31, మార్చి 2019, ఆదివారం

ఆనందంగా ఆర్జించండి

సంపద అనగానే మనకు వెంటనే తట్టేది ధన,కనక,వస్తు, వాహనాల్లాంటివే. ఇవేగాక సంపద జాబితాలో చేర్చదగ్గవి  ఇంకా ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుని,వాటిని పెంచుకుంటే సంపదను పెంచుకున్నట్టే.అవి ఎంత ఎక్కువుంటే అంత సంపదవున్నట్టే.ఆశ్చర్యకర విషయం ఏమిటంటే,వాటిని ఏమంత ప్రయాస పడకుండానే సొంతం చేసుకోవచ్చు.

23, మార్చి 2019, శనివారం

వారానికి ఒకరోజైనా మనతో మనం బ్రతుకుదాం!

మనిషికి ఒంటరితనం ఎన్నో అక్కర్లేని విషయాలు నేర్పుతుంది.ఎక్కువుగా ఖాళీగా ఉంటే మనిషికి అన్నీ నెగిటివ్ ఆలోచనలు ముసురుకుంటాయి.అందుకే కాబోలు పెద్దలు ఖాళీ బుర్ర దెయ్యాల నివాసం అవుతుందని చెప్పారు.మనిషి ఏదో వ్యాపకం పెట్టుకోవాలి.అది మనకి మంచి చేసేదై ఉండి, మన అభివృద్ధికి దోహదం చేసేదై ఉంటే ఎంతో మేలు.

నిజానికి మన సంతోషానికి,దు:ఖానికి మనమే కారణం.దీనికి వేరెవ్వరూ కారణం కాదు.మనం కాస్త ప్రశాంతంగా ఉండాలంటే తెల్లవారు లేచి దైవప్రార్ధన చేసుకుని మన పనులు చక్కబెట్టుకోవడంలో ఉన్న ఆనందం,సంతోషం మరెందులోనూ ఉండదు.

రాత్రుళ్లు 1నుండి,2గంటల టైం వరకూ పడుకోకుండా,మర్నాడు సూర్యుడు నడినెత్తికి వస్తున్న సమయంలో నిద్రలేవడాలు,లేక ఉదయం 8,9గంటలకు మేల్కోడాలు ఇవ్వన్నీ కూడా మనిషికి ప్రశాంతతను దూరం చేసేవే.అనారోగ్యాన్ని దగ్గర చేసేవే.

17, మార్చి 2019, ఆదివారం

అంతరాత్మ ప్రబోధన వింటే చాలు! | To hear the supplication of the supreme spirit!

to-hear-supplication-of-supreme-spirit
మనం రోజంతా ప్రశాంతంగా ఉండాలంటే తెల్లవారుజామున లేచి అవయవాలన్నీ చన్నీళ్లతో కడుక్కుని దైవ ధ్యానం చేసుకుంటే చాలు.మరొక ముఖ్య విషయం ఏమిటంటే మనిషి నిరంతర విధ్యార్ధి.ఎంత నేర్చుకున్నా మిగిలే వుంటుంది.కాబట్టి మనం నేర్చుకున్న దానిని బట్టే మన జ్ఞాన సంపతి ఉంటుంది.మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగానికి సంభందించిన విషయాలను మనం నేర్చుకుంటూ ఆ రంగంలో మనం మరింత ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ నిత్యం జరుగుతూ ఉండాలి. అలా మనం ఉండగలిగినప్పుడు ఆ ఆనందం వర్ణించడానికి వీలు లేనిది అవుతుంది.ఏదో పుట్టాం,బ్రతుకుతున్నాం అనుకుంటే ఎటువంటి లాభం లేదు.బ్రతికినన్నాళ్లు ఏదో సాధించడానికే బ్రతకాలి.దైవనామ స్మరణతోనే బ్రతకాలి. మనవలన ఏవైతే సేవా కార్యక్రమాలు జరుగుతాయో అవి చేస్తూ ఉండాలి.సమాజం మన విషయంలో చూపించే మంచి,చెడులను పట్టించుకునే అవసరం లేదు. నీ అంతరాత్మను పట్టించుకుంటే చాలు.అంతరాత్మ ఉన్నంత నిజాయితీగా మనస్సు ఎప్పుడూ ఉండదు.

