29, ఆగస్టు 2017, మంగళవారం

వాత్సాయన శాస్త్రాన్ని ఏవగించుకోవాల్సిన అవసరం లేదు.

మన పూర్వులు రాయని శాస్త్రమంటూ లేదు. శాస్త్రకారులలో ప్రాచీనుడైన వాత్సాయనుడు కామసూత్రం అని ఒక శాస్త్రాన్ని రాశాడు. గాలి,నీరు,ఆకాశం మొదలైన వాటన్నిటికీ శాస్త్రజ్ఞులు దైవత్వాన్ని చూపించినట్టే జీవిత సాఫల్యాన్ని నిర్ధారించడానికి సంపూర్ణత్వానికి సమన్వయం కుదర్చడానికి వాత్సాయనుడు కామసూత్రం రాశాడు. దురదృష్టవశాత్తూ వాత్సాయన కామసూత్రాల ప్రసక్తి రాగానే చాలామంది అదేదో వినరాని పదం విన్నట్టు మొహం ఏవగింపుగా పెట్టటం దురదృష్టకరమైన విషయం.

26, ఆగస్టు 2017, శనివారం

తెలుగు బ్లాగులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

మన తెలుగు అంతర్జాలంలో తెలుగు బ్లాగర్లను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.ఒకరకంగా మనం తెలుగు బ్లాగుల విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నాం.బ్లాగంటే ఒక పర్సనల్ డైరీలాటిది.మన జ్ఞాపకాలు,ఆలోచనలు,అనుభవాలు...ఇంకా ఎన్నో విషయాలు మనం దానితొ పది మందికి తెలియజేయవచ్చు.అంతే కాకుండా ఏదో సబ్జక్ట్ మీద చక్కగా విషయాలు పొందుపరచి నలుగురి ఉపయోగానికి తోడ్పడవచ్చు.నా వంతు కృషిగా నేను నల్గురు మిత్రులకు చెప్పి వారి చేత బ్లాగులు ఓపెన్ చేయించాను.అలా ప్రతి ఒక్కరూ చేసినట్లయితే ఈ బ్లాగుల విషయం అందరికీ అవగాహణ అవుతుంది.అప్పుడు మనం తెలుగు బ్లాగుల విషయంలో మనమే టాప్ అవుతాము.

   దీనివల్ల ప్రయోజనమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవవచ్చు.ఒక బ్లాగర్ తన బ్లాగులో ఒక అంశంపై వ్రాయాలంటే దానికి సంబధించిన ఇన్ ఫర్ మేషన్ అతని దగ్గర ఉండాలి.ఆ సమాచారం కోసం అతను అనేక పుస్తకాలు చదవాలి.ఏకాంతంగా ఆలోచించాలి.ఇవన్నీ కూడా మంచి పనులే కదా!అతనికి ప్రయోజనం చేకూర్చేవే గదా!

   ఏకకాలంలో ఒక బ్లాగర్ మంచి పాఠకుడు,మంచి రచయితగా కూడా ఎదుగుతాడు.

   అంతర్జాలంలో మొత్తం కలిపి 5000 తెలుగు బ్లాగులు కూడా లేవు.బ్లాగులను చదివేవారు కూడా తక్కువే.నా ఉద్దేశ్యంలో చాలామందికి అసలు బ్లాగుల యొక్క అవగాహణ లేదు.పెద్ద,పెద్ద విద్యావంతులకే బ్లాగ్ అనేది ఒకటుంటుంది అనే విషయమే తెలియదు.ఇక బ్లాగ్ చదివేవారు ఎక్కడుంటారు?

   మరొక ముఖ్యవిషయమేమిటంటే...ప్రతి బ్లాగరు ఓ మంచి బ్లాగ్ రీడర్ కావాలి.ఏదో బ్లాగులో పోస్ట్ చేసేసాము..అయిపోయింది అనుకోకుండా మంచి,మంచి బ్లాగులను చదువుతూ వాటికి మన స్పందనలు కామెంట్ రూపంలో పంపుతూ ఉంటే వారిని కూడా మనం ప్రొత్సాహించినవాళ్ళమవుతాము.అప్పుడు వారు కూడా మన బ్లాగుకొచ్చి మనల్ని ప్రొత్సాహిస్తారు.

   ఏది ఏమైనా మనమందరము తెలుగు బ్లాగులను ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుదాం!ఓకే నా?

14, ఆగస్టు 2017, సోమవారం

జీవితానికి అడ్జస్ట్ మెంట్ కావాలి!

జీవితంలో పైకి రావాలంటే ప్రతిభా,పనితనం మాత్రమే సరిపోవు.ఎప్పటికప్పుడు ఎమోషన్స్ ని అదుపు చేసుకుపోతూ అడ్జస్ట్ మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి,రాయడానికి బావుంటాయని అనుకోకండి.అక్షరాలా అద్భుతాలు చేసినవారెందరో ఉన్నారు. అటువంటి వారిలో మన భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకరు. 16ఏళ్ల వయస్సులోనే టెస్ట్ మ్యాచ్ రంగంలో దిగి,24 సంవత్సరాల పాటు నిర్విరామంగా, నంబర్ వన్ గానూ ఆడుతూ 100సెంచరీలు చేసి, ఇటు ప్రజలు అటు ప్రభుత్వం గుర్తింపు పొంది అత్యంత ప్రతిష్టాత్మకరమైన "భారతరత్న" బిరుదును పొందారు.రాజ్యసభలో సభ్యుడిగా గౌరవింపబడ్డారు. లిటిల్ మాస్టారుగాప్రపంచంలోఎందరికోఅభిమానిఅయ్యాడు....Readmore

12, ఆగస్టు 2017, శనివారం

ఈ మాట ఒట్టి నిజం!

