26, ఫిబ్రవరి 2020, బుధవారం

మనిషికి ప్రశాంతత దూరం చేసేది ఎక్కువుగా ఆర్ధిక సంబంధాలే!

The-more-calm-the-distance-to-the-man-is-the-financial-relations
మనిషికి ప్రశాంతత దూరం చేసేది ఎక్కువుగా ఆర్ధిక సంబంధాలే!
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నాడొక మహాకవి. ఇది ముమ్మాటికీ నిజమన్న భావన మనకప్పుడప్పుడూ అన్పిస్తోంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు మనకి మనం కావాలనే తెచ్చుకుంటాం. సమస్య తయారు కాకముందే మనం మేలుకోము. సమస్య క్రియేట్ అయిన తరువాత లబో,దిబో మంటూ హైరానా పడిపోతాము. నేను నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేను ఒక సైట్ (స్థలం) వాయిదా నిమిత్తం 15,౦౦౦ కట్టాలి. ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఎలాగైనా ఈసారి సంక్రాతిని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నా! 15౦౦౦ రూపాయలు ఎలాగూ ఉన్నాయి కదా అని ఆనందపడే సమయంలో వాయిదా నోటిస్ వచ్చింది. వాయిదా కట్టేదామా? లేక పెండింగ్ లో పెడదామా? అనే సందిగ్ధంలో కొంతసేపు ఉండిపోయా! సంక్రాంతి హడావుడి లో 15౦౦౦ గ్యారెంటీగా అయిపోతాయి. మంచి బట్టలు, షూస్ కొనాలి. ఇంకా అమ్మకు,నాన్నకు కూడా బట్టలు తీయాలి. ఎలా? వాయిదా కట్టడం మానేద్దామా? లేక వాయిదా కట్టేస్తే పండుగకు ఏమీ ఉండవు. బ్యాంక్ లో చూస్తే కేవలం 1000 రూపాయలే ఉన్నాయి. సరిపోవు కదా ? ఎలా అనిపించింది.అమ్మని అడిగితే ఎందుకొచ్చిన గొడవ. ముందు వాయిదా కట్టేయి. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే పండుగని చెప్పింది. వాయిదా కట్టేసాను. ఎందుకో చాలా ఫ్రీగా కూడా ఫీలయ్యాను.

సంక్రాంతి హ్యాఫీగానే ఉన్నంతలో గడిచిపోయింది.

ఒక పదిరోజుల తరువాత మా పక్కింటి అంకుల్ గారు, ఆంటిగారు మాఇంటికి వచ్చారు. ఆంటీ మా అమ్మగారితో అంటుంది. " పది వేలు ఉంటే అప్పుగా ఇవ్వు వదినా? రెండు వాయిదాల చిట్స్ కట్టాలి. మీ అన్నయ్యగారిని చేతులో ఉన్న పది వేలు ఆ చిట్స్ కట్టేయండి అంటే "సంక్రాoతి" కదా అని కట్టకుండా ఖర్చు పెట్టేసారు. ఇప్పుడు ఆ చిట్స్ ఆయన ఇంటిమీదికొచ్చి చిట్స్ కట్టమని గొడవ చేస్తున్నాడు అంది.

ఇదంతా వింటున్న నేను మా అమ్మమాట విని ఎంత గొప్ప పని చేసానో అర్ధమయ్యింది. ఎందుకంటే వాయిదా కట్టకుండా ఆ 15౦౦౦ పండక్కి ఖర్చు పెట్టేసి ఉంటే మా పరిస్థితి కూడా అంతే! నిజానికి ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే ముందు మనo ఏవైతే సమస్యలుగా మారనున్నాయో అటువంటి పనులన్నీ క్లియర్ చేసేసుకోండి. ఎందుకంటే సమస్య క్రియేట్ అయ్యిన తరువాత మనం అనుభవించే మానసిక ఆందోళన, మానసిక అశాంతి వర్ణించలేనివి.
The more calm the distance to the man is the financial relations!

1 కామెంట్‌:

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.