రాత్రి పూట భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రిస్తారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే రాత్రి పూట భోజనం తరువాత ఈ పనులను అస్సలు చేయకూడదు. ఇవే కాదు, ఇంకా ఇలాంటివే కొన్ని పనులను రాత్రి పూట డిన్నర్ అవగానే చేయరాదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...Read More
1, సెప్టెంబర్ 2017, శుక్రవారం
30, ఆగస్టు 2017, బుధవారం
29, ఆగస్టు 2017, మంగళవారం
వాత్సాయన శాస్త్రాన్ని ఏవగించుకోవాల్సిన అవసరం లేదు.

26, ఆగస్టు 2017, శనివారం
తెలుగు బ్లాగులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.
దీనివల్ల ప్రయోజనమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవవచ్చు.ఒక బ్లాగర్ తన బ్లాగులో ఒక అంశంపై వ్రాయాలంటే దానికి సంబధించిన ఇన్ ఫర్ మేషన్ అతని దగ్గర ఉండాలి.ఆ సమాచారం కోసం అతను అనేక పుస్తకాలు చదవాలి.ఏకాంతంగా ఆలోచించాలి.ఇవన్నీ కూడా మంచి పనులే కదా!అతనికి ప్రయోజనం చేకూర్చేవే గదా!
ఏకకాలంలో ఒక బ్లాగర్ మంచి పాఠకుడు,మంచి రచయితగా కూడా ఎదుగుతాడు.
అంతర్జాలంలో మొత్తం కలిపి 5000 తెలుగు బ్లాగులు కూడా లేవు.బ్లాగులను చదివేవారు కూడా తక్కువే.నా ఉద్దేశ్యంలో చాలామందికి అసలు బ్లాగుల యొక్క అవగాహణ లేదు.పెద్ద,పెద్ద విద్యావంతులకే బ్లాగ్ అనేది ఒకటుంటుంది అనే విషయమే తెలియదు.ఇక బ్లాగ్ చదివేవారు ఎక్కడుంటారు?
మరొక ముఖ్యవిషయమేమిటంటే...ప్రతి బ్లాగరు ఓ మంచి బ్లాగ్ రీడర్ కావాలి.ఏదో బ్లాగులో పోస్ట్ చేసేసాము..అయిపోయింది అనుకోకుండా మంచి,మంచి బ్లాగులను చదువుతూ వాటికి మన స్పందనలు కామెంట్ రూపంలో పంపుతూ ఉంటే వారిని కూడా మనం ప్రొత్సాహించినవాళ్ళమవుతాము.అప్పుడు వారు కూడా మన బ్లాగుకొచ్చి మనల్ని ప్రొత్సాహిస్తారు.
ఏది ఏమైనా మనమందరము తెలుగు బ్లాగులను ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుదాం!ఓకే నా?
14, ఆగస్టు 2017, సోమవారం
జీవితానికి అడ్జస్ట్ మెంట్ కావాలి!
జీవితంలో పైకి రావాలంటే ప్రతిభా,పనితనం మాత్రమే సరిపోవు.ఎప్పటికప్పుడు ఎమోషన్స్ ని అదుపు చేసుకుపోతూ అడ్జస్ట్ మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి,రాయడానికి బావుంటాయని అనుకోకండి.అక్షరాలా అద్భుతాలు చేసినవారెందరో ఉన్నారు. అటువంటి వారిలో మన భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకరు. 16ఏళ్ల వయస్సులోనే టెస్ట్ మ్యాచ్ రంగంలో దిగి,24 సంవత్సరాల పాటు నిర్విరామంగా, నంబర్ వన్ గానూ ఆడుతూ 100సెంచరీలు చేసి, ఇటు ప్రజలు అటు ప్రభుత్వం గుర్తింపు పొంది అత్యంత ప్రతిష్టాత్మకరమైన "భారతరత్న" బిరుదును పొందారు.రాజ్యసభలో సభ్యుడిగా గౌరవింపబడ్డారు. లిటిల్ మాస్టారుగాప్రపంచంలోఎందరికోఅభిమానిఅయ్యాడు....Readmore
12, ఆగస్టు 2017, శనివారం
ఈ మాట ఒట్టి నిజం!
8, ఆగస్టు 2017, మంగళవారం
మహిళా సంఘాలు మహా గొప్పవా?
మొన్నా మధ్య సినిమాల్లో ఆడదాన్ని అడ్డూ,అదుపు లేకుండా అన్యాయంగా చూపించారని చాలా పెద్ద గొడవ చేసాయి.ఎక్కడ ఆడవాళ్లపై ఏవిధమైన అన్యాయం జరిగినా విరుచుకు పడుతున్నాయి.మేమున్నాము అని పర్లేదు అని భరోషా ఇస్తున్నాయి.మంచిదే.[నిజానికి వాళ్లను మీడియాకి ఎక్కించి నానా యాగీ చేసి ఎవరి దారిన వాళ్లు పోతారనే విమర్శ కూడా ఉంది.ఎంతవరకూ నిజమో తెలీదు]
మహిళా సంఘాల గొడవలు ఎలాంటివంటే...
సినిమాల్లో స్త్రీని నగ్నంగా చూపించారని గొడవ?
ప్రతి వ్యాపార సంస్థకు స్త్రీ నగ్న ఫోజులు పెడుతున్నారని గొడవ?
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి?..వీధి కటౌట్ల దగ్గర నుండి అగ్గిపెట్టె వరకూ స్త్రీ నగ్న ఫోజులే వాడుతున్నారు.
బహుశా వీటి విషయంలో కూడా స్త్రీ లేక పోతే మనుగడే లేదేమో?
మహిళాసంఘాలు వీటి విషయంలో గొడవ చేయడం తప్పు అని నేను అనను.ఎందుకంటే అది న్యాయం కూడా..అయితే దీనికంటే ముందు వాళ్లు మరొక ముఖ్యమైన పని చేస్తే బాగుంటుంది.ఇది అత్యవసరం.
స్త్రీని నగ్నంగానో,అర్ధనగ్నంగానో చూపించారని నిర్మాతలను,డైరెక్టర్లను...వ్యాపార సంస్థలను నిలదీసేముందు..వాటిలో నటించిన స్త్రీలను జుట్టు పట్టుకుని బయటికి లాగి బుద్ధి చెప్తే సమాజానికి మేలు చేసిన వారౌతారు.బహుశా ఈ పని చేయరు.ఎందుకంటే వాళ్లు ఆడాళ్లు కదా?
ఢిల్లీ నిర్భయ ఉదంతం చూసి నాకు కొన్నాళ్లు నిద్ర పట్టలేదు.మనసంతా అదొక రకమైన ఆందోళన.అప్పుడు పేపరు చూడడానికి,టివి చూడానికే బయపడేవాడిని..ఏం వినాల్సివస్తుందో అని.నా దృష్టిలో వాళ్లను అన్నాళ్లు జైల్లలో పెట్టి మేపడమే తప్పు.వెంటనే ముక్కముక్కలుగా నరికేసి చంపి పారేస్తే దరిద్రం పోయేది.
కాని దారుణమేమిటంటే ..ఆ మర్నాటి నుండే మరిన్ని అత్యాచారాలు జరిగాయి..జరుగుతున్నాయి కూడా
నా సలహా ఏమిటంటే ఈ మహిళాసంఘాలు అన్ని కలసి స్త్రీలలో సంస్కృతి సంప్రదాయాల పట్ల,కట్టుబొట్టు పట్ల అవేరునెస్ తీసుకొస్తే బాగుంటుంది.ప్రాశ్చాత్య కల్చర్ రూపుమాపాలి.అచ్చమైన భారతదేశ కట్టుబొట్టు ఉండాలి.
విచిత్రం ఏమిటంటే...షార్ట్ కట్ జాకెట్లు,శరీర సౌష్టవం కనిపించేలా చీరలు వేసుకునే మహిళా సంఘ సభ్యులున్నారు.వాళ్లలో చాలామంది పిల్లలు పబ్బులకు,క్లబ్బులకూ వెళ్లేవారే.
మన దగ్గర జాగ్రత్త లేనప్పుడు బాగుండాలి అంటే కుదురుతుందా? కొన్ని మార్పులు రానంతకాలం ఎన్ని ఉద్యమాలు నడిపినా ఉపయోగం లేదు.పులి నోట్లో తల పెట్టి కరవద్దు అని గొల పెట్టడం అజ్ఞానం.
> ఆధ్యాత్మిక విషయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

29, జులై 2017, శనివారం
నా నిజమైన స్నేహితులు ఎప్పటికీ పుస్తకాలే!
ప్రపంచంలో పుస్తకాన్ని మించిన నమ్మకమైన స్నేహితుడు మరొకరు లేరు.పుస్తకం మనకెప్పుడూ జ్ఞానాన్ని,సంస్కారాన్ని నేర్పుతుంది.దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడందరూ Facebook,twitter అనుకుంటూ ఎంతో సమయాన్ని వృధా చేస్తూనే ఉన్నారు.అవి వాడకూడదు అని నేను అనడం లేదు.గంటల తరబడి వాటి చుట్టూ తిరగడం తప్పు అని నా నిశ్చితాభిప్రాయం.నిజానికి ఆ సోషల్ సైట్స్ వల్ల నేర్చుకునేది ఏమీ లేదు.Facebookలో గడిపే Timeలో ఒక పది నిముషాలు మంచి పుస్తకం చదివితే ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు.
