అవీ...ఇవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవీ...ఇవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జులై 2019, సోమవారం

ఈ రోజు చెన్నై...రేపు మన ఊరు..?

🏢చెన్నై...భారతదేశం లో అదొక ప్రసిద్ధ  మహా నగరం....నోరూరించే రుచులతో, తర తరాల సంస్కృతిలో, పెద్ద పెద్ద ఆలయాలు, భవంతులు తో, కూత వేటు దూరం లో అద్భుతమైన బీచ్ తో సముద్ర గోషతో ,నిత్యం తన గుండా ప్రయాణించే వేలమంది ప్రయాణికులతో కిటకిటలాడే రద్దీ అయిన నగరం,

కానీ...ఇప్పుడు ఆ నగరం లో...

🚃🚃మెట్రో ట్రైన్ లో ఒక బోర్డ్...నీటి కొరత కారణంగా ఈ మెట్రో రైల్లో ఏసీ పని చెయ్యదు, అర్థం చేసుకోగలరు..

🍚హోటల్ బయట ఒక బోర్డ్- నీటి కొరత కారణంగా  ఒక మనిషి భోజనానికి ఒక గ్లాస్ నీరు మాత్రమే ఇవ్వబడును,అర్థం చేసుకోగలరు..

🚽టాయిలెట్ బయట ఒక బోర్డ్- నీటి కొరత కారణంగా  ఈ టాయిలెట్ మూసివేయ్యబడింది,అర్థం చేసుకోగలరు..

🖥సాఫ్ట్ వేర్ కంపెనీ బయట ఒక బోర్డ్-నీటి కొరత కారణంగా  ఉద్యోగులు భోజనానికి, ప్లేట్స్ కడుక్కోవాడిని సరిపడా నీరు మీరే తెచ్చుకోండి లేకపోతే ఇంటి దగ్గర ఉండే పని చెయ్యండి,అర్థం చేసుకోగలరు..

🏥హాస్పిటల్ లో ఒక బోర్డ్-నీటి కొరత కారణంగా రోగులు నీళ్ల బదులు సెలైన్  తో సరిపెట్టుకోండి..అర్థం చేసుకోగలరు..

👨🏻‍💻స్కూల్ లో ఒక బోర్డ్-నీటి కొరత కారణంగా మీ పిల్లల్ని కొద్దిరోజులు స్కూల్ కి పంపకండి, అర్థం చేసుకోగలరు..

🚿నగర వీధుల్లో ఒక బోర్డ్- నీటి కొరత కారణంగా  స్నానాలు చెయ్యడం కొద్దీ రోజులు మానేయండి,అర్థం చేసుకోగలరు..

అసలు ఏంటి అర్థం చేసుకొనేది?? మొన్నటికి మొన్ననే ఆ నగరం  భారీ వర్షాలు, వరదలు తో తడిసి ముద్దయింది... కానీ ఇప్పుడు గొంతెడుతున్న తాగడానికి నీటి చుక్క కూడా లేదు...మరి ఆ నీరు ఎటు పోయింది.. ??అసలు ఈ పరిస్థితి కి కారణం ఏంటి????

కారణం అందరికీ తెలిసిందే...ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ  "సరైన నీటి సంరక్షన చర్యలు" తీసుకోపోవడమే...

మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది??? అక్కడ ప్రభుత్వం ప్రజలకు పథకాల ద్వారా అన్ని ఫ్రీ గా ఇస్తూ నీటి సంరక్షనను గాలి వదిలేసింది🤦🏻‍♂...ఇప్ప్పుడు వర్షాలు కోసం పూజలు చేయిస్తుంది🤷🏻‍♂...

మరి ప్రజలు ఏం చేస్తున్నారు?? ప్రజలు ఎండాకాలం లో నీరులేక ఏడుస్తారు,వర్షాల కోసం కప్పల పెళ్లిళ్లు చేస్తారు🤦🏻‍♂..కానీ వర్షాకాలం లో వర్షం నీరు వృధాగా పోతున్నా చూస్తూ పోతారు....🤷🏻‍♂

☀కానీ వారికి తెలీదు అనుకుంటా!! ఒక పనికి(నీటి సంరక్ష) మానవ ప్రయత్నం లేనప్పుడు వారికి  దేవుడు కూడా సాయం చెయ్యడు...

