1, జులై 2020, బుధవారం

నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు | Do not be in a place where you have no respect for yourself and your personality

ఒక తండ్రి తాను చనిపోయే ముందు, తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 200 సం. పైగా వయస్సు కలిగి, మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చేముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాప్ కి వెళ్లి దీనికి వెల కట్టించుకొని రా అని పంపించాడు. కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతది ఐనది కావున 5 డాలర్లకు మించి రావన్నారు అని చెప్పాడు. అయితే తండ్రి ఈ సారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల ( యాంటిక్ ) దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు. ఈ సారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 5000 డాలర్ల వెల కట్టినట్లు చెప్పగా.. ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకొని వెళ్లి వెల కట్టించమన్నాడు..తిరిగివస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా, మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించటానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి, ఈ పాత గడియారంకు ఒక మిలియన్ డాలర్ల వెలకట్టినట్లు చెప్పాడు!!*

*కాగా అది విన్న తండ్రి.. కొడుకుతో  దీని ద్వారా నీకు చెప్పాలని అనుకుంటున్నది ఏమిటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం బట్టి, నీ విలువ కూడా మారుతూ ఉంటుంది.. అందుకే  నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు..అంటూ చెప్పాడు......*

4 కామెంట్‌లు:

 1. ఢిల్లీ నుంచి వచ్చాక, బీజేపీ లో చేరే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇది చదివుంటే ఎంత బాగుండేది !
  కదూ ... ?
  :)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. ఆయ్ ! ఇప్పుడే పవన్ గారు సరియైన మిలియన్ డాలరు ప్లేస్ కి వెళ్లారండోయ్ బండి వారు :)


   నెక్స్ట్ సీ యెమ్ ఆయనే ( గెడ్దం ఇంకొద్దిగ తెల్లబడితే చాలంతే )

   జిలేబి

   తొలగించు
  2. ఒకవైపు ఎకరా రెండు కోట్లు పలికింది కాబట్టి అల్లుడికి వరకట్నం కింద ఎకరం ఇచ్చామని, ఇప్పుడు తరలిస్తే అల్లుళ్ళు ఊరుకోరని ఆంధ్రజ్యోతి బెదిరిస్తోంది. మరోపక్క మిలియన్ డాలర్ల కొద్దీ కట్నం ఇచ్చే కమలత్తారింటికి దారేదో వెతుక్కొని దత్తపుత్రుడు వెళ్ళిపోయాడు!

   తొలగించు


  3. అత్తారింటికి దారేదీ అని ఓ దశాబ్దం ముందే అల్లుడడిగే డంటే ఎంత ముందు చూపు గలవారండీ వారు జై గొట్టి వారూ అర్ఘం చేసుకోరు గా మీరు :)   జిలేబి

   తొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.