31, జనవరి 2019, గురువారం

మంచి పుస్తక పఠనానికున్న మహత్తర శక్తి గూర్చి మహనీయుల అభిప్రాయాలు.

 • ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది. - రాయ్ యల్ స్మిత్.
 • మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు.ఎందుకంటే చదివి వినిపించే తల్లి నాకుంది - ఎబిగెయిల్ నాన్ బ్యూరన్
 • నేను పుస్తకాలు కనుగొన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను.- ఆర్చీ మూర్
 • భూమికి సూర్యుడు ఎటువంటి వాడో నా జీవితానికి పుస్తకాలు అటువంటివి -ఎర్ల్ నైటింగేల్
 • చదువు ద్వారా మన ప్రపంచాన్ని మన చరిత్రను మనలను మనం ఆవిష్కరించుకుంటాం. - డేనియల్ జె. బూరిస్టిన్
 • అనేక సందర్భాలలో ఒక పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును రూపుదిద్దింది.-రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
 • పుస్తకాలు లేకుండా ఈ రోజు ఈ స్థానాన్ని నేను ఊహించలేను.పుస్తకాలు స్వేచ్చకు పర్యాయపదాలుగా మారాయి.మీరు తలుపులు తెరిచి నడవవచ్చని అవి చెబుతాయి.- ఓప్రా విన్ ఫ్రీ.

26, జనవరి 2019, శనివారం

మీ ఇల్లే మీ స్వర్గం | Your house is your heaven.

మీ ఇల్లే మీ స్వర్గం Your house is your heaven.
మీ ఇల్లే మీ స్వర్గం  Your house is your heaven.
ఆఫీసులో ఇంట్లో ఉన్నన్ని సౌకర్యాలు ఉండొచ్చు.కానీ ఎదురుచూసే వాళ్లుండరు.ప్రేమించే వాళ్లుండరు.కొసరికొసరి వడ్డించే వాళ్లుండరు.అందుకే ఆరైపోగానే అంత ఆరాటం.ఉద్యోగ జీవితంలో అద్భుతవిజయాలు సాధిస్తే చాలు,ఇంకేం అక్కర్లేదనుకునే కెరీర్ జీవులకు ఆ గెలుపు జీవితంలో సగమేనని,ఒక భాగమేనని తేటతెల్లమైపోతోంది. మరో సగం,ఇంకో భాగం...కుటుంబమనే సంగతి అర్ధమవుతుంది."కుటుంబానికి ఇంకాస్త సమయం కేటాయించాలన్న లక్షల మంది దంపతుల నిర్ణయం.

   అంతవరకు బాగానే ఉంది.సమస్యంతా వ్యక్తిగత,వృత్తిజీవితాల మధ్య సమతూకం పాటించడంలోనే.ఆఫీసులో అనుకున్న సమయానికి లక్ష్యాలు పూర్తికావు.ఎంత తొదరగా గూడు చేరుకుందామన్నా ,అర్ధరాత్రి దాటే పరిస్థితి.అందుకే "ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది ప్రక్కన పెట్టండి.ఎంత సంతోషంగా గడుపుతున్నామనే కోణంలోంచి చూడండి.అది పావుగంటే కావచ్చు.కాని లీనమయిపోండి. ఇల్లే సర్వస్వం కావాలి.ఆఫీసు,టార్గెట్లు...ఏవీ గుర్తుండకూడదు."అని సలహా ఇస్తారు.ఫ్యామిలీ కౌన్సెలర్స్ పదిలంగా అల్లుకున్న పొదరిల్లు గుర్తుకొస్తోందా! శుభం.

25, జనవరి 2019, శుక్రవారం

ప్రార్ధనతో ప్రశాంతత

ప్రతిరోజూ ఉదయాన్నే [తెల్లవారుజాము]ప్రార్ధన చేస్తే అద్భుతాలు జరుగుతాయి.చక్కటి ఆలోచనలు,భావాలు మనస్సులో ఏర్పడతాయి.సంఘర్షణాత్మక ఆలోచనలు అంతమై మనస్సు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది.తల్లి జోల పాడుతుంటే ఒడిలో పడుకున్న బిడ్డ ఆదమరచి నిద్రించినట్టుగా మనస్సు విశ్రాంతి పొందుతుంది.రోజూ క్రమం తప్పకుండా ప్రార్ధన చేస్తే మిగతా విషయాలు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి.

20, జనవరి 2019, ఆదివారం

ఇలా ఉంటే మిమ్మల్ని అందరూ లైక్ చేస్తారు!

నిజం చెప్పండిమిమ్మల్ని అందరూ లైక్ చేయాలని కోరుకుంటారా? లేదా?
ముమ్మాటికీ! మనల్ని అందరూ ఇష్టపడాలని కోరుకుంటాం. దీనిలో అనిర్వచనీయమైన ఆనందం ఉంది. అయితే అలా అందరూ మనల్ని ఇష్టపడాలంతే మరి మన వ్యవహార శరళి ఎలా ఉండాలి?
 • సమయపాలన పాటించాలి.
 • చనువు తీసుకోవద్దు-ఇవ్వదు.
 • మనసు విప్పి మాట్లాడాలి
 • అభినందించడం మంచి అలవాటు
 • మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి
 • మాట జారడం మంచిది కాదు
 • పరిచయస్థుల పేర్లు గుర్తుంచుకోవాలి
 • చెప్పేది జాగ్రత్తగా వినాలి
 • సహజంగా ఉండాలి.

3, జనవరి 2019, గురువారం

మనిషి సద్గుణ సంపన్నుడు కావాలంటే..?

రోజుల్లో మనుషుల్లో సైకో మనస్తత్వం పెరిగిపోతుంది.మాటల్లోగాని, చేతల్లోగాని అసలు మానవత్వం అనేదే లేకుండా పోతుంది. జాలి,దయ, తోటివాడి పట్ల సేవా గుణం ఇంచుమించు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీనికి కారణాలేమిటో? నా ఉద్దేశ్యం ప్రకారం మనిషికి భక్తిభావం ఉండాలి. అది లేని కారణం చేతనే ఈరోజు మనుషుల్లో ఈ సద్గుణాలు లేకుండా పోతున్నాయి.మీరనుకోవచ్చు. ఈరోజు సమాజంలో గుళ్లు,గోపురాలు పెరుగుతూ పోతున్నాయి! అవి నిండి పోతున్నాయి కదా? అని. నామమాత్రపు భక్తి వలన, కల్పిత సిద్ధాంతాలను పట్టుకు వేలాడటం వలన మనుషులకు ఈ గుణాలు రావు.మనిషిలో సత్పవర్తన, దైవం పట్ల భయభక్తులు కలగాలంటే సశాస్త్రీయమైన శాస్త్రానుకూలమైన భక్తి కావాలి.అది కేవలం ఆథ్యాత్మిక గ్రంధాలైన వేదోపనిషత్తులు, బైబిల్, ఖురాన్ లను అధ్యయనం చేయడం వలన మాత్రమే దొరుకుతుంది తప్ప అవి పట్టుకుని వ్యాపారం చేసుకునే ధార్మిక పండితుల మధ్య దొరకదు.