8, ఆగస్టు 2017, మంగళవారం

మహిళా సంఘాలు మహా గొప్పవా?

 మొన్నా మధ్య సినిమాల్లో ఆడదాన్ని అడ్డూ,అదుపు లేకుండా అన్యాయంగా చూపించారని చాలా పెద్ద గొడవ చేసాయి.ఎక్కడ ఆడవాళ్లపై ఏవిధమైన అన్యాయం జరిగినా విరుచుకు పడుతున్నాయి.మేమున్నాము అని పర్లేదు అని భరోషా ఇస్తున్నాయి.మంచిదే.[నిజానికి వాళ్లను మీడియాకి ఎక్కించి నానా యాగీ చేసి ఎవరి దారిన వాళ్లు పోతారనే విమర్శ కూడా ఉంది.ఎంతవరకూ నిజమో తెలీదు]

మహిళా సంఘాల గొడవలు ఎలాంటివంటే...

సినిమాల్లో స్త్రీని నగ్నంగా చూపించారని గొడవ?
ప్రతి వ్యాపార సంస్థకు స్త్రీ నగ్న ఫోజులు పెడుతున్నారని గొడవ?
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి?..వీధి కటౌట్ల దగ్గర నుండి అగ్గిపెట్టె వరకూ స్త్రీ నగ్న ఫోజులే వాడుతున్నారు.
బహుశా వీటి విషయంలో కూడా స్త్రీ లేక పోతే మనుగడే లేదేమో?

మహిళాసంఘాలు వీటి విషయంలో గొడవ చేయడం తప్పు అని నేను అనను.ఎందుకంటే అది న్యాయం కూడా..అయితే దీనికంటే ముందు వాళ్లు మరొక ముఖ్యమైన పని చేస్తే బాగుంటుంది.ఇది అత్యవసరం.

స్త్రీని నగ్నంగానో,అర్ధనగ్నంగానో చూపించారని నిర్మాతలను,డైరెక్టర్లను...వ్యాపార సంస్థలను నిలదీసేముందు..వాటిలో నటించిన స్త్రీలను జుట్టు పట్టుకుని బయటికి లాగి బుద్ధి చెప్తే సమాజానికి మేలు చేసిన వారౌతారు.బహుశా ఈ పని చేయరు.ఎందుకంటే వాళ్లు ఆడాళ్లు కదా?

ఢిల్లీ నిర్భయ ఉదంతం చూసి నాకు కొన్నాళ్లు నిద్ర పట్టలేదు.మనసంతా అదొక రకమైన ఆందోళన.అప్పుడు పేపరు చూడడానికి,టివి చూడానికే బయపడేవాడిని..ఏం వినాల్సివస్తుందో అని.నా దృష్టిలో వాళ్లను అన్నాళ్లు జైల్లలో పెట్టి మేపడమే తప్పు.వెంటనే ముక్కముక్కలుగా నరికేసి చంపి పారేస్తే దరిద్రం పోయేది.

కాని దారుణమేమిటంటే ..ఆ మర్నాటి నుండే మరిన్ని అత్యాచారాలు జరిగాయి..జరుగుతున్నాయి కూడా

నా సలహా ఏమిటంటే ఈ మహిళాసంఘాలు అన్ని కలసి స్త్రీలలో సంస్కృతి సంప్రదాయాల పట్ల,కట్టుబొట్టు పట్ల అవేరునెస్ తీసుకొస్తే బాగుంటుంది.ప్రాశ్చాత్య కల్చర్ రూపుమాపాలి.అచ్చమైన భారతదేశ కట్టుబొట్టు ఉండాలి.

విచిత్రం ఏమిటంటే...షార్ట్ కట్ జాకెట్లు,శరీర సౌష్టవం కనిపించేలా చీరలు  వేసుకునే మహిళా సంఘ సభ్యులున్నారు.వాళ్లలో చాలామంది పిల్లలు పబ్బులకు,క్లబ్బులకూ వెళ్లేవారే.

మన దగ్గర జాగ్రత్త లేనప్పుడు బాగుండాలి అంటే కుదురుతుందా? కొన్ని మార్పులు రానంతకాలం ఎన్ని ఉద్యమాలు నడిపినా ఉపయోగం లేదు.పులి నోట్లో తల పెట్టి కరవద్దు అని గొల పెట్టడం అజ్ఞానం.

                                                  > ఆధ్యాత్మిక విషయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

2 వ్యాఖ్యలు:

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.