🌧🌧వస్తున్నది వర్షాకాలం కాబట్టి ఇంకుడు గుంతల ద్వారానో, చెరువుల ద్వారానో ,  మరెలానో సాధ్యమైనంత వరకు వర్షపు నీరు ఒడిసి పట్టుకుందాం, వర్షపు నీరు భూమిలోకి ఇంకెలా చేద్దాం ...మన ఊరు మరో  చెన్నై కాకుండా జాగ్రత్త పడదాం...🙏🙏

28, జూన్ 2019, శుక్రవారం

ఓపెన్‌స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం | Open school admissions begin

*★ ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) 2019-20 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.*

*★ బాలికలు, గ్రామీణ యువత, పనిచేసే స్ర్తీలు, పురుషులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు చదువుకునేందుకు అవకాశం.*

*★ ఈనెల 28 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లు.*

*★ ఆగస్టు 31వ తేదీన అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్లు.*

*★ సెప్టెంబరు 26వ తేదీ వరకు రూ.200ల అపరాధ రుసుముతో.*

*★ 30వ తేదీ నాటికి చెల్లించాలి.*

*★ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లను పొందవచ్చు.*

*★ పదోతరగతి అడ్మిషన్లకు రికార్డ్‌ షీటు లేదా టీసీతో పాటు ఆధార్‌కార్డు*

*★ తల్లి ఆధార్‌ కార్డు, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కుల ధ్రువీకరణ పొందుపరచాలి.*

*★ దివ్యాంగులు వైద్యుల ధ్రువీకరణ ఇవ్వాలి.*

*★ ఎటువంటి విద్యార్హత లేకున్నా తహసీల్దార్‌ ధ్రువీకరించిన జనన ధ్రువీకరణ పత్రాలతో డైరక్టర్‌గా పదో తరగతిలో అడ్మిషన్‌ పొందవచ్చు.*

*★ పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఏడాది విరామం ఉన్న వారు ఒకే సంవత్సరం ఇంటర్‌ పూర్తి చేసే అవకాశం.*

26, జనవరి 2019, శనివారం

మీ ఇల్లే మీ స్వర్గం | Your house is your heaven.

మీ ఇల్లే మీ స్వర్గం  Your house is your heaven.
మీ ఇల్లే మీ స్వర్గం  Your house is your heaven.
ఆఫీసులో ఇంట్లో ఉన్నన్ని సౌకర్యాలు ఉండొచ్చు.కానీ ఎదురుచూసే వాళ్లుండరు.ప్రేమించే వాళ్లుండరు.కొసరికొసరి వడ్డించే వాళ్లుండరు.అందుకే ఆరైపోగానే అంత ఆరాటం.ఉద్యోగ జీవితంలో అద్భుతవిజయాలు సాధిస్తే చాలు,ఇంకేం అక్కర్లేదనుకునే కెరీర్ జీవులకు ఆ గెలుపు జీవితంలో సగమేనని,ఒక భాగమేనని తేటతెల్లమైపోతోంది. మరో సగం,ఇంకో భాగం...కుటుంబమనే సంగతి అర్ధమవుతుంది."కుటుంబానికి ఇంకాస్త సమయం కేటాయించాలన్న లక్షల మంది దంపతుల నిర్ణయం.

   అంతవరకు బాగానే ఉంది.సమస్యంతా వ్యక్తిగత,వృత్తిజీవితాల మధ్య సమతూకం పాటించడంలోనే.ఆఫీసులో అనుకున్న సమయానికి లక్ష్యాలు పూర్తికావు.ఎంత తొదరగా గూడు చేరుకుందామన్నా ,అర్ధరాత్రి దాటే పరిస్థితి.అందుకే "ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది ప్రక్కన పెట్టండి.ఎంత సంతోషంగా గడుపుతున్నామనే కోణంలోంచి చూడండి.అది పావుగంటే కావచ్చు.కాని లీనమయిపోండి. ఇల్లే సర్వస్వం కావాలి.ఆఫీసు,టార్గెట్లు...ఏవీ గుర్తుండకూడదు."అని సలహా ఇస్తారు.ఫ్యామిలీ కౌన్సెలర్స్ పదిలంగా అల్లుకున్న పొదరిల్లు గుర్తుకొస్తోందా! శుభం.

