సినిమా"రివ్యూలు" లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమా"రివ్యూలు" లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జులై 2015, శనివారం

"బాహుబలి" సినిమాకెళ్ళి బుక్కయ్యాను!

సినిమా పూర్తి అయ్యేవరకూ "బాహుబలి" సినిమా రెండు భాగాలు అన్న విషయం నాకు తెలియదు. టి.వి.సీరియల్ మాదిరి ఎండింగ్ లో సస్పెన్స్ లో పెట్టేసి బయటికి పంపేసిండు. తండ్రి బాహుబలికి ఏమి జరిగిందో అర్ధం కాక, ఆయనను అతని నమ్మిన అనుచరుడే వెనుక నుండి వెన్నుపోటు పొడిచి ఎందుకు చంపాడో తెలియక బుర్ర పిచ్చెక్కిపోయింది. కొడుకు బాహుబలి ఏమి చేస్తాడో ఇక చూడాలి. ఇవన్నీ తెలియాలంటే మరో 110 రూపాయలు పట్టుకుని రెండో భాగం కోసం ఎదురు చూడాలి.
       కట్ చేసి...సినిమా విషయానికొస్తే ...
       ఏమాటకామాటే చెప్పుకోవాలి. సినిమా ఇంచుమించు హాలీవుడ్ తరహాలో ఉందంటే నమ్మండి. సినిమా క్లైమాక్స్ యుద్ధం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా ప్రారంభంలో వాటర్ ఫాల్ ఒక అద్భుతమైన వింతలా తీశారు. అది గ్రాఫిక్స్ మీదే సృష్టించారని, అది నిజంకాదని పేపర్లో చదివి చాలా ఆశ్చర్యపోయాను. సినిమాలో ప్రకృతి అందాలను చాలా చక్కగా చూపించారు.
      సినిమా కధ విషయానికొస్తే చాలా బలహీనంగానే అనిపించింది. పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ నాకైతే మొదటి భాగంలో అనిపించలేదు. ఇక రెండో భాగంలో ఉంటుందేమో చూడాలి.

3, జనవరి 2015, శనివారం

ఇటువంటి సినిమాల వలన సమాజానికి ఏవిధమైన నష్టం ఉండదు.

తంలో దృశ్యం సినిమా గూర్చి నేను వ్రాసిన పాత టపా ఒకటి చదువుతుంటే అందులో చిరంజీవిగారు పెట్టిన కామెంట్ చూసాను. అందులో ఆయన "చందమామ కథలు" చూడండి.చాలా బాగుంది అంటూ సూచించారు. సరే మంచి సినిమాలను చూడడంలో తప్పేముందని యూట్యూబ్ చర్చ్ చేసి మూవీ చూసాను. అద్భుతం సినిమా చాలా సాప్ట్ గా హుందాగా బాగుంది. ఎన్నో పాత్రలు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. ప్రేమించి మోసం చేయాలని చూస్తే ఏమి జరుగుందో, పొరపాటైనా సరదాగా నిజాయితీగా ప్రేమించే వారికి ఎటువంటి కష్టాలు ఎదురవుతాయో, 30సం// వచ్చినా పెళ్లి కాకుండా భాద పడుతున్న అబ్బాయికి ఎంతమంచి కేరెక్టర్ కలిగిన భార్య వచ్చిందో చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా చెప్పుకోవల్సింది రచయిత గురించి. కూతురు కేన్సర్ కోసం పాపం తను డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతుంటే తను వ్రాసిన ముష్ఠివాడి కథలోని పాత్రే తనకు ఉపయోగపడటం చాలా,చాలా అద్భుతం. మరొక కథ ఆమని,నరేశులది. ప్రేమించుకుని పెళ్లి కాకుండా విడిపోయిన వీళ్లు తిరిగి భర్తను కొల్పోయి ఒంటరిగా ఉన్న ఆమెను నరేశ్ పెళ్లి చేసుకుని లైఫంతా హేఫీగా గడపడం చాలా బాగుంది. మంచి పాజిటివ్ సెన్స్ తో తీసిన సినిమాలెప్పుడూ ప్రజల హృదయాలను దోచుకుంటాయి. నిజానికి వీటికి అవార్డులు రాకపోవచ్చు.దిక్కుమాలిన ఐటెం సాంగ్స్ డప్పుల మోత ఉన్న సినిమాలకే రావచ్చు. కాని చందమామ కథలు లాంటి సినిమాలకి తప్ప ప్రజల హృదయంలో స్థానం మరొక సినిమాలకి లభించదు. ఇదే వాటికి మర్చిపోలేని పెద్ద అవార్డు.
ఇక్కడ సినిమా కూడా చూడండి.

