28, జూన్ 2014, శనివారం

ఓ చిన్న శుభవార్త

ప్రియమైన బ్లాగ్ రీడర్లకు ఓ చిన్న శుభవార్త.ఇకనుండీ వెన్నెలకెరటం బ్లాగ్ పత్రికను నడిపించాలని సంకల్పించాము.దీనికొరకు మీ సహాయసహకార్యాలు మాకు కావాలి.దయచేసి ఈ పత్రికను ముందుకు నడిపించడానికి కావల్సిన ప్రోత్సాహాన్ని అందించవల్సిందిగా కోరుచున్నాము.

                       మీ సహాయసహకార్యాలు కోరుకుంటూ....
                             
                                    మీ
                             వెన్నెలకెరటం ఎడిటర్

                     http://vennelakeratam.blogspot.in/  

23, జూన్ 2014, సోమవారం

2.యేసు దేవుడా?

తనను ఒకడు పంపితేనేగాని ఈ లోకానికి రాలేని యేసు దేవుడు ఎలా కాగలరు?

    యేసు నిజంగా దేవుడే అయివుంటే ప్రజలకు ప్రత్యక్షమవటం,అవ్వకపోవడం అన్నది ఆయన స్వీయ అభీష్టం ప్రకారమే జరగాలి.ఎందుకంటే దేవుడనేవాడు 'సర్వస్వతంత్రుడై' ఉంటాడు.'పరతంత్రుడై' ఉండేవాడు దేవుడు ఏమాత్రం కాలేడు.ఈ విషయంలో యేసును 'ఓ యేసూ!మీరు స్వయంగా ఈ లోకానికి వచ్చారా?లేక మిమ్మల్ని ఎవరైనా పంపించారా?'అని ప్రశ్నిస్తే యేసు స్వతహాగా ఇచ్చే సమాధానం ఏమిటో ప్రత్యక్షంగా చూడండి.

...నేను దేవుని[యెహోవా] యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను,నా అంతట నేనే వచ్చి యుండలేదు,ఆయన నన్ను పంపెను. -యోహాన్:8:42

   తన అభీష్టంతో ఈ లోకానికి రాలేదని యేసు స్వయంగా చెబుతున్న పై వాక్యాలనిటి ద్వారా అర్ధమవుతుంది.మరెలా వచ్చారు?సర్వశక్తిగల దేవుడైన యెహోవా పంపగా వచ్చారు.ఒకవేళ యేసు యెహోవా వంటి దేవుడే అయి వుంటే స్వతహాగా రావాలి.ఒకరు పంపితే వచ్చేవాడు దేవుడు ఎలా కాగలడు?

కనీసం తన సొంత బోధ చేయలేని యేసు దేవుడు ఎలా కాగలడు?

    అందుకు యేసు-నేను చేయుబోధ నాదికాదు;నన్ను పంపిన తండ్రిదే. -యోహాన్: 7:16
    నన్ను పంపినవాడు సత్యవంతుడు,నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.  -యోహాన్ 8:26
    ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు.నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ణ యిచ్చియున్నాడు. -యోహాన్ 12:49
 
    పైవాక్యాలన్నిటి ప్రకారం యెహోవా దేవుడు ఆదేశించిన దానిని తప్ప యేసు సొంతంగా మాటలాడే కనీస అర్హతను సైతం కలిగిలేరని స్వయంగా ఆయన చేస్తున్న బోధనల ద్వారానే తెలుస్తుంది.అటువంటప్పుడు యేసు దేవుడు ఎలా కాగలరు?
                                                             దీనికి ముందు పేజీ చదవండి         ఇంకా వుంది

                                                                   More Blog information

మీ బ్లాగు Speed Up అవ్వాలనుకుంటున్నారా?ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
http://techclubinworld.blogspot.in/

20, జూన్ 2014, శుక్రవారం

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

7, జూన్ 2014, శనివారం

యేసు దేవుడా?

కనీసం స్వీయ జీవశక్తి లేని యేసు దేవుడు ఎలా కాగలరు?
       జీవముగల తండ్రి[యెహోవా]నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే...    -యోహాన్ 6:57
       మీ జీవము ఎవరిది?అని ప్రశ్నిస్తే 'నా జీవము నా తండ్రి ప్రసాదితం' అని యేసు సమాధానం ఇస్తున్నారు.అంటే నా స్వీయ జీవశక్తితో నేను జీవించటం లేదు అనేకదా!యేసు-'నా తండ్రి మూలముగా జీవిస్తున్నాను ' అని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆయన ఈ క్రింది యధార్ధాన్ని తెలుసుకున్నారు.ఏమిటి ఆ యధార్ధం?
       యెహోవాయే నిజమైన దేవుడు,ఆయనే జీవముగల దేవుడు,సదాకాలము ఆయనే రాజు.    -యిర్మియా 10:10
       కనుక ఈనాటి అధికశాతం క్రైస్తవ పండితులు చేసే యేసు దేవుడు అనే వాక్య విరుద్ధ అబద్ధ ప్రచారాన్ని నమ్మక, యేసు పరిచయం చేస్తున్న స్వీయ జీవశక్తిని కలిగియున్న యెహోవానే నిజమైన దేవునిగా నమ్ముకోండి.కనీసం జీవశక్తి లేకుండా,మరొకనిపై ఆధారపడి ఉన్న యేసు ఎలా దేవుడు కాగలరు?
                                                                                  Next Page

1, జూన్ 2014, ఆదివారం

"మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-3

హిందువులారా దీనిని తప్పక చదవండి,చదివించండి!

