30, డిసెంబర్ 2015, బుధవారం

ప్రొద్దుట మంచం మీద ఉండగానే NTV నుండి ఒక రిపోర్ట్ గారి ఫోన్.

5am to 6am మధ్యం ఇంకా మంచంపై దొర్లుతూనే ఉన్నాను. నిద్రపోలేదుగాని ఈరోజు ఏమి చేయాలా? నూతన సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ప్లాన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే ప్రక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ఇంత ప్రొద్దుటే నాతో ఎవరికి అవసరం పడిందా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతలి నుండి NTV రిపోర్ట్ గారట. నాతో చాలా సేపు సంభాషించారు. మన "సాక్ష్యం మేగజైన్" చాలా బాగా నచ్చిందట. అందులోని కొన్ని బుక్స్ ఆయన Download చేసుకుని చదవడమే కాకుండా రెగ్యులర్ గా దానిలోని ఆర్టికల్స్ ఆయన ఫాలో అవుతున్నానని త్వరలో మీ సాక్ష్యం బ్లాగును NTV లో ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకో మనసుకి...Read more

27, డిసెంబర్ 2015, ఆదివారం

కొంతమంది మహానుభావులను దేవుడు పుట్టిస్తాడు. అటువంటి వాళ్ళలో ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు గారు ఒకరు!

రాత్రి ఈ‌టి‌వి 20వ వసంతం ప్రోగ్రామ్ Youtube లో చూస్తుంటే మన గాన గాంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం గారు రామోజీరావు గారి గురించి కొన్ని విషయాలు చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమయి ఆయన కాళ్లపై పడి నమష్కరించే సన్నివేశం చూసి నా మనసు చలించిపోయింది. ఒకసారి బాల సుబ్రమణ్యం గారు ఎయిర్ పోర్ట్ లో దిగి కారు కోసం ఈనాడు ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ ఎట్టలేదట! సరే అనుకుని రామోజీ రావుగారింటికి ధైర్యం చేసి ఫోన్ చేస్తే రామోజీ రావుగారు ఫోన్ ఎత్తారట. చెప్పండి బాల సుబ్రమణ్యం గారు అని అడిగితే ఏమి చెప్పాలో బాలుగారికి అర్ధకాలేదట! గుండెల్లో దడ పట్టుకుందట.... Read More

24, డిసెంబర్ 2015, గురువారం

నేనొక హంతకుడిని!

అవును నేను ముమ్మాటికి హంతకుడినే...ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకాకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు... Read More

22, డిసెంబర్ 2015, మంగళవారం

నేను సిగ్గుపడుతున్నా..ఈ దేశంలో పుట్టినందుకు!

ఒక ఆడపిల్లను రాత్రంతా బస్సులో ఢిల్లీ నడి వీధుల్లో తిప్పుతూ అతి కిరాతకంగా ఒకరి వెంట ఒకరు హత్యాచారమ్ చేస్తూ, మానంలో ఇనుపరాడ్లు, బీరు బాటిల్లు చొప్పించి ప్రేగులను సైతం మానంలో నుండే బయటికి లాగి అతికిరాతకంగా అనుభవించిన పైశాచిక రాక్షసులలో ఒకడ్ని మన దేశం వదిలి పెట్టి... Read More

18, డిసెంబర్ 2015, శుక్రవారం

నీహారికా మేడమ్...మీకో "తొక్క"లో సలహా!

నీహారికా గారు..మీరు ఎంతో చక్కని పోస్టులు పెడుతుండేవారు. అటువంటిది ఈ "తొక్క" లో గొడవెంటమ్మా? ప్రతి బ్లాగును పట్టుకుని "తొక్కా...తొక్కా" అని విమర్శిస్తుంటే అసలు నీహారికా మేడమ్ గారు చెప్పేది ఏ "తొక్క" గురించి అనే సందేహం వచ్చింది. దానిని....Read More

17, డిసెంబర్ 2015, గురువారం

మీలో ఎవరు విజేత? జవాబు చెప్పండి? బహుమతి గెలవండి!

ప్రతినెలా రెండు క్విజ్ లు నిర్వహించబడతాయి. ప్రతి క్విజ్ లోనూ మీరు గెలుపొందవచ్చు. చక్కని బహుమతులు అందుకోవచ్చు. పుస్తకాలూ, చిన్న,చిన్న వాడుకునే చక్కని వస్తువులు, అందమైన బట్టలు ఏవైనా కావచ్చు. ఇంకెందుకాలస్యం వెంటనే పాల్గొనండి మరి. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

14, డిసెంబర్ 2015, సోమవారం

సబీరా!... బ్రతికే ఉందా?

