30, డిసెంబర్ 2014, మంగళవారం

ఇటువంటి గగుర్పాటు చిత్రాలను తీసేవారిని, నటించేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.

ఈరోజు Facebook చూస్తుంటే ఒక మిత్రుడు ఈక్రింది వీడియోను షేర్ చేసాడు. ఒక అమ్మాయిని బీచ్ రోడ్ లో రేప్ చేసే సన్నివేశాన్ని అతికిరాతకంగా చూపించారు. నాకైతే చాలా భయమేసింది.ఎంతదారుణమైన షూటింగులు. ఒక ప్రక్క స్త్రీలకు రక్షణ లేకుండా దేశం నాశనమవుతుంటే ఇటువంటి షూటింగ్లా? ప్రభుత్వం ఉందా? సెన్షార్ బోర్డ్ సభ్యులకు బుర్రలు పని చేస్తున్నాయా? లేక వాళ్లు కూడా లంచగొండులయిపోయారా? దేశ భవిష్యత్తు వీరికవసరం లేదా? నిజానికి ఇలాంటి స్త్రీలను కూడా కఠినంగా శిక్షించాలి.ఇటువంటి పనికిమాలిన సీన్లలో నటిస్తున్న ఇటువంటి దరిద్రగొట్టు నటులను ఉరి తీసినా పాపం లేదు. మన దేశంలో ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు నాశనమవుతాయో?


16, డిసెంబర్ 2014, మంగళవారం

మాలతీచందూర్ గారి నవలా మంజరి.

రెండు రోజులక్రితం విజయవాడ వెళ్లినప్పుడు RTC బస్తాండ్ బుక్ షాప్ లో బుక్స్ కోసం వెదుకుతున్నప్పుడు మాలతీచందూర్ గారి బుక్స్ కంటబడ్డాయి. నవలామంజరి 4పార్ట్స్ ఉన్నాయి. మొత్తం 4 భాగాలను తీసుకుని వచ్చాను.ఆ పుస్తకాలలో పాత తరం ఆంగ్ల రచయితలు వ్రాసిన నవలలు, కథల గూర్చి సంక్షిప్తంగా వివరిస్తూ తనదైన శైలిలో చాలా చక్కగా వ్రాసుకొచ్చారు మాలతీ చందూరుగారు. అవ్వన్నీ ప్రతి సాహిత్య అభిలాషి చదవాల్సినవే! అందులోని కథలన్నీ మనస్సును ఎంతగానో కదిలిస్తాయి. ఏది ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట అక్షరసత్యం. మీరు వీలయితే మీకు దగ్గరలోని బుక్ స్టాల్స్ లో ప్రయత్నించి చూడండి. లేదంటే నాకు మెయిల్ చేయండి పంపే ఏర్పాటు చేస్తాను. బుక్స్ ఖరీదుతో పాటు పోస్టల్ ఖర్చులు కూడా మీవే సుమా!!!

13, డిసెంబర్ 2014, శనివారం

సిని సింగర్ సునీత గారంటే నాకు చాలా ఇష్టం.

సునీత గారిని చూస్తే చాలు నాకు ఎదో లోకంలో తేలియాడుతున్నట్టే అనిపిస్తుంది. ఆమె పాడే విధానం, ఆమె స్టైల్ ఇష్టపడని వారెవరూ ఉండరు. ముఖ్యంగా ఆమెతో మాటలాడితే చాలా సరదాగా ఉంటుంది. ఒకసారి చెన్నాయ్ లోని మా పెద్దమ్మగారింటికి పంక్షన్ నిమిత్తం వచ్చినప్పుడు తొలిసారిగా ఆమెను దగ్గరినుండి చూసాను. ఎలాగైనా ఆమెతో మాటలాడాలని మా పెద్దమ్మను తీసుకుని వెళ్లి పరిచయం చేసుకుని హాయ్ చెప్పేసాను. ఆరోజు నాకు ఎవరెస్ట్ శిఖరం 4సార్లు ఎక్కి దిగేసినంత అనుభూతి కలిగింది. ఐడియా సూపర్ సింగర్లో ఆమె కోసమే నేను ఆ ప్రొగ్రాంస్ చూసేవాడిని. (నిజానికి ఆమె నాకంటే చాలా పెద్దది. ఏదొ పిచ్చి అభిమానం)  ఏది, ఏమైనా అభిమానించే మనుషులను కలిస్తే ఆ అనుభూతే వేరు!

