28, జులై 2014, సోమవారం

ఈ రోజుల్లో ఇంతమంచి సినిమా ఇదేనేమో!

ఒకరోజు నా ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దృశ్యం సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు.పెద్దగా సినిమాలు చూడని నేను ఆరోజు ఆ సినిమా చూసాను.సినిమా చాలా బాగుంది.సైలెంట్ గా,ధ్రిల్లింగ్ గా సస్పెన్స్ కధనంతో ఆసాంతం మనిషిని కట్టి పడేసింది.
 
    బహుశా ఈరోజుల్లో ఇంతటి మంచి సినిమా రావడం ఇదే  మొదటిసారనుకుంటా!
 
    సినిమాలో అశ్లీలం లేదు.బట్టలూడదీసి తిరగడం అసలే లేదు.ఎంతో హుందాగా,గౌరవపధంగా నడిచింది.

    నేటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ఉంది.

    ఇక కట్ చేసి కథలోకొస్తే...

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ప్రాజెక్ట్ పనిమీద బయటికి క్యాంప్ కి వెళ్లుంది.ఒకరోజు బాత్ రూం లో స్నానం చేస్తుంటే...ఆ అమ్మాయికి తెలియకుండా ఓ రాక్షసుడు సెల్ కెమెరాతో వీడియో తీసి తర్వాత క్యాంపు నుండి తిరిగి వచ్చిన అమ్మాయి ఊరెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

    వాడొక ఐ.జి కొడుకు...తల నిండా పొగరు.

    ఒకరోజు నైట్ తనతో గడపక పోతే ఆ వీడియో Youtube లో Upload చేస్తానని బెదిరిస్తాడు.

    అమ్మాయి బెదిరిపోతుంది.విపరీతంగా భయపడిపోతుంది.
 
    ఆరోజు రాత్రి అతను రమ్మన్న చోటుకి వెళ్తుంది.వీడు కూడా అదే చోటుకి వెళ్లినప్పుడు అక్కడ ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా వుంటుంది.

    వీడికి కోపం రగిలిపోతుంది.

    తల్లికూతుర్లిద్దరూ ఎంతో ప్రాధేయపడతారు.ఆ వీడియో ఇచ్చేయమని బ్రతిమిలాడుకుంటారు.

    అయినా ఆ రాక్షసుడు వినడు.వాడికి మనస్సుంటేనే గదా!

    తన కూతురి జీవితాన్ని...పాడు చేయవద్దని...కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న తల్లి ఒంటిపై చేతులేసి..."నీ కూతుర్ని వదిలి పెడతాను.నీవు నాతో ఈ నైట్ గడుపు"అంటాడు.అంతే..వాడి తలపై బలమైన దెబ్బ...ఆ అమ్మాయి కట్టె తీసుకుని వాడి తలపై కొడుతుంది.ఆ ఒక్క దెబ్బ బలంగా తగిలి అక్కడికక్కడే కూలబడి చనిపోతాడు.ఆ తరువాత వాడి బాడీని తల్లీకూతుర్లిద్దరూ...గోతిలో పూడ్చేస్తారు.

    ఆ కుటుంబాన్ని ఎలా ఆ కేస్ నుండి రక్షించాలా అని ఆ అమ్మాయి తండ్రి చేసే ప్రయత్నాలే సినిమా అంతా!

    ఇందులో గమనించాల్సిన ఓ  పేక్షకుడి ఫీలింగ్ ఏమిటంటే...

    ఆ కుటుంబం ఆ కేస్ నుండి తప్పించుకోవడానికి ఆడే నాటకం ఏ పేక్షకుడికి తప్పు అనిపించదు.ఎందుకంటే ఆ దుర్మార్గుడి వారి పట్ల ప్రవర్తించిన తీరు ...వీళ్లు కేసునుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు,నాటకాలను సమర్ధిస్తాయి.ఉద్దేశ్యపూర్వకంగా చేయని ఆ హత్యనుండి తప్పించుకోవడానికి ఈ కుటుంబం చేసేదంతా రైటే అనిపిస్తుంది.

    నా దృష్టిలో అయితే...కరెక్ట్ కూడా..

    ఆ అమ్మాయి తనకు జరిగిన విషయం గురించి తల్లికి చెప్పడం గొప్ప విషయం!ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.ఈ సినిమాలో అమ్మాయి అలా చెయ్యలేదు.తల్లికి చెప్పి గొప్ప పని చేసింది.

   మరొక విషయమేమిటంటే ఆ అమ్మాయి తండ్రికి ఆ కేస్ ను ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు త్రాగించేంత తెలివితేటలు..అతను ఎక్కువుగా అతని కేబుల్ ఆఫీసులో సినిమాలు చూడటం వలనే వచ్చాయి.సినిమాలు మనిషికి ఇన్ని తెలివితేటలు కల్గిస్తాయా?అదీ మంచిగా అనేది నాకైతే పెద్ద సందేహమే!

   ఏది ఏమైనా!సినిమా చాలా బాగుంది.ఆ అమ్మాయి తల్లిదండ్రులుగా మీనా,వెంకటేశు నటించారు.గొప్ప విషయమేమిటంటే...మీనాగారు అచ్చు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా, ఓ చక్కని భార్యగా..హుందాగా నటించిన తీరు చూస్తే...అబ్బో నాకు కూడా ఓ మంచి సంప్రదాయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది.బ్యాచ్ లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనిపించింది.

8 వ్యాఖ్యలు:

 1. దృశ్యం బాగుంది. మీ రివ్యూ బాగుంది. వెంకటేష్ పాత్ర తన కుటుంబాన్ని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో తన కొడుకు కోసం నదియా పాత్ర చట్టాన్ని అంతే దుర్వినియోగం చేస్తుంది. నిజజీవితంలో వెంకటేష్ లా ఉండడం అరుదు. కానీ నదియా కంటే ఘోరంగా పోలీస్ పాత్ర ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఏమైనా ఈ సినిమా మంచి స్పూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు. డైర్క్షన్ ఎక్కడా అతి అనిపించకుండా ఆద్యంతం ఆసక్తికరంగా తీశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాతజులై 29, 2014

   చక్కటి స్పందన...బాగుంది సర్.మీలాంటి పెద్దలు నా బ్లాగుకొచ్చి స్పందించడం నాయొక్క అదృష్టం.నాకు ఎక్కడలేని ప్రొత్సాహం.కృతజ్ఞుడ్ని.

   తొలగించు
 2. చందమామ కథలు కూడా చూడండి. నాకైతే బాగా నచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాతజులై 29, 2014

   నిజానికి నేను సినిమాలు చూడటం చాలా అరుదు.మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా చూసే ప్రయత్నం చేస్తాను సర్!మీ స్పందనకు కృతజ్ఞతలు.

   తొలగించు
 3. మీరు రాసింది చదివాక నాక్కూడా ఈ మూవీ చూడాలనిపిస్తుంది.. చక్కటి భారతీయ సంప్రదాయం గల అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలనుకున్నందుకు మీకు అభినందనలు. పెళ్ళికి మేము కూడా నాలుగు అక్షింతలు వేస్తాము.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాతజులై 29, 2014

   తప్పక చూడండి.నా పెళ్లికి మిమ్మల్ని తప్పకుండా పిలుస్తానండోయ్...త్వరలోనే అక్షింతలు వేసే రోజులొస్తాయి.మీ ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు సర్.

   తొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.