28, జులై 2014, సోమవారం

ఈ రోజుల్లో ఇంతమంచి సినిమా ఇదేనేమో!

ఒకరోజు నా ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దృశ్యం సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు.పెద్దగా సినిమాలు చూడని నేను ఆరోజు ఆ సినిమా చూసాను.సినిమా చాలా బాగుంది.సైలెంట్ గా,ధ్రిల్లింగ్ గా సస్పెన్స్ కధనంతో ఆసాంతం మనిషిని కట్టి పడేసింది.
 
    బహుశా ఈరోజుల్లో ఇంతటి మంచి సినిమా రావడం ఇదే  మొదటిసారనుకుంటా!
 
    సినిమాలో అశ్లీలం లేదు.బట్టలూడదీసి తిరగడం అసలే లేదు.ఎంతో హుందాగా,గౌరవపధంగా నడిచింది.

    నేటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ఉంది.

    ఇక కట్ చేసి కథలోకొస్తే...

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ప్రాజెక్ట్ పనిమీద బయటికి క్యాంప్ కి వెళ్లుంది.ఒకరోజు బాత్ రూం లో స్నానం చేస్తుంటే...ఆ అమ్మాయికి తెలియకుండా ఓ రాక్షసుడు సెల్ కెమెరాతో వీడియో తీసి తర్వాత క్యాంపు నుండి తిరిగి వచ్చిన అమ్మాయి ఊరెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

    వాడొక ఐ.జి కొడుకు...తల నిండా పొగరు.

    ఒకరోజు నైట్ తనతో గడపక పోతే ఆ వీడియో Youtube లో Upload చేస్తానని బెదిరిస్తాడు.

    అమ్మాయి బెదిరిపోతుంది.విపరీతంగా భయపడిపోతుంది.
 
    ఆరోజు రాత్రి అతను రమ్మన్న చోటుకి వెళ్తుంది.వీడు కూడా అదే చోటుకి వెళ్లినప్పుడు అక్కడ ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా వుంటుంది.

    వీడికి కోపం రగిలిపోతుంది.

    తల్లికూతుర్లిద్దరూ ఎంతో ప్రాధేయపడతారు.ఆ వీడియో ఇచ్చేయమని బ్రతిమిలాడుకుంటారు.

    అయినా ఆ రాక్షసుడు వినడు.వాడికి మనస్సుంటేనే గదా!

    తన కూతురి జీవితాన్ని...పాడు చేయవద్దని...కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న తల్లి ఒంటిపై చేతులేసి..."నీ కూతుర్ని వదిలి పెడతాను.నీవు నాతో ఈ నైట్ గడుపు"అంటాడు.అంతే..వాడి తలపై బలమైన దెబ్బ...ఆ అమ్మాయి కట్టె తీసుకుని వాడి తలపై కొడుతుంది.ఆ ఒక్క దెబ్బ బలంగా తగిలి అక్కడికక్కడే కూలబడి చనిపోతాడు.ఆ తరువాత వాడి బాడీని తల్లీకూతుర్లిద్దరూ...గోతిలో పూడ్చేస్తారు.

    ఆ కుటుంబాన్ని ఎలా ఆ కేస్ నుండి రక్షించాలా అని ఆ అమ్మాయి తండ్రి చేసే ప్రయత్నాలే సినిమా అంతా!

    ఇందులో గమనించాల్సిన ఓ  పేక్షకుడి ఫీలింగ్ ఏమిటంటే...

    ఆ కుటుంబం ఆ కేస్ నుండి తప్పించుకోవడానికి ఆడే నాటకం ఏ పేక్షకుడికి తప్పు అనిపించదు.ఎందుకంటే ఆ దుర్మార్గుడి వారి పట్ల ప్రవర్తించిన తీరు ...వీళ్లు కేసునుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు,నాటకాలను సమర్ధిస్తాయి.ఉద్దేశ్యపూర్వకంగా చేయని ఆ హత్యనుండి తప్పించుకోవడానికి ఈ కుటుంబం చేసేదంతా రైటే అనిపిస్తుంది.

    నా దృష్టిలో అయితే...కరెక్ట్ కూడా..

