26, ఏప్రిల్ 2015, ఆదివారం

నిజం కాదా?

నిస్వార్ధ, త్యాగనిరతిలపై నిలబెట్టాల్సిన థర్మాన్ని రూపాయి నోట్ పై నిలబెడుతోంది ఈలోకం. - అహ్మద్ చౌదరి.

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

దేవుడనుగ్రహిస్తే కాకినాడలో నా మిగతా జీవిత కొనసాగింపు!

నేను కోదాడ నుండి కాకినాడ తిరిగి వచ్చేసాను. ఇన్షా అల్లాహ్ ఇక నుండీ నా వ్యాపారాలు, ఆధ్యాత్మిక పనులు, బ్లాగింగ్ చేయడం అన్నీ కాకినాడ నుండే ప్రారంభిస్తాను. నన్ను ఎంతగానో ఆదరించే పాత బస్టాండ్ థార్మిక సభ్యులైన ఉమర్, అజీం, మల్లిక్, మచ్చా శ్రీను వాళ్లతో కలిసి ధార్మిక సమావేశాలలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరొక ముఖ్య విషయమేమిటంటే ప్రముఖ ధార్మిక పండితులు ముష్తాఖ్ అహ్మద్ గారిది కూడా కాకినాడ కావడం, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఎక్కువుగా కలవడం, అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఏర్పడటం నాకు లభించిన అదృష్ట వరంగా భావిస్తున్నాను. నా పెద్ద గురువుగారైన అహ్మద్ అలీ గారు భౌతికంగా లేకపోయినప్పటికీ నా చిన్న గురువుగారు అయిన జహరుల్లాహ్ గారు, అమీర్ గారితో కలవడం కూడా నేను ఆనందంగానే భావిస్తాను. సంతోషిస్తాను. ముఖ్యంగా నాకు అన్ని విధాల ఉమర్ గారు తోడ్పాటు నేను గర్వించదగ్గది. ఆయన స్నేహం విలువకు అందలేనిది. వీళ్లందరికీ సర్వేశ్వరుడు మేలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శుభం.

21, ఏప్రిల్ 2015, మంగళవారం

దేవుని దృష్టిలో థర్మం ఎక్కడుంది?

పేదవాని ఆకలి తీర్చడంలోనూ, ఎదుటి వాని కష్టాలలో పాలు పంచుకోవడంలోనూ దేవుని ధర్మం ఇమిడి ఉంది. - అహ్మద్ చౌదరి.