క్రైస్తవమతం ముసుగులో పాశ్చాత్య విష సంస్కృతి ప్రచారం!? 


బైబిల్ ప్రకారం- నిత్యజీవం పొందటానికి క్రైస్తవమతం స్వీకరించవలసిన అవసరం లేదు!

     నేటి క్రైస్తవ పండితుల ప్రచారహోరును బట్టి- ఇహలోక జీవితంలో "శాంతి"-పరలోక జీవితంలో "ముక్తి"వంటి ఉభయ లోక ప్రయోజనాలు లభించాలంటే-"క్రైస్తవమతం స్వీకరించక తప్పదు"అనే ఒక అపోహకు చాలా మంది గురవుతున్నారు.ఇది "క్రైస్తవ పండితుల కాల్పనిక భావన" తప్ప బైబిల్ గ్రంధ యధార్ధం"మాత్రం కాదనే విషయాన్ని క్రింది వాక్యాలు తెలుపుతున్న వైనాన్ని గమనించగలరు.
      ఆయన [యెహోవా దేవుడు] ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమునిచ్చును.-రోమా 2:6
     పై వాక్యంలో- ప్రతివానికి"అనగా లోకంలో ఉన్న మతస్తునికైన సరే వానివాని "మతము" చొప్పున అనికాక "వానివాని క్రియల చొప్పన అన్న దానిని బట్టి-క్రైస్తవమతానికి ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టమవుతుంది.నిత్యజీవమును పొందటానికి క్రైస్తవ మత స్వీకారం ఏకైక మార్గమా?లేక మరొక మార్గం ఏదైనా ఉందా?అన్న ప్రశ్నకు క్రింది వాక్యం ఇచ్చే సమాధానం ఏమిటో గమనించగలరు.
     సత్ క్రియలను ఓపికగా చేయుచు,మహిమ,ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. - రోమా 2:7
     వాక్యాల ప్రకారం -నిత్యజీవమూను పొందటానికి క్రైస్తవ మత స్వీకారంతో ఎలాంటి సంబంధం లేకుండా,ఎవరైతే సత్ క్రియలను ఓపికగా చేస్తారో ఇంకా తన మహిమను,ఘనతను మరియు అక్షయతను అన్వేషిస్తారో అలాంటి వారికి నిత్యజీవమును ప్రసాదిస్తానని దేవుడైన యెహోవా స్వయంగా ప్రకటిస్తున్న వైనం పై వాక్యాలలో కనిపిస్తుంది."నిత్యజీవమును పొందటానికి మార్గం బైబిల్ చెబుతున్న పై విషయాలే గాని నేటి క్రైస్తవ పండితులు చెబుతున్న క్రైస్తవ మత స్వీకారం కాదని తెలుస్తుంది.
       అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును....-రోమా 2:9
      బైబిల్ గ్రంధం ప్రకారమైతే- *భేదములు పుట్టించి *సత్యమునకు లోబడక *దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమున వచ్చును"అని ప్రకటిస్తుంది.అయితే నేటి అధికశాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే -క్రైస్తవులుగా మారనివారిపై దేవుని ఉగ్రతయు రౌద్రమున వచ్చును"అని ప్ప్రకటించబడుతుంది.దీనిని బట్టి -వారి ప్రచారం బైబిల్ గ్రంధానికి  విరుద్ధమైన అసత్య ప్రచారమని తేటపడుతుంది.
      దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు,మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడ,శ్రమయు వేదనయు కలుగును. సత్ క్రియ చేయు ప్రతివానికి,మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ మహిమ ఘనతను సమాధానమును కలుగును. రోమా 2:9-10
  దుష్కార్యము చేయు ప్రతి యుని ఆత్మకు [అతడు మతవర్గం వాడైనా సరే వానికి]శ్రమయు వేదనయు కలుగును"అని పైన పేర్కొన్న బైబిల్ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది.కాని నేటి అధిక శాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే క్రైస్తవులుగా మారనివారిపై శ్రమయు వేదనయు కలుగును"అని బైబిల్ కు పూర్తి విరుద్ధంగా ప్రకటించబడుతుంది.
   అలాగే "సత్ క్రియ చేయు ప్రతివానికి [అతడు మతవర్గం వాడైనా సరే వానికి]మహిమను,ఘనతను సమాధానమును కలుగును" అని పైన పేర్కొన్న అదే బైబిల్ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది.కాని నేటి అధిక శాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే క్రైస్తవులుగా మారినవారిపై "మహిమను ఘనతను సమాధానమును కలుగును"అని బైబిలుకు పూర్తి విరుద్ధంగా ప్రకటించబడుతుంది.
      విధంగా "నిత్యజీవము" లేక "నిత్యమరణము"లను నర్ణయించేది "సత్ క్రియ" లేక "దుష్ క్రియ "అని బైబిల్ గ్రంధం చెబుతుంటే - నామకార్ధ క్రైస్తవ పండితులైతే "క్రైస్తవ మతం తీసుకోవటం" లేక "క్రైస్తవ మతం తిరస్కరించటం"అని అంటున్నారు.ఇది ఎంత దారుణమైన  వాక్య అతిక్రమణో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించగలరు.బైబిల్ గ్రంధంలో దేవుడు మతపరమైన విభజనను ఎందుకు చేయలేదు?అన్న ప్రశ్నకు క్రింది వాక్యం ఇచ్చే సమాధానం ఏమిటో చూడగలరు.
            దేవునికి పక్షపాతములేదు...... - రోమా 2:11
     అంటే నామకార్ధ క్రైస్తవ పండితులలో పక్షపాతం ఉన్నట్లే కదా!అందుకే వారు క్రైస్తవేతరులతోనే కాక స్వయంగా తమ క్రైస్తవుల మధ్య సైతం పక్షపాతాన్ని పాటిస్తూ "డినామినేషన్ల భేదము"లను పుట్టిస్తూ వీరే ఎలక్ట్రానిక్ మీడియాలో పరస్పరం దూషించుకుంటూ తమ అసలు నైజాన్ని చాటుకుంటున్నారు.
       పై అంశం వివరణను బట్టి ,బైబిల్ ప్రకారం -నిత్యజీవం పొందటానికి క్రైస్తమతం స్వీకరించవలసిన అవసరం ఏమీ లేదని సుస్పష్టమవుతుంది.