29, ఆగస్టు 2017, మంగళవారం

వాత్సాయన శాస్త్రాన్ని ఏవగించుకోవాల్సిన అవసరం లేదు.

మన పూర్వులు రాయని శాస్త్రమంటూ లేదు. శాస్త్రకారులలో ప్రాచీనుడైన వాత్సాయనుడు కామసూత్రం అని ఒక శాస్త్రాన్ని రాశాడు. గాలి,నీరు,ఆకాశం మొదలైన వాటన్నిటికీ శాస్త్రజ్ఞులు దైవత్వాన్ని చూపించినట్టే జీవిత సాఫల్యాన్ని నిర్ధారించడానికి సంపూర్ణత్వానికి సమన్వయం కుదర్చడానికి వాత్సాయనుడు కామసూత్రం రాశాడు. దురదృష్టవశాత్తూ వాత్సాయన కామసూత్రాల ప్రసక్తి రాగానే చాలామంది అదేదో వినరాని పదం విన్నట్టు మొహం ఏవగింపుగా పెట్టటం దురదృష్టకరమైన విషయం.

26, ఆగస్టు 2017, శనివారం

తెలుగు బ్లాగులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

మన తెలుగు అంతర్జాలంలో తెలుగు బ్లాగర్లను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.ఒకరకంగా మనం తెలుగు బ్లాగుల విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నాం.బ్లాగంటే ఒక పర్సనల్ డైరీలాటిది.మన జ్ఞాపకాలు,ఆలోచనలు,అనుభవాలు...ఇంకా ఎన్నో విషయాలు మనం దానితొ పది మందికి తెలియజేయవచ్చు.అంతే కాకుండా ఏదో సబ్జక్ట్ మీద చక్కగా విషయాలు పొందుపరచి నలుగురి ఉపయోగానికి తోడ్పడవచ్చు.నా వంతు కృషిగా నేను నల్గురు మిత్రులకు చెప్పి వారి చేత బ్లాగులు ఓపెన్ చేయించాను.అలా ప్రతి ఒక్కరూ చేసినట్లయితే ఈ బ్లాగుల విషయం అందరికీ అవగాహణ అవుతుంది.అప్పుడు మనం తెలుగు బ్లాగుల విషయంలో మనమే టాప్ అవుతాము.

   దీనివల్ల ప్రయోజనమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవవచ్చు.ఒక బ్లాగర్ తన బ్లాగులో ఒక అంశంపై వ్రాయాలంటే దానికి సంబధించిన ఇన్ ఫర్ మేషన్ అతని దగ్గర ఉండాలి.ఆ సమాచారం కోసం అతను అనేక పుస్తకాలు చదవాలి.ఏకాంతంగా ఆలోచించాలి.ఇవన్నీ కూడా మంచి పనులే కదా!అతనికి ప్రయోజనం చేకూర్చేవే గదా!

   ఏకకాలంలో ఒక బ్లాగర్ మంచి పాఠకుడు,మంచి రచయితగా కూడా ఎదుగుతాడు.

   అంతర్జాలంలో మొత్తం కలిపి 5000 తెలుగు బ్లాగులు కూడా లేవు.బ్లాగులను చదివేవారు కూడా తక్కువే.నా ఉద్దేశ్యంలో చాలామందికి అసలు బ్లాగుల యొక్క అవగాహణ లేదు.పెద్ద,పెద్ద విద్యావంతులకే బ్లాగ్ అనేది ఒకటుంటుంది అనే విషయమే తెలియదు.ఇక బ్లాగ్ చదివేవారు ఎక్కడుంటారు?

   మరొక ముఖ్యవిషయమేమిటంటే...ప్రతి బ్లాగరు ఓ మంచి బ్లాగ్ రీడర్ కావాలి.ఏదో బ్లాగులో పోస్ట్ చేసేసాము..అయిపోయింది అనుకోకుండా మంచి,మంచి బ్లాగులను చదువుతూ వాటికి మన స్పందనలు కామెంట్ రూపంలో పంపుతూ ఉంటే వారిని కూడా మనం ప్రొత్సాహించినవాళ్ళమవుతాము.అప్పుడు వారు కూడా మన బ్లాగుకొచ్చి మనల్ని ప్రొత్సాహిస్తారు.

   ఏది ఏమైనా మనమందరము తెలుగు బ్లాగులను ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుదాం!ఓకే నా?