30, డిసెంబర్ 2014, మంగళవారం

ఇటువంటి గగుర్పాటు చిత్రాలను తీసేవారిని, నటించేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.

ఈరోజు Facebook చూస్తుంటే ఒక మిత్రుడు ఈక్రింది వీడియోను షేర్ చేసాడు. ఒక అమ్మాయిని బీచ్ రోడ్ లో రేప్ చేసే సన్నివేశాన్ని అతికిరాతకంగా చూపించారు. నాకైతే చాలా భయమేసింది.ఎంతదారుణమైన షూటింగులు. ఒక ప్రక్క స్త్రీలకు రక్షణ లేకుండా దేశం నాశనమవుతుంటే ఇటువంటి షూటింగ్లా? ప్రభుత్వం ఉందా? సెన్షార్ బోర్డ్ సభ్యులకు బుర్రలు పని చేస్తున్నాయా? లేక వాళ్లు కూడా లంచగొండులయిపోయారా? దేశ భవిష్యత్తు వీరికవసరం లేదా? నిజానికి ఇలాంటి స్త్రీలను కూడా కఠినంగా శిక్షించాలి.ఇటువంటి పనికిమాలిన సీన్లలో నటిస్తున్న ఇటువంటి దరిద్రగొట్టు నటులను ఉరి తీసినా పాపం లేదు. మన దేశంలో ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు నాశనమవుతాయో?


9, నవంబర్ 2014, ఆదివారం

"జోరు" సినిమా పరమ బోరు!

నేను నా ఫ్రెండు బలవంతం మీద జోరు సినిమాకి వెళ్లాల్సి వచ్చింది.తీరా ధియేటర్ లో కూర్చున్న తరువాత నుండీ సినిమా అంతా పరమ బోరుగా అనిపించింది.లౌక్యం సినిమాలో ఉపయోగించు కున్నంత ఎక్కువుగా బ్రహ్మానందాన్ని ఈ జోరు సినిమాలో ఉపయోగించుకోలేకపోయేరు. ఒక ప్రేమ కధా చిత్రం ప్రేం నటుడు సప్తగిరిని కూడా పెద్దగా చూపించలేదు. ఈ మధ్య వచ్చిన నాలుగైదు సినిమాలను కలిపి వడకట్టి తీసిన  సినిమాలా అనిపించింది.సంగీతం కూడా వినసొంపుగా లేదు. ఇక సినిమాలో అయితే అక్కడక్కడా కార్టూన్ చిత్రాలే రాజ్యమేలాయి. ఎందుకో తెలీదుగాని మొత్తానికి సినిమా పెద్దగా నచ్చలేదు.ఈ జోరు సినిమా పరమ బోరుగానే నడిచింది.

28, జులై 2014, సోమవారం

ఈ రోజుల్లో ఇంతమంచి సినిమా ఇదేనేమో!

ఒకరోజు నా ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దృశ్యం సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు.పెద్దగా సినిమాలు చూడని నేను ఆరోజు ఆ సినిమా చూసాను.సినిమా చాలా బాగుంది.సైలెంట్ గా,ధ్రిల్లింగ్ గా సస్పెన్స్ కధనంతో ఆసాంతం మనిషిని కట్టి పడేసింది.
 
    బహుశా ఈరోజుల్లో ఇంతటి మంచి సినిమా రావడం ఇదే  మొదటిసారనుకుంటా!
 
    సినిమాలో అశ్లీలం లేదు.బట్టలూడదీసి తిరగడం అసలే లేదు.ఎంతో హుందాగా,గౌరవపధంగా నడిచింది.

    నేటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ఉంది.

    ఇక కట్ చేసి కథలోకొస్తే...

