రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఆగస్టు 2015, గురువారం

రోజా గారు అన్ని పార్టీలకు ద్రౌపతి అయ్యిపోతుందా?

ఈరోజు నేను టి.విలో వార్తలు చూస్తుంటే రోజాగారి విమర్శలు వచ్చాయి. ఆంధ్ర సి.యం చంద్రబాబుగారి టర్కీ పర్యటనకు 65 కోట్లు ఖర్చయ్యిందని, ఇంకా ఆంధ్రను సింగపూరికి అమ్మేస్తున్నాడని ఏవేవో అనేసింది. నిజానికి ఈమెకు రాజకీయమంటే తెలుసంటారా? లేక జబర్దస్త్ కామెడీ చూసి, చూసి ఈమెకేమైనా మెంటలు వచ్చిందా పాపం అనిపించింది. ఒకసారి ఆమె గత రాజకీయ వేషాలు చూడండి. తెలుగు దేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను తిట్టింది. కాంగ్రెస్ కి వచ్చిన తరువాత తెలుగుదేశాన్ని తిట్టింది. ఇప్పుడు వై.యస్.ఆర్.లోకి జంప్ అయిన తరువాత ఏకంగా మిగతా పార్టీలను తిడుతోంది. దారుణంగా విమర్శిస్తోంది. రోజా చాలా మంచి నటి. అందమైనది. నా చిన్నప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇప్పటికి అందరి హృదయాలలో రోజా గారికి ఓ క్రేజ్ ఉంది. అటువంటిది ఈమెకు ఈ దిక్కుమాలిన రాజకీయాల దరిద్రం ఎందుకో అర్ధం కావడం లేదు. గతంలో జగన్ గారు అన్నట్టు ఈమె చివరికి వై.యస్.ఆర్ పార్టీకే కాకుండా అన్ని పార్టీలకు, అందరికీ ద్రౌపతి అయ్యిపోయేలా ఉంది.

27, జులై 2014, ఆదివారం

ఆంధ్ర,తెలంగాణ వాళ్లు ఎప్పటికీ అన్నదమ్ములే!

ఆంధ్ర,తెలంగాణ వాళ్లు ఎప్పటికీ తెలుగుజాతి ముద్దుబిడ్డలే!తోడబుట్టిన అన్నదమ్ములే!వారి మధ్య వున్న బంధాన్ని ఎప్పటికీ విడదీయలేరు.కాని...కొన్ని రాజకీయ శక్తులు వీళ్ల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టింది.
   తెలంగాణ వేరైంది!మంచిదే.నేనైతే ప్రత్యేక తెలంగాణ నినాదానికి ఎప్పటికీ వ్యతిరేకిని కాను.ఎందుకంటే మేము వేరైపోయి మా తెలంగాణను ఇంకా సస్యశ్యామలం చేసుకుంటాం.అభివృద్ధి పధంలోకి నడిపించుకుంటాం!అంటున్నారు కాబట్టి విడిపోవడం మంచిది.
  ప్రాంతీయ అభివృద్ధే దేశ అభివృద్ధికి మూలం అని నమ్మేవాళ్లలో నేనూ ఒకడ్ని.
  విడిపోయాం...కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా పరిష్కారాలు చూసుకుని ఆంధ్ర,తెలంగాణాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాల్సిన బాధ్యత,అవసరం,ఆవశ్యకత ఈ రాజకీయవేత్తలపై ఉంది.
      కానీ...
  • ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టేలా..వ్యాఖ్యానించడాలు,రెచ్చగొట్టే ధొరణిలో మాట్లాడటాలు ఎంతవరకు న్యాయం?
  • కేవలo ప్రాంతాలను విడదీయడమే కాకుండా, మనుషులను కూడా వేరుపర్చాలనా?
  • ఆంధ్రా,తెలంగాణలను మరొక ఇండియా,పాకిస్తాన్ ల మాదిరిగా మార్చేయలనా?
  • తెలంగాణలో కొన్ని అల్లరిమూకలు అక్కడున్న ఆంధ్రావాళ్లను టార్గెట్ చేయడం,వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం పద్ధతేనా?
  • అక్కడే పుట్టి,అక్కడే పెరిగి చదువుకుంటున్న అమాయక విధ్యార్ధులను ఏవేవో చట్టాలు చేసి బయటికి తోలడానికి సన్నాహాలు చేయడం,ఏవిధమైన సహాయాలు చేయకుండా నిరోధించాలనుకోవడం ఎంతవరకు సబబు?

  పరిస్థితి గమనిస్తుంటే...ఇన్నీ చేస్తున్న మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రిగారైన కె.సి.యార్ గారిని కూడా ఏదో రోజున నీవు కూడా పూర్తి తెలంగాణ వాడివి కాదంటూ బయటికి తోలేస్తారేమో అనిపిస్తుంది.