6, ఏప్రిల్ 2020, సోమవారం

మాటేమంత్రం

మాటల్లో పాజిటివ్-నెగెటివ్ ఎమోషన్స్
ఎమోషన్స్ లో రెండు రకాలుంటాయి. ప్రతికూలం-అనుకూలం.ప్రతికూలం వలన ప్రమాదాలు తప్పవు.అనుకూలం వలన ఆనందం లభిస్తుంది.డేనియల్ గోల్మన్ అనే రచయిత ప్రతికూల ఎమోషన్స్ లో ఎలా ఉండాలో,అంటే ఆ సమయంలో అలవర్చుకోవలసిన అనుకూల ఎమోషన్స్ ఏమిటో తెలిపాడు.ఇవి పరిశీలించండి.పాటించే ప్రయత్నం చేయండి.
    నెగిటివ్                                           పాజిటివ్
 • 1.భయం                                         ధైర్యం
 • 2.ఆందోళన                                     ఆత్మవిశ్వాసం
 • 3.ద్వేషం                                         క్షమాగుణం
 • 4.బాధ                                           ఓర్పు
 • 5.అవమానం                                   ఆత్మస్ధైర్యం
 • 6.అసూయ                                     ప్రేమ
 • 7.వైఫల్యం                                      ఆత్మబలం
 • 8.మోసానికి గురికావటం                   అదొక పాఠంగా స్వీకరించటం
 • 9.అంగవైకల్యం                                అంగీకరించటం
 • 10.నిరాశ,నిస్పృహలు                      ఓదార్పు
 • 11.స్వయం సానుభూతి                    ఛాలెంజిగా తీసుకోవటం

* మంచి మాటలతో ప్రేరణలు కలిగించవచ్చు.ఎదుటివారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చు.పదును పెట్టవచ్చు.వారిని నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దవచ్చు.మంచిమాటలు ఎంతో ప్రభావాన్ని కలిగించగలవు.మంచిమాటలను తేలికగా అంచలా వేయకండి.మంచిమాటలను చెప్పటం సాధన చేస్తూ ఉండండి.ఉత్సాహం ఉరకలు వేస్తుంది.మీ మంచిమాటలు ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

* మనం చెప్పేదానిపట్ల సరైన అవగాహన ఉండాలి.వినే వ్యక్తి యొక్క స్ధాయి యొక్క ఆలోచనా సరళి,అతని ఎమోషన్స్ గురించి కొంత అధ్యయనం చేయాలి.వాటికి తగ్గట్లుగా మాట్లాడాలి.అంటే మాట్లాడే స్వరం,మాటల్లో ఎంపికచేసే పదాలు కూడా ప్రభావం చూపించగలవు.

* ధ్వనికి ప్రతిధ్వని తప్పదు.ఇది అందరికీ తెలిసిన సత్యమే.ఈ రోజు నేను ఒక వ్యక్తిపై ఎమోషన్స్ వెళ్లగక్కితే,మళ్లీ నాకు అవి ఒక రోజు తప్పవు అనే సత్యం గుర్తించాలి.అందుచేత వీలైనంతగా మూడ్స్ ని అదుపులో ఉంచుకోవాలి.ఎమోషన్స్ ఎప్పటికప్పుడు అదుపుచేసుకోవటం కూడా ఒక కళ.

* మనం ఏరంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధించాలంటే,ముందు ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించాలి.ఆపైన మనలో ఉన్న బలాలు,బలహీనతలు,అవకాశాలు,పొంచియున్న ప్రమాదాలు అంచనా వేసుకోవాలి.నిజం చెప్పాలంటే ఏ రంగంలోనైనా తగినన్ని బలాలు,అవకాశాలు ఉన్నాయి.అసలు చిక్కంతా బలహీనతలే.ఆ బలహీనత కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమే.

* మీ స్వంత శక్తిమీదనే ఆధారపడండి.ఈ ప్రపంచంలో "పాపం"ఏదైనా ఉంటే అది బలహీనతే. బలహీనతను విడిచిపెట్టండి. బలమే జీవితం,బలహీనతే మరణం.నేను బలహీనుణ్ణి అని ఎప్పుడూ అనుకోవద్దు.చెప్పుకోవద్దు.మీలో ఉన్న అపారమైన శక్తి గురించి మీకు తెలిసినది చాలా తక్కువ.మీ వెనుక అనంతశక్తి సముద్రం ఉంది.

 పై అద్భుతమైన విషయాలన్నీ డా//బి.వి.పట్టాభిరాంగారి రచన "మాటేమంత్రం" లోనివి.ఈరోజు మనిషి సరైన కమ్యూనికేషన్స్ లేక తెలియక ఎన్ని అపజయాలు పొందుతున్నాడో,స్వార్ధపరుల బారినపడి ఎలా మోసపడుతున్నాడో,తనలో ఉన్న స్కిల్స్ ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడో మనకి తెలిసిందే.వాటినన్నిటినీ సరిదిద్ది జీవితంలో ఎలా విజయాన్ని సాధించాలో చక్కగా నేర్పుతుంది. ప్రతిఒక్కరూ చదవాల్సిందే.

రచయిత చిరునామా:
డా//బి.వి.పట్టాభిరాం Ph.D
ప్రశాంతి కౌన్సిలింగ్ & HRD సెంటర్
సామ్రాట్ కాంప్లెక్స్,సెక్రటేరియట్ రోడ్,
హైదరాబాద్-500004.
Ph:040-23233232,23231123
email : bvpattabhiram@hotmail.com
www.pattabhiram.com

Publisher's 
సాహితి ప్రచురణలు
29-13-53,కాళేశ్వరరావురోడ్డు,
సూర్యారావుపేట,విజయవాడ-2
Ph:0866-2436643,6460633
email: sahithi.vij@gmail.com