వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2021, శుక్రవారం

ఒకసారి విజయాన్ని రుచి చూస్తే చాలు.

ఒకసారి విజయాన్ని రుచి చూడటం ప్రారంభించిన తరువాత,విజయాన్ని రుచి చూడటం అలవాటు (Habit) గా మారుతుంది.ఆ తరువాత అది అభిరుచి (Hobby) అవుతుంది.చివరికి గెలుపొక వ్యసనం (Vice) గా ఎదుగుతుంది.అప్పుడిక అంతా ఆనందమే.

13, అక్టోబర్ 2020, మంగళవారం

Is this what every father's situation is like? | Everyone should read! | ప్రతి తండ్రి పరిస్థితి ఇంతేనేమో? | కళ్ళు చమర్చే కథ | ప్రతి ఒక్కరూ చదవాల్సిందే!

*హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....*
*భోజనానికి ఎంత తీసుకుంటారు......*
*యజమాని చెప్పాడు...*
చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, 
*అవి లేకుండా అయితే 20 రూపాయలు....*
*ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....*
*నా చేతిలో ఈవే ఉన్నాయి..*
*వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...*
*కాస్త ఆకలి తీరితే చాలు.*
*నిన్నటి నుండి ఏమీ తినలేదు...*
*ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....*
*హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.*
*నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను....* ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....*

17, జులై 2020, శుక్రవారం

జీవితంలో ప్రశాంతత


ప్రతిక్షణం...పరుగు...
ఏ క్షణంలో అయినా కాలంతో పయనమే..
ఇలాంటి జీవిత పరుగు పందెంలో మనిషి ఎంతవరకు ప్రశాంతంగా ఉండగలడు?
ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచించండి...అందుకే ప్రశాంతంగా ఉండాలంటే ఏంచేయాలో తెల్సుకోవాలి.తెల్సుకుని ఆచరణలో పెట్టి జీవితాన్ని ప్రశాంత నిలయంగా మలచుకోవాలి.

భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకోవాలి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రత్యేక పరిశోధనలలో ఆధ్యాత్మిక చింతన,భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నవారు...జీవితంలో ఎలాంటి కష్టాలు సంభవించినా వాటిని సమర్ధవంతంగా ఎదురుకున్నారని..
మానసికంగా ఆరోగ్యకరంగా వీరెలాంటి వైకల్యాలకు గురి కాలేదని ఋజువయింది.కష్టం,సుఖం..పరిస్థిథి ఏదయినా భారం భగవంతునిపై వేసే ఆధ్యాత్మికతత్వం మీలో ఉంటే...
మీ జీవితనావ ..ఎంత పెనుతుఫానులో చిక్కుకున్నా మీ మనసు మాత్రం ప్రశాంతంగా శాంతగంభీరంగా ఉండగలుగుతుంది.ఈ రోజు నుంచే ఈ అలవాటు చేసుకొండి.దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదు...ఈ నిజాన్ని గుర్తుంచుకుని భారమంతా భగవంతునిపై వేసి ప్రశాంతంగా బ్రతుకు రధాన్ని దొర్లించటం అలవరచుకొండి.

1, జులై 2020, బుధవారం

నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు | Do not be in a place where you have no respect for yourself and your personality

ఒక తండ్రి తాను చనిపోయే ముందు, తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 200 సం. పైగా వయస్సు కలిగి, మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చేముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాప్ కి వెళ్లి దీనికి వెల కట్టించుకొని రా అని పంపించాడు. కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతది ఐనది కావున 5 డాలర్లకు మించి రావన్నారు అని చెప్పాడు. అయితే తండ్రి ఈ సారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల ( యాంటిక్ ) దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు. ఈ సారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 5000 డాలర్ల వెల కట్టినట్లు చెప్పగా.. ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకొని వెళ్లి వెల కట్టించమన్నాడు..తిరిగివస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా, మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించటానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి, ఈ పాత గడియారంకు ఒక మిలియన్ డాలర్ల వెలకట్టినట్లు చెప్పాడు!!*

*కాగా అది విన్న తండ్రి.. కొడుకుతో  దీని ద్వారా నీకు చెప్పాలని అనుకుంటున్నది ఏమిటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం బట్టి, నీ విలువ కూడా మారుతూ ఉంటుంది.. అందుకే  నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు..అంటూ చెప్పాడు......*

16, మే 2020, శనివారం

* Peace *|*మనశ్శాంతి*

* Peace *|*మనశ్శాంతి*

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. 

అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి.

ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

అప్పుడు శిష్యుని అనుమానం " ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? 
బుధ్ధుడు : నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.  మన మనసు కూడా అంతే !!

ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.

6, ఏప్రిల్ 2020, సోమవారం

మాటేమంత్రం

మాటల్లో పాజిటివ్-నెగెటివ్ ఎమోషన్స్
ఎమోషన్స్ లో రెండు రకాలుంటాయి. ప్రతికూలం-అనుకూలం.ప్రతికూలం వలన ప్రమాదాలు తప్పవు.అనుకూలం వలన ఆనందం లభిస్తుంది.డేనియల్ గోల్మన్ అనే రచయిత ప్రతికూల ఎమోషన్స్ లో ఎలా ఉండాలో,అంటే ఆ సమయంలో అలవర్చుకోవలసిన అనుకూల ఎమోషన్స్ ఏమిటో తెలిపాడు.ఇవి పరిశీలించండి.పాటించే ప్రయత్నం చేయండి.
    నెగిటివ్                                           పాజిటివ్
 • 1.భయం                                         ధైర్యం
 • 2.ఆందోళన                                     ఆత్మవిశ్వాసం
 • 3.ద్వేషం                                         క్షమాగుణం
 • 4.బాధ                                           ఓర్పు
 • 5.అవమానం                                   ఆత్మస్ధైర్యం
 • 6.అసూయ                                     ప్రేమ
 • 7.వైఫల్యం                                      ఆత్మబలం
 • 8.మోసానికి గురికావటం                   అదొక పాఠంగా స్వీకరించటం
 • 9.అంగవైకల్యం                                అంగీకరించటం
 • 10.నిరాశ,నిస్పృహలు                      ఓదార్పు
 • 11.స్వయం సానుభూతి                    ఛాలెంజిగా తీసుకోవటం

* మంచి మాటలతో ప్రేరణలు కలిగించవచ్చు.ఎదుటివారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చు.పదును పెట్టవచ్చు.వారిని నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దవచ్చు.మంచిమాటలు ఎంతో ప్రభావాన్ని కలిగించగలవు.మంచిమాటలను తేలికగా అంచలా వేయకండి.మంచిమాటలను చెప్పటం సాధన చేస్తూ ఉండండి.ఉత్సాహం ఉరకలు వేస్తుంది.మీ మంచిమాటలు ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

* మనం చెప్పేదానిపట్ల సరైన అవగాహన ఉండాలి.వినే వ్యక్తి యొక్క స్ధాయి యొక్క ఆలోచనా సరళి,అతని ఎమోషన్స్ గురించి కొంత అధ్యయనం చేయాలి.వాటికి తగ్గట్లుగా మాట్లాడాలి.అంటే మాట్లాడే స్వరం,మాటల్లో ఎంపికచేసే పదాలు కూడా ప్రభావం చూపించగలవు.

* ధ్వనికి ప్రతిధ్వని తప్పదు.ఇది అందరికీ తెలిసిన సత్యమే.ఈ రోజు నేను ఒక వ్యక్తిపై ఎమోషన్స్ వెళ్లగక్కితే,మళ్లీ నాకు అవి ఒక రోజు తప్పవు అనే సత్యం గుర్తించాలి.అందుచేత వీలైనంతగా మూడ్స్ ని అదుపులో ఉంచుకోవాలి.ఎమోషన్స్ ఎప్పటికప్పుడు అదుపుచేసుకోవటం కూడా ఒక కళ.