23, ఆగస్టు 2015, ఆదివారం

కిక్-2 సినిమా అంతగా కంపర్ట్ ఫుల్ గా లేదు!

రవితేజ హీరోగా విడుదలైన కిక్-2 సినిమా ఎందుకో అంతా కంపర్ట్ ఫుల్ గా అనిపించలేదు. దీని ముందు సినిమా కిక్ ని మరిపించలేకపోయింది. ఆ సినిమా బాగుంది. ఈ కిక్-2 సినిమా అంతగా నాకు నచ్చలేదు. సహజంగా రవితేజ సినిమా అంటేనే కామెడీ గా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ముందుభాగమ్ కొద్దిగా పర్లేదు గాని సెకండ్ భాగం అసలు నచ్చలేదు. బ్రహ్మనందాన్ని పెద్దగా ఉపయోగించలేకపోయారు. విలన్ ని మొదటి భాగంలో చూపించినంతగా రెండో భాగంలో చూపించలేదు. హీరో విషయంలో కూడా అలాగే జరిగింది. అంత ఫీలింగ్ ఉన్న సినిమా ఏమీ కాదు ఈ కిక్-2. సినిమా అంతా హీరో కంపర్ట్ గా ఉంటేనే ఏ పనైనా చేస్తాడు. కానీ ఆ సినిమా చూసే మనకు మాత్రం ఏవిధమైన కంపర్ట్ లేకుండా పోతుంది.

5, ఆగస్టు 2015, బుధవారం

"దృశ్యం" సినిమా 5 భాషల్లోనూ సూపర్ హిట్టేనట!

ఈరోజు ఒక మిత్రుని బ్లాగులో "దృశ్యం" సినిమా ఐదు భాషలలోనూ సూపర్ హిట్టయ్యిందన్న టపా చదివి చాలా ఆనందమేసింది. ఎందుకంటే చాలా చక్కని సినిమా! అందరూ చూడాల్సిన సినిమా! గతంలో ఈ సినిమా గురించి ఒక టపా కూడా వ్రాసాను. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. ఒకసారి ఆ లింక్ చూడండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పడేయ్యండి.

28, జులై 2015, మంగళవారం

"కాకినాడ బజార్" నూతన బ్లాగ్ ప్రారంభం!

ఎప్పటినుండో కాకినాడకు సంబంధించిన విశేషాలతో ఒక బ్లాగును ప్రారంభించాలని అనుకుంటూ ఉండేవాడిని. దైవానుగ్రహం అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఇకనుండీ కాకినాడకు గూర్చిన సమాచారమంతా ఈ బ్లాగు ద్వారా అందుతూనే ఉంటుంది. కాకినాడ వాసులకు ఉపయోగకరంగానూ, మిగతా ప్రాంతాలవారికి సమాచారాత్మకంగానూ ఈబ్లాగును తయారుజేస్తాను. ఒకసారి ఈ లింక్ ద్వారా Kakinada bazaar వీక్షించి మీ విలువైన సలహాలు,సూచనలు అందించగలరని ఆశిస్తున్నాను.

14, జులై 2015, మంగళవారం

"బాహుబలి" విజయవంతమయ్యిందా?

రాజమౌళిగారు దర్శకత్వంలో వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా బాహుబలి గురించి పేక్షకులలో వివిధ కామెంట్లు వస్తున్నాయి. అత్యధికంగా సినిమా పెద్దేమీ సూపర్ హిట్ కాదన్న విమర్శలే కాన వస్తున్నాయి. అయితే సినిమాకి కావల్సిన కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయని రిపోర్టులు చెపుతున్నాయి. ఏది,ఏమైనా తెలుగు సినిమాని హాలీవుడ్ తరహాలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళిగారిని అభినందించవల్సిందే!

8, సెప్టెంబర్ 2014, సోమవారం

ఆన్ లైన్ ధార్మిక పత్రిక :సాక్ష్యం సంచలన పత్రిక.