ఆకాశమంతా నిర్మానుష్యంగా ఉందినల్లని త్రాచులాంటి తార్రోడుపై  నా కారు పరుగెడుతుందినేనుఇండియా వచ్చి రెండురోజులయ్యిందిఆరెండు రోజులూ కాకినాడలోనే ఉండిపోయానుఈరోజుఎలాగైనా నేను పుట్టిన పల్లెటూరు చూసి రావాలనిపించి బయలుదేరానుబయట వాతావరణంచాలా చల్లగా ఉందిఅప్పటికే చిరుజల్లులు ప్రారంభమయ్యి చలి పుడుతూంది.   "అమెరికా నుండి వచ్చి కాకినాడలోనే ఉండిపోతావానన్ను చూడాలని అనిపించడం లేదా? "నేను ఇండియా వచ్చిన దగ్గరనుండి మా బామ్మ నన్ను తిడుతూనే ఉందినాకు మా బామ్మ కంటేఎవరున్నారుఆమెను చూడకుండా ఉండగలనానేను వచ్చిన రోజే కాకినాడవచ్చేయమన్నాను..నేను అంతదూరం రాలేనునీవు ఇక్కడికి రాఅంది.
   నేను  వూరు వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది కారణం పేరే సబీరా! Read More

12, డిసెంబర్ 2015, శనివారం

నేను ఒక హర్రర్ సీరియల్ వ్రాద్దామనుకుంటున్నా..!

అవును. మీ అందరికోసం నేను ఒక హర్రర్ సీరియల్ వ్రాద్దామని అనుకున్నా! కానీ రాయడానికి నాకు చాలా భయమేస్తుంది. రాత్రి 12 గంటలకు పెన్ను,పుస్తకం తీసుకుని మా పెరటులో ఉన్న చింతచెట్టు దగ్గర కూర్చుని మెదలు పెట్టానో లేదో ఒక్కసారిగా మా చింతచెట్టు కొమ్మలు తమిళనాడు వరద గాలికి ఊగినట్టు తెగ ఊగిపోయాయి.  Read More

10, డిసెంబర్ 2015, గురువారం

మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు -3

"అమ్మాయి కాదు అబ్బాయని..అదీ ఆ టైపు అబ్బాయని ఎలా తెలిసిందో మా ప్రసాద్ గాడు చెప్పడం ప్రారంభించాడు.
"వాడు నిన్న ఎర్లీ మార్నింగ్ 7am కల్లా ఇంటికొచ్చేయమని ఫోన్ చేశాడు. నేను పుల్ మేకప్ మీద తయారయ్యి రాజమండ్రి సందులూ,గొందులూ అన్నీ తడుముకుని మొత్తానికి ఆ అమ్మాయి, ఛ... ఆ అబ్బాయి ఇంటికెల్లాను. డోర్ దగ్గర నిలబడి పిలిస్తే లోపలికొచ్చి సోఫాలో కూర్చోండి అనే వాయిస్ వినబడింది. నాకు ఎక్కడ లేని టెన్షన్ అనుకో. తను డ్రెస్ మార్చుకుంటున్నానని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పింది. సరే అనుకుని రిలీఫ్ దొరికింది కదా అని సోఫాలో కూలబడ్డాను. కొద్ది సేపటికి వాడు కాఫీ గ్లాసుతో వచ్చి నాదగ్గర నిలబడి నీవు నాకు ట్రైన్ లో పరిచయమయిన వాడివి కాదే" అని అడిగింది.Read more

9, డిసెంబర్ 2015, బుధవారం

మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు.-2

మా ప్రసాద్ గాడికి ఏమి జరిగిందో చెప్పేముందు మీకు వాడి గురించి తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే వాడిని బుక్ చేసింది నేనే కాబట్టి మీరందరూ నన్ను తిట్టుకునే అవకాశం ఉంది. సరే...మా ప్రసాద్ గాడు డైలీ చేసే పెద్ద పని ఏమిటంటే ఎప్పుడూ మొబైల్ లో సొల్లు కబుర్లు చెప్పడమే! ఏదో ఒక రాంగ్ నంబర్ కి డయల్ చేయడం అవతలి వాళ్ళు మగవారైతే రాంగ్ నంబర్ సర్ అని చెప్పి పెట్టేయడం, ఆడ వారైతే ఏదో విధంగా మాటలు కలుపుకుని మాటలాడటం వీడి ప్రధాన పని, ఈ విషయంలో ఎన్నో తిట్ల పురాణాలు వీడు స్వతహాగా అనుభవించిన  బుద్ది రాలేదు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ గారు పనీపాటా లేకుండా వీడు జులాయిగా తిరుగుతున్నాడని నా దగ్గర ఎన్నోసార్లు వాపోయింది. Read more

7, డిసెంబర్ 2015, సోమవారం

మా ప్రసాద్ గాడు బుక్కయ్యాడు..

