
నా దృష్టిలో అయితే...ఎక్కువ మార్పు రావాల్సింది...రెండింటిలో!
1.స్త్రీలలో ..2) చట్టాలలో అని నా అభిప్రాయం.
1.ఈరోజు ఆడవారు మేము పురుషులతో సమానమని పరుగులు తీస్తున్నారు.నిజానికి ఎందులో సమానం? ప్రతిరంగంలోనూ పురుషునితో పోటీ పడే స్త్రీ బయట అసభ్య వస్త్రధారణ వేసుకుని విచ్చలవిడిగా తిరగడంలో కూడా సమానమా? తన టాలెంట్స్ ఉపయోగించుకుని పేరు,ప్రఖ్యాతలు తెచ్చుకోవడం దేశానికి గర్వకారణమే నేను కాదని అనను. అయితే బయట రాక్షస ప్రపంచంలో కూడా పురుషుని వలె తిరుగుతాను అంటే మాత్రం ప్రమాదమే! నిజానికి స్త్రీలు రక్షణ పరమైన పనులు చేసుకుంటూ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటే దేశానికి మానవత్వ విలువలు చేకూరుతాయి. గతంలో అయితే స్త్రీ ఇంటి దగ్గరే ఉండి గృహకార్యక్రమాలు నిర్వహించుకుంటూ పిల్లలను చక్కగా తీర్చిదిద్దెవారు. ఇప్పటికీ కొందరి ఇల్లల్లో ఈ విధమైన సంప్రదాయం కొనసాగుతుంది. వీరి పిల్లలు చాలా చక్కగా సంస్కృతి,సంప్రదాయాలు అలవర్చుకుంటూ హుందాగా ఉన్నారు కూడా!. ఎక్కువుగా ఉద్యోగ నిర్వహణలో మునిగిపోయినవారి తల్లిదండ్రుల పిల్లలే ఈరోజు ఈ అఘాయిత్యాలకు బలవుతున్నారు. బలి చేస్తున్నారు. వారి పిల్లలో సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే పరిస్థితి ఎనాడూ నిర్వహించకుండా పాశ్చాత్య కల్చరును ప్రోత్సాహిస్తూ వారసలు ఏ స్థితిలో ఉన్నారనేది పట్టించుకోకుండా, చివరికి వారిలోని రాక్షస ప్రవుత్తిని చూసి తర్వాత ఘోషిస్తున్నారు. దీని వలన ఏమి లాభం? భార్యభర్తలనేవాళ్లు తిరుగటిరాయి లాంటివాళ్లు.బియ్యం దానిలో పోసి విసురుతున్నప్పుడు పిండిగా బయటకు వస్తుంది.ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే క్రింది రాయి తిరగకుండా పైరాయి మాత్రమే తిరుగుతుంది. దాని ద్వారా బియ్యం కాస్తా పిండిగా మారి వంటలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ తిరుగటిరాయిలో క్రింది తిరగనిరాయి భార్య అయితే పైన తిరిగేరాయి భర్త. అంటే దీని అర్ధం భార్య బయట తిరగకుండా ఉండి ఇంటిపట్టునే ఉండి తన పనులను నిర్వహించుకుంటూ పిల్లలను తీర్చిదిద్దుకుంటే ఆ కుటుంబానికి లాభం, దేశానికి లాభం. ఇక పోతే పై తిరిగే రాయి భర్త తను గృహ అవసరాలను తీర్చడం కోసం,కుటుంబ భారాన్ని మోయడం కొసం తను బయట పని చేయాలి. అంటే కుటుంబ బాధ్యతలను నిర్వహించాలి.అంతే గాని పైరాయితో పాటు క్రింది రాయి తిరిగినా, క్రింది రాయిలాగ పై రాయి తిరగక పోయినా అందులోంచి పిండి రాదు.అలాంటి కుటుంబానికి సుభిక్షం కూడా కలుగదు. ఆధ్యాత్మిక ప్రవక్తలు ఏనాడో చెప్పారు "ఏ సమాజంలో అయితే స్త్రీ గడప దాటుతుందో ఆ సమాజం సర్వనాశనమవుతుందని.
2.మన చట్టాలు ఎందుకో తెలీదుగాని బలహీనమని నా అభిప్రాయం.స్త్రీలకు న్యాయం చేసిన ధాఖలాలు పెద్దగా కనిపించవు. కొంతమంది అమాయక స్త్రీల కేసులు ఇప్పటికీ తేలలేదు.కొన్నింటికి అడ్రస్ కూడా లేదు. పరిస్థితి ఇలా ఉంటే మనకు రక్షణ ఎలా కలిగిస్తాయి. మొన్నటికి నిన్న అచేలాల్ కేసు ఏమైంది. నిర్ధోషిగా బయటికొచ్చాడు. అదీ 70సం// వృద్దురాలిని రేప్ చేసి మరీ! ఎంతదారుణం. ఆ స్త్రీని అమ్మా,అమ్మా అని పిలుస్తూనే ఇద్దరూ మందుకొట్టి వావివరసలు మరిచిపోయి శారీరకంగా కలిసినప్పుడు ఈయన గారి ధాటికి తట్టుకోలేక గాయాల పాలై చనిపోయిందట!ఇదంతా ఈయనగారు మద్యం మత్తులో ఉండి చేసిందికాబట్టి, ఇంకా ఆమె మనోపాఝ్ దశ కోల్పోయింది కాబట్టి ఈయనగారు నిర్దోషని సదరు డిల్లీ హైకోర్టు తీర్పు చేసింది.ఇలాంటి తీర్పులు అసలు సమంజసమా?దారుణం కాదూ? చట్టాలే ఇలాంటి తీర్పులు చేస్తే ఇక రక్షణ ఎక్కడుంటుంది చెప్పండి?
- ఆమె తట్టుకోలేక చనిపోతే అది రేపు కాదా? వాడికి ఆ పరిస్థితి తెలియకుండానే కళ్ళు మూసుకుపోయాడా?
- ఆమెకు భర్త బ్రతికి ఉన్నప్పుడు ఆమెతో సంబంధం పెట్టుకోవడం అక్రమం కాదా? నేరం కాదా?
- మద్యం త్రాగి ఇలాంటి నేరాలు చేస్తే తప్పు మద్యానిదేనా? త్రాగినవాడికి వర్తించదా? ఇదే నిజమైతే మద్యం త్రాగి నేరాలకు పాల్పడవచ్చని సంకేతమా ఆ తీర్పు?
ఇలా విశ్లేసించుకుంటూ పోతే చాలా విషయాలు బయటికొస్తాయి. చట్టాల పరిస్థితి ఇలా ఉంటే మనం ఏమి చేయగలం?
ఆధ్యాత్మిక ప్రవక్తలు ఆడపిల్లలను రేప్ చేసి చంపే వారిని నడిరోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు. నాకు ఇదే పరిష్కారం అని నిర్భయ సంఘటన తరువాత బలంగా అభిప్రాయం ఏర్పడింది. ఈ విషయంలో వాదించేవారు నిర్భయ స్థానంలో తమ కూతురునో, చెల్లినో,తల్లినో ఊహించుకుంటే ఆ నేరాల యొక్క తీవ్రత, అన్యాయానికి గురినవారి ఆక్రోదన కనిపిస్తుంది.