12, డిసెంబర్ 2014, శుక్రవారం

పిల్లా నువ్వులేని జీవితం వృధాయే!

అవును.నాకు ఈమధ్య ఓ పిల్ల గుర్తుకొచ్చినప్పుడు అనిపించింది. ఆ దేవుడు మనల్ని పుట్టించి నప్పుడే మనకి జోడు కూడా పుట్టిస్తాడని మన పెద్దలు చెప్తుంటారు. నా తోడు ఎక్కడ పుట్టించాడో ఏమిటో? ఎక్కడని వెదకను? నా ఫ్రెండ్ ఒకరోజు ఒక అమ్మాయి ఉంది. నీకు నచ్చితే పెళ్లి విషయం మాట్లాడదాం అన్నాడు. తీరా వాళ్లింటికి చూపులకి వెళ్తే నీవు నా తోడు కాదు పొమ్మంది. తనకి ఆల్రెడీ తోడు దొరికేసిందట. చేసేదేమీ లేక వాళ్లు పెట్టిన మైసూర్ పాకం, కారప్పొడి సిగ్గులేకుండా తినేసి వాడూ, నేనూ బయటికొచ్చాం. ఏమిటో ఈమధ్య పిల్ల లేని జీవితం బోరు కొడుతుంది. నా తోడు (జీవిత భాగస్వామి) ఎక్కడుందో ఏమిటో? ఈ బ్లాగు ద్వారా నా పిల్ల కోసం ప్రకటన చేస్తున్నాను. ఓ నా స్వీటీ ఎక్కడున్నా వచ్చేయ్. నీ తోడు ఇక్కడున్నాను. నీతో పంచుకోవాల్సిన ఎన్నో విషయాలు నా దగ్గర అట్టే పెట్టాను. నీకోసం నీపై పూలాభిషేకం చేద్దామని వాడిపోని పూలు నీకోసం సిద్ధం చేసి ఉంచాను. నీవు త్వరగా వచ్చేయ్...నీకోసం ఎదురుచూస్తూ...నీ తోడు.

10, డిసెంబర్ 2014, బుధవారం

పిల్లా నువ్వులేని జీవితం

నా ఫ్రెండ్ "పిల్లా నువ్వు లేని జీవితం" పాటలు బాగున్నాయని చెప్పాడు. సరే విందాం కదా అని డౌన్లోడ్ చేసి ప్లే చేసాను. ఇంచుమించు 4పాటలు వరకూ చాలా, చాలా బాగున్నాయి. ఈమధ్య ఇంతమంచి మ్యూజిక్ తో వచ్చిన పాటలు ఇవే అనుకుంటా! లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఏది,ఏమైనా మెలోడి మ్యూజిక్ మనిషిని మంత్రముగ్ధుణ్ణి చేస్తువేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.మనిషిని ఊహా ప్రపంచంలో జీవింపజేసే శక్తిని సంగీతం కలిగియుందనడంలో 100% నిజమే!

8, డిసెంబర్ 2014, సోమవారం

ఒక సూక్తి!

ఒక చెడ్డవాని చెడుతనం వలన, ఒక దుర్మార్గుడి దౌర్జన్యం వలన పెద్ద ప్రమాదం లేదు గాని,ఒక మంచివాని మౌనం దేశానికి చాలా ప్రమాదకరం - స్వామి వివేకానంద!