"హాయ్ సర్ " పక్కనుండి వచ్చిన గొంతు విని ట్రైన్ విండో నుండి కదులుతున్న చెట్లను, పొలాలను గమనిస్తున్న నేను అతని వైపు చూశాను.
  తెల్లగా, కాంతివంతమైన ముఖంతో చిరునవ్వు చిందుస్తూ నా వయస్సే ఉన్న ఒక యువకుడు కనిపించాడు. బహుశా వేరే సీటులో నుండి వచ్చి నా ప్రక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతకు ముందు నాపక్క అప్పటివరకూ ఎవరూ లేరు.
 "హాయ్ సర్..." నేనూ ప్రతి పలకరింపు చేశాను. అప్పటికే ట్రైన్ నిడదవోలు దాటుతుంది.
 "నేను రాజమండ్రి నుండి వస్తున్నాను సర్ ..మీరెక్కడ నుండి?" అడిగాడతను. More read

5, డిసెంబర్ 2015, శనివారం

క్యా డైలాగ్ హై!

 ఇటువంటి మంచి డైలాగ్స్ మీకు కూడా తెలిస్తే క్రింది కామెంట్ బాక్స్ లో తెలియ జేయండి. నలుగురికీ తెలుస్తాయి. Read more

3, డిసెంబర్ 2015, గురువారం

రాత్రి "శశిరేఖా పరిణయం" టి‌వి సీరియల్ చూసినందుకు కళ్ళు బైర్లు కమ్మి మైండ్ బ్లాక్ అయ్యింది.

మా అత్తగారికి, నా సతీమణికి టి‌వి సీరియల్స్ అంటే పిచ్చి. 7pm నుండి ప్రారంభమయ్యే చిన్నారి పెళ్లి కూతురి నుండి 9:30 వరకూ ప్రసారమయ్యే శశిరేఖా పరిణయం వరకూ దేనిని వదలరు. ఆసమయంలో ఇంట్లో దొంగలు పడినా సరే వీరు గమనించే స్థితిలో ఉండరు. కేవలం మా ఇళ్లే కాదండోయ్! మా కాలనీలోని స్త్రీ సమాజం మొత్తం అదే పనిలో ఉంటుంది. Read More

2, డిసెంబర్ 2015, బుధవారం

మీ జీవితాన్ని మార్చే STOP టెక్నిక్

ప్రతిరోజూ ఒక సమయానికి ఆహారం తీసుకోవడమనే అలవాటును చేస్తే ఆ సమయానికి ఆకలి పుడుతుంది. అలాగే మనసుకీ ఆకలి కలగాలి. ఈ మనస్సులో కలిగే మానసిక ఆకలి తృష్ణకు సమయంతో పని లేదు. ఆలోచించడం ద్వారా మనమే ఈ ఆకలిని సృష్టించుకోవాలి. Read More

1, డిసెంబర్ 2015, మంగళవారం

ఆలోచింప చేసే ఎ.ఎస్.లక్ష్మి గారి మాటల తూటాలు!

ఇంతకీ మనలో మన మాట: మతాలనీ, రాజకీయాలనీ పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రపంచంలో అసలు భారతీయులని మించిన సహనవoతులు ఎక్కడా కనబడరు.
రుజువులు కావాలా? చిత్తగించండి.  - Read More

9, నవంబర్ 2015, సోమవారం

మీ పర్సులో సాధారణంగా ఉండాల్సిన ID కార్డులు!

1.ఆధార్ కార్డు
2.పాన్ కార్డు
3.ఓటర్ ఐడి కార్డు
4.డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.
5.ఏ.టి.యమ్. కార్డ్.
6.కనీసం రెండు పాస్ పోర్ట్ ఫోటోలు.
ఇవన్నీ మనం ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవాలి..వీలైనంతమట్టుకు మనం ఒరిజినల్స్ ఇంటి దగ్గరే పెట్టుకుని డూప్లికేట్స్ పెట్టుకుంటే మంచిది. ATM కార్డ్ డూప్లికేట్ పెట్టుకోవడం కుదరదులెండి.

