అవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జులై 2014, గురువారం

మనం ఈ తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లను ఆదరిస్తున్నామా?

తెలుగు బ్లాగులను ప్రతిరోజూ ఏదో ఒక టపాతో అప్ డేట్ చెయ్యకపోతే వాటికి అడ్రస్ లేకుండా పోతుంది.వాటిని తెలుగు ప్రజలకు చేరవేసే అగ్రిగేటర్లు కొన్ని మాత్రమే ఉన్నాయి.వాటిలో మొదటి స్థానంలో కూడలి ఉంటే తరువాతి స్థానంలో మాలిక, ఆపై బ్లాగిల్లు,జల్లెడ ఉన్నాయి.ఇవే కాకుండా మరికొన్ని బ్లాగ్ ప్రపంచం,బ్లాగ్ వేదిక,పూదండ వంటివి కూడా ఉన్నాయి.వీటన్నింట్లో మాలిక మాత్రం అమిత వేగం కలది.పోస్ట్ చెయ్యడం తరువాయి వెంటనే మాలికలో ప్రచురించబడుతుంది.కూడలి,బ్లాగిల్లు మాత్రం కొద్ది సమయాన్ని తీసుకుంటాయి.ఇవి చేసే సేవ చాలా గొప్పదనే చెప్పాలి.ఎటువంటి ఆదాయం లేకుండా తెలుగు బ్లాగుల లోకానికి ఎనలేని సేవ చేస్తున్నాయి.కాని దారుణమేమిటంటే ఈ అగ్రిగేటర్లను ఉపయోగింకుంటూ వాటి లోగోలను తమ బ్లాగుల్లో ముద్రించుకోని బ్లాగర్లు నూటికి 95% మంది ఉన్నారు.వారు చేసే ఉచిత సేవ అందుకుంటూ వారికి మద్దతు ఇవ్వకపోవడం చాలా దారుణం కదూ?

9, జులై 2014, బుధవారం

బ్లాగ్ వేదిక మరో విజయం.

ఇప్పటివరకూ బ్లాగ్ వేదికలో 300 తెలుగు బ్లాగులు అనుసంధానించబడ్డాయి.ప్రముఖ అగ్రిగేటర్లకు ఇంచుమించు తక్కువ కాకుండా బ్లాగ్ వేదిక రూపాంతరం చెందింది.ఎన్నో శీర్షికలు రూపొందించింది.ఇంకా మరెన్నో ఫీచర్స్ రానున్నాయి కూడా.త్వరలో బ్లాగ్ యాడ్స్ ద్వారా తెలుగు బ్లాగర్లకు కొద్దో,గొప్పో ఆదాయాన్ని సమకూర్చే విధానం కూడా ప్రవేశపెట్టనుంది.ఇవే కాకుండా ఇంగ్లీష్ బ్లాగుల పోర్టల్ కూడా అందించనుంది.దానితో పాటు ప్రతి సబ్జెక్ట్ మీద బ్లాగులను వేరు పరచి బ్లాగు వీక్షకులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేయనుంది.
       
        బ్లాగు క్రియేట్ చేయాలన్నా,టెంప్లేట్ మార్చాలన్న,ఏవిధమైన సమాచారమైనా బ్లాగ్ వేదికలో దొరికే ఏర్పాటు చేయనుంది.

        బ్లాగ్ వేదిక ప్రవేశ పెట్టిన శీర్షికలలో 'బ్లాగర్ల పరిచయాలు 'ప్రత్యేకమైనది.ఎందుకంటే ప్రతి బ్లాగరును తెలుగు ప్రజలకు తెలియచేయటం ప్రధాన ల్క్ష్యంగా కొనసాగుతుంది.దీని నిమిత్తం Facebook, twitter లాంటి సోషల్ సైట్ల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది.
        ఇలా..ఎన్నో...మరెన్నో శీర్షికలు,ఫీచర్లు త్వరలో రానున్నాయి.
        మీరు కూడా ఓ మంచి బ్లాగరైతే ఈ క్షణమే మీ బ్లాగును బ్లాగ్ వేదికతో అనుసంధానించండి.
                                           
                                              మీ
                                         బ్లాగ్ వేదిక టీం

                                 http://blogvedika.blogspot.in/
                                              

28, జూన్ 2014, శనివారం

ఓ చిన్న శుభవార్త

ప్రియమైన బ్లాగ్ రీడర్లకు ఓ చిన్న శుభవార్త.ఇకనుండీ వెన్నెలకెరటం బ్లాగ్ పత్రికను నడిపించాలని సంకల్పించాము.దీనికొరకు మీ సహాయసహకార్యాలు మాకు కావాలి.దయచేసి ఈ పత్రికను ముందుకు నడిపించడానికి కావల్సిన ప్రోత్సాహాన్ని అందించవల్సిందిగా కోరుచున్నాము.

                       మీ సహాయసహకార్యాలు కోరుకుంటూ....
                             