11, నవంబర్ 2014, మంగళవారం

ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేమా?

నిర్భయ ఉదంతం దగ్గర నుండీ మీడియాలో జరుగుతున్న చర్చలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.ఎవరెన్ని మార్గదర్శకాలు చేసినా, చట్టాలను కఠినం చేసినా ఈ అఘాయిత్యాలు పెరిగాయేగాని తగ్గలేదు.వీటికి అడ్డుదలకు మార్గం లేదంటారా? మన స్త్రీలను మనం రక్షించలేమా? వీటి సమూల నిర్మూలనకు పరిష్కారం దొరకదా? మీరైతే ఏమి పరిష్కారం చూపుతారు?
నా దృష్టిలో అయితే...ఎక్కువ మార్పు రావాల్సింది...రెండింటిలో!
1.స్త్రీలలో ..2) చట్టాలలో అని నా అభిప్రాయం.

1.ఈరోజు ఆడవారు మేము పురుషులతో సమానమని పరుగులు తీస్తున్నారు.నిజానికి ఎందులో సమానం? ప్రతిరంగంలోనూ పురుషునితో పోటీ పడే స్త్రీ బయట అసభ్య వస్త్రధారణ వేసుకుని విచ్చలవిడిగా తిరగడంలో కూడా సమానమా? తన టాలెంట్స్ ఉపయోగించుకుని పేరు,ప్రఖ్యాతలు తెచ్చుకోవడం దేశానికి గర్వకారణమే నేను కాదని అనను. అయితే బయట రాక్షస ప్రపంచంలో కూడా పురుషుని వలె తిరుగుతాను అంటే మాత్రం ప్రమాదమే! నిజానికి స్త్రీలు రక్షణ పరమైన పనులు చేసుకుంటూ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటే దేశానికి మానవత్వ విలువలు చేకూరుతాయి. గతంలో అయితే స్త్రీ ఇంటి దగ్గరే ఉండి గృహకార్యక్రమాలు నిర్వహించుకుంటూ పిల్లలను చక్కగా తీర్చిదిద్దెవారు. ఇప్పటికీ కొందరి ఇల్లల్లో ఈ విధమైన సంప్రదాయం కొనసాగుతుంది. వీరి పిల్లలు చాలా చక్కగా సంస్కృతి,సంప్రదాయాలు అలవర్చుకుంటూ హుందాగా ఉన్నారు కూడా!. ఎక్కువుగా ఉద్యోగ నిర్వహణలో మునిగిపోయినవారి తల్లిదండ్రుల పిల్లలే ఈరోజు ఈ అఘాయిత్యాలకు బలవుతున్నారు. బలి చేస్తున్నారు. వారి పిల్లలో సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే పరిస్థితి ఎనాడూ నిర్వహించకుండా పాశ్చాత్య కల్చరును ప్రోత్సాహిస్తూ వారసలు ఏ స్థితిలో ఉన్నారనేది పట్టించుకోకుండా, చివరికి వారిలోని రాక్షస ప్రవుత్తిని చూసి తర్వాత ఘోషిస్తున్నారు. దీని వలన ఏమి లాభం? భార్యభర్తలనేవాళ్లు తిరుగటిరాయి లాంటివాళ్లు.బియ్యం దానిలో పోసి విసురుతున్నప్పుడు పిండిగా బయటకు వస్తుంది.ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే క్రింది రాయి తిరగకుండా పైరాయి మాత్రమే తిరుగుతుంది. దాని ద్వారా బియ్యం కాస్తా పిండిగా మారి వంటలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ తిరుగటిరాయిలో క్రింది తిరగనిరాయి భార్య అయితే పైన తిరిగేరాయి భర్త. అంటే దీని అర్ధం భార్య బయట తిరగకుండా ఉండి ఇంటిపట్టునే ఉండి తన పనులను నిర్వహించుకుంటూ పిల్లలను తీర్చిదిద్దుకుంటే ఆ కుటుంబానికి లాభం, దేశానికి లాభం. ఇక పోతే పై తిరిగే రాయి భర్త తను గృహ అవసరాలను తీర్చడం కోసం,కుటుంబ భారాన్ని మోయడం కొసం తను బయట పని చేయాలి. అంటే కుటుంబ బాధ్యతలను నిర్వహించాలి.అంతే గాని పైరాయితో పాటు క్రింది రాయి తిరిగినా, క్రింది రాయిలాగ పై రాయి తిరగక పోయినా అందులోంచి పిండి రాదు.అలాంటి కుటుంబానికి సుభిక్షం కూడా కలుగదు. ఆధ్యాత్మిక ప్రవక్తలు ఏనాడో చెప్పారు "ఏ సమాజంలో అయితే స్త్రీ గడప దాటుతుందో ఆ సమాజం సర్వనాశనమవుతుందని.