31, అక్టోబర్ 2015, శనివారం

"కంచె" సినిమా చూశానండోయ్! చాలా బాగుంది.

నేనూ, నా మిత్రుడు ప్రకాష్ గారూ కలిసి "కంచె" సినిమా దర్శింశాము. సినిమా ఆద్యంతం చాలా బాగుంది. ఒక హాలీవుడ్ తరహాలో ఉన్నట్టుగా ఉంది. లొకేషన్స్, సెటింగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకో "దృశ్యం" సినిమా మాదిరిగా ఈ సినిమాకి కూడా ఒక రివ్యూ వ్రాస్తాను. వీలు చూసుకుని త్వరలో మంచి,మంచి సన్నివేశాలు వర్ణిస్తూ ఒక స్టోరీ వ్రాసాను.ఈలోపు మీరు కూడా వీలయితే ఒకసారి ఈ మూవీ చూసే ప్రయత్నం చేయండి. అంతవరకూ శెలవా మరి? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి ధియేటర్ లోని పేక్షకులందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. నా జీవితంలో ఈ విధంగా జరిగింది ఈ సినిమాకి మాత్రమే. ఆ సీన్ సూపరంటే సూపర్. ఆ సన్నివేశాన్ని చూస్తే మీరు కూడా చప్పట్లు కొడ్తారు. అమ్మతనం తెలిసినవారైతే!!

29, అక్టోబర్ 2015, గురువారం

కాకినాడలోని సంగీత,నాట్య వార్షికోత్సవం స్పెషల్ ఈవెంట్ మిస్సయ్యాను.

నిన్న రాత్రి నేనూ, నా మిత్రుడు ప్రకాష్ గారూ కలిసి కల్పనా సెంటర్లో జ్యూస్ త్రాగుతుండగా ఒక్కనే ఉన్న "సరస్వతీ గాన మందిరం" పై నా చూపు పడింది. అంతా కళాకారులతో హడావుడిగా ఉంటే ఏమిటా? అని ఆశ్చర్యపోతూ వెళ్ళి చూశాను. అప్పటికి ప్రోగ్రామ్ అయ్యిపోయినట్టుంది. అందరూ వెళ్లిపోయే హడావుడిలో ఉన్నారు. ప్రక్కనే ఉన్న బోర్డు చూసి చాలా బాధ పడ్డాను. అక్టోబర్ 22-10-2015 నుండి 28-10-2015 వారకూ ఏరోజు ఏవిధమైన ప్రోగ్రామ్స్ ఉంటాయో దానిపై వ్రాసి ఉంది. అరే కాకినాడలో ఉంటూ ఇంతమంచి ప్రోగ్రామ్స్ మిస్సయ్యానే అనే ఆలోచన మనసుకి చాలా బాధ కలిగించింది. భరతనాట్యం గాని, వీణ గాని, సంగీతం గాని మన భారతీయ కళలు. కాపాడుకోవల్సిన సంపద. మనమే వాటిని చూడకపోతే ఎలా? ఏ కళైనా ప్రోత్సాహం పైనే ఆధారపడి బ్రతుకుతుంది. వాటిని బ్రతికించాల్సింది ముమ్మాటికీ మనమే! ఏమంటారు?

13, అక్టోబర్ 2015, మంగళవారం

ఇదే కరెక్ట్!

కొందరిలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం సిట్టింగులు వేసినా, గొడవలు పెట్టుకున్నా ఆ సమస్యలు సమసిపోవు. అటువంటి వారితో మెత్తగా ఉంటూ, ప్రేమగా ఉంటూ (లేక నటిస్తూ) ఆ సమస్యలను తుడిచివేయాలి. పరిస్థితిని బట్టి మనమే వారికి సమస్య అయిపోవాలి. అప్పుడు అన్నీ సర్దుకుపోతాయి.

31, ఆగస్టు 2015, సోమవారం

మీ పాతటపాలకు చక్కని పుస్తకాలు బహుమతిగా అందుకోండి.

బ్లాగ్ వేదిక "టీమ్" వారు ఒక చక్కని మనం వ్రాసిన పాతటపాలకు చక్కని పుస్తకాలను బహుమతిగా ప్రకటించారు. వాటిని సొంతం చేసుకోవడం కోసం మనం ఏమి చేయాలో తెల్సుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు :బ్లాగ్ వేదిక విజిట్ చేయండి.