ఈ రోజు మతం అనేక రూపాలు ధరించి మనిషిని భక్తి అంటేనే విరక్తి చెందేలా చేస్తుంది.రోజుకొక మతం పుట్టుకొస్తూనే ఉంది.వీధికొక బాబా వెలుస్తూనే ఉన్నారు.నిజానికి ధార్మిక గ్రంధాల ప్రమేయం లేకుండానే సొంతబోధనలు,కల్పిత సిద్ధాంతాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి.అసలు దేవుడంటే ఎవరు?ధర్మమంటే ఏమిటి?ధార్మిక గ్రంధాలకు మనకు గల సంబంధం ఏమిటి?ఇత్యాది విషయాలను తేటతెల్లం చేసి చూపించే ధార్మిక పత్రిక - సాక్ష్యం సంచలన పత్రిక. తప్పక చదవగలరు.

                                                

16, ఆగస్టు 2014, శనివారం

ఇకనుండీ నా బ్లాగులో...

నా కలం పేరుమీద (నామనోడైరీ:బ్లాగ్ టైటిల్)బ్లాగు మొదలిపెట్టినప్పుడు నుండీ దానికోసం రాయడం కంటే బ్లాగును డిజైన్ చేయడంలోనే ఎక్కువ సమయం కేటాయించేస్తున్నాను.ఈ రోజున పెట్టిన టెంప్లేట్ రేపు నచ్చడం లేదు.ఇలా ఎన్నో మార్చి,మార్చి చూసి చివరికి చిరాకేసిందంటే నమ్మండి.
 ఇక ఈరోజుతో ఆపనికి స్వస్తి చెప్పేసాను.(కొన్నాళ్లు సుమా!మంచి డిజైన్ నా కళ్ల బడితే అంతే నాది కూడా అటువంటి టెంప్లేట్ సెట్ చేసేయాలి.లేకపోతే నిద్రపట్టదు.)
 అయినా!నామతిగానీ..బ్లాగ్ ఎంత అందంగా ఉంటే ఉపయోగమేముందీ అందులో సరుకు బాగుండాలి గాని!అంతే గదండీ !
 ఫాతిమా మేరాజ్ గారి బ్లాగు చూడండి ఏమాత్రం అలంకరణ ఉండదు.గానీ బ్లాగులో కవిత ఫోస్ట్ అయితే చాలు హాట్ కేకుల్లా తినేస్తారు.సారీ..చదివేస్తారు.టాలెంట్ ఉండాలంతే!ఏమంటారు?
 పద్మప్రియ గారి బ్లాగు "ప్రేరణ"కూడా కొంతవరకు అలంకరణ వున్నా మంచి,మంచి కవితలలో దదరిల్లే బ్లాగే.ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగవతం ఈ జన్మకు పూర్తికాదు.గూగుల్ వాడి మెమరి కూడా సరిపోదు.ఇంకా తెలుసుకోవాలని గట్టి  పట్టుదలగా ఉంటే...అదే బ్లాగుల గురించి "బ్లాగ్ వేదిక"ను ఓ లుక్కేయండి.
 ఇంతకీ ఓ శుభవార్త చెప్పటం మరిచాను."వెన్నెలకెరటం"అని ఈ మధ్య కొత్త బ్లాగ్ ఒకటి అవతరించింది.సాహిత్యంపై ఎక్కువుగా పని చేస్తుంది.
 ఏది,ఏమైనా నా బ్లాగులో మంచి,మంచి పోస్ట్సు చేయాల్సిందే!ఇక నుండీ ఆపని మొదలు పెడతాను.

28, జులై 2014, సోమవారం

ఈ రోజుల్లో ఇంతమంచి సినిమా ఇదేనేమో!

ఒకరోజు నా ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దృశ్యం సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు.పెద్దగా సినిమాలు చూడని నేను ఆరోజు ఆ సినిమా చూసాను.సినిమా చాలా బాగుంది.సైలెంట్ గా,ధ్రిల్లింగ్ గా సస్పెన్స్ కధనంతో ఆసాంతం మనిషిని కట్టి పడేసింది.
 
    బహుశా ఈరోజుల్లో ఇంతటి మంచి సినిమా రావడం ఇదే  మొదటిసారనుకుంటా!
 
    సినిమాలో అశ్లీలం లేదు.బట్టలూడదీసి తిరగడం అసలే లేదు.ఎంతో హుందాగా,గౌరవపధంగా నడిచింది.

    నేటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ఉంది.

    ఇక కట్ చేసి కథలోకొస్తే...