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ప్రాజెక్ట్ పనిమీద బయటికి క్యాంప్ కి వెళ్లుంది.ఒకరోజు బాత్ రూం లో స్నానం చేస్తుంటే...ఆ అమ్మాయికి తెలియకుండా ఓ రాక్షసుడు సెల్ కెమెరాతో వీడియో తీసి తర్వాత క్యాంపు నుండి తిరిగి వచ్చిన అమ్మాయి ఊరెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

    వాడొక ఐ.జి కొడుకు...తల నిండా పొగరు.

    ఒకరోజు నైట్ తనతో గడపక పోతే ఆ వీడియో Youtube లో Upload చేస్తానని బెదిరిస్తాడు.

    అమ్మాయి బెదిరిపోతుంది.విపరీతంగా భయపడిపోతుంది.
 
    ఆరోజు రాత్రి అతను రమ్మన్న చోటుకి వెళ్తుంది.వీడు కూడా అదే చోటుకి వెళ్లినప్పుడు అక్కడ ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా వుంటుంది.

    వీడికి కోపం రగిలిపోతుంది.

    తల్లికూతుర్లిద్దరూ ఎంతో ప్రాధేయపడతారు.ఆ వీడియో ఇచ్చేయమని బ్రతిమిలాడుకుంటారు.

    అయినా ఆ రాక్షసుడు వినడు.వాడికి మనస్సుంటేనే గదా!

    తన కూతురి జీవితాన్ని...పాడు చేయవద్దని...కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న తల్లి ఒంటిపై చేతులేసి..."నీ కూతుర్ని వదిలి పెడతాను.నీవు నాతో ఈ నైట్ గడుపు"అంటాడు.అంతే..వాడి తలపై బలమైన దెబ్బ...ఆ అమ్మాయి కట్టె తీసుకుని వాడి తలపై కొడుతుంది.ఆ ఒక్క దెబ్బ బలంగా తగిలి అక్కడికక్కడే కూలబడి చనిపోతాడు.ఆ తరువాత వాడి బాడీని తల్లీకూతుర్లిద్దరూ...గోతిలో పూడ్చేస్తారు.

    ఆ కుటుంబాన్ని ఎలా ఆ కేస్ నుండి రక్షించాలా అని ఆ అమ్మాయి తండ్రి చేసే ప్రయత్నాలే సినిమా అంతా!

    ఇందులో గమనించాల్సిన ఓ  పేక్షకుడి ఫీలింగ్ ఏమిటంటే...

    ఆ కుటుంబం ఆ కేస్ నుండి తప్పించుకోవడానికి ఆడే నాటకం ఏ పేక్షకుడికి తప్పు అనిపించదు.ఎందుకంటే ఆ దుర్మార్గుడి వారి పట్ల ప్రవర్తించిన తీరు ...వీళ్లు కేసునుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు,నాటకాలను సమర్ధిస్తాయి.ఉద్దేశ్యపూర్వకంగా చేయని ఆ హత్యనుండి తప్పించుకోవడానికి ఈ కుటుంబం చేసేదంతా రైటే అనిపిస్తుంది.

    నా దృష్టిలో అయితే...కరెక్ట్ కూడా..

    ఆ అమ్మాయి తనకు జరిగిన విషయం గురించి తల్లికి చెప్పడం గొప్ప విషయం!ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.ఈ సినిమాలో అమ్మాయి అలా చెయ్యలేదు.తల్లికి చెప్పి గొప్ప పని చేసింది.

   మరొక విషయమేమిటంటే ఆ అమ్మాయి తండ్రికి ఆ కేస్ ను ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు త్రాగించేంత తెలివితేటలు..అతను ఎక్కువుగా అతని కేబుల్ ఆఫీసులో సినిమాలు చూడటం వలనే వచ్చాయి.సినిమాలు మనిషికి ఇన్ని తెలివితేటలు కల్గిస్తాయా?అదీ మంచిగా అనేది నాకైతే పెద్ద సందేహమే!

   ఏది ఏమైనా!సినిమా చాలా బాగుంది.ఆ అమ్మాయి తల్లిదండ్రులుగా మీనా,వెంకటేశు నటించారు.గొప్ప విషయమేమిటంటే...మీనాగారు అచ్చు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా, ఓ చక్కని భార్యగా..హుందాగా నటించిన తీరు చూస్తే...అబ్బో నాకు కూడా ఓ మంచి సంప్రదాయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది.బ్యాచ్ లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనిపించింది.