8, జనవరి 2016, శుక్రవారం

ఇది మనుషులలో అజ్ఞానమా? మూర్ఖత్వమా?

నేటి రోజుల్లో మనిషి ఎంత ఉన్నతమైన స్థితికెదిగినా, ఎన్ని విద్యా పట్టాలు చేత బట్టినా మనిషిలో ఇంకా అజ్ఞానం పోలేదన్నడానికి క్రింది సంఘటనే ఒక ఉదాహరణ.
మార్నింగ్ వీడి గుమ్మం దగ్గర కూర్చుని మా మావయ్యగారితో కలిసి న్యూస్ పేపర్ చదువుతుండగా ఒక పెద్దామె ఫుల్ గా అలంకరించబడి ఉంది. బయటికెళ్లడానికి వీధి చివరి వరకూ అటు,ఇటూ చూస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే ఒక విధవరాలు (భర్త లేని స్త్రీ) వస్తూ ఉంది. ఆమె ఎదురు మంచిది కాదని ఈ మేడమ్ గారు ఆగిపోయారు ఈమె ఒక స్కూల్ కి హెడ్మాస్టర్ గా చేస్తుంది. అయినా ఇంత అజ్ఞానమా? ఎదురు వల్ల ఏమైనా జరుగుతాయా? చెప్పండి? నా గురించి వాళ్ళు బయటికెళ్లడానికి బయపడుతున్నారని ఆ వితంతువుకి తెలిస్తే ఆమె మనస్సు గాయపడదా? ఇంతకన్నా దారుణమేముంది? ఈరోజుల్లో కూడా సైన్స్ ఇంత డవలప్ అయిన తరువాత కూడా ఇటువంటి మూడాచారాలను ఇంకా నమ్మడం మూర్ఖత్వమా? అజ్ఞానమా?
      మా గురువు గారు ఒక కథ చెప్తుండేవారు. ఒక రాజు ఉదయాన్నే నిద్రలేచి శయనమందిరం నుండి బయటికొస్తూ గుమ్మం గడపను తన్నుకుని పడిపోతే కాలి బొటనవేలుకు చిన్న దెబ్బ తగిలి రక్తం వచ్చింది. 
      రాజు గారు ఇదంతా గది బయట కాపలా వాడి ముఖం చూడడం వలనే జరిగిందన్న అజ్ఞానం లేక మూర్ఖత్వంతో ఆ భటునికి ఉరిశిక్ష ప్రకటించాడు.
     ఆ భటున్ని ఉరితీసే ముందు నీ చివరి కోరిక ఏమిటని ఉరి నిర్వహణాధికారులు అడిగిన దానికి ఆ భటుడు రాజు గారితో ఒకసారి మాట్లాడాలని చెప్పాడట!
    రాజుగారు వచ్చిన తరువాత ఆ భటుడు రాజుగారితో "ప్రభూ!.. మీతో ఒక విషయం విన్నపించుకోదలిశాను. మీరు రాత్రులు లోపల శయనమందిరంలో నిద్రపోయేవారు, బయట కాపలా ఉంటూ నేనూ నిద్రకు అప్పుడప్పుడూ జోగుతుందేవాడిని. ఉదయాన్నే మీ ముఖం నేను, నాముఖం మీరూ చూసుకునే వాళ్ళం. అయితే ఈరోజు నా ముఖం మీరు చూసినందుకు మీకు చిన్న కాలి దెబ్బ మాత్రమే తగిలింది. మీ ముఖం నేను చూసినందుకు ఏకంగా నాకు ఉరి శిక్షే పడిపోయింది. ప్రభువులు క్షమించాలి. మీ ముఖం వర్చస్ కంటే నా ముఖ వర్ససే గొప్పదని విన్నపించుకొదలిసాను. నాకంటే శిక్షాహార్హులు మీరేనని మనవి" అని చెప్పాడు. దానికి రాజు సిగ్గుతో తలదించుకుని ఉరి శిక్ష రద్దు చేసి వెళ్లిపోయాడు. ఎదురులు చూసేవాళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఎంత అజ్ఞానపు నమ్మకాలు కలిగియున్నారో అర్ధమవుతుంది. కాబట్టి మూఢాచారాలకు మనుషులు దూరంగా ఉండాలి. ఈ విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ (స) వారు ఎదురులు చూసేవారు,జ్యోతిషాలంట పడేవారు, దిష్టి బొమ్మలను వేలాడ దీసుకునే వారు పాపాత్ములని ప్రకటించారు.
ఈవీడియో చూడండి.


1 కామెంట్‌:

  1. మతం మార్చుకోవద్దు -మనస్సు మార్చుకోండి
    "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-1
    రచయితకు నేను మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను.నిజమే...ముమ్మాటికి నిజమే.నేను అనుకుంటున్నాను, ఈ మాటలు వ్రాసిన రచయిత ఒకప్పుడు క్రైస్తవుడై ఉండి పశ్చాత్తాపం పొందలేక యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడనిపిస్తుంది.యేసు క్రీస్తును నమ్మినవారు మరలా పాపాలు చేసి పశ్చాత్తాపం లేకుండా చనిపోయినా...అసలు యేసుక్రీస్తునే విశ్వసించకపోయిన దేవాధిదేవుని ఉగ్రతకు గురికావలసినదే.అయితే యేసుని విశ్వసించి అంతము వరకు తనను తాను కాపాడుకున్నవారికి (వారి ఆత్మకు)నిత్యజీవము.ఒక్క మాట అడుగుతున్నాను ఏ హైందవ గ్రంథము శత్రువును ప్రేమించమని చెప్పింది.?చెప్తారామీరు?.శత్రువును ప్రేమించు అనే మాటను మీరు ఒప్పుకుంటారా....?.

    రిప్లయితొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.