* మనం ఏరంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధించాలంటే,ముందు ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించాలి.ఆపైన మనలో ఉన్న బలాలు,బలహీనతలు,అవకాశాలు,పొంచియున్న ప్రమాదాలు అంచనా వేసుకోవాలి.నిజం చెప్పాలంటే ఏ రంగంలోనైనా తగినన్ని బలాలు,అవకాశాలు ఉన్నాయి.అసలు చిక్కంతా బలహీనతలే.ఆ బలహీనత కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమే.

* మీ స్వంత శక్తిమీదనే ఆధారపడండి.ఈ ప్రపంచంలో "పాపం"ఏదైనా ఉంటే అది బలహీనతే. బలహీనతను విడిచిపెట్టండి. బలమే జీవితం,బలహీనతే మరణం.నేను బలహీనుణ్ణి అని ఎప్పుడూ అనుకోవద్దు.చెప్పుకోవద్దు.మీలో ఉన్న అపారమైన శక్తి గురించి మీకు తెలిసినది చాలా తక్కువ.మీ వెనుక అనంతశక్తి సముద్రం ఉంది.

 పై అద్భుతమైన విషయాలన్నీ డా//బి.వి.పట్టాభిరాంగారి రచన "మాటేమంత్రం" లోనివి.ఈరోజు మనిషి సరైన కమ్యూనికేషన్స్ లేక తెలియక ఎన్ని అపజయాలు పొందుతున్నాడో,స్వార్ధపరుల బారినపడి ఎలా మోసపడుతున్నాడో,తనలో ఉన్న స్కిల్స్ ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడో మనకి తెలిసిందే.వాటినన్నిటినీ సరిదిద్ది జీవితంలో ఎలా విజయాన్ని సాధించాలో చక్కగా నేర్పుతుంది. ప్రతిఒక్కరూ చదవాల్సిందే.

రచయిత చిరునామా:
డా//బి.వి.పట్టాభిరాం Ph.D
ప్రశాంతి కౌన్సిలింగ్ & HRD సెంటర్
సామ్రాట్ కాంప్లెక్స్,సెక్రటేరియట్ రోడ్,
హైదరాబాద్-500004.
Ph:040-23233232,23231123
email : bvpattabhiram@hotmail.com
www.pattabhiram.com

Publisher's 
సాహితి ప్రచురణలు
29-13-53,కాళేశ్వరరావురోడ్డు,
సూర్యారావుపేట,విజయవాడ-2
Ph:0866-2436643,6460633
email: sahithi.vij@gmail.com

15, మార్చి 2020, ఆదివారం

తప్పులెన్నే వాడు తన తప్పులెరుగడు!

* ఎదుటివారిలో దోషాలు ఎన్నటం మానుకోవాలి. ఎందుకంటే మనలో కూడా అనేక దోషాలు ఉంటాయి.వాటి గురించి ఎవరైనా ఎత్తిచూపటం మనకిష్టం ఉండదు కదా! మరి మనం మాత్రం ఆపని ఎందుకు చెయ్యాలి? అరటిపండు తినటానికి ముందు మనం తొక్క పారేస్తున్నాము. పండు తింటున్నామేగానీ తొక్క తినడం లేదు కదా? అలాగే అవతలి వారిలోని సద్గుణాలనే గుర్తించి గౌరవించాలి.
* ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారంటే అతని గురించి తప్పుగా చెప్పేవారే తప్ప మంచిగా చెప్పేవారిని మీరు కలవలేదన్నమాట. ఎందుకంటే ప్రతివ్యక్తిలోనూ వెలుగు,చీకటి లాగా మంచిచెడులు ఉంటాయి.
* అవతలి వ్యక్తి గురించి నీ దగ్గర ఎవడైనా వచ్చి చెడుగా చెప్తున్నాడంటే నీ గురించి కూడా మరొకడికి చెప్తున్నాడనే అర్థం.
* చాడీలు చెప్పేవాడే చాడీలు వింటారు ఇది వారికి మానసిక ఆహారం.లేకపోతే బ్రతకలేరు.

