29, మే 2014, గురువారం

"మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-2

హిందువులారా దీనిని తప్పక చదవండి,చదివించండి!

క్రైస్తవమతం ముసుగులో పాశ్చాత్య విష సంస్కృతి ప్రచారం!? 


పాపాలకు పాల్పడే క్రైస్తవులకు కక్కిన దానిని నాకే కుక్కలుగా బురదలో దొర్లు పందులుగా పేర్కొంటున్న బైబిల్ గ్రంధం
మనిషి ఎంత గొప్పవాడైనా అతని వలన చిన్న-పెద్ద పాపాలు జరగకపోవటం అసంభవం. కనుక అతనికి ప్శ్చాత్తాపం చెంది తిరిగి నిలబడే అవకాశం ఎంతైనా అవసరం. అయితే ఒకడు బాప్తిస్మం పొంది రక్షించబడినతరవాత అతడు తిరిగి కారణం చేతనైనా ఒకవేళ పాపంలో పడితే ఏమవుతాడో ఈక్రింది వాక్యంలో చూడగలరు.
      కుక్క తన వాంతికి తిరిగినట్టును,కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను.   2పేతురు2:22
       పై వాక్యాన్ని బట్టి -పాపులైన క్రైస్తవులు తమ వాంతిని తామే నాకే కుక్కలు మరియు బురదలో దొర్లే పందులు అయిపోతారు.కనీసం అన్యులుగా అంటే తిరిగి మారుమనస్సును పొదే అవకాశం ఉన్న హిందువులుగా కూడా మిగలరు.కనుక క్రైస్తవులుకావడం ఎందుకు కుక్కలు-పందులుగా మారటం ఎందుకు?అంత పెద్ద ప్రమాదంలో పడే కంటే అసలు క్రైస్తవులు కాకుండా హిందువులుగా ఉండటమే మేలుకదా! క్రింది మరొక వాక్యాన్ని గమనించగలరు.
      మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల [] పాపమునకు బలి ఇకను ఉండదు. హెబ్రీయులకు 10:26
   పైవాక్యాన్ని బట్టి పాపుల విషయంలో యేసు బలి లాభం కంటే నష్టాన్నే మిగిల్చిందని తెలుస్తుంది.యేసు బలి కంటే ముందైతే పాపులకు తమ ఎప్పటి పాపాలకు అప్పటికి బలులిచ్చి వదిలించుకునే అవకాశం ఉండేది.యేసు బలి తరువాత వారికి అవకాశం లేకుండా పోయింది.ఎందుకంటే -పాపములకు బలి ఇకను ఉండదు!" అని పాపపరిహారానికి శాశ్వతంగా ముద్ర వేసేయడం జరిగింది.క్రైస్తవులుగా మారి మానవ సహజ పాపాలు జరిగిపోయి చివరకు కుక్కలుగా పందులుగా మిగిలిపోవడం ఎందుకు?క్రైస్తవులుగా మారి పాప పరిహారపు అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయేకంటే హిందువులుగా మారి పాపపరిహారానికి ఒక అవకాశాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండటమే మంచిదికదా!
పాపులను "యేసు"రక్షిస్తారా?లేక "నీతి" రక్షిస్తుందా?
   యేసును గురించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న విషయం "పాపుల రక్షకుడు"అన్నదే. దానికీఅధారంగా చూపబడే వాక్యం -"ఇదిగో లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల"అన్నది. విషయం చదవటానికి ప్రచారం చేయటానికి ఎంతో అందంగా ఉంది.ఇంతకూ విషయం వాస్తవమేనా? అని ప్రశ్నిస్తే, క్రింది వాక్యాలు ఇచ్చే సమాధానం ఏమిటో గమనించగలరు.
   దినమందు అనేకులు నన్ను చూచి-ప్రభువా,ప్రభువా, మేము నీ నామమమును ప్రవచింపలేదా? నీ నామమమును దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమమును అనేకమైన అద్భుతములను చేయలేదా? అని చెప్పుదురు.అప్పుడు నేను-మిమ్ములను ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారులారా నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.          మత్తయి 7:23