2.మన చట్టాలు ఎందుకో తెలీదుగాని బలహీనమని నా అభిప్రాయం.స్త్రీలకు న్యాయం చేసిన ధాఖలాలు పెద్దగా కనిపించవు. కొంతమంది అమాయక స్త్రీల కేసులు ఇప్పటికీ తేలలేదు.కొన్నింటికి అడ్రస్ కూడా లేదు. పరిస్థితి ఇలా ఉంటే మనకు రక్షణ ఎలా కలిగిస్తాయి. మొన్నటికి నిన్న అచేలాల్ కేసు ఏమైంది. నిర్ధోషిగా బయటికొచ్చాడు. అదీ 70సం// వృద్దురాలిని రేప్ చేసి మరీ! ఎంతదారుణం. ఆ స్త్రీని అమ్మా,అమ్మా అని పిలుస్తూనే ఇద్దరూ మందుకొట్టి వావివరసలు మరిచిపోయి శారీరకంగా కలిసినప్పుడు ఈయన గారి ధాటికి తట్టుకోలేక గాయాల పాలై చనిపోయిందట!ఇదంతా ఈయనగారు మద్యం మత్తులో ఉండి చేసిందికాబట్టి, ఇంకా ఆమె మనోపాఝ్ దశ కోల్పోయింది కాబట్టి ఈయనగారు నిర్దోషని సదరు డిల్లీ హైకోర్టు తీర్పు చేసింది.ఇలాంటి తీర్పులు అసలు సమంజసమా?దారుణం కాదూ? చట్టాలే ఇలాంటి తీర్పులు చేస్తే ఇక రక్షణ ఎక్కడుంటుంది చెప్పండి?
 • ఆమె తట్టుకోలేక చనిపోతే అది రేపు కాదా? వాడికి ఆ పరిస్థితి తెలియకుండానే కళ్ళు మూసుకుపోయాడా?
 • ఆమెకు భర్త బ్రతికి ఉన్నప్పుడు ఆమెతో సంబంధం పెట్టుకోవడం అక్రమం కాదా? నేరం కాదా?
 • మద్యం త్రాగి ఇలాంటి నేరాలు చేస్తే తప్పు మద్యానిదేనా? త్రాగినవాడికి వర్తించదా? ఇదే నిజమైతే మద్యం త్రాగి నేరాలకు పాల్పడవచ్చని సంకేతమా ఆ తీర్పు? 

  ఇలా విశ్లేసించుకుంటూ పోతే చాలా విషయాలు బయటికొస్తాయి. చట్టాల పరిస్థితి ఇలా ఉంటే మనం ఏమి చేయగలం?

ఆధ్యాత్మిక ప్రవక్తలు ఆడపిల్లలను రేప్ చేసి చంపే వారిని నడిరోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు. నాకు ఇదే పరిష్కారం అని నిర్భయ సంఘటన తరువాత బలంగా అభిప్రాయం ఏర్పడింది. ఈ విషయంలో వాదించేవారు నిర్భయ స్థానంలో తమ కూతురునో, చెల్లినో,తల్లినో ఊహించుకుంటే ఆ నేరాల యొక్క తీవ్రత, అన్యాయానికి గురినవారి ఆక్రోదన కనిపిస్తుంది.