23, ఆగస్టు 2015, ఆదివారం

కిక్-2 సినిమా అంతగా కంపర్ట్ ఫుల్ గా లేదు!

రవితేజ హీరోగా విడుదలైన కిక్-2 సినిమా ఎందుకో అంతా కంపర్ట్ ఫుల్ గా అనిపించలేదు. దీని ముందు సినిమా కిక్ ని మరిపించలేకపోయింది. ఆ సినిమా బాగుంది. ఈ కిక్-2 సినిమా అంతగా నాకు నచ్చలేదు. సహజంగా రవితేజ సినిమా అంటేనే కామెడీ గా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ముందుభాగమ్ కొద్దిగా పర్లేదు గాని సెకండ్ భాగం అసలు నచ్చలేదు. బ్రహ్మనందాన్ని పెద్దగా ఉపయోగించలేకపోయారు. విలన్ ని మొదటి భాగంలో చూపించినంతగా రెండో భాగంలో చూపించలేదు. హీరో విషయంలో కూడా అలాగే జరిగింది. అంత ఫీలింగ్ ఉన్న సినిమా ఏమీ కాదు ఈ కిక్-2. సినిమా అంతా హీరో కంపర్ట్ గా ఉంటేనే ఏ పనైనా చేస్తాడు. కానీ ఆ సినిమా చూసే మనకు మాత్రం ఏవిధమైన కంపర్ట్ లేకుండా పోతుంది.

6, ఆగస్టు 2015, గురువారం

రోజా గారు అన్ని పార్టీలకు ద్రౌపతి అయ్యిపోతుందా?

ఈరోజు నేను టి.విలో వార్తలు చూస్తుంటే రోజాగారి విమర్శలు వచ్చాయి. ఆంధ్ర సి.యం చంద్రబాబుగారి టర్కీ పర్యటనకు 65 కోట్లు ఖర్చయ్యిందని, ఇంకా ఆంధ్రను సింగపూరికి అమ్మేస్తున్నాడని ఏవేవో అనేసింది. నిజానికి ఈమెకు రాజకీయమంటే తెలుసంటారా? లేక జబర్దస్త్ కామెడీ చూసి, చూసి ఈమెకేమైనా మెంటలు వచ్చిందా పాపం అనిపించింది. ఒకసారి ఆమె గత రాజకీయ వేషాలు చూడండి. తెలుగు దేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను తిట్టింది. కాంగ్రెస్ కి వచ్చిన తరువాత తెలుగుదేశాన్ని తిట్టింది. ఇప్పుడు వై.యస్.ఆర్.లోకి జంప్ అయిన తరువాత ఏకంగా మిగతా పార్టీలను తిడుతోంది. దారుణంగా విమర్శిస్తోంది. రోజా చాలా మంచి నటి. అందమైనది. నా చిన్నప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇప్పటికి అందరి హృదయాలలో రోజా గారికి ఓ క్రేజ్ ఉంది. అటువంటిది ఈమెకు ఈ దిక్కుమాలిన రాజకీయాల దరిద్రం ఎందుకో అర్ధం కావడం లేదు. గతంలో జగన్ గారు అన్నట్టు ఈమె చివరికి వై.యస్.ఆర్ పార్టీకే కాకుండా అన్ని పార్టీలకు, అందరికీ ద్రౌపతి అయ్యిపోయేలా ఉంది.

5, ఆగస్టు 2015, బుధవారం

"దృశ్యం" సినిమా 5 భాషల్లోనూ సూపర్ హిట్టేనట!

ఈరోజు ఒక మిత్రుని బ్లాగులో "దృశ్యం" సినిమా ఐదు భాషలలోనూ సూపర్ హిట్టయ్యిందన్న టపా చదివి చాలా ఆనందమేసింది. ఎందుకంటే చాలా చక్కని సినిమా! అందరూ చూడాల్సిన సినిమా! గతంలో ఈ సినిమా గురించి ఒక టపా కూడా వ్రాసాను. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. ఒకసారి ఆ లింక్ చూడండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పడేయ్యండి.

31, జులై 2015, శుక్రవారం

అతి త్వరలో "సాక్ష్యం సంచలన పత్రిక " ప్రింటెడ్ మాసపత్రికగా మీ ముందుకు!