        పై వాక్యంలో కొన్ని గమనార్హ విషయాలు ఉన్నాయి.వాటిలో -"ప్రభువా,ప్రభువా, మేము నీ నామమమును ప్రవచింపలేదా? నీ నామమమును దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమమును అనేకమైన అద్భుతములను చేయలేదా?"అని అత్యంత ఆందోళన పడుతూ యేసును ప్రశ్నించేవారు "అన్యులు"కారు."సామాన్యక్రైస్తవులు"కాదు.యేసును విశ్వసించిన క్రైస్తవపండితులే!"అన్నది అత్యంత గమనార్హమైనది.తనను ఒప్పుకున్నప్పటికీ "అక్రమకారులారా!"అని దూషిస్తూ. "నా యొద్ద నుండి పొండి"అని వారిని యేసు అత్యంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే -క్రైస్తవులను రక్షించేది యేసుకాదు.మరొకటి ఏదో ఉందని తెలుస్తుంది.అదేమిటి?అని ప్రశ్నిస్తే బైబిల్ గ్రంధం ఇచ్చే సమాధానం ఏమిటో క్రింది వాక్యములో గమనించగలరు.
...........నీతి మరణమునుండి రక్షిస్తుంది          సామెతలు 10:2
       పై వాక్యాన్ని బట్టి -రక్షణకు కేవలం యేసును "అంగీకరించడం"ఒక్కటే సరిపోదు."నీతిని కూడా కలిగి ఉండాలని తెలుస్తుంది.అందుకే యేసు,తనను "నమ్ముకున్న క్రస్తవ పండితుల"ను సైతం "అక్రమకారులారా!" అని ఘొరంగా దూషిస్తూ,"నా యొద్దనుండి పొండి!!"అని గద్దిస్తానంటున్నారు.అంటే -వారిలో క్రీస్తు ఉన్నారు కాని నీతి లేదు కనుక క్రీస్తు పేరిట మహత్కార్యాలు చేసినప్పటికి రక్షణ లేకుండా పోయింది.కనుక మనవులను రక్షించేది యేసు కాదు "నీతి"మాత్రమేనని బైబిల్ గ్రంధం ద్రారా తెలుస్తుంది.వారు మతవర్గంలో ఉన్నాసరే!
                     నిత్యజీవమునకు "క్రైస్తవులు" వెళతారా?
                    "అన్యులు" వెళతారా?
                     "నిత్యజీవమునకు "నీతిమంతులు"వెళతారా?
                     "అనీతిమంతులు"వెళతారా?
          నేటి క్రైస్తవ భొధకుల ఉద్ధృత ప్రచారమును బట్టి-"నిత్యజీవము"నకు ఒక్క క్రైస్తవులు" మాత్రమే వెళతారు.నిత్య శిక్షకు ఒక్క అన్యులు మాత్రమే పోతారని తెలుస్తుంది.అయితే బైబిల్ సువార్తను బట్టి నిత్యజీవమునకు వెళ్లేది ఎవరో మరియు నిత్యమరణమునకు పోయేది ఎవరో క్రింది వాక్యంలో చూడగలరు.
            వీరు{అనీతిమంతులు} నిత్యశ్క్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. -మత్తయి 25:46
           పైవాక్యమును బట్టి -నిత్యజీవమునకు వెళ్ళేది "నీతిమంతులే"కాని క్రైస్తవులు"కాదు.అలాగే "నిత్య శిక్షకు వెళ్ళేది అనీతిమంతులే"గాని అన్యులు కాదు.అని సుస్పష్టం అవుతుంది.ఇప్పుడు చెప్పండి పాపులు యేసును ఒప్పుకుంటే యేసు రక్షిస్తారా? లేక పాపులు "నీతి"ని ఆచరిస్తే "నీతి"రక్షిస్తుందా? "యేసు"కాదు రక్షించేది నీతే రక్షిస్తుంది!కనుక హిందువులు రక్షించబడాలంటే -నీతిమంతులుగా మారితే సరిపోతుంది క్రైస్తవులుగా మారవలసిన అవసరంలేదు.
     అందుకే-"ప్రభువా,ప్రభువా,మేము నీ నామమమును ప్రవచింపలేదా?నీ నామమమును దయ్యములను వెళ్లగొట్టలేదా?నీ నామమమును అనేకమైన అద్భుతములను చేయలేదా? అని అత్యంత ఆందొళన పడుతూ యేసును ప్రశ్నిస్తున్న క్రైస్తవ పండితులను ఉద్దేశించి "అక్రమకారులారా!"అని దూషిస్తూ "నా యొద్దనుండి పొండి!! అని యేసు గద్దిస్తున్నారు.దీనిని బట్టి -యేసును రక్షకుడిగా అంగీకరించి,క్రైస్తవులుగా మారటం వలన వారికి ఒరిగిందేమీ లేదు కదా! విధంగా క్రైస్తవులైతేనే నిత్యజీవమునకు వెళతారన్నది పచ్చి అబద్ధప్రచారమని తేలిపోయింది.                              [ దీని ముందు పేజీ చదవండి.]

                                                                            Next Page
         
                                                                        Comments Here