    ఆ అమ్మాయి తనకు జరిగిన విషయం గురించి తల్లికి చెప్పడం గొప్ప విషయం!ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.ఈ సినిమాలో అమ్మాయి అలా చెయ్యలేదు.తల్లికి చెప్పి గొప్ప పని చేసింది.

   మరొక విషయమేమిటంటే ఆ అమ్మాయి తండ్రికి ఆ కేస్ ను ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు త్రాగించేంత తెలివితేటలు..అతను ఎక్కువుగా అతని కేబుల్ ఆఫీసులో సినిమాలు చూడటం వలనే వచ్చాయి.సినిమాలు మనిషికి ఇన్ని తెలివితేటలు కల్గిస్తాయా?అదీ మంచిగా అనేది నాకైతే పెద్ద సందేహమే!

   ఏది ఏమైనా!సినిమా చాలా బాగుంది.ఆ అమ్మాయి తల్లిదండ్రులుగా మీనా,వెంకటేశు నటించారు.గొప్ప విషయమేమిటంటే...మీనాగారు అచ్చు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా, ఓ చక్కని భార్యగా..హుందాగా నటించిన తీరు చూస్తే...అబ్బో నాకు కూడా ఓ మంచి సంప్రదాయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది.బ్యాచ్ లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనిపించింది.

27, జులై 2014, ఆదివారం

ఆంధ్ర,తెలంగాణ వాళ్లు ఎప్పటికీ అన్నదమ్ములే!

ఆంధ్ర,తెలంగాణ వాళ్లు ఎప్పటికీ తెలుగుజాతి ముద్దుబిడ్డలే!తోడబుట్టిన అన్నదమ్ములే!వారి మధ్య వున్న బంధాన్ని ఎప్పటికీ విడదీయలేరు.కాని...కొన్ని రాజకీయ శక్తులు వీళ్ల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టింది.
   తెలంగాణ వేరైంది!మంచిదే.నేనైతే ప్రత్యేక తెలంగాణ నినాదానికి ఎప్పటికీ వ్యతిరేకిని కాను.ఎందుకంటే మేము వేరైపోయి మా తెలంగాణను ఇంకా సస్యశ్యామలం చేసుకుంటాం.అభివృద్ధి పధంలోకి నడిపించుకుంటాం!అంటున్నారు కాబట్టి విడిపోవడం మంచిది.
  ప్రాంతీయ అభివృద్ధే దేశ అభివృద్ధికి మూలం అని నమ్మేవాళ్లలో నేనూ ఒకడ్ని.
  విడిపోయాం...కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా పరిష్కారాలు చూసుకుని ఆంధ్ర,తెలంగాణాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాల్సిన బాధ్యత,అవసరం,ఆవశ్యకత ఈ రాజకీయవేత్తలపై ఉంది.
      కానీ...
  • ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టేలా..వ్యాఖ్యానించడాలు,రెచ్చగొట్టే ధొరణిలో మాట్లాడటాలు ఎంతవరకు న్యాయం?
  • కేవలo ప్రాంతాలను విడదీయడమే కాకుండా, మనుషులను కూడా వేరుపర్చాలనా?
  • ఆంధ్రా,తెలంగాణలను మరొక ఇండియా,పాకిస్తాన్ ల మాదిరిగా మార్చేయలనా?
  • తెలంగాణలో కొన్ని అల్లరిమూకలు అక్కడున్న ఆంధ్రావాళ్లను టార్గెట్ చేయడం,వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం పద్ధతేనా?
  • అక్కడే పుట్టి,అక్కడే పెరిగి చదువుకుంటున్న అమాయక విధ్యార్ధులను ఏవేవో చట్టాలు చేసి బయటికి తోలడానికి సన్నాహాలు చేయడం,ఏవిధమైన సహాయాలు చేయకుండా నిరోధించాలనుకోవడం ఎంతవరకు సబబు?

  పరిస్థితి గమనిస్తుంటే...ఇన్నీ చేస్తున్న మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రిగారైన కె.సి.యార్ గారిని కూడా ఏదో రోజున నీవు కూడా పూర్తి తెలంగాణ వాడివి కాదంటూ బయటికి తోలేస్తారేమో అనిపిస్తుంది.

