1, మార్చి 2020, ఆదివారం

ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించాలి

ఇది యదార్థంగా జరిగిన సంఘటన.ఎవ్వరినీ తక్కువ
అంచనా వేయకూడదు. ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించాలి... లేకపోతే ఇలాగే
కంగు తినాల్సి వస్తుంది.

70 సం. పైపడిన ఒక బామ్మ ఒక బ్యాంకు కు వెళ్లి తన చెక్కు బుక్ క్యాషియర్కు ఇచ్చి 500 రూపాయలు డ్రా చేయాలని కోరింది. ఆ మహిళా క్యాషియర్ కాస్త విసుగ్గా ఇలా అంది.

," 10000 కంటే తక్కువ నగదు డ్రా చేయాలంటే ఇక్కడ మా రూల్స్ ఒప్పుకోవు...వెళ్లి ఏ.టీ. యం. లో తీసుకోండి "అని కసిరింది.
అప్పుడు బామ్మ కాసేపు పక్కన కూర్చొని మళ్ళీ క్యాషియర్ దగ్గరకు వెళ్ళింది. ఆ క్యాషియర్ కోపంగా "ఒక్కసారి చెపితే అర్థంకాదా? వెళ్ళు,వెళ్ళు తల్లీ!" అంది.
బామ్మ! కాస్త సీరియస్ గా ...

"నా అకౌంట్ లో ఎంత డబ్బు ఉందొ మొత్తం నాకు ఇప్పుడే కావాలి. ఇవ్వండి "అంది.
"ఆ ఈమె అకౌంట్ లో లక్షలు ఉన్నాయి మరి. చూస్తే అడు క్కునేదానిలా ఉంది."అని గొణుక్కుంటు అకౌంట్ ఓ పెన్ చేసి చూసి భయంతో వణికి పోయింది.ఆమె అకౌంట్లో 4 కోట్లరూపాయలున్నాయి.క్యాషియర్ బయటికివచ్చి ఆమెను లోపలికి తీసుకునివెళ్లి ఇలా అంది.
"బామ్మగారూ! నన్ను మన్నించండి.. బ్యాంకు లో 4 కోట్ల క్యాష్ లేదు..మీరు రేపు రాగలరా?"
బామ్మ ఇలా అంది.
"అయితే ఎంత డబ్బుతీసుకోవచ్చు ఈరోజు నేను"
"3 లక్షలు తీసుకోవచ్చు బామ్మా!"అంది క్యాషియర్..
"అయితే నాకు 3 లక్షలు ఇవ్వండి" అంది బామ్మ.
బామ్మగారికి కాఫీ తెప్పించి మరీ 3 లక్షలు డ్రా చేసి ఇచ్చింది క్యాషియర్..
బామ్మ తనకు అవసరమైన 500 తీసుకుని మిగతా 2,99,500 మళ్ళీ అకౌంట్లో వేయమంది. క్యాషియర్ చచ్చినట్లు బామ్మ చెప్పినట్లు చేయకతప్పలేదు...
రూల్స్ ఫాలో కావాల్సిందే కానీ,
ఎదుటివారిని హీనంగా మాత్రం చూడకూడదు.పెద్దవారికి కాస్త ఓపిగ్గా అర్థం అయ్యేటట్లు చెప్పాలి..అది వారి బాధ్యత కూడా..ఎవ్వరిని తక్కువగా అంచానా వేయకూడదు కదా!
అవసరాలను,పరిస్థితులను అర్థం చేసుకోవాలి కదా! ఎంతైనా బామ్మా సూపర్ కదా!
వావ్...వావ్..బామ్మా!😍😍😍😍

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.