5am to 6am మధ్యం ఇంకా మంచంపై దొర్లుతూనే ఉన్నాను. నిద్రపోలేదుగాని ఈరోజు ఏమి చేయాలా? నూతన సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ప్లాన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే ప్రక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ఇంత ప్రొద్దుటే నాతో ఎవరికి అవసరం పడిందా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతలి నుండి NTV రిపోర్ట్ గారట. నాతో చాలా సేపు సంభాషించారు. మన "సాక్ష్యం మేగజైన్" చాలా బాగా నచ్చిందట. అందులోని కొన్ని బుక్స్ ఆయన Download చేసుకుని చదవడమే కాకుండా రెగ్యులర్ గా దానిలోని ఆర్టికల్స్ ఆయన ఫాలో అవుతున్నానని త్వరలో మీ సాక్ష్యం బ్లాగును NTV లో ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకో మనసుకి...Read more
30, డిసెంబర్ 2015, బుధవారం
27, డిసెంబర్ 2015, ఆదివారం
కొంతమంది మహానుభావులను దేవుడు పుట్టిస్తాడు. అటువంటి వాళ్ళలో ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు గారు ఒకరు!
రాత్రి ఈటివి 20వ వసంతం ప్రోగ్రామ్ Youtube లో చూస్తుంటే మన గాన గాంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం గారు రామోజీరావు గారి గురించి కొన్ని విషయాలు చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమయి ఆయన కాళ్లపై పడి నమష్కరించే సన్నివేశం చూసి నా మనసు చలించిపోయింది. ఒకసారి బాల సుబ్రమణ్యం గారు ఎయిర్ పోర్ట్ లో దిగి కారు కోసం ఈనాడు ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ ఎట్టలేదట! సరే అనుకుని రామోజీ రావుగారింటికి ధైర్యం చేసి ఫోన్ చేస్తే రామోజీ రావుగారు ఫోన్ ఎత్తారట. చెప్పండి బాల సుబ్రమణ్యం గారు అని అడిగితే ఏమి చెప్పాలో బాలుగారికి అర్ధకాలేదట! గుండెల్లో దడ పట్టుకుందట.... Read More
24, డిసెంబర్ 2015, గురువారం
నేనొక హంతకుడిని!
అవును నేను ముమ్మాటికి హంతకుడినే...ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకాకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి
చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు... Read More
22, డిసెంబర్ 2015, మంగళవారం
నేను సిగ్గుపడుతున్నా..ఈ దేశంలో పుట్టినందుకు!
ఒక ఆడపిల్లను రాత్రంతా బస్సులో ఢిల్లీ నడి వీధుల్లో తిప్పుతూ
అతి కిరాతకంగా ఒకరి వెంట ఒకరు హత్యాచారమ్ చేస్తూ, మానంలో ఇనుపరాడ్లు, బీరు బాటిల్లు చొప్పించి ప్రేగులను
సైతం మానంలో నుండే బయటికి లాగి అతికిరాతకంగా అనుభవించిన పైశాచిక రాక్షసులలో ఒకడ్ని
మన దేశం వదిలి పెట్టి... Read More
20, డిసెంబర్ 2015, ఆదివారం
మనుషులు మాతో పోల్చుకోవడం మాకు చాలా అవమానకరం: అడవి రాజు పులి!
నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ ఇంటర్వూలో అడవిరాజు పులి మానుషులపై విరుచుకు పడింది. వివరాలకు... Read More
19, డిసెంబర్ 2015, శనివారం
18, డిసెంబర్ 2015, శుక్రవారం
నీహారికా మేడమ్...మీకో "తొక్క"లో సలహా!
నీహారికా గారు..మీరు ఎంతో చక్కని పోస్టులు పెడుతుండేవారు. అటువంటిది ఈ "తొక్క" లో గొడవెంటమ్మా? ప్రతి బ్లాగును పట్టుకుని "తొక్కా...తొక్కా" అని విమర్శిస్తుంటే అసలు నీహారికా మేడమ్ గారు చెప్పేది ఏ "తొక్క" గురించి అనే సందేహం వచ్చింది. దానిని....Read More
17, డిసెంబర్ 2015, గురువారం
మీలో ఎవరు విజేత? జవాబు చెప్పండి? బహుమతి గెలవండి!
ప్రతినెలా రెండు క్విజ్ లు నిర్వహించబడతాయి. ప్రతి క్విజ్ లోనూ మీరు గెలుపొందవచ్చు. చక్కని బహుమతులు అందుకోవచ్చు. పుస్తకాలూ, చిన్న,చిన్న వాడుకునే చక్కని వస్తువులు, అందమైన బట్టలు ఏవైనా కావచ్చు. ఇంకెందుకాలస్యం వెంటనే పాల్గొనండి మరి. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
14, డిసెంబర్ 2015, సోమవారం
సబీరా!... బ్రతికే ఉందా?
ఆకాశమంతా నిర్మానుష్యంగా ఉంది. నల్లని త్రాచులాంటి తార్రోడుపై నా కారు పరుగెడుతుంది. నేనుఇండియా వచ్చి రెండురోజులయ్యింది. ఆరెండు రోజులూ కాకినాడలోనే ఉండిపోయాను. ఈరోజుఎలాగైనా నేను పుట్టిన పల్లెటూరు చూసి రావాలనిపించి బయలుదేరాను. బయట వాతావరణంచాలా చల్లగా ఉంది. అప్పటికే చిరుజల్లులు ప్రారంభమయ్యి చలి పుడుతూంది. "అమెరికా నుండి వచ్చి కాకినాడలోనే ఉండిపోతావా? నన్ను చూడాలని అనిపించడం లేదా? "నేను ఇండియా వచ్చిన దగ్గరనుండి మా బామ్మ నన్ను తిడుతూనే ఉంది. నాకు మా బామ్మ కంటేఎవరున్నారు? ఆమెను చూడకుండా ఉండగలనా? నేను వచ్చిన రోజే కాకినాడవచ్చేయమన్నాను..నేను అంతదూరం రాలేను. నీవు ఇక్కడికి రా? అంది.
నేను ఆ వూరు వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం పేరే సబీరా! Read More
12, డిసెంబర్ 2015, శనివారం
నేను ఒక హర్రర్ సీరియల్ వ్రాద్దామనుకుంటున్నా..!

