18, మార్చి 2020, బుధవారం

What happens in the body when the original corona virus is infected? | అసలు కరోనా వైరస్ సోకితే శరీరంలో ఏం జరుగుతుంది

*అసలు కరోనా వైరస్ సోకితే శరీరంలో ఏం జరుగుతుంది* 

కరోన వైరస్ మన శరీరంలో ప్రవేశించి  ఊపిరితిత్తులను చేరితే ఈ క్రింది పరిణామాలు జరుగుతాయి.
what-happens-in-body-when-original-corona-virus-is-infected
అసలు కరోనా వైరస్ సోకితే శరీరంలో ఏం జరుగుతుంది
1. మొదటగా ఊపిరితిత్తుల్లో ఉండే చిన్న చిన్న గదులు అయినటువంటి alveoli అనే వాటిలో నివాసం ఏర్పర్చుకుంటాయి. అక్కడి కణజాలల్లో రేప్లికేషన్ జరుపుకోవడం ద్వారా ఆ కణాలను నాశనం చేయడం జరుగుతుంది.

2. కణాల విచ్ఛిన్నం వల్ల alveoli గదుల్లో  ద్రవం ఏర్పడుతుంది. నుమోనియా లాంటి పరిస్థితి ఏర్పడుతుంది

3. Alveoli  ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకోవడానికి వదిలిపెట్టడానికి ఉపయోగపడుthayi. ఎప్పుడైతే అవి విచ్చిన్నం అయినయో అప్పుడు ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో పని చేయడం జరగదు.

4. ఊపిరితిత్హులు పూర్తిస్థాయిలో పని చేయక పోవడం మూలంగా శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్‌ను శరీరం అందుకోలేదు, సరిపడా ఆక్సిజన్ లేకపోవడం మూలంగా శరీరంలోని వివిధ అవయవాలకు కావలసినటువంటి ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు అందించలేవు.

5. దీనిలో ప్రధానమైనటువంటివి మెదడు, గుండె మరియు ఇతర అవయవాలు. ఎప్పుడైతే అవయవాలకు సరిపడేంత ఆక్సిజన్ లభ్యం కాదో అవయవాల్లో జరగవలసినటువంటి జీవక్రియలను తగ్గిపోతాయి. 

6. జీవ క్రియలు తగ్గి పోవడం మూలంగా ఆయా అవయవాల పనితనం అనేది మందగిస్తుంది అవయవాల పనితనం మందగించడం వల్ల శరీరం అనేది క్రమేణా క్షీణించడం జరుగుతుంది. వైరస్ శరీరంలోని వివిధ అవయవాలకు పాకి అక్కడ కూడా కణాలను నాశనం చేయవచ్చు.

7. అప్పుడు శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్‌ను బయటనుండి అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది

8. ఇందుకోసం ఐసియులో చేర్చి కృత్రిమ శ్వాస లేదా ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ అందించవలసి ఉంటుంది

9. పేషెంట్‌కు యాంటీబయాటిక్స్, అదేవిధంగా పేషెంట్లు ప్రదర్శించే అటువంటి లక్షణాల ఆధారంగా పేషెంట్ కు వివిధ ఔషధాల ద్వారా చికిత్స అందించాల్సి ఉంటుంది.

10. ఈ చికిత్స అనేది వైరస్ ద్వారా వచ్చే వివిధ లక్షణాలను తగ్గించేందుకు మాత్రమే.  *వైరస్ ను బయటకు పంపించడం/ వైరస్ ని నాశనం చేయడం  అనేది ప్రస్తుతం ఉన్నటువంటి చికిత్సలో సాధ్యం కాదు* 

11.మనం అందించే చికిత్స అంతా కూడా పేషెంట్ యొక్క రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. పేషెంట్ యొక్క రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడు బలోపేతం అవుతుందో, అప్పుడు పేషెంటు లోపల ఉండే  వివిధ రకాలైనటువంటి తెల్ల రక్త కణాలు, మాలిక్యూల్స్ (intrrferons) ఆ వైరస్ మీద దాడి చేయడం జరుగుతుంది.  

12. అలా పేషెంట్ యొక్క రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మనము ఆ పేషెంట్ కు చికిత్స చేయగలుగుతాం, తప్పించి వేరే ఏ రకంగా చికిత్స చేయలేము.

అందుకే ప్రతి వ్యక్తి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు గూర్చి విస్తృత ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పేర్కొనలేదు. ...Dr. Venu Gopala Reddy, Microbiologist and Principal Model School, Veenavanka ( please share)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.