26, జులై 2014, శనివారం

పూర్తిగా చెడిపోతున్న కాలేజీ అమ్మాయిలు!

ఈ రోజు అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంది.Boy Friend లేని అమ్మాయిలు లేరు.అలాగే Girl Friend లేని అబ్బాయిలు లేరు. (బహుశా కొంతమంది జెన్యూన్ అబ్బాయిలు,అమ్మాయిలు ఉండొచ్చు!నా అభిప్రాయం వారికి వర్తించదు)
        కట్ చేస్తే...
        నేను ఒక ప్రాంతానికి వర్కు నిమిత్తం వెళ్లి,అక్కడ రూం అద్దెకు తీసుకుని ఉన్నాను.నేను 8నెలలు ఉండాల్సి వచ్చిందిలెండి.నా పక్క ఫోర్షన్ లో మరో నాలుగు గదులున్నాయి.వాటిలో కాలేజీ స్టూడెంట్స్ ఉంటున్నారు.
        నేను వాళ్లను దగ్గర నుండి గమనించింది ఏమిటంటే....
        ఖాళీ దొరికితే చాలు..గంటల తరబడి ఫోన్లు!వెటకారాలు,నవ్వులాటలు..ఒక్కటేమిటి...అన్నీ..వీళ్లు నిజంగా చదువుకునే వారేనా అనిపిస్తుంది.వాళ్లందరూ చదువుకంటే ఎక్కువ సమయాన్ని ఫోన్ల సంభాషణకు, చాటింగులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
        రాత్రుళ్లు...మరీ దారుణం..
        అమ్మాయిల రూముల్లోకి స్వయంగా అబ్బాయిలు వచ్చి రాత్రంతా గడిపేసి వెళ్లిపోతున్నారు.కొంతమంది అమ్మాయిలైతే మరీ దారుణం వారే రాత్రి సమయాల్లో తమ,తమ Boy Friend రూములకు వెళ్లిపోతున్నారు.
        పెళ్లి కాకుండా ఇంత బరి తెగింపా?
        నాకు ఇదంతా ఏదోలా అనిపించింది.ఒళ్లు గగుర్పొడుస్తుంది.
        ఇలాంటి వారిని ఏమి చెయ్యాలి?
        ఎంతో కష్టపడి...చెమటోడ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం వారికి తమ,తలకి మించిన భారాన్ని మోస్తూ చదివించుకుంటున్న మధ్యతరగతి తల్లిదండ్రుల పిల్లలే అక్కడ ఎక్కువమంది ఉన్నారు.
        ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో..?
        ఇది ఒక ప్రాతంలోనే కాదు.అన్ని ప్రాంతాలలో ఇలాగే తగలబడింది.
        అబ్బాయిలైతే దులుపుకుపోతారు.మరి అమ్మాయిల పరిస్థితి? రేపు పెళ్లి చేసుకున్న వాడిని దారుణంగా మోసం చేయడమే కదా!రేపు గతం తాలుకు విషయాలు తప్పక తెల్సిపోతాయి.అప్పుడు వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో..ఊహించడమే కష్టంగా వుంది.
        లక్షణంగా చదువుకోవల్సిన అమ్మాయిలు..తమ చేజేతులా ఆవిరైపోతుంటే ఆవేదనగా వుంది.
        పాపం! తల్లిదండ్రులకు ఇవేవీ తెలియడం లేదు.తమ పిల్లలు మంచిగానే ఉన్నారనే భ్రమలో ఉంటున్నారు.ఈ పిల్లలు అలా నమ్మిస్తున్నారు వారిని.
        ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేదేమిటంటే...
        మీ పిల్లలపై నిఘా పెట్టండి.ఇది వారి భవిష్యత్ మంచికోసమే.బయటి వాళ్లు నిఘా పెడితే తప్పుగాని..మీరు గమనించడంలో తప్పు అస్సలు లేదు.
        ఒకవేళ వారి ప్రవర్తన బాగులేకపోతే వెంటనే పెళ్లిళ్లు చేసేయండి!అమ్మాయిల విషయంలో అయితే మరీ తొందరపడటం మంచిదని నా అభిప్రాయం.దీనికి మీరేమంటారు?