సాక్ష్యం సంచలన పత్రిక స్థాపించాలని ఎప్పటినుండో నా కల. ఎట్టకేలకు అన్నీ పరిమిషన్స్ తీసుకుని త్వరలో రెడీ అవ్వబోతుంది. ఈ మాస పత్రిక నడపాలంటే చాలా బరువైన వ్యవహారం కాబట్టి ఇప్పటి వరకూ సరైన జోడు లభించక ఆగిపోవడం జరిగింది. అయితే దేవుడు దయవలన మంచి మిత్రుడు, ప్రముఖ ధార్మిక రచయిత అయిన యం.డి.యన్.ప్రకాష్ గారి సహకారం లభించడం, ఆయన భాగస్వామి కావడం సంతోషదాయకమైన విషయంగా పరిగణిస్తున్నాను. పత్రికాఫీసుకు సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరిగిపోతున్నాయి.దేవుడనుగ్రహిస్తే తొలి పత్రిక త్వరలోనే మీముందుకు వస్తుంది. అంతవరకూ సెలవు. శుభం.

28, జులై 2015, మంగళవారం

"కాకినాడ బజార్" నూతన బ్లాగ్ ప్రారంభం!

ఎప్పటినుండో కాకినాడకు సంబంధించిన విశేషాలతో ఒక బ్లాగును ప్రారంభించాలని అనుకుంటూ ఉండేవాడిని. దైవానుగ్రహం అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఇకనుండీ కాకినాడకు గూర్చిన సమాచారమంతా ఈ బ్లాగు ద్వారా అందుతూనే ఉంటుంది. కాకినాడ వాసులకు ఉపయోగకరంగానూ, మిగతా ప్రాంతాలవారికి సమాచారాత్మకంగానూ ఈబ్లాగును తయారుజేస్తాను. ఒకసారి ఈ లింక్ ద్వారా Kakinada bazaar వీక్షించి మీ విలువైన సలహాలు,సూచనలు అందించగలరని ఆశిస్తున్నాను.

25, జులై 2015, శనివారం

మంచి ముత్యాలు

  • దైవం ఏదో ఇవ్వాలని ఆరాధించడం కాదు. ఎన్నో ఇచ్చాడని గుర్తించి ఆరాధించడమే దైవారాధన.
  • తీర్చుకోవాల్సిన వాటిలో ప్రధమ ఋణం -దేవరుణం.
  • శరీరం మనల్ని వదిలితే మృత్యువు. మనం శరీరాన్ని వదిలితే మోక్షం.
  • దేవుడు ఇంకా ఆయుస్శును ఉంచాడూ అంటే, ఇంకా అవకాశం ఇచ్చాడని అర్ధం.
  • శరీరానికి పెద్దరికం వస్తే ఫరవాలేదు. మనసుకు మాత్రం ముసలితనాన్ని రానీయరాదు.

18, జులై 2015, శనివారం

"బాహుబలి" సినిమాకెళ్ళి బుక్కయ్యాను!

సినిమా పూర్తి అయ్యేవరకూ "బాహుబలి" సినిమా రెండు భాగాలు అన్న విషయం నాకు తెలియదు. టి.వి.సీరియల్ మాదిరి ఎండింగ్ లో సస్పెన్స్ లో పెట్టేసి బయటికి పంపేసిండు. తండ్రి బాహుబలికి ఏమి జరిగిందో అర్ధం కాక, ఆయనను అతని నమ్మిన అనుచరుడే వెనుక నుండి వెన్నుపోటు పొడిచి ఎందుకు చంపాడో తెలియక బుర్ర పిచ్చెక్కిపోయింది. కొడుకు బాహుబలి ఏమి చేస్తాడో ఇక చూడాలి. ఇవన్నీ తెలియాలంటే మరో 110 రూపాయలు పట్టుకుని రెండో భాగం కోసం ఎదురు చూడాలి.
       కట్ చేసి...సినిమా విషయానికొస్తే ...
       ఏమాటకామాటే చెప్పుకోవాలి. సినిమా ఇంచుమించు హాలీవుడ్ తరహాలో ఉందంటే నమ్మండి. సినిమా క్లైమాక్స్ యుద్ధం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా ప్రారంభంలో వాటర్ ఫాల్ ఒక అద్భుతమైన వింతలా తీశారు. అది గ్రాఫిక్స్ మీదే సృష్టించారని, అది నిజంకాదని పేపర్లో చదివి చాలా ఆశ్చర్యపోయాను. సినిమాలో ప్రకృతి అందాలను చాలా చక్కగా చూపించారు.
      సినిమా కధ విషయానికొస్తే చాలా బలహీనంగానే అనిపించింది. పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ నాకైతే మొదటి భాగంలో అనిపించలేదు. ఇక రెండో భాగంలో ఉంటుందేమో చూడాలి.

16, జులై 2015, గురువారం

తెలుగు బ్లాగుల ఆస్వాదమ్

రాత్రి ఎందుకో సరిగా నిద్ర రాలేదు. ఏమి చేద్దామా అని ఆలోచిస్తుండగా నా దృష్టి నా బ్లాగ్ వేదిక పై పడింది.సర్లే ఒకసారి బ్లాగులన్నీ చదువుదామని కూర్చొని ఇంచుమించు పాతవి ,కొత్తవి చాలా బ్లాగులను పరిశీలించి చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను. అందులో కొండలరావుగారి ప్రజాబ్లాగులోని నీహారికగారి ఇంటర్వూ నాకు బాగా నచ్చింది.ఆమె నిక్కచ్చిగానే ఇచ్చిన సమాధానాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.ఇకపోతే కొన్ని బ్లాగుల ద్వారా ఒక గొప్ప విషయం తెలిసింది.అదేమిటంటే బ్లాగు పెట్టి ఏదో రాయడం కాదు ఆ వ్రాసేదేదో మనిషికి చదవాలనే జిజ్ఞాస, జ్ఞానం, చైతన్యం వంటివి కలిగే విషయాలే వ్రాయాలి.ఒక రకంగా చెప్పాలంటే బ్లాగర్లలో సెలబ్రిటీ అయ్యిపోవాలి. ఈ ఆలోచనలు చాలా గొప్పవి కాబట్టే నాకు బాగా నచ్చాయి.
      కొన్ని కామెంట్లు చదివినప్పుడు కొంతమంది నేను తల్చుకుంటే ఎవరినైనా సరే తోక ముడుచుకునేలా చేస్తానని, పరుగులు తీయిస్తాననే తరహాలోనే  పెట్టారు. ఇది వారి అహంకారానికి నిదర్శనం తప్ప మరేమీ కాదు.
      ఏమైనా ఏవో కొన్ని బ్లాగుల్లో ఒకటి రెండు మంచి టపాలు తప్ప గొప్పగా అనిపించే బ్లాగేమి కనిపించలేదు. గూగులమ్మను అడిగినా చూపించలేదు. ఇకనుండైనా మంచి,మంచి బ్లాగులు రావాలని కోరుకుందాం!

14, జులై 2015, మంగళవారం

"బాహుబలి" విజయవంతమయ్యిందా?

రాజమౌళిగారు దర్శకత్వంలో వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా బాహుబలి గురించి పేక్షకులలో వివిధ కామెంట్లు వస్తున్నాయి. అత్యధికంగా సినిమా పెద్దేమీ సూపర్ హిట్ కాదన్న విమర్శలే కాన వస్తున్నాయి. అయితే సినిమాకి కావల్సిన కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయని రిపోర్టులు చెపుతున్నాయి. ఏది,ఏమైనా తెలుగు సినిమాని హాలీవుడ్ తరహాలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళిగారిని అభినందించవల్సిందే!

7, మే 2015, గురువారం

నిజం కాదా?

మనకి మనం స్వతహాగా ఏదైనా పని సృష్టించుకో గలిగినప్పుడే ఎక్కువగా ఆనందం అనుభవిస్తాం. - అహ్మద్ చౌదరి.

26, ఏప్రిల్ 2015, ఆదివారం

నిజం కాదా?

నిస్వార్ధ, త్యాగనిరతిలపై నిలబెట్టాల్సిన థర్మాన్ని రూపాయి నోట్ పై నిలబెడుతోంది ఈలోకం. - అహ్మద్ చౌదరి.

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

దేవుడనుగ్రహిస్తే కాకినాడలో నా మిగతా జీవిత కొనసాగింపు!

