26, ఆగస్టు 2017, శనివారం

తెలుగు బ్లాగులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

మన తెలుగు అంతర్జాలంలో తెలుగు బ్లాగర్లను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.ఒకరకంగా మనం తెలుగు బ్లాగుల విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నాం.బ్లాగంటే ఒక పర్సనల్ డైరీలాటిది.మన జ్ఞాపకాలు,ఆలోచనలు,అనుభవాలు...ఇంకా ఎన్నో విషయాలు మనం దానితొ పది మందికి తెలియజేయవచ్చు.అంతే కాకుండా ఏదో సబ్జక్ట్ మీద చక్కగా విషయాలు పొందుపరచి నలుగురి ఉపయోగానికి తోడ్పడవచ్చు.నా వంతు కృషిగా నేను నల్గురు మిత్రులకు చెప్పి వారి చేత బ్లాగులు ఓపెన్ చేయించాను.అలా ప్రతి ఒక్కరూ చేసినట్లయితే ఈ బ్లాగుల విషయం అందరికీ అవగాహణ అవుతుంది.అప్పుడు మనం తెలుగు బ్లాగుల విషయంలో మనమే టాప్ అవుతాము.

   దీనివల్ల ప్రయోజనమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవవచ్చు.ఒక బ్లాగర్ తన బ్లాగులో ఒక అంశంపై వ్రాయాలంటే దానికి సంబధించిన ఇన్ ఫర్ మేషన్ అతని దగ్గర ఉండాలి.ఆ సమాచారం కోసం అతను అనేక పుస్తకాలు చదవాలి.ఏకాంతంగా ఆలోచించాలి.ఇవన్నీ కూడా మంచి పనులే కదా!అతనికి ప్రయోజనం చేకూర్చేవే గదా!

   ఏకకాలంలో ఒక బ్లాగర్ మంచి పాఠకుడు,మంచి రచయితగా కూడా ఎదుగుతాడు.

   అంతర్జాలంలో మొత్తం కలిపి 5000 తెలుగు బ్లాగులు కూడా లేవు.బ్లాగులను చదివేవారు కూడా తక్కువే.నా ఉద్దేశ్యంలో చాలామందికి అసలు బ్లాగుల యొక్క అవగాహణ లేదు.పెద్ద,పెద్ద విద్యావంతులకే బ్లాగ్ అనేది ఒకటుంటుంది అనే విషయమే తెలియదు.ఇక బ్లాగ్ చదివేవారు ఎక్కడుంటారు?

   మరొక ముఖ్యవిషయమేమిటంటే...ప్రతి బ్లాగరు ఓ మంచి బ్లాగ్ రీడర్ కావాలి.ఏదో బ్లాగులో పోస్ట్ చేసేసాము..అయిపోయింది అనుకోకుండా మంచి,మంచి బ్లాగులను చదువుతూ వాటికి మన స్పందనలు కామెంట్ రూపంలో పంపుతూ ఉంటే వారిని కూడా మనం ప్రొత్సాహించినవాళ్ళమవుతాము.అప్పుడు వారు కూడా మన బ్లాగుకొచ్చి మనల్ని ప్రొత్సాహిస్తారు.

   ఏది ఏమైనా మనమందరము తెలుగు బ్లాగులను ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుదాం!ఓకే నా?

7 వ్యాఖ్యలు:

 1. మంచి టపా. చక్కగా చెప్పారు. నిజంగా నిజమైన మాట. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అజ్ఞాతఆగస్టు 03, 2014

  Well said.
  ఈ మధ్య బ్లాగుల్లో ఆసక్తికరమైన టపాలు కూడ రావడంలేదు. ఒక రెండేళ్ళ క్రితం వరకు చాలామంది బ్లాగర్లు సీరియస్‌గా వ్రాసేవారు. ఇప్పుడు చాలామంది వ్రాయడం మానేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాతఆగస్టు 04, 2014

   మీరు చెప్పింది 100% నిజం సర్.ఇక నుండైనా ఆ పరిస్థితి రాకుండా చూద్దాం.తెలుగు బ్లాగుల అభివృద్ధి కృషి చేద్దాం!స్పందనకు కృతజ్ఞతలు.

   తొలగించు
 3. చాలా మంది సీనియర్ బ్లాగర్లు ఇప్పుడు ఫేస్‌బుక్ లో రాస్తున్నారు. అటువంటి కొంత మందిని నేనక్కడ ఫాలో అవుతున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.