                                    మీ
                             వెన్నెలకెరటం ఎడిటర్

                     http://vennelakeratam.blogspot.in/  

28, మార్చి 2014, శుక్రవారం

తప్పనిసరి

         తన గురించి తను ఆలోచించుకోవటమంటే పగటి కలలు కనటం కాదు.అసాధ్యమైన పనులలో విజయాన్ని ఊహించటం పగటికల.సాధ్యమైన విజయాలని ఎలా సాధించాలి అని ఆలోచించటం వాస్తవమైన కల.ఈ తేడా తెలుసుకోగలిగి వుండాలి.
         తొందర  తొందరగా మెట్లు ఎక్కి పైకి వెళ్లిపోదాం అన్న ఆశ ఒక్కోసారి కాలుజారేలా చేస్తుంది అదే మనం తెలుసుకోవలసింది.

24, అక్టోబర్ 2013, గురువారం

మీ బ్లాగులను జత చేయండి

బ్లాగ్ వేదిక నూతనంగా తయారవుతుంది.ప్రియమైన బ్లాగర్లందరూ తమ,తమ బ్లాగులను బ్లాగ్ వేదికలో జత చేయవల్సిందిగా కోరుచున్నాము.బ్లాగు వేదికను మరింతగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాము.త్వరలో వెబ్ సైట్ గా మారుతుంది.మీ బ్లాగులను జతచేయుటకు http://blogvedika.blogspot.in/  పై క్లిక్ చేయండి

19, అక్టోబర్ 2013, శనివారం

మీ ఆలోచనలు పంపండి

         
ప్రతివాళ్లకీ ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతూనే ఉంటాయి.
వాటిలో మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి భద్రంగా దాచుకోండి. సమాజం గురించీ,దేశం గురించీ,అందరికీ సమస్యలుగా తయారయ్యే విషయాల గురించి మీకొచ్చే ఆలోచనలను "వెన్నెల కెరటం" సాహిత్య బ్లాగులో మీ సహ బ్లాగు వీక్షకులతో పంచుకోండి.వీలైతే మీకు తోచిన పరిష్కారాలు చెప్పండి.మంచి సూచనలు చేయండి.మీ మనస్సులో మాటల్ని అక్షరాలుగా కూర్చి పంపండి. దానితోపాటు మీకిష్టమైతే మీ ఫొటో జత చేయండి.మీ ఆలోచనలు ఎందరికో కనువిప్పు కలిగించవచ్చు.కొందరికి ఓదార్పునివ్వవచ్చు.సమాజానికి మేలుకొలుపూ కావచ్చు.
                 మీ ఆలోచనలు పంపాల్సిన మెయిల్ ఐడి:
                   md.ahmedchowdary@gmail.com

       వెన్నెలకెరటం సాహిత్య బ్లాగు కొరకు క్లిక్ చేయండి.

12, అక్టోబర్ 2013, శనివారం

సకల రంగాల సంపూర్ణ బ్లాగవతం-1

నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు నా విషయాలు,రచనలు మాత్రమే అందించాలి అనుకున్నాను.అంటే ఆన్ లైన్ డైరీలా నా పర్సనల్ డేటా ఉంచుదామనుకున్నాను.తీరా కొన్నాళ్లు వాడిన తర్వాత అన్ని రంగులు,రంగాలు మిళితం చేసి అందరికీ చేరువ చేస్తే బాగుంటుంది అనిపించింది.అందుకే నా బ్లాగును 'సకల రంగాల సంపూర్ణ బ్లాగవతం'గా మార్చాను.దీని ద్వారా మీ అందరితో దగ్గరవ్వడం ఒకటైతే మిమ్మల్ని కూడా ఇందులో భాగస్తులను చెయ్యడం మరొకటి.దీని వలన కలిగే ప్రయోజనమేమిటో తెలియదు కానీ,పూర్తిగా ఈ బ్లాగు గురించి ప్రచారం కల్పించాలనికుంటున్నాను.ఈ బ్లాగులో సాహిత్యం,పుస్తకాలు,ఆరోగ్యం,ఆధ్యాత్మికం,ఆటలు,పాటలు వార్తలు,వాయింపులు అన్నీ ...ఒక్కటి కాదు,రెండుకాదు 64కళలు అందుబాటులోకి తీసుకొస్తాను.దానితోపాటు సోషల్ బ్లాగ్ నెట్ వర్క్,వ్యాపార లావాదేవీలు,అమ్ముకోవడాలు,కొనుక్కోవడాలు అన్నీ ఉంటాయి.లేదనేదేదీకూడా లేకుండా చేస్తాను.మీరు కూడా దీనితో లింక్ కలుపుకోండి.మీ బ్లాగులను,వ్యాపారాలను అభివృద్ధి పర్చుకోండి...అదేంటో...ఎలాగో ...త్వరలోనే చెప్తాను.ప్లీజ్ వెయిట్ అండ్ సీ!