24, జులై 2014, గురువారం

మనం ఈ తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లను ఆదరిస్తున్నామా?

తెలుగు బ్లాగులను ప్రతిరోజూ ఏదో ఒక టపాతో అప్ డేట్ చెయ్యకపోతే వాటికి అడ్రస్ లేకుండా పోతుంది.వాటిని తెలుగు ప్రజలకు చేరవేసే అగ్రిగేటర్లు కొన్ని మాత్రమే ఉన్నాయి.వాటిలో మొదటి స్థానంలో కూడలి ఉంటే తరువాతి స్థానంలో మాలిక, ఆపై బ్లాగిల్లు,జల్లెడ ఉన్నాయి.ఇవే కాకుండా మరికొన్ని బ్లాగ్ ప్రపంచం,బ్లాగ్ వేదిక,పూదండ వంటివి కూడా ఉన్నాయి.వీటన్నింట్లో మాలిక మాత్రం అమిత వేగం కలది.పోస్ట్ చెయ్యడం తరువాయి వెంటనే మాలికలో ప్రచురించబడుతుంది.కూడలి,బ్లాగిల్లు మాత్రం కొద్ది సమయాన్ని తీసుకుంటాయి.ఇవి చేసే సేవ చాలా గొప్పదనే చెప్పాలి.ఎటువంటి ఆదాయం లేకుండా తెలుగు బ్లాగుల లోకానికి ఎనలేని సేవ చేస్తున్నాయి.కాని దారుణమేమిటంటే ఈ అగ్రిగేటర్లను ఉపయోగింకుంటూ వాటి లోగోలను తమ బ్లాగుల్లో ముద్రించుకోని బ్లాగర్లు నూటికి 95% మంది ఉన్నారు.వారు చేసే ఉచిత సేవ అందుకుంటూ వారికి మద్దతు ఇవ్వకపోవడం చాలా దారుణం కదూ?

16, జులై 2014, బుధవారం

ఒక ముస్లిం [విశ్వాసి]ఈ రెండు విధులనూ నిర్వర్తించకపోతే కఠినశిక్షే!


విశ్వాసి అయిన ప్రతి వ్యక్తీ రెండు విధులను నిర్వర్తించవలసి ఉందని అల్లాహ్ నిర్దేశించి ఉన్నాడు.వాటిలో మొదటి విధి 'దైవధర్మ అనుసరణ".దీనినే షరియత్ పరిభాషలో 'ఇత్తెబాయె ఇస్లాం"అని అంటారు.రెండవ విధి 'దైవధర్మ ప్రచారం దీనిని 'ఇషాయతె ఇస్లాం"అని అంటారు.ఈ రెండు విధులనూ సమాంతరంగా నిర్వర్తించవలసి ఉంది.మొదటి విధిని నిర్వర్తించి, రెండవ విధిని నిర్వర్తించక పోతే ఏ విధమైన ప్రయోజనమూ లేదు అన్న దానికి ఆధారంగా ఈ క్రింది ఖురాన్ వాక్యాలను గమనించగలరు.

    ఇంకా వారికి ఈ విషయం గుర్తు చేయి.వారిలోని ఒక వర్గం వారు మరొక వర్గంవారితో ఇలా అన్నారు: 'మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ నాశనం చెయ్యనున్న వారికి లేక కఠినంగా శిక్షించునున్న వారికి?..ఖురాన్ 7:164

  పై వాక్యాలను కాస్త నిశితంగా గమనిస్తే వాటిలో మూడు వర్గాలు కనిపిస్తాయి. అవి:
 
1.హితబోధ చేస్తున్న వర్గం.
2.హితబోధ చేస్తున్న వారిని వారిస్తున్న వర్గం.
3.హితబోధ చేయబడే వర్గం.

  మొదటి వర్గం ధర్మానుసరణ [ఇత్తెబాయె ఇస్లాం] మరియు ధర్మప్రచురణ [ఇషాయతె ఇస్లాం] అన్న రెండు విధులను కూడా చేస్తున్న వర్గం.