11, మార్చి 2020, బుధవారం

A must read for teachers !! | ఉపాధ్యాయులు చదవవలసిన ఓ మంచికథ!!

A must read for teachers !! | ఉపాధ్యాయులు చదవవలసిన ఓ మంచికథ!!

బహుమతి*
 ```
®ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.

వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.

లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.

గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.

నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను వెంకట్‌ని. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.

అప్పుడు గుర్తుకు వచ్చింది. వెంకట్‌ చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.

1, మార్చి 2020, ఆదివారం

ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించాలి

ఇది యదార్థంగా జరిగిన సంఘటన.ఎవ్వరినీ తక్కువ
అంచనా వేయకూడదు. ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించాలి... లేకపోతే ఇలాగే
కంగు తినాల్సి వస్తుంది.

70 సం. పైపడిన ఒక బామ్మ ఒక బ్యాంకు కు వెళ్లి తన చెక్కు బుక్ క్యాషియర్కు ఇచ్చి 500 రూపాయలు డ్రా చేయాలని కోరింది. ఆ మహిళా క్యాషియర్ కాస్త విసుగ్గా ఇలా అంది.

," 10000 కంటే తక్కువ నగదు డ్రా చేయాలంటే ఇక్కడ మా రూల్స్ ఒప్పుకోవు...వెళ్లి ఏ.టీ. యం. లో తీసుకోండి "అని కసిరింది.
అప్పుడు బామ్మ కాసేపు పక్కన కూర్చొని మళ్ళీ క్యాషియర్ దగ్గరకు వెళ్ళింది. ఆ క్యాషియర్ కోపంగా "ఒక్కసారి చెపితే అర్థంకాదా? వెళ్ళు,వెళ్ళు తల్లీ!" అంది.
బామ్మ! కాస్త సీరియస్ గా ...

26, ఫిబ్రవరి 2020, బుధవారం

మనిషికి ప్రశాంతత దూరం చేసేది ఎక్కువుగా ఆర్ధిక సంబంధాలే!

The-more-calm-the-distance-to-the-man-is-the-financial-relations
మనిషికి ప్రశాంతత దూరం చేసేది ఎక్కువుగా ఆర్ధిక సంబంధాలే!
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నాడొక మహాకవి. ఇది ముమ్మాటికీ నిజమన్న భావన మనకప్పుడప్పుడూ అన్పిస్తోంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు మనకి మనం కావాలనే తెచ్చుకుంటాం. సమస్య తయారు కాకముందే మనం మేలుకోము. సమస్య క్రియేట్ అయిన తరువాత లబో,దిబో మంటూ హైరానా పడిపోతాము. నేను నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేను ఒక సైట్ (స్థలం) వాయిదా నిమిత్తం 15,౦౦౦ కట్టాలి. ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఎలాగైనా ఈసారి సంక్రాతిని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నా! 15౦౦౦ రూపాయలు ఎలాగూ ఉన్నాయి కదా అని ఆనందపడే సమయంలో వాయిదా నోటిస్ వచ్చింది. వాయిదా కట్టేదామా? లేక పెండింగ్ లో పెడదామా? అనే సందిగ్ధంలో కొంతసేపు ఉండిపోయా! సంక్రాంతి హడావుడి లో 15౦౦౦ గ్యారెంటీగా అయిపోతాయి. మంచి బట్టలు, షూస్ కొనాలి. ఇంకా అమ్మకు,నాన్నకు కూడా బట్టలు తీయాలి. ఎలా? వాయిదా కట్టడం మానేద్దామా? లేక వాయిదా కట్టేస్తే పండుగకు ఏమీ ఉండవు. బ్యాంక్ లో చూస్తే కేవలం 1000 రూపాయలే ఉన్నాయి. సరిపోవు కదా ? ఎలా అనిపించింది.

15, ఫిబ్రవరి 2020, శనివారం

మీరు గెలవాలంటే మీ మనసు ఇలా ఉండాలి | If you want to win your mind should be like this