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ప్రాజెక్ట్ పనిమీద బయటికి క్యాంప్ కి వెళ్లుంది.ఒకరోజు బాత్ రూం లో స్నానం చేస్తుంటే...ఆ అమ్మాయికి తెలియకుండా ఓ రాక్షసుడు సెల్ కెమెరాతో వీడియో తీసి తర్వాత క్యాంపు నుండి తిరిగి వచ్చిన అమ్మాయి ఊరెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

    వాడొక ఐ.జి కొడుకు...తల నిండా పొగరు.

    ఒకరోజు నైట్ తనతో గడపక పోతే ఆ వీడియో Youtube లో Upload చేస్తానని బెదిరిస్తాడు.

    అమ్మాయి బెదిరిపోతుంది.విపరీతంగా భయపడిపోతుంది.
 
    ఆరోజు రాత్రి అతను రమ్మన్న చోటుకి వెళ్తుంది.వీడు కూడా అదే చోటుకి వెళ్లినప్పుడు అక్కడ ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా వుంటుంది.

    వీడికి కోపం రగిలిపోతుంది.

    తల్లికూతుర్లిద్దరూ ఎంతో ప్రాధేయపడతారు.ఆ వీడియో ఇచ్చేయమని బ్రతిమిలాడుకుంటారు.

    అయినా ఆ రాక్షసుడు వినడు.వాడికి మనస్సుంటేనే గదా!

    తన కూతురి జీవితాన్ని...పాడు చేయవద్దని...కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న తల్లి ఒంటిపై చేతులేసి..."నీ కూతుర్ని వదిలి పెడతాను.నీవు నాతో ఈ నైట్ గడుపు"అంటాడు.అంతే..వాడి తలపై బలమైన దెబ్బ...ఆ అమ్మాయి కట్టె తీసుకుని వాడి తలపై కొడుతుంది.ఆ ఒక్క దెబ్బ బలంగా తగిలి అక్కడికక్కడే కూలబడి చనిపోతాడు.ఆ తరువాత వాడి బాడీని తల్లీకూతుర్లిద్దరూ...గోతిలో పూడ్చేస్తారు.

    ఆ కుటుంబాన్ని ఎలా ఆ కేస్ నుండి రక్షించాలా అని ఆ అమ్మాయి తండ్రి చేసే ప్రయత్నాలే సినిమా అంతా!

    ఇందులో గమనించాల్సిన ఓ  పేక్షకుడి ఫీలింగ్ ఏమిటంటే...

    ఆ కుటుంబం ఆ కేస్ నుండి తప్పించుకోవడానికి ఆడే నాటకం ఏ పేక్షకుడికి తప్పు అనిపించదు.ఎందుకంటే ఆ దుర్మార్గుడి వారి పట్ల ప్రవర్తించిన తీరు ...వీళ్లు కేసునుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు,నాటకాలను సమర్ధిస్తాయి.ఉద్దేశ్యపూర్వకంగా చేయని ఆ హత్యనుండి తప్పించుకోవడానికి ఈ కుటుంబం చేసేదంతా రైటే అనిపిస్తుంది.

    నా దృష్టిలో అయితే...కరెక్ట్ కూడా..

    ఆ అమ్మాయి తనకు జరిగిన విషయం గురించి తల్లికి చెప్పడం గొప్ప విషయం!ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.ఈ సినిమాలో అమ్మాయి అలా చెయ్యలేదు.తల్లికి చెప్పి గొప్ప పని చేసింది.

   మరొక విషయమేమిటంటే ఆ అమ్మాయి తండ్రికి ఆ కేస్ ను ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు త్రాగించేంత తెలివితేటలు..అతను ఎక్కువుగా అతని కేబుల్ ఆఫీసులో సినిమాలు చూడటం వలనే వచ్చాయి.సినిమాలు మనిషికి ఇన్ని తెలివితేటలు కల్గిస్తాయా?అదీ మంచిగా అనేది నాకైతే పెద్ద సందేహమే!

   ఏది ఏమైనా!సినిమా చాలా బాగుంది.ఆ అమ్మాయి తల్లిదండ్రులుగా మీనా,వెంకటేశు నటించారు.గొప్ప విషయమేమిటంటే...మీనాగారు అచ్చు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా, ఓ చక్కని భార్యగా..హుందాగా నటించిన తీరు చూస్తే...అబ్బో నాకు కూడా ఓ మంచి సంప్రదాయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది.బ్యాచ్ లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనిపించింది.