19, మార్చి 2020, గురువారం

కరోనా అలర్ట్ : ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారికి షాకింగ్ న్యూస్


కరోనా అలర్ట్ : ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారికి షాకింగ్ న్యూస్

Blood-group-A-more-vulnerable-to-China-virus-corona
కరోనా అలర్ట్ : ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారికి షాకింగ్ న్యూస్

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాకింది. దాదాపుగా 160దేశాలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డాయి. రెండు లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజు రోజుకు ఈ సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. 8 వేల మంది మృతి చెందగా ఈ సంఖ్య ఇంకా ఎంతకు పెరుగుతుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో వుహాన్ యూనివర్శిటీ జోంగ్నాన్ హాస్పిటల్ లోని కరోనా బాధితులపై జింగ్ హువాన్ సంస్థ ఒక సర్వే నిర్వహించగా అందులో ఆశ్చర్యకర విషయం వెళ్లడయ్యింది.

ఎవరికి అయితే ‘ఏ’ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు కరోనాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని ఆ సర్వేలో నిర్థారించారు. ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకిందంటే మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయంటూ వారు అన్నారు. వుహాన్ లో కరోనా వైరస్ వల్ల మరణించిన 206 మందిలో ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏకంగా 85 మంది ఉన్నట్లుగా వారు నిర్థారించారు. ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనాను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుందని ఈ ప్రయోగంలో వెళ్లడయ్యిందని వారు పేర్కొన్నారు.

ఇక ఓ బ్లడ్ గ్రూప్ వారికి కూడా కరోనా కాస్త ఇబ్బందికరంగానే ఉందని అన్నారు. ఓ బ్లడ్ గ్రూప్ వారికి కూడా కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోదక శక్తి సరిపోవడం లేదంటూ వైధ్యులు అంటున్నారు. అందుకే ఏ ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ వారు ఖచ్చితంగా కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇతరుల కంటే ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.

ఒక వేళ ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్థారణ అయితే ఇతర బాధితుల కంటే ఎక్కువ శ్రద్దతో వారిని చూసుకోవాలంటూ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాగ్రత్త ఏ బ్లడ్ గ్రూప్ వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇతరులు కూడా లైట్ గా ఏమీ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ పరిశుభ్రతను పాటించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.

5 వ్యాఖ్యలు:

 1. అయ్య బాబోయ్, ఇప్పుడెలా మరి 😳😳?

  అయ్యా, నా అభిప్రాయం ప్రకారం ఇటువంటివి ఎక్కువగా statistical survey లు అయ్యుంటాయి. కాఫీ తాగితే “బదిరీనాథ్” అని ఒక study report చూపించిందంటాడు ఒకసారి; కొంతకాలం పోయాక కాఫీ తాగకపోతే “బదిరీనాథ్” అని మరో study report లో తేలిందంటాడు. మనం చూస్తూనే ఉంటాంగా అటువంటి వార్తలు.

  అంతెందుకు, అసలు ఓపికుంటే ఏదన్నా హాస్పిటల్ కు వెళ్ళి, మీలో ఎంతమంది తెలుగు బ్లాగులు చదువుతారు అని రోగులనడిగి ఒక సర్వే నిర్వహించి, వచ్చిన జవాబుల శాతం వగైరా లెక్కలు వేసి ..... ఆహా, తెలుగు బ్లాగులు చదివితే అధిక శాతం మందికి ఫలానా రుగ్మత వస్తుంది ..... అని ఒక రిపోర్ట్ తయారు చెయ్యచ్చు 🙂.

  పైన చెప్పిన ఈ చైనా వారి సర్వే ప్రయత్నం మెచ్చుకోదగినదే కానీ చదువరులు ఇటువంటి వార్తలు చదివి బెంబేలెత్తడం మానేసి అన్ని రక్తం గ్రూపుల వారూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి .... అని నా అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఏ బ్లడ్ గ్రూప్ అయినా ఎర్రగా ఉంటే కరోనా ముప్పు ఉన్నట్లేనట.

   తొలగించు
 2. అన్ని రక్తం గ్రూపుల వారూ కూడా వెల్లుల్లి తింటే కరోనా రాదని (?) సర్వేలో తేలిందట !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సినీ నిర్మాత్ కే మురారి గారు ఒక ఆయుర్వేఅద్ కళాశాల్ ప్రిన్సిపాల్ తాన్ లెటర్ హెడ్ మీద ఈ విషయాన్ని ప్రకటించిన ఫోటో ఒకటి పెట్టారు.కానీ, అదేమంత శాస్త్రీయమైన పద్ధతి కాదు.ఒక మందు అందరికీ ఒకేలా పని చేస్తుందని ఏ వైద్యవిధానంలోనూ లేదు.అందుకే మందులు మారుస్తూ ఉంటారు.కేస్ స్టడీ లేకుండా కేవలం లెటర్ హెడ్ మీద రాసినదాన్ని ప్రమాణం అనుకోకూడదు.

   తొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.