26, ఫిబ్రవరి 2020, బుధవారం

మనిషికి ప్రశాంతత దూరం చేసేది ఎక్కువుగా ఆర్ధిక సంబంధాలే!

The-more-calm-the-distance-to-the-man-is-the-financial-relations
మనిషికి ప్రశాంతత దూరం చేసేది ఎక్కువుగా ఆర్ధిక సంబంధాలే!
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నాడొక మహాకవి. ఇది ముమ్మాటికీ నిజమన్న భావన మనకప్పుడప్పుడూ అన్పిస్తోంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు మనకి మనం కావాలనే తెచ్చుకుంటాం. సమస్య తయారు కాకముందే మనం మేలుకోము. సమస్య క్రియేట్ అయిన తరువాత లబో,దిబో మంటూ హైరానా పడిపోతాము. నేను నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేను ఒక సైట్ (స్థలం) వాయిదా నిమిత్తం 15,౦౦౦ కట్టాలి. ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఎలాగైనా ఈసారి సంక్రాతిని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నా! 15౦౦౦ రూపాయలు ఎలాగూ ఉన్నాయి కదా అని ఆనందపడే సమయంలో వాయిదా నోటిస్ వచ్చింది. వాయిదా కట్టేదామా? లేక పెండింగ్ లో పెడదామా? అనే సందిగ్ధంలో కొంతసేపు ఉండిపోయా! సంక్రాంతి హడావుడి లో 15౦౦౦ గ్యారెంటీగా అయిపోతాయి. మంచి బట్టలు, షూస్ కొనాలి. ఇంకా అమ్మకు,నాన్నకు కూడా బట్టలు తీయాలి. ఎలా? వాయిదా కట్టడం మానేద్దామా? లేక వాయిదా కట్టేస్తే పండుగకు ఏమీ ఉండవు. బ్యాంక్ లో చూస్తే కేవలం 1000 రూపాయలే ఉన్నాయి. సరిపోవు కదా ? ఎలా అనిపించింది.

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

పువ్వు ఎండిపోయి పూజారి ఏడుస్తుంటే భక్తుడోచ్చి ప్రసాదం అడిగాడంట!

నా ఆఫీసు రూమ్ ప్రక్కన అభి అని SI ట్రైనింగ్ అవుతున్న ఒక అబ్బాయి ఉన్నాడు. అతని దగ్గర భలే సామెతలు ఉంటాయి. వింటే చాలు పగలబడి నవ్వవల్సిందే! పై సామెత అతను చెప్పిందే. విన్న వెంటనే భలే నవ్వు ముంచుకొచ్చిందంటే నమ్మండి. నిజానికి మన పూర్వీకులు పద సంపదను, జ్ఞాన సంపదను సామెతలలో పెట్టి భావి తరాల కోసం దాచి ఉంచారనిపిస్తోంది.నిజమేనంటారా?

15, ఫిబ్రవరి 2020, శనివారం

మీరు గెలవాలంటే మీ మనసు ఇలా ఉండాలి | If you want to win your mind should be like this

విజయం సాధించాలంటే ముందుగా విజయం సాధించాలనే ఆలోచన ఆ వ్యక్తికి వుండాలి.ఏ విషయంలో విజయం సాధించాలి అనే విషయం నిర్ణయించుకున్న తరువాత ఆ దిశలో ఆలోచనలు మొదలుపెట్టాలి .రోజు రోజుకూ మీలో అభివృద్ధి వస్తుందనే ఆలోచన బాగా వుండాలి.
ఆత్మ పరిశోధనకు కూడా ఈ ఆలోచన పనికి వస్తుంది.చెడు ఆలోచన మనసు లోనికి రానియ్యకూడదు.మంచి ఆలోచన వలన మనోధైర్యం పెరుగుతుంది.ఆలోచనలో ఊహించటం జరుగుతుంది ఇది పగటి కలగానే వుండి పోకుండా రోజురోజుకూ మీలో వచ్చే ప్రగతిని విశ్లేషించుకోవాలి.ఈ విజయం సాధించడానికి ఏం చెయ్యాలి అనే విషయం చూద్దాం.మనసుకి విశ్రాంతిని ,స్పూర్తినిచ్చే ఈ క్రింది విషయాలు తలచుకోవాలి.