17, జులై 2020, శుక్రవారం

జీవితంలో ప్రశాంతత


ప్రతిక్షణం...పరుగు...
ఏ క్షణంలో అయినా కాలంతో పయనమే..
ఇలాంటి జీవిత పరుగు పందెంలో మనిషి ఎంతవరకు ప్రశాంతంగా ఉండగలడు?
ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచించండి...అందుకే ప్రశాంతంగా ఉండాలంటే ఏంచేయాలో తెల్సుకోవాలి.తెల్సుకుని ఆచరణలో పెట్టి జీవితాన్ని ప్రశాంత నిలయంగా మలచుకోవాలి.

భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకోవాలి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రత్యేక పరిశోధనలలో ఆధ్యాత్మిక చింతన,భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నవారు...జీవితంలో ఎలాంటి కష్టాలు సంభవించినా వాటిని సమర్ధవంతంగా ఎదురుకున్నారని..
మానసికంగా ఆరోగ్యకరంగా వీరెలాంటి వైకల్యాలకు గురి కాలేదని ఋజువయింది.కష్టం,సుఖం..పరిస్థిథి ఏదయినా భారం భగవంతునిపై వేసే ఆధ్యాత్మికతత్వం మీలో ఉంటే...
మీ జీవితనావ ..ఎంత పెనుతుఫానులో చిక్కుకున్నా మీ మనసు మాత్రం ప్రశాంతంగా శాంతగంభీరంగా ఉండగలుగుతుంది.ఈ రోజు నుంచే ఈ అలవాటు చేసుకొండి.దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదు...ఈ నిజాన్ని గుర్తుంచుకుని భారమంతా భగవంతునిపై వేసి ప్రశాంతంగా బ్రతుకు రధాన్ని దొర్లించటం అలవరచుకొండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.