కందుకూరి వీరేశలింగం పంతులుగారు "చినిగిపోయిన చొక్కాని సూది,దారం పెట్టి కుట్టుకో.కాని కొత్త చొక్కా కొనే ఆ డబ్బులతో ఓ మంచి పుస్తకం కొనుక్కో"మన్నారు.
ఇప్పుడన్నీ హైటెక్ చదువులయి పోయాలి.చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులొచ్చేసాయి.చదువు ఇప్పుడు ప్రోత్సాహానికంటే అమిత భారాన్ని కలిగిస్తోంది.ర్యాంకుల కోసం బట్టి పట్టడం తప్ప నేర్చుకునేది ఏమీ ఉండడం లేదు.బహుశా మంచి పుస్తకాలు కూడా చదవడానికి యువత వెనుకాడడానికి కారణం ఇప్పటి చదువులేనేమో!
నేను 8వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ గారు "నేర్చుకోండి..నేర్చుకోండి" అనే వారు.ఆయన దృష్టిలో నేర్చుకోవడం అంటే చదువుకోవడం.అంటే బట్టీ పెట్టి చదవడడం కాదు.అవగాహణ చేసుకుంటూ చదవడం.అప్పుడు ఆయనను పిచ్చివాడని కామెంట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు మాకు తెలుస్తుంది.ఆయన మాటల యొక్క మర్మం, గొప్పతనం.
ఇకనుండైనా మనం పుస్తక పఠనాన్ని ప్రారంభించాలి.నెలకొచ్చీ ఎంతో వృధా ఖర్చు చేస్తాం.కనీసం నెలకి ఓ మంచి పుస్తకం కొంటే ఎంత ఉపయోగం.పుస్తకాల పట్ల నా దినచర్య క్రింది విధంగా ఉంటుంది.

- నెలకి ఓ మంచి పుస్తకం కొంటాను.
- ప్రతిరోజూ పడుకునే ముందు ఓ 15నిముషాలు చదువుతాను.
- అంతే కాకుండా ఖాళీ కుదిరినప్పుడు,వీలు కుదిరినప్పుడు కూడా చదువుతాను.
- ఒకవేళ ఎవరైనా నా బుక్ షెల్ఫ్ నుండి పుస్తకం తీసుకెళితే అతను చదివిన తరువాత కంపల్సరీ ఆ పుస్తకాన్ని తిరిగి తీసేసుకుంటాను.ఎందుకంటే పుస్తకాల పట్ల జాగ్రత్త లేనివారు పుస్తకాలు కూడా చదవరు.
- నా ఆస్థి అంతా నిండుగా ఉన్న నా బుక్ షెల్ఫే.
మీరు కూడా పుస్తకాలు చదవండి.ఇతరులకు చదివే ప్రేరణను కలిగించండి.పుస్తకాలు మనల్ని తప్పనిసరిగా విజ్ఞానవంతున్ని చేస్తాయి.తలవంచి మనం పుస్తకం చదివితే అవి మనల్ని తలెత్తుకునేలా చేస్తాయి.శుభం.
16, జులై 2017, ఆదివారం
ఈరోజుల్లో చనువిస్తే చాలు చంక కెక్కుతున్నారు!
ఈరోజుల్లో ఎవర్ని పూర్తిగా నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో కూడా అర్ధం కావడం లేదు. నేను ఎన్నో సంఘటనలు చూస్తున్నాను. ఎవరికివారు డబ్బా కొట్టుకోవడం ఎక్కువయిపోయింది. పనులకంటే ప్రచారం ఎక్కువయిపోయింది. లేనిదాన్ని, ఉన్నట్లుగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఎక్కువయిపోయారు. వీళ్లనసలు ఏమి చేయాలి? మనుషుల ఆత్మగౌరవం మీద కొట్టడం, కించపరచడం, ఎదుటివారి హక్కులను బలవంతంగా నిరోధించాలని చూడడం చాలా తీవ్రకరమైన నేరం. మహాపాపం. ఛా! వీళ్లను అసహ్యహించుకోవాలి. వీళ్లకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. మనం ఎవర్ని పూర్తిగా నమ్మకూడదు. మన విషయాలు చాలా వరకూ పంచుకో కూడదు. ఒకవేళ పంచుకుంటే రేపన్నరోజు నీమీదే వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడానికి పూనుకుంటారు. ఈరోజు సమాజం చాడీలు చెప్పే వ్యక్తుల సమాజంలా మారిపోయింది. ప్రవక్త(స) వారు చాడీలు చెప్పడం 26సార్లు వ్యభిచారం చేసిన పాపంతో సమానమని హెచ్చరించారు.
18, ఫిబ్రవరి 2017, శనివారం
ధీరూభాయ్ అంబానీ మాటలు నాకు చాలా స్పూర్తి కలిగించాయి.