9, మార్చి 2019, శనివారం

మహిళల గూర్చి కొంతైనా తెలుసుకో...కాస్తైనా మార్చుకో ? | Learn something about women ... can you change anything?

ఏ శాస్త్రమూ చెప్పలేదు...!!
ఎంగిలిపడిన బండెడు అంట్లనూ ఇంటి "మహిళ"లే కడగాలనీ...!!

ఏ చట్టమూ చెప్పలేదు ప్రతిరోజూ ఉరుకుపరుగుతో వంటను "వనిత"లే చేయాలనీ...!!

ఏ గ్రంథమూ చెప్పలేదు నిత్యం గదులన్నిటినీ "నీరజాక్షే" ఊడ్చి నీరాజనాలు అందుకోవాలనీ...!!

ఏ భారత భాగవతాలూ చెప్పలేదు...
ఇంటి సంతానపు ఆలనాపాలనా ఇంటి "భామే" చూసుకోవాలనీ...!!

ఏ లలిత సంగీత కళల రాగాలూ చెప్పలేదు "లలన" లిప్తపాటు కనులతో మౌనవించాలనీ...!!

భవితలో ఎక్కడా రాసి పొందుపరచలేదు ఇంటి "భామ"లే బండెడు బట్టలు ఉతికి ఆరేయాలనీ...!!

ఏ కమనీయ భాషలూ చెప్పలేదు తన కడుపు మాడ్చుకునీ అందరి కడుపులూ "కోమలే" నింపాలనీ...!!

ఏ వరమిచ్చే దేవుడు కూడా చెప్పలేదు "వనితంటే" వంటింటి కుందేలుగా పరిమితమైపోవాలనీ...!!

2, మార్చి 2019, శనివారం

సుఖనిద్రతో సుఖమయ జీవితం!

రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున4 గంటల మధ్య గల సమయంలోనే శరీరంలోని హార్మోన్లు సమ్మిళితం కావడానికి ఉత్తమమైంది.ఆ సమయంలో తప్పక నిద్రించాలి.అప్పుడు శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది.మనస్సు ఎటువంటి కోర్కెలు లేకుండా విశ్రాంతి పొందుతుంది.
             ఆత్మ తిరిగి కాలపరిమితిలేని సహజస్థితికి చేరుకుంటుంది.అందువల్ల నిద్ర ఎంతో ముఖ్యమైంది.మద్యపానం,మాదకద్రవ్యాల జోలికి వెళ్ళకుండా మంచి ఆలోచనలతో కంటినిండా నిద్రించాలి.నిద్రించే ముందు గాఢశ్వాస తీసుకోవడం లేదా విశ్రాంతి పొందే ధ్యానం,సంగీత వాయిద్యం నునుడి వెలువడే శ్రావ్యమైన సంగీతం వినడం చెయ్యాలి.మనస్సును ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంచుకుని హాయిగా నిద్రకు ఉపక్రమించండి.

1, మార్చి 2019, శుక్రవారం

మీ సంతోషానికి మాటే మంత్రం

         అనాలోచితంగా మాట్లాడిన చిన్న మాటైనా ఆనందాన్ని హరిస్తుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తుంది. ఆలోచనతో చేసే వ్యాఖ్యలు ఉత్తేజాన్ని నిపుతాయి. సంబంధాలను మరింత శోభాయనం చేస్తాయి. కాబట్టి నిష్పాక్షికంగా ఆలోచించాలి.
          ఎదుటి వారిని కించపరచడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీలేదు.శక్తి వృధా అవుతుంది.అదే శక్తిని ప్రేమించడానికి వినియోగిస్తే అదొక వనరుగా ఉండిపోతుంది.ప్రతి కూలంగా వున్న వ్యక్తిని ప్రేమించడం కొనసాగిస్తే ఆ వ్యక్తి ముఖంలో ప్రతికూలత మాయమై, చిరునవ్వు చిందుతాయి.మీ మనస్సులో సంతోషం వెల్లివిరుస్తుంది.