  రెండవ వర్గం అయితే అటు ధర్మప్రచురణ [ఇషాయతె ఇస్లాం] చేయక కేవలం ధర్మ అనుసరణ [ఇత్తెబాయె ఇస్లాం] అన్న ఒక్క విధిని మాత్రమే చేస్తున్న వర్గం.

  మూడవ వర్గం అయితే అటు ధర్మ అనుసరణ మరియు ఇటు ధర్మ ప్రచురణ అనే రెండు విధులనూ చేయని వర్గం అనగా తిరస్కార వర్గం.

  అయితే ఒకరోజు దైవశిక్ష అవతరించింది.ఆ శిక్ష నుండి ఎవరు రక్షించబడ్డారు? మరియు ఎవరు దానికి బలి అయ్యారు? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.

                                                                              More read

13, జులై 2014, ఆదివారం

వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?

 నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,ఆవులు ఇతర జంతువులు బలి అర్పిస్తూ ఉండేవారు.యజ్ఞాలలో అర్పించబడిన జంతువులను వారు భుజిస్తూ ఉండేవారు.

స్వామి భాస్కరానందగారి మాటల్లో....

    స్మృత్యనుసారంగా ఆనాటి వారికి కొన్ని జంతువుల మాంసం నిషేధం కాదు.మాంసాహారమంతగా నిషిద్ధం కాకపోయినా మనువు శాకాహారమే జీవహింస దృష్ట్యా శ్రేష్టమన్నాడు.మాంసాహారం తీసుకోవడం పాపమేమీ కాదు.కానీ తినకపోవడం ఎంతో మంచిది.ఏ ఆహారమైనా,మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి.వేదకాలం నాటి ఆర్యులు గోమాంసం భక్షకులా?కాదా? అన్న మీమాంస ఒకటి ఉన్నదివారు తినారన్నది సత్యమే.కానీ పాలిచ్చే ఆవులనెన్నడూ వారు చంపలేదు.ఆవును ఆఘ్న్యా అనేవారు.అంటే చంపకూడదని దీని అర్ధం.ఎడ్లు, లేతదూడలు,గొడ్డుబోతు ఆవులను మాత్రమే తినేవారు.ఆవుమాంసం తినకూడదన్న సంప్రదాయం చాలా ఇటీవల కాలంలో వచ్చింది.దీనికి కారణం జైనమతమని కొoదరంటారు.
                                                - స్వామి భాస్కరానంద [హిందూమత సారాంశం 58,59]

                                                                                  Read more10, జులై 2014, గురువారం

'త్రిత్వ"వాదం మరియు ;యేసు దైవత్వ"వాదం యేసు అనంతరమే క్రైస్తవంలో ప్రవేశపెట్టబడ్డాయా?

యేసు దేవుడని లేక 'తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటేన"ని ఏ ప్రచారమైతే నేడు క్రైస్తవంలో జోరుగా సాగుతుందో అది,యేసు సువార్తకు ఏమాత్రం సంబంధం లేని అన్య విశ్వాసాలని చెప్పటానికి బలమైన ఆధారం వీటిని నిరూపించే ఎటువంటి రుజువులూ పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో ఇసుమంతైనా లేకపోవడమే!!మొత్తానికి యేసు దైవత్వాన్ని ఏదో విధంగా నిరూపించాలనుకున్న ప్రయత్నంలో భాగంగా అన్యుల నుండి తెచ్చుకున్నదే ఈ త్రిత్వదైవత్వపు వాదం.

     క్రైస్తవంలో యేసు దైవత్వ సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరు?దేవుడా?అన్యుడా?

  ఇక యేసు దైవత్వపు సిద్ధాంతం సైతం యేసు అనంతరం 325వ సంవత్సరంలో విగ్రహారాధకుడైన బాప్తిస్మం పొందని అన్య రోమన్ చక్రవర్తి   'కైసర్ ఫ్లావిస్ కాన్ స్టన్ టైన్" ఆధ్వర్యంలో జరిగిన నైసియా సభలో నాడు క్రీస్తు బోధించిన 'పరిశుద్ధ ఏక దైవ ఆరాధనా విశ్వాసంలో ఈ అపరిశుద్ధ అనేక దైవారాధన విశ్వాసం"యుక్తిగా చొప్పించబడిందని క్రైస్తవ చరిత్రకారులు ఏకరువుపెడుతున్నారు.