10, డిసెంబర్ 2015, గురువారం
మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు -3
"అమ్మాయి కాదు అబ్బాయని..అదీ ఆ టైపు అబ్బాయని ఎలా తెలిసిందో మా ప్రసాద్ గాడు చెప్పడం ప్రారంభించాడు.
"వాడు నిన్న ఎర్లీ మార్నింగ్ 7am కల్లా ఇంటికొచ్చేయమని ఫోన్ చేశాడు. నేను పుల్ మేకప్ మీద తయారయ్యి రాజమండ్రి సందులూ,గొందులూ అన్నీ తడుముకుని మొత్తానికి ఆ అమ్మాయి, ఛ... ఆ అబ్బాయి ఇంటికెల్లాను. డోర్ దగ్గర నిలబడి పిలిస్తే లోపలికొచ్చి సోఫాలో కూర్చోండి అనే వాయిస్ వినబడింది. నాకు ఎక్కడ లేని టెన్షన్ అనుకో. తను డ్రెస్ మార్చుకుంటున్నానని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పింది. సరే అనుకుని రిలీఫ్ దొరికింది కదా అని సోఫాలో కూలబడ్డాను. కొద్ది సేపటికి వాడు కాఫీ గ్లాసుతో వచ్చి నాదగ్గర నిలబడి నీవు నాకు ట్రైన్ లో పరిచయమయిన వాడివి కాదే" అని అడిగింది.Read more
9, డిసెంబర్ 2015, బుధవారం
మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు.-2
మా ప్రసాద్ గాడికి ఏమి జరిగిందో చెప్పేముందు మీకు వాడి గురించి తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే వాడిని బుక్ చేసింది నేనే కాబట్టి మీరందరూ నన్ను తిట్టుకునే అవకాశం ఉంది. సరే...మా ప్రసాద్ గాడు డైలీ చేసే పెద్ద పని ఏమిటంటే ఎప్పుడూ మొబైల్ లో సొల్లు కబుర్లు చెప్పడమే! ఏదో ఒక రాంగ్ నంబర్ కి డయల్ చేయడం అవతలి వాళ్ళు మగవారైతే రాంగ్ నంబర్ సర్ అని చెప్పి పెట్టేయడం, ఆడ వారైతే ఏదో విధంగా మాటలు కలుపుకుని మాటలాడటం వీడి ప్రధాన పని, ఈ విషయంలో ఎన్నో తిట్ల పురాణాలు వీడు స్వతహాగా అనుభవించిన బుద్ది రాలేదు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ గారు పనీపాటా లేకుండా వీడు జులాయిగా తిరుగుతున్నాడని నా దగ్గర ఎన్నోసార్లు వాపోయింది. Read more
7, డిసెంబర్ 2015, సోమవారం
మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు..

తెల్లగా, కాంతివంతమైన ముఖంతో చిరునవ్వు చిందుస్తూ నా వయస్సే ఉన్న ఒక యువకుడు కనిపించాడు. బహుశా వేరే సీటులో నుండి వచ్చి నా ప్రక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతకు ముందు నాపక్క అప్పటివరకూ ఎవరూ లేరు.
"హాయ్ సర్..." నేనూ ప్రతి పలకరింపు చేశాను. అప్పటికే ట్రైన్ నిడదవోలు దాటుతుంది.
"నేను రాజమండ్రి నుండి వస్తున్నాను సర్ ..మీరెక్కడ నుండి?" అడిగాడతను. More read
5, డిసెంబర్ 2015, శనివారం
క్యా డైలాగ్ హై!
ఇటువంటి మంచి డైలాగ్స్ మీకు కూడా తెలిస్తే క్రింది కామెంట్ బాక్స్ లో తెలియ జేయండి. నలుగురికీ తెలుస్తాయి. Read more
3, డిసెంబర్ 2015, గురువారం
రాత్రి "శశిరేఖా పరిణయం" టివి సీరియల్ చూసినందుకు కళ్ళు బైర్లు కమ్మి మైండ్ బ్లాక్ అయ్యింది.

2, డిసెంబర్ 2015, బుధవారం
మీ జీవితాన్ని మార్చే STOP టెక్నిక్

1, డిసెంబర్ 2015, మంగళవారం
ఆలోచింప చేసే ఎ.ఎస్.లక్ష్మి గారి మాటల తూటాలు!
ఇంతకీ మనలో మన మాట: మతాలనీ, రాజకీయాలనీ పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రపంచంలో అసలు భారతీయులని మించిన సహనవoతులు ఎక్కడా కనబడరు.
రుజువులు కావాలా? చిత్తగించండి. - Read More
రుజువులు కావాలా? చిత్తగించండి. - Read More
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)