    మతమార్పిడిని నిరసిస్తున్న యేసు!
  అయ్యో,వేషధారులైన శాస్త్రులారా,పరిసయ్యులారా,ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు;అతడు కలసినప్పుడు అతనిని మీ కంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. -మత్తయి 23:15
  దుష్ క్రియలు పోయి-సత్ క్రియలు రాకపోయినప్పుడు మతం మారటం వలన ఒరిగేదేమీ ఉండదు.బైబిలుకు వ్యతిరేక బొధలు చేసే క్రైస్తవ పండితులు తమతో పాటు తమ అనుయాయులనూ నరకానికి తీసుకుపోవటం తప్ప మరేమీ చేయగలరు? విషయాన్నే పైవాక్యంలో యేసు ఎంతో ఆవేదనతో తెలుపుతున్నారు.దీనిని బట్టి యేసు కూడా క్రియాత్మకమైన మార్పును కోరుకున్నారేగాని,మతమార్పిడిని,పేరు,సంస్కృతుల మార్పునుగాని ఎన్నడూ కోరుకోలేదని బోధపడుతుంది.
    అందుకే క్రైస్తవులు కాకపోతేనే మేలని బైబిల్ గ్రంధం ప్రకటిస్తుంది!
   ఇప్పటివరకు సాగిన వాక్యపరిశీలన ద్వారా-అన్యులకు తప్ప యేసును నమ్ముకున్న క్రైస్తవులకు పాపక్షమాపణ లేదని తేలిపోయింది.అలాగే "యేసు పాపుల రక్షకుడు"కాదని కూడా తేలిపోయింది.క్రైస్తవమత స్వీకారం ద్వారా మాత్రమే కాక,దుష్ క్రియను విడిచి సత్ క్రియను ఆచరించి మతవర్గం వానికైనా "నిత్యజీవం"లభిస్తుందని తెలిసింది.కనుక క్రింది వాక్యం చెబుతున్నదేమిటో చూడగలరు.
   వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని,తమకు అప్పగింపబడిన పరిశుద్దమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుటకంటే [క్రస్తవ] మార్గం అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. -పేతురు 2:21
   ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు చిన్నపాటి పాపానికి పాల్పడకూడదు.అది ఎంత గొప్ప భక్తునికైనా సాధ్యం కాని విషయం.మనిషి అన్నాక ఎంతోకంత పాపానికి పాల్పడుతూనే ఉంటాడు.అటువంటప్పుడు క్రైస్తవ్యం గురించి తెలుసుకుంటే మేలుకంటే కీడే ఎక్కువ!అందుకే-క్రైస్తవమార్గము తెలియకపోవుటయే ప్రజలకు మేలు"అని పైవాక్యం కోరుతుంది.దీనిని బట్టి "యేసు పాపుల రక్షకుడు-క్రైస్తవ్యం రక్షణమార్గం"అని జరుగుతున్న ప్రచారం బైబిల్ గ్రంధానికి వ్యతిరేకమైన అసత్యప్రచారమని తెలుస్తుంది.

                                                          దీనికి ముందు పేజీలు :   1     2   
                                    
                                                                                           ఇంకా ఉంది...త్వరలో...

Comments here