  'బాప్తిస్మం తీసుకొనని ఈ చక్రవర్తే నైసియా సభకు అధ్యక్షత వహించి దేవుడు [యెహోవా]మరియు యేసు ఒకేసారం కలిగి ఉన్నారనే విశ్వాసాన్ని ప్రతిపాదించటంలో ప్రధాన పాత్ర వహించాడు.   -ది ఎన్ సైక్లోపిడియా బ్రిటానికా

     క్రైస్తవంలో త్రిత్వ సిద్ధాంతం ప్రవేశ పెట్టింది ఎవరు?
                                                                                 Read more

9, జులై 2014, బుధవారం

బ్లాగ్ వేదిక మరో విజయం.

ఇప్పటివరకూ బ్లాగ్ వేదికలో 300 తెలుగు బ్లాగులు అనుసంధానించబడ్డాయి.ప్రముఖ అగ్రిగేటర్లకు ఇంచుమించు తక్కువ కాకుండా బ్లాగ్ వేదిక రూపాంతరం చెందింది.ఎన్నో శీర్షికలు రూపొందించింది.ఇంకా మరెన్నో ఫీచర్స్ రానున్నాయి కూడా.త్వరలో బ్లాగ్ యాడ్స్ ద్వారా తెలుగు బ్లాగర్లకు కొద్దో,గొప్పో ఆదాయాన్ని సమకూర్చే విధానం కూడా ప్రవేశపెట్టనుంది.ఇవే కాకుండా ఇంగ్లీష్ బ్లాగుల పోర్టల్ కూడా అందించనుంది.దానితో పాటు ప్రతి సబ్జెక్ట్ మీద బ్లాగులను వేరు పరచి బ్లాగు వీక్షకులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేయనుంది.
       
        బ్లాగు క్రియేట్ చేయాలన్నా,టెంప్లేట్ మార్చాలన్న,ఏవిధమైన సమాచారమైనా బ్లాగ్ వేదికలో దొరికే ఏర్పాటు చేయనుంది.

        బ్లాగ్ వేదిక ప్రవేశ పెట్టిన శీర్షికలలో 'బ్లాగర్ల పరిచయాలు 'ప్రత్యేకమైనది.ఎందుకంటే ప్రతి బ్లాగరును తెలుగు ప్రజలకు తెలియచేయటం ప్రధాన ల్క్ష్యంగా కొనసాగుతుంది.దీని నిమిత్తం Facebook, twitter లాంటి సోషల్ సైట్ల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది.
        ఇలా..ఎన్నో...మరెన్నో శీర్షికలు,ఫీచర్లు త్వరలో రానున్నాయి.
        మీరు కూడా ఓ మంచి బ్లాగరైతే ఈ క్షణమే మీ బ్లాగును బ్లాగ్ వేదికతో అనుసంధానించండి.
                                           
                                              మీ
                                         బ్లాగ్ వేదిక టీం

                                 http://blogvedika.blogspot.in/
                                              

7, జులై 2014, సోమవారం

దివ్య ఖుర్'ఆన్ తెలుగులో

దివ్యగ్రంధం ఖుర్ ఆన్ తెలుగులో ప్రారంభించబడింది.ప్రతిరోజూ కొద్ది,కొద్దిగా మీకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుంది.ఖుర్ ఆన్ యొక్క గొప్పతనం అది అధ్యయనం చేసే వారికే తెలుస్తుంది.దాని గొప్పతనం వర్ణించలేనిది.ఈరోజు అత్యధిక ముస్లిం సమాజం ఉన్నతమైన స్థితిలో లేదు అంటే దానికి ప్రధానకారణం ఖుర్ ఆన్ యొక్క ఆదేశాలను పెడ చెవిన పెట్టడమే.

                            ఖుర్ ఆన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

4, జులై 2014, శుక్రవారం

యేసువారు నిజంగానే పునరుత్థానుడా?

యేసువారు పాపులకోసం చనిపోయి మూడవదినమున లేచి పునరుత్థానము చెందడం వాస్తవమేనా? మీరు కూడా చదవండి.పరిశీలించండి.      Read More