నేను కోదాడ నుండి కాకినాడ తిరిగి వచ్చేసాను. ఇన్షా అల్లాహ్ ఇక నుండీ నా వ్యాపారాలు, ఆధ్యాత్మిక పనులు, బ్లాగింగ్ చేయడం అన్నీ కాకినాడ నుండే ప్రారంభిస్తాను. నన్ను ఎంతగానో ఆదరించే పాత బస్టాండ్ థార్మిక సభ్యులైన ఉమర్, అజీం, మల్లిక్, మచ్చా శ్రీను వాళ్లతో కలిసి ధార్మిక సమావేశాలలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరొక ముఖ్య విషయమేమిటంటే ప్రముఖ ధార్మిక పండితులు ముష్తాఖ్ అహ్మద్ గారిది కూడా కాకినాడ కావడం, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఎక్కువుగా కలవడం, అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఏర్పడటం నాకు లభించిన అదృష్ట వరంగా భావిస్తున్నాను. నా పెద్ద గురువుగారైన అహ్మద్ అలీ గారు భౌతికంగా లేకపోయినప్పటికీ నా చిన్న గురువుగారు అయిన జహరుల్లాహ్ గారు, అమీర్ గారితో కలవడం కూడా నేను ఆనందంగానే భావిస్తాను. సంతోషిస్తాను. ముఖ్యంగా నాకు అన్ని విధాల ఉమర్ గారు తోడ్పాటు నేను గర్వించదగ్గది. ఆయన స్నేహం విలువకు అందలేనిది. వీళ్లందరికీ సర్వేశ్వరుడు మేలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శుభం.

21, ఏప్రిల్ 2015, మంగళవారం

దేవుని దృష్టిలో థర్మం ఎక్కడుంది?

పేదవాని ఆకలి తీర్చడంలోనూ, ఎదుటి వాని కష్టాలలో పాలు పంచుకోవడంలోనూ దేవుని ధర్మం ఇమిడి ఉంది. - అహ్మద్ చౌదరి.

4, మార్చి 2015, బుధవారం

నా మనో డైరీ మళ్లీ రాస్తాను.

నా బిజీ పనుల వల్ల, సాక్ష్యం గ్రూప్ పని వల్ల నా పర్సనల్ బ్లాగైన దీనిని పూర్తిగా పట్టించుకోవడం మానివేసాను. ఇందులో నా అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు వ్రాయడం అన్నా, నేను చదివే సాహిత్య పుస్తకాలను పరిచయం చేయాలన్నా నాకెంతో ఇష్టం. ఈసారి నా డైరీ ని అశ్రద్ధ చేయను.

3, జనవరి 2015, శనివారం

ఇటువంటి సినిమాల వలన సమాజానికి ఏవిధమైన నష్టం ఉండదు.

తంలో దృశ్యం సినిమా గూర్చి నేను వ్రాసిన పాత టపా ఒకటి చదువుతుంటే అందులో చిరంజీవిగారు పెట్టిన కామెంట్ చూసాను. అందులో ఆయన "చందమామ కథలు" చూడండి.చాలా బాగుంది అంటూ సూచించారు. సరే మంచి సినిమాలను చూడడంలో తప్పేముందని యూట్యూబ్ చర్చ్ చేసి మూవీ చూసాను. అద్భుతం సినిమా చాలా సాప్ట్ గా హుందాగా బాగుంది. ఎన్నో పాత్రలు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. ప్రేమించి మోసం చేయాలని చూస్తే ఏమి జరుగుందో, పొరపాటైనా సరదాగా నిజాయితీగా ప్రేమించే వారికి ఎటువంటి కష్టాలు ఎదురవుతాయో, 30సం// వచ్చినా పెళ్లి కాకుండా భాద పడుతున్న అబ్బాయికి ఎంతమంచి కేరెక్టర్ కలిగిన భార్య వచ్చిందో చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా చెప్పుకోవల్సింది రచయిత గురించి. కూతురు కేన్సర్ కోసం పాపం తను డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతుంటే తను వ్రాసిన ముష్ఠివాడి కథలోని పాత్రే తనకు ఉపయోగపడటం చాలా,చాలా అద్భుతం. మరొక కథ ఆమని,నరేశులది. ప్రేమించుకుని పెళ్లి కాకుండా విడిపోయిన వీళ్లు తిరిగి భర్తను కొల్పోయి ఒంటరిగా ఉన్న ఆమెను నరేశ్ పెళ్లి చేసుకుని లైఫంతా హేఫీగా గడపడం చాలా బాగుంది. మంచి పాజిటివ్ సెన్స్ తో తీసిన సినిమాలెప్పుడూ ప్రజల హృదయాలను దోచుకుంటాయి. నిజానికి వీటికి అవార్డులు రాకపోవచ్చు.దిక్కుమాలిన ఐటెం సాంగ్స్ డప్పుల మోత ఉన్న సినిమాలకే రావచ్చు. కాని చందమామ కథలు లాంటి సినిమాలకి తప్ప ప్రజల హృదయంలో స్థానం మరొక సినిమాలకి లభించదు. ఇదే వాటికి మర్చిపోలేని పెద్ద అవార్డు.
ఇక్కడ సినిమా కూడా చూడండి.