31, అక్టోబర్ 2015, శనివారం

"కంచె" సినిమా చూశానండోయ్! చాలా బాగుంది.

నేనూ, నా మిత్రుడు ప్రకాష్ గారూ కలిసి "కంచె" సినిమా దర్శింశాము. సినిమా ఆద్యంతం చాలా బాగుంది. ఒక హాలీవుడ్ తరహాలో ఉన్నట్టుగా ఉంది. లొకేషన్స్, సెటింగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకో "దృశ్యం" సినిమా మాదిరిగా ఈ సినిమాకి కూడా ఒక రివ్యూ వ్రాస్తాను. వీలు చూసుకుని త్వరలో మంచి,మంచి సన్నివేశాలు వర్ణిస్తూ ఒక స్టోరీ వ్రాసాను.ఈలోపు మీరు కూడా వీలయితే ఒకసారి ఈ మూవీ చూసే ప్రయత్నం చేయండి. అంతవరకూ శెలవా మరి? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి ధియేటర్ లోని పేక్షకులందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. నా జీవితంలో ఈ విధంగా జరిగింది ఈ సినిమాకి మాత్రమే. ఆ సీన్ సూపరంటే సూపర్. ఆ సన్నివేశాన్ని చూస్తే మీరు కూడా చప్పట్లు కొడ్తారు. అమ్మతనం తెలిసినవారైతే!!

29, అక్టోబర్ 2015, గురువారం

కాకినాడలోని సంగీత,నాట్య వార్షికోత్సవం స్పెషల్ ఈవెంట్ మిస్సయ్యాను.

నిన్న రాత్రి నేనూ, నా మిత్రుడు ప్రకాష్ గారూ కలిసి కల్పనా సెంటర్లో జ్యూస్ త్రాగుతుండగా ఒక్కనే ఉన్న "సరస్వతీ గాన మందిరం" పై నా చూపు పడింది. అంతా కళాకారులతో హడావుడిగా ఉంటే ఏమిటా? అని ఆశ్చర్యపోతూ వెళ్ళి చూశాను. అప్పటికి ప్రోగ్రామ్ అయ్యిపోయినట్టుంది. అందరూ వెళ్లిపోయే హడావుడిలో ఉన్నారు. ప్రక్కనే ఉన్న బోర్డు చూసి చాలా బాధ పడ్డాను. అక్టోబర్ 22-10-2015 నుండి 28-10-2015 వారకూ ఏరోజు ఏవిధమైన ప్రోగ్రామ్స్ ఉంటాయో దానిపై వ్రాసి ఉంది. అరే కాకినాడలో ఉంటూ ఇంతమంచి ప్రోగ్రామ్స్ మిస్సయ్యానే అనే ఆలోచన మనసుకి చాలా బాధ కలిగించింది. భరతనాట్యం గాని, వీణ గాని, సంగీతం గాని మన భారతీయ కళలు. కాపాడుకోవల్సిన సంపద. మనమే వాటిని చూడకపోతే ఎలా? ఏ కళైనా ప్రోత్సాహం పైనే ఆధారపడి బ్రతుకుతుంది. వాటిని బ్రతికించాల్సింది ముమ్మాటికీ మనమే! ఏమంటారు?

13, అక్టోబర్ 2015, మంగళవారం

ఇదే కరెక్ట్!

కొందరిలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం సిట్టింగులు వేసినా, గొడవలు పెట్టుకున్నా ఆ సమస్యలు సమసిపోవు. అటువంటి వారితో మెత్తగా ఉంటూ, ప్రేమగా ఉంటూ (లేక నటిస్తూ) ఆ సమస్యలను తుడిచివేయాలి. పరిస్థితిని బట్టి మనమే వారికి సమస్య అయిపోవాలి. అప్పుడు అన్నీ సర్దుకుపోతాయి.