ఆడది నీడ లాంటిది. పట్టుకోవాలనుకుంటే తప్పించుకు తిరుగుతుంది. పట్టించుకోవడం మానివేస్తే మన వెనుకే తిరుగుతుంది.

8, ఆగస్టు 2017, మంగళవారం

మహిళా సంఘాలు మహా గొప్పవా?

 మొన్నా మధ్య సినిమాల్లో ఆడదాన్ని అడ్డూ,అదుపు లేకుండా అన్యాయంగా చూపించారని చాలా పెద్ద గొడవ చేసాయి.ఎక్కడ ఆడవాళ్లపై ఏవిధమైన అన్యాయం జరిగినా విరుచుకు పడుతున్నాయి.మేమున్నాము అని పర్లేదు అని భరోషా ఇస్తున్నాయి.మంచిదే.[నిజానికి వాళ్లను మీడియాకి ఎక్కించి నానా యాగీ చేసి ఎవరి దారిన వాళ్లు పోతారనే విమర్శ కూడా ఉంది.ఎంతవరకూ నిజమో తెలీదు]

మహిళా సంఘాల గొడవలు ఎలాంటివంటే...

సినిమాల్లో స్త్రీని నగ్నంగా చూపించారని గొడవ?
ప్రతి వ్యాపార సంస్థకు స్త్రీ నగ్న ఫోజులు పెడుతున్నారని గొడవ?
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి?..వీధి కటౌట్ల దగ్గర నుండి అగ్గిపెట్టె వరకూ స్త్రీ నగ్న ఫోజులే వాడుతున్నారు.
బహుశా వీటి విషయంలో కూడా స్త్రీ లేక పోతే మనుగడే లేదేమో?

మహిళాసంఘాలు వీటి విషయంలో గొడవ చేయడం తప్పు అని నేను అనను.ఎందుకంటే అది న్యాయం కూడా..అయితే దీనికంటే ముందు వాళ్లు మరొక ముఖ్యమైన పని చేస్తే బాగుంటుంది.ఇది అత్యవసరం.

స్త్రీని నగ్నంగానో,అర్ధనగ్నంగానో చూపించారని నిర్మాతలను,డైరెక్టర్లను...వ్యాపార సంస్థలను నిలదీసేముందు..వాటిలో నటించిన స్త్రీలను జుట్టు పట్టుకుని బయటికి లాగి బుద్ధి చెప్తే సమాజానికి మేలు చేసిన వారౌతారు.బహుశా ఈ పని చేయరు.ఎందుకంటే వాళ్లు ఆడాళ్లు కదా?

ఢిల్లీ నిర్భయ ఉదంతం చూసి నాకు కొన్నాళ్లు నిద్ర పట్టలేదు.మనసంతా అదొక రకమైన ఆందోళన.అప్పుడు పేపరు చూడడానికి,టివి చూడానికే బయపడేవాడిని..ఏం వినాల్సివస్తుందో అని.నా దృష్టిలో వాళ్లను అన్నాళ్లు జైల్లలో పెట్టి మేపడమే తప్పు.వెంటనే ముక్కముక్కలుగా నరికేసి చంపి పారేస్తే దరిద్రం పోయేది.

కాని దారుణమేమిటంటే ..ఆ మర్నాటి నుండే మరిన్ని అత్యాచారాలు జరిగాయి..జరుగుతున్నాయి కూడా

నా సలహా ఏమిటంటే ఈ మహిళాసంఘాలు అన్ని కలసి స్త్రీలలో సంస్కృతి సంప్రదాయాల పట్ల,కట్టుబొట్టు పట్ల అవేరునెస్ తీసుకొస్తే బాగుంటుంది.ప్రాశ్చాత్య కల్చర్ రూపుమాపాలి.అచ్చమైన భారతదేశ కట్టుబొట్టు ఉండాలి.

విచిత్రం ఏమిటంటే...షార్ట్ కట్ జాకెట్లు,శరీర సౌష్టవం కనిపించేలా చీరలు  వేసుకునే మహిళా సంఘ సభ్యులున్నారు.వాళ్లలో చాలామంది పిల్లలు పబ్బులకు,క్లబ్బులకూ వెళ్లేవారే.

మన దగ్గర జాగ్రత్త లేనప్పుడు బాగుండాలి అంటే కుదురుతుందా? కొన్ని మార్పులు రానంతకాలం ఎన్ని ఉద్యమాలు నడిపినా ఉపయోగం లేదు.పులి నోట్లో తల పెట్టి కరవద్దు అని గొల పెట్టడం అజ్ఞానం.

                                                  > ఆధ్యాత్మిక విషయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.