10, నవంబర్ 2014, సోమవారం

తెలుగు బ్లాగర్లకు కూడా అభిమానులుంటారా?

నాకు నిన్న ఒక అద్భుతమైన సంఘటన ఎదురైంది. నేను ఖమ్మం బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఓ అమ్మాయి నా ప్రక్కన కూర్చుంది.నేను నోట్ బుక్ తీసుకుని వ్రాసుకుంటునప్పుడు ఆమె నా నోట్ బుక్ చూసి ఏమిటి? ఏదైనా ఐడియా వచ్చిందా సర్? ఈసారి ఏ విషయంపై వ్రాయబోతున్నారు మీ బ్లాగులో? అని అడిగింది. నేను ఆశ్చర్యంగా ఆమె వంక చూసాను.నేను బ్లాగు వ్రాస్తానని మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాను.
మీ బ్లాగ్: "నా మనోడైరీ" రెండు,మూడు సార్లు చదివాను లెండి చాలా క్యాజువల్ గా చెప్పింది.
"అది సరే నేనే ఆ బ్లాగ్ ఓనర్ నని మీకెలా తెలుసు.నా ప్రొఫైల్ పిక్చర్ అంత క్లియర్ గా ఉండదు కదా? నన్ను ఎలా గుర్తు పట్టగలిగారు? ఆశ్చర్యంగా అడిగాను.
"అభిమానం ఉంటే గుర్తు పట్టడం అంత కష్టం కాదులెండి.మీ బ్లాగుతో పాటు మీ సాక్ష్యం సంచలన పత్రిక కూడా చదువుతాను"
 మీరు తెలుగు బాగులను ఎక్కువుగానే ఆదరిస్తారనుకుంటా? ఆమెను అడిగాను.
"పర్లేదు"
నాకు ఇదంతా ఓ వింతగా అనిపిస్తోంది. నా బ్లాగులను చదివే ఓ అందమైన అమ్మాయి నన్ను గుర్తు పట్టి, నా బ్లాగులను చదవడం, నన్ను అభిమానించడం నా దగ్గర కూర్చుని మాటలాడటం నాకంతా ఓ అద్భుతమైన, అనిర్వచనీయమైన సంఘటన కనిపిస్తోంది.
ఓకె చౌదరి సర్! నా బస్సు వచ్చింది నేను వెళ్తున్నాను.ఇక నుండీ మీ బ్లాగ్ ద్వారా కలుద్దాము లెండి. బై అంటూ అక్కడినుండి నిష్క్రమించింది.
ఆ అమ్మాయెవరో? ఎక్కడుంటుందో? ఎలా? నేను తేరుకుని చూసేలోపు ఆ అమ్మాయి కనిపించకుండా...మాయమయ్యింది. అక్కడ కుర్చీలోనే అలా నీరసంగా కూర్చుండిపోయాను. మనసు నిండా ఏవేవో ఆలోచనలు.అరకొరగా వ్రాసే నా బ్లాగులకే అంత అభిమానులుంటే మరి కొతమంది మహానుభావుల బ్లాగులకు ఇంకెంతమంది అభిమానులుంటారో! అప్పుడే గట్టి నిర్ణయం చేసుకున్నా? ఈసారి నా బ్లాగుల ద్వారా మరింత అభిమానాన్ని సంపాదించుకోవాలి. సమాజాన్ని మేల్కొలిపే మరిన్ని ఆర్టికల్స్ నా బ్లాగుల ద్వారా అందించాలి.

9, నవంబర్ 2014, ఆదివారం

"జోరు" సినిమా పరమ బోరు!