విజయం సాధించాలంటే ముందుగా విజయం సాధించాలనే ఆలోచన ఆ వ్యక్తికి వుండాలి.ఏ విషయంలో విజయం సాధించాలి అనే విషయం నిర్ణయించుకున్న తరువాత ఆ దిశలో ఆలోచనలు మొదలుపెట్టాలి .రోజు రోజుకూ మీలో అభివృద్ధి వస్తుందనే ఆలోచన బాగా వుండాలి.
ఆత్మ పరిశోధనకు కూడా ఈ ఆలోచన పనికి వస్తుంది.చెడు ఆలోచన మనసు లోనికి రానియ్యకూడదు.మంచి ఆలోచన వలన మనోధైర్యం పెరుగుతుంది.ఆలోచనలో ఊహించటం జరుగుతుంది ఇది పగటి కలగానే వుండి పోకుండా రోజురోజుకూ మీలో వచ్చే ప్రగతిని విశ్లేషించుకోవాలి.ఈ విజయం సాధించడానికి ఏం చెయ్యాలి అనే విషయం చూద్దాం.మనసుకి విశ్రాంతిని ,స్పూర్తినిచ్చే ఈ క్రింది విషయాలు తలచుకోవాలి.

10, జనవరి 2020, శుక్రవారం

నాకు నచ్చిన ఒక చిన్న కథ | One of my favorite stories

వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.. ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది ..." పెళ్ళికి నాది ఒకే ఒక షరతు ...."
అతను కుతూహలంగా  చూసాడు..
" అది ఏమిటంటే ఏ మాట మాట్లాడాలనుకున్నా  సరే,
 అంటే విపరీతమైన కోపం వచ్చినా ..... టెన్షన్ వచ్చినా ..... విసుగ్గా వున్నా... ఏదైనా అసలు నచ్చకపోయినా గొంతు పెంచి మాట్లాడకూడదు.. మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే !!!
అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను.. ఆ పై నన్ను ఏమీ అనకూడదు !!!" అన్నది..
అతనికి కొంచెం వింతగా అనిపించినా..తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు....

4, డిసెంబర్ 2019, బుధవారం

పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో! | Benefits of Reading a Book

ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితి మచ్చుకు కూడా కనిపించడం లేదు.పుస్తకం స్థానంలో సెల్ ఫోన్ హస్తభూషణమైంది.
   "క్లాసు పుస్తకాలు చదవడానికి టైం సరిపోవడం లేదు.ఇక సాహిత్య పుస్తకాలు కూడానా"అనేది ఒక సాకు మాత్రమే.మనస్సుంటే మార్గం ఉంటుంది.చదవాలని కోరిక ఉండాలే గానీ సమయం తప్పకుండా దొరుకుతుంది.
   పుస్తకాలు చదవడం అనేది సాహిత్యపరిచయానికో,కాలక్షేపానికో కాదు...పఠన ప్రభావం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తెలియజేస్తున్నాయి.నిజానికి బాల్యంలోనే చదవడం మొదలుపెట్టాలి.వీలు కానప్పుడు టీనేజ్ లో తప్పనిసరిగా పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి.బ్రిటన్ లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్ తాజా అధ్యయనం మరోసారి పుస్తక పఠన విలువను ప్రపంచానికి చాటింది.పుస్తకాలు చదివే అలవాటు ఉన్న టీనేజర్లకు, లేని టీనేజర్లకు మధ్య వ్యత్యాసాలను అధ్యయనం చేసారు.పుస్తకాలు చదవని వారితో పోల్చితే, చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు,రకరకాల సామర్ధ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని ఎన్.ఎల్.టి అధ్యయనం చెబుతుంది.

   పుస్తక పఠనం వల్ల ఉపయోగం ఏమిటి?
 • టీనేజీలో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.వీటిలో ముఖ్యమైనది...లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుంది.లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుంది.
 • సామాజిక సమస్యలపై అవగాహన,సామాజిక స్పృహ ఏర్పడతాయి.
 • పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించేవాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు.క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలను కనుక్కోగలరు.
 • పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది.
 • స్వీయ విశ్లేషణ సామర్ధ్యం పెరుగుతుంది.దీనివల్ల తప్పులను,లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు.
 • చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది.

అమ్మాయిలే ఫస్ట్...
       పాశ్చాత్య దేశాలలో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు.దీనివల్ల అబ్బాయిల కంటే అమ్మాయిలలోనే సానుకూల దృక్పధం ఎక్కువగా కనిపిస్తుంది.

30, సెప్టెంబర్ 2019, సోమవారం

రెండు సందర్భాలలో మాటల పొదుపు అత్యవసరం!

మీరు ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడూ, ఆవేశం కలిగియున్నప్పుడూ ఎట్టి సమయంలోనూ మాటలు మాట్లాడకండి.. ఎందుకంటే ఆమాటల పట్ల నియంత్రణను మనం కోల్పోతాము. ఏమి మాట్లాడుతున్నామో అర్ధం కానీ పరిస్థితిని కలిగియుంటాము. దాని వలన ఎదుటి వారికి మనం చులకన అయ్యిపోవడం, నేరం చెయ్యకపోయినా మనమే నేరస్తులుగా మిగిలిపోవడం జరుతుంది. కాబట్టి దయచేసి ఈ రెండు సందర్భాలలో నోరు మెదపకపోవడమే మేలు. ఇదే అనేక సమస్యలకు పరిష్కారం అవుతుంది. శుభం.

19, జూన్ 2019, బుధవారం

ఓ చెట్టు - మనిషి కథ : కళ్ళు చెమ్మగిల్లుతాయి

🙏 దయచేసి అందరూ ఇది ఓ సారి పూర్తిగా చదవండి..ఇంతవరకు నేను చదివిన అద్భుతమైన మెసేజ్ లలో ఇది ఒకటి 

🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  

🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 

🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు

🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 

👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 

🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 

🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 

🌴 క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 

🏕 "నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 

🌿 "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 

🌴 అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 

🌴 బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు

🌴 నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 

🌴 అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 

🌴 చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 
నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 
ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 

🌴 చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 
ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 

🌴 నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 

🌴 నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 

🌴 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 

🌴 ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 

