8, ఏప్రిల్ 2014, మంగళవారం

అనుసరిస్తే లైఫ్ స్టైలే మారిపోతుంది.

* నీ విజయసాధనంలో వెయ్యిసార్లు విఫలమైన మరోసారి ప్రయత్నించు.
* అపజయం [ఓటమి]తర్వాత వచ్చే బాధలో నుండి నిరాశ కాదు గెలవాలనే కసి పుట్టుకు రావాలి.
* ఓటమి క్రుంగిపోవలసింది కాదు.మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి నిచ్చెన వంటిది.
* సహనం వహించేవారు తప్ప మరెవరూ విజయాన్ని చేరుకోలేరు.
* భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపాలి.అప్పుడు భయం పారిపోతుంది.
* విజయం సాధించడామికి కావలసిన శక్తిసామర్ధ్యాలు మీలోనే నిక్షిప్తంగా ఉంటాయి.వాటిని గుర్తించి        మసలుకుంటే   విజయం సుసాధ్యం.
* శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
* సాధించిన దానితో సంతృప్తి పొదటం ప్రారంభిస్తే అక్కడితో అభివృద్ధి ఆగిపోయినట్లే.
* అందరూ ఎక్కువ కాలం జీవించాలని కోరుకునే వారే కానీ చక్కగా జీవించాలనే వారే అరుదు.
* క్రోధం,అసహనం అన్నవి అవగాహనకు అడ్డొచ్చే జంట శత్రువులు.
* ధైర్యంగా కార్యాచరణకు ఉపక్రమించే వారికే విజయం లభిస్తుంది.పర్యావసనాల గురించి భయపడే వారిని విజయం  వరించదు.
* మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేనిదానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖసంతోషాలు అనుభవించ లేకపోవడానికి కారణం.
* అనవసర ఆలోచనల కారణంగా ఉన్నతంగా ఎదగడానికి చేసే కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది.అలా కాకుండా ప్రస్తుత స్థితికంటే పైకి ఎదగాలని నిరంతరం కృషి చేసే వ్యక్తికి బూడిదలోనే బంగారం లభిస్తుంది.
* నీ ముఖం మీద చిరునవ్వు నువ్విచ్చే విందును అమృతతుల్యం చేస్తుంది.