31, మార్చి 2019, ఆదివారం

ఆనందంగా ఆర్జించండి

సంపద అనగానే మనకు వెంటనే తట్టేది ధన,కనక,వస్తు, వాహనాల్లాంటివే. ఇవేగాక సంపద జాబితాలో చేర్చదగ్గవి  ఇంకా ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుని,వాటిని పెంచుకుంటే సంపదను పెంచుకున్నట్టే.అవి ఎంత ఎక్కువుంటే అంత సంపదవున్నట్టే.ఆశ్చర్యకర విషయం ఏమిటంటే,వాటిని ఏమంత ప్రయాస పడకుండానే సొంతం చేసుకోవచ్చు.


అందచందాలు : మనం ఏసందర్భానికైనా తగినరీతిలో దుస్తులు ధరిస్తే చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.మన అంతః సౌందర్యంవల్ల అనేక సంధర్భాల్లో చాలా మెరుగ్గా వుంటాం.మంచి వ్యక్తిగా మసలు కోవడం ద్వారా మనం అంతః సౌదర్యాన్ని పెంచుకుని ఇతరులకి కూడా అందంగా కనిపించవచ్చు.
పేరుప్రఖ్యాతలు : పేరు ప్రఖ్యాతల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.మనం ఎటువంటి వ్యక్తులమో అలాగే ఎదుటివారికి కనబడినప్పుడే మనకు ఏ ఇబ్బందీ లేకుండా వుంటుంది.మనం ఒకలాంటి మనస్తత్వం గల వారిమైవుండి మరొకలా కనబడేందుకు ప్రయత్నిస్తే అది మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది.
జ్ఞానం,తెలివితేటలు : తగినంత జ్ఞానం వున్న వాళ్లు ఎటువంటి పరిస్థితులైనా కలవరపడకుడా హాయిగా వుండగలుగుతారు.ఎంకంటే ఎప్పుడు ఏ పనిచేయాలో వారికి తెలుసు గనుక.అందుకే జీవితంలో ఎన్నో విషయాలను మనం  ఎప్పుడూ నేర్చుకుంటూనే వుండాలి.నేర్చుకోవడమనే ప్రక్రియను జీవితంలో ఎప్పుడూ ఆపకూడదు.
నిరాడంబరత : ఎవరైనా సరే నిరాడంబరమైన జీవన విధానం అవలంభించకపోతే చాలా పరిస్తితుల్లో ఆందోళనకు లోనవుతారు.భాగ్యవంతులకైనా తమ భాగ్యాన్ని ప్రదర్శించడం,ఆడంబరాలకు అంటిపెట్టుకుని ఉండాలనికోవడం ప్రయోజనకరమేమీ కాదు.
శక్తి,ఆరోగ్యాలు : మంచి ఆరోగ్యవంతులమైతే మనకు ఎంతో ఆనందముగా ఉంటుంది.మనకి బలమిచ్చే మరో అంశం శక్తి.దాన్ని మనం స్వాగతించాల్సిందే.మనం శక్తివంతులమైనప్పుడు భయాలను ఎదుర్కోగల్గుతాం.భద్రంగా వున్నట్టు ఫీలవుతాం.
ఐశ్వర్యం,భద్రత : ఐశ్వర్యం వల్ల కూడా భద్రంగా ఉన్నట్టనిపిస్తుంది.సంతోషంగా ఉంటాం.ఇది అధ్యయనాల్లో తేలింది.డబ్బుతోటే మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటాం.అవసరమైన సేవలు,మర్యాద లభిస్తాయి.కనుక డబ్బు వల్ల మరింత ఆనందదాయకంగా ఉండగలుగుతాం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.