🌴 కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 

🌴 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.

👥 మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 

💘 ఈ కథలోని నీతి.. 

💗 మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 

💖 మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. 
మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది


🙏 ఈ విషయాలు అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే

22, మే 2019, బుధవారం

మన సక్సెస్ కు ప్రమాదం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి! | We must avoid people who are at risk for our success!

నిన్న ఒక ఆధ్యాత్మిక సెలబ్రిటీని కలిసాను.ఎందుకో తెలీదు గాని ఆయనతో మాటలాడినప్పుడల్లా నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.లైఫ్ లో ఏదో సాధించాలన్న కసి పుడుతుంది.అంతగా ఆయన మాటలు నాకు ప్రేరణ కలిగిస్తాయి.మనకంటే గొప్పవారితోనే మన సంబంధాలు పెట్టుకోవాలి.లేదా మన రంగానికి సంబధించినవారితో నన్న కలిసి ఉంటే ప్రయోజనం ఉంటుంది.ఎదుటివారి గురించి చాడీలు చెప్పేవారి దగ్గర,ఎగతాళిగా మాటలాడేవారి దగ్గర అస్సలు కూర్చోకూడదు.మన సమయం వృధాతో పాటు,మానసికంగా అప్సెట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

   కొంతమంది మేధావులుంటారు.వీళ్లు తమ విషయాలేమీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ...ఎదుటి వారి అన్ని విషయాలు కూపీలాగి మరీ తెలుసుకుంటారు.ఏదైనా ఇష్టంలేని పరిస్థితి వస్తే ఆ విషయాలన్నీ బైట పెడుతూ ఎంతో నష్టానికి గురి చేస్తారు.వీళ్లు మహా ప్రమాదకరమైన వ్యక్తులు.వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

   ఏది,ఏమైనా మన సక్సెస్ పై ప్రభావం మన కలిగియున్న వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. జాగ్రత్త వహిస్తే మనకే మంచిది.ఏమంటారు?

10, మే 2019, శుక్రవారం

ఆసక్తి [Interest] కలగాలంటే?

     మనం చేసే పనిమీద ఏకాగ్రత కుదరడానికి మనం చేసే పనిమీద మనకి ఆసక్తి ఉండాలన్నది నిర్వివాదాంశం.ఆసక్తి అంటే వినే విషయం మీద శ్రద్ధ,ఆ విషయాన్ని గురించి ఒక అనుభూతిని పొంది, ఆకళింపును చేసుకోగలగడం.పూర్వపుస్మృతికి ప్రస్తుత అనుభూతికి ఉన్న అపూర్వ సంబంధమే ఆసక్తి.అనేక యితర విషయాల్లోంచి మనకు ఆసక్తికరమైన విషయాన్ని మాత్రమే ఎన్నుకుని మనస్సులో పదిలపరచుకుందామనే విషయంపై తప్పక ఆసక్తిని పెంచుకోవాలి.ఆసక్తి ఉన్న విషయాలు అప్రయత్నంగానే గుర్తుంటాయి.

     అయితే మనకి ఆసక్తిలేని విషయాలపైన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి,శ్రద్ధ పెంచుకోక తప్పదు.అవసరం వల్ల ఆసక్తి దానంతట అదే కలుగుతుంది.జీవితానికి అవసరమైనదానిని గుర్తుంచు తీరాలని నిర్ణయించుకోవాలి.అప్పుడు ప్రతి చిన్న విషయం తప్పనిసరిగా గుర్తుంటుంది.ఆసక్తిలేని విషయాలను అధ్యయనం చేయవలసిన సందర్భాలలో తమకు తాము 'ఆటోసజెషన్" ఇచ్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

     ఏకాగ్రత,జ్ఞాపకశక్తి కేవలం ఆసక్తి మీదే ఆధారపడి ఉండవు.కేవలం ఆసక్తి ఒక్కటే ఏకాగ్రతకు,జ్ఞాపకశక్తికి కారణం కాదు.చేసే పని నచ్చకపోవడానికి కారణం నచ్చదనే దృఢాభిప్రాయంతో కూడిన భావనే.ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటే ఆ పని నచ్చుతుంది.చేసే పని మీద న్యూన్యతాభావం కూడా ఆసక్తి లేకపోవడానికి మరో కారణం.ఆసక్తిని కలిగించుకుని,పెంపొందించుకుంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
7, మే 2019, మంగళవారం

ఎదుటివారి విషయాలకి అడ్డుకట్ట వేయండి.

మనం చాలా వరకు ఇతరుల గురించి ఆలోచించినంతగా మన గురించి మనం ఆలోచించుకోము. అందుకేనేమో మనకీ సమస్యలు...కష్టాలునూ! తెల్లవారి లేచిన తరువాత మన పనులేమిటి? నిన్నటి కంటే ఈరోజు సాధించిన విజయమేమిటి? ఈరోజు ఇంకా చక్కగా అభివృద్ధికి తీసుకెళ్లామా? లేదా? ఇత్యాది ప్రశ్నలు ప్రతిరోజూ వేసుకుంటూ దానికి సంబంధించిన ప్రణాళిక మనం సరి చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈరోజుల్లొ మనం ప్రశాంతంగా బ్రతకాలంటే మన పనులను మనం చేసుకోవాలి. ఇతరుల విషయాలలోకి తల దూర్చి బొప్పి కట్టించుకోవడం తప్ప మరేమీ లేదు. రోజులు ఎలా తయారయ్యాయి అంటే ఇతరుల మేలు కోసం కృషి చేసినప్పుడు లాభం చేకూరితే నిన్ను మెచ్చుకోవడం అరుదుగా చేసి తన గొప్పదనం ప్రకటించుకుంటాడు. ఒకవేళ నష్టం కలిగితే అతిదారుణంగా నీ పట్ల అవహేళన భావంతో నిరసిస్తూ నిందిస్తాడు. ఎక్కడో కొంతమంది మహానుభావులు నష్టాన్ని, లాభాన్ని ఒకలా తీసుకుంటారు. అలాంటివారు ఈలోకంలో బహు అరుదు అని చెప్పవచ్చు. ఇకపోతే ముందు చెప్పుకున్నట్టుగా మన పని మనం చేసుకోవడం మాని ఈ తలపోటు ఎందుకు చెప్పండి. ఈరోజుల్లొ మనుష్యుల కోపతాపాలకు, పగలకు అంతులేదు. కంట్రోల్ కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో ఎదుటివారి గురించి ఆలోచించడం అనవసరం. మనకి ఏమైనా కలిగినప్పుడు సహకరించడం తప్ప వారి వ్యవహారాలలో దూరకపోవడం వందరెట్లు మేలని నా అభిప్రాయం.

31, మార్చి 2019, ఆదివారం

ఆనందంగా ఆర్జించండి

సంపద అనగానే మనకు వెంటనే తట్టేది ధన,కనక,వస్తు, వాహనాల్లాంటివే. ఇవేగాక సంపద జాబితాలో చేర్చదగ్గవి  ఇంకా ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుని,వాటిని పెంచుకుంటే సంపదను పెంచుకున్నట్టే.అవి ఎంత ఎక్కువుంటే అంత సంపదవున్నట్టే.ఆశ్చర్యకర విషయం ఏమిటంటే,వాటిని ఏమంత ప్రయాస పడకుండానే సొంతం చేసుకోవచ్చు.

23, మార్చి 2019, శనివారం

వారానికి ఒకరోజైనా మనతో మనం బ్రతుకుదాం!

మనిషికి ఒంటరితనం ఎన్నో అక్కర్లేని విషయాలు నేర్పుతుంది.ఎక్కువుగా ఖాళీగా ఉంటే మనిషికి అన్నీ నెగిటివ్ ఆలోచనలు ముసురుకుంటాయి.అందుకే కాబోలు పెద్దలు ఖాళీ బుర్ర దెయ్యాల నివాసం అవుతుందని చెప్పారు.మనిషి ఏదో వ్యాపకం పెట్టుకోవాలి.అది మనకి మంచి చేసేదై ఉండి, మన అభివృద్ధికి దోహదం చేసేదై ఉంటే ఎంతో మేలు.

నిజానికి మన సంతోషానికి,దు:ఖానికి మనమే కారణం.దీనికి వేరెవ్వరూ కారణం కాదు.మనం కాస్త ప్రశాంతంగా ఉండాలంటే తెల్లవారు లేచి దైవప్రార్ధన చేసుకుని మన పనులు చక్కబెట్టుకోవడంలో ఉన్న ఆనందం,సంతోషం మరెందులోనూ ఉండదు.

రాత్రుళ్లు 1నుండి,2గంటల టైం వరకూ పడుకోకుండా,మర్నాడు సూర్యుడు నడినెత్తికి వస్తున్న సమయంలో నిద్రలేవడాలు,లేక ఉదయం 8,9గంటలకు మేల్కోడాలు ఇవ్వన్నీ కూడా మనిషికి ప్రశాంతతను దూరం చేసేవే.అనారోగ్యాన్ని దగ్గర చేసేవే.