2, అక్టోబర్ 2018, మంగళవారం

లక్ష్యసాధనకు ముందే ప్రేమలు అవసరమా?

నేను కలిగియున్న మిత్రులలో ఎక్కువమంది ప్రేమమత్తులో ఉన్నవారే!ఫోన్లు,చాటింగులు,సినిమాలు,షికార్లలతో కాలం వెళ్లదీస్తున్నవారే!
  వీళ్ల ఆలోచనలు,ఊహలు చాలా విడ్డూరంగా ,విచిత్రంగా ఉంటాయి.అదీ అమ్మాయిల విషయంలో అయితే మరీ ఎక్కువ.
  ఒక బి.టెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి మాటలు నాకు చాలా వింతగా అంపించాయి.ఆమె అమాయకత్వానికి నాకు ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు.
  "బి.టెక్ తరవాత యం.టెక్ చేస్తాను.మంచి జాబు సంపాదించి తరవాత అతన్ని మా పేరెట్స్ కి పరిచయం చేసి ఒప్పించి పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది.
  ఇంచుమించు 8లేక9 సంవత్సరాల తరవాత జరిగే పెళ్లికి ఇప్పుడి నుండే ప్లానింగ్" అసలు ఇది కరెక్ట్ పద్దతేనా అనేది నా సందేహం.లైఫ్ లో ఒక పొజిషన్ కి వచ్చిన తరవాత లైఫ్ పార్ట్ నర్ ని చూసుకునే బదులు ఇప్పటినుండే ఎన్నుకోవడం కరెక్టా?ఎప్పుడో జరిగే పెళ్లి కోసం ప్రేమ పేరు చెప్పి తన సరస్వాన్ని అవతలివాడికి ధారబోయడం అజ్ఞానం కాదా?
  ఓ మనిచి పుస్తకంలో చదివాను.
  ఓ అమ్మాయి 3సంవత్సరాల తర్వాత కారు కొనాలని ల్క్ష్యం పెట్టుకుంది.గొప్ప విషయమే!అయితే అప్పుడు కొనబోయే కారు మోడల్ ఇప్పుడే నిర్ణయించుకుంది.ఇది మాత్రం పూర్తి అజ్ఞానం. ఎందుకంటే 3సంవత్సరాల తరువాత ఇప్పటికంటే మంచి మోడళ్లు అప్పుడు రావచ్చు.వస్తాయి.కొనేదేదో అప్పటి మోడల్ కొనుక్కుంటేనే గొప్పగా వుంటుంది.ఫ్యాషన్ గా వుంటుంది.అప్పుడు..ఇప్పటి పాతమోడల్ కారు కొనడం వల్ల గొప్పేముంది?
  ఇది! జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు.
  లైఫ్ లో ఓ మంచి పొజిషన్ సంపాదించుకున్న తరువాత తన తోడు కోసం వెదికితే ఆ పొజిషన్ దగ్గ మంచి భాగస్వామిని పొందవచ్చు.అది మనస్సుకు ఆనందం కల్గిస్తుంది.ఆహ్లాదాన్ని అందిస్తుంది.లక్ష్యం సాధించే వరకూ ప్రేమమత్తు లేదు కాబట్టి...చక్కగా లక్ష్యంపై దృష్టి పెట్టవచ్చు.ఎటువంటి అడ్డంకులు ఉండవు.అటువంటిది లైఫ్ సెటిల్ కాకుండానే ముందే ప్రేమ అవసరమా?
  ఇప్పుడు ప్రేమలో ఎన్నుకున్న వారు రేపు ఎలా ఉంటారో తెలీదు.తమకు అనుకూలమవుతారో, వ్యతిరేకమవుతారో తెలీదు.కాబట్టి ఏది,ఏమైనా లక్ష్యసాధనలో ఉన్నప్పుడు ప్రేమలు,పెళ్లిళ్లు అవసరమని అంపించడం లేదు.అలా కాకుండా శరీర సుఖాల కోసం ప్రేమ,పెళ్లి అనే ముసుగేసుకుంటే మాత్రం ఏం చెయ్యలేము!