3, జనవరి 2015, శనివారం

ఇటువంటి సినిమాల వలన సమాజానికి ఏవిధమైన నష్టం ఉండదు.

తంలో దృశ్యం సినిమా గూర్చి నేను వ్రాసిన పాత టపా ఒకటి చదువుతుంటే అందులో చిరంజీవిగారు పెట్టిన కామెంట్ చూసాను. అందులో ఆయన "చందమామ కథలు" చూడండి.చాలా బాగుంది అంటూ సూచించారు. సరే మంచి సినిమాలను చూడడంలో తప్పేముందని యూట్యూబ్ చర్చ్ చేసి మూవీ చూసాను. అద్భుతం సినిమా చాలా సాప్ట్ గా హుందాగా బాగుంది. ఎన్నో పాత్రలు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. ప్రేమించి మోసం చేయాలని చూస్తే ఏమి జరుగుందో, పొరపాటైనా సరదాగా నిజాయితీగా ప్రేమించే వారికి ఎటువంటి కష్టాలు ఎదురవుతాయో, 30సం// వచ్చినా పెళ్లి కాకుండా భాద పడుతున్న అబ్బాయికి ఎంతమంచి కేరెక్టర్ కలిగిన భార్య వచ్చిందో చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా చెప్పుకోవల్సింది రచయిత గురించి. కూతురు కేన్సర్ కోసం పాపం తను డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతుంటే తను వ్రాసిన ముష్ఠివాడి కథలోని పాత్రే తనకు ఉపయోగపడటం చాలా,చాలా అద్భుతం. మరొక కథ ఆమని,నరేశులది. ప్రేమించుకుని పెళ్లి కాకుండా విడిపోయిన వీళ్లు తిరిగి భర్తను కొల్పోయి ఒంటరిగా ఉన్న ఆమెను నరేశ్ పెళ్లి చేసుకుని లైఫంతా హేఫీగా గడపడం చాలా బాగుంది. మంచి పాజిటివ్ సెన్స్ తో తీసిన సినిమాలెప్పుడూ ప్రజల హృదయాలను దోచుకుంటాయి. నిజానికి వీటికి అవార్డులు రాకపోవచ్చు.దిక్కుమాలిన ఐటెం సాంగ్స్ డప్పుల మోత ఉన్న సినిమాలకే రావచ్చు. కాని చందమామ కథలు లాంటి సినిమాలకి తప్ప ప్రజల హృదయంలో స్థానం మరొక సినిమాలకి లభించదు. ఇదే వాటికి మర్చిపోలేని పెద్ద అవార్డు.
ఇక్కడ సినిమా కూడా చూడండి.