19, జనవరి 2017, గురువారం
TTDP లీడర్ రేవంత్ రెడ్డి చెప్పిన పులి-గాడిద కథ!
ఉదాహరణగా రేవంత్ రెడ్డి చెప్పిన కథ ఇది. "ఒక అడవిలో ఒక పులి - ఒక గాడిద హోరాహోరిగా పోరాడుతున్నాయి వాటి అరుపులు కేకలతో అడవి మొత్తం దద్దరిల్లిపోతోంది. రాత్రి వెళ కూడ వాటి పోరాటం ఆగలేదు. ఇది అడవిలోని ఇతర జంతువులకు ఇబ్బందిగా తయారుకావడంతో ఒక ఏనుగు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. ఇంతకు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారని పులి - గాడిదలను ఆ ఏనుగు అడిగింది. 'భూమికి దూరంగా కనిపించే భూమి ఆకాశాలు రెండు నిజంగా కలిసే ఉన్నాయని నేను చెప్తున్నాను కానీ అవి కల్పినట్లు కనిపిస్తాయే తప్ప నిజంగా కలవవని ఈ పులి చెప్తోంది' అని గాడిద బదులిచ్చింది" అంటూ రేవంత్ తదనంతర కథ వివరించారు.
"ఇలా కాదని ఏనుగు ఏ వివాదం అయినా మన అడవి రాజ సింహం దగ్గరే తేల్చుకోవాలని పులి - గాడిదలను సింహం వద్దకు తీసుకువెళ్లింది. వాటిని విచారించిన సింహం పులిని కట్టెసి వంద కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించింది. దీంతో బిత్తరపోయిన పులి 'మహారాజా నేను చెప్తున్నది నిజమే అని మీకు తెలుసుకదా? మరి నన్నెందుకు కొట్టమన్నారు?' అని సింహాన్ని అడిగింది. 'అది గాడిద - దానికి నువ్వేం చెప్పినా అర్థం కాదు - అది అనుకున్నదే చెప్తుంది ఆ విషయం తెలిసికూడా నువ్వు గాడదతో గొడవ పడ్డావు. అందుకే నీకు ఈ కొరడా దెబ్బలు' అని సింహం స్పష్టం చేసింది. ఈ కథలో నీతిలాగానే సభలో మీరు ఏం చెప్పినా ఎవరు వినరని ఓ పెద్దమనిషి నాకు చెప్పారు!" అంటూ ముక్తాయించారు రేవంత్. ఈ కథ ద్వారా అధికార పక్షాన్ని ఏం తిట్టాలో అది పరోక్షంగా తిట్టారని టీడీపీ నాయకులు అంటున్నారు.

13, జనవరి 2017, శుక్రవారం
గౌరవించాల్సిన సంస్కృతి పండుగ : "సంక్రాంతి"
అన్ని మతాలవాళ్ళు, అన్ని కులాల వారు కల్సి జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటేనే చాలు అందరిలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒకప్పుడు సంక్రాతి వస్తే పది,పదిహేను రోజుల ముందు నుండే ఇల్లంతా శుభ్రం చేసుకుని, రుచి కరమైన పిండి వంటలు వండుకునేవారు. ఆ వంటకాలు ఐదు నుండి పది రకాల వంటకాలవరకూ చేసుకునేవారు. కాని ఇప్పుడు కాస్త ఎక్కువుగానే సంక్రాంతి హడావిడి తగ్గిపోయింది. కారణాలు అనేకం కావచ్చు. నిజానికి సంక్రాంతిలో ఉన్న గొప్పతనం ఎందులోనూ లేదు. ఇది నాలుగు రోజుల పండుగ. మొదటి రోజు భోగితో ప్రారంభమయ్యి చివరి రోజు ముక్కనుమ తో ముగుస్తుంది. భోగిరోజు పచ్చిపులుసు, అత్తెసరు, పెద్ద పండుగ నాడు పప్పు గారెలు,పకోడీలు, కనుమ నాడు నాటు కోడి మాంసం ముక్కనుమ రోజు ఏది బడితే అది. ఇదీ సంక్రాంతి షెడ్యూలు. ఇలాగే ఉండాలని లేదు. అయితే అత్యధికులు మాత్రo ఈవిధంగానే చేసుకుంటారు.
ఏది,ఏమైనా సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు, తమ స్తోమతను బట్టి కొత్త బట్టలతో హడావుడి చేస్తూ గడుపుతారు. ఇది అందరూ జరుపుకోవాల్సిన పండుగ. అందరూ కాపాడుకోవాల్సిన సంస్కృతి.
ఏది,ఏమైనా సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు, తమ స్తోమతను బట్టి కొత్త బట్టలతో హడావుడి చేస్తూ గడుపుతారు. ఇది అందరూ జరుపుకోవాల్సిన పండుగ. అందరూ కాపాడుకోవాల్సిన సంస్కృతి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)