నేను నా ఫ్రెండు బలవంతం మీద జోరు సినిమాకి వెళ్లాల్సి వచ్చింది.తీరా ధియేటర్ లో కూర్చున్న తరువాత నుండీ సినిమా అంతా పరమ బోరుగా అనిపించింది.లౌక్యం సినిమాలో ఉపయోగించు కున్నంత ఎక్కువుగా బ్రహ్మానందాన్ని ఈ జోరు సినిమాలో ఉపయోగించుకోలేకపోయేరు. ఒక ప్రేమ కధా చిత్రం ప్రేం నటుడు సప్తగిరిని కూడా పెద్దగా చూపించలేదు. ఈ మధ్య వచ్చిన నాలుగైదు సినిమాలను కలిపి వడకట్టి తీసిన  సినిమాలా అనిపించింది.సంగీతం కూడా వినసొంపుగా లేదు. ఇక సినిమాలో అయితే అక్కడక్కడా కార్టూన్ చిత్రాలే రాజ్యమేలాయి. ఎందుకో తెలీదుగాని మొత్తానికి సినిమా పెద్దగా నచ్చలేదు.ఈ జోరు సినిమా పరమ బోరుగానే నడిచింది.

6, నవంబర్ 2014, గురువారం

Wonderfull Dancing


2, అక్టోబర్ 2014, గురువారం

ఈ క్రింది బుక్స్ అన్నీ మీకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.


పై బుక్స్ తోపాటు మరెన్నో బుక్స్ ఉచితంగా డౌన్లోడ్ కి ఉంచడం జరిగింది.మీకు కావలిస్తే ఈ క్రింది లింక్ చూడండి.

చాలా రోజుల తరువాత కాకినాడకి.

నేను చాలా రోజుల తరువాత కాకినాడ వెళ్తున్నాను.అక్కడి నామిత్రులను కలవబోతున్నాను.ఒక్కప్పుడు నేను కాకినాడలో దర్జా,హోదా,గౌరవాన్ని అందుకుంటూ ఉండేవాడిని.నా ఆర్ధిక పరిస్థితులు నన్ను అక్కడినుండి కడప వెళ్లిపోయేలా చేసాయి.దాని కారణంగా నేను ఎంతో ప్రేమిస్తూ,ఆదరించే స్నేహితులకు సైతం దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది.నా జిల్లా తూర్పుగోదావరి.కాకినాడ నాకిష్టమైన పట్టణం.దానికి దూరంగా ఉండడమంటే చాలా కష్టమే!ఇన్షా అల్లాహ్ ఈ రోజుతో ఆ కష్టం తీరబోతుంది.నా మిత్రులను,నా శత్రువులను సైతం కలవబోతున్నాను.వారందరికీ దసరా మరియు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పబోతున్నాను.దేవుడు నా ప్రయాణాన్ని సఫలం చేయాలని కోరుకుంటూ...
@ Ahmed Chowdary

8, సెప్టెంబర్ 2014, సోమవారం

ఆన్ లైన్ ధార్మిక పత్రిక :సాక్ష్యం సంచలన పత్రిక.

ఈ రోజు మతం అనేక రూపాలు ధరించి మనిషిని భక్తి అంటేనే విరక్తి చెందేలా చేస్తుంది.రోజుకొక మతం పుట్టుకొస్తూనే ఉంది.వీధికొక బాబా వెలుస్తూనే ఉన్నారు.నిజానికి ధార్మిక గ్రంధాల ప్రమేయం లేకుండానే సొంతబోధనలు,కల్పిత సిద్ధాంతాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి.అసలు దేవుడంటే ఎవరు?ధర్మమంటే ఏమిటి?ధార్మిక గ్రంధాలకు మనకు గల సంబంధం ఏమిటి?ఇత్యాది విషయాలను తేటతెల్లం చేసి చూపించే ధార్మిక పత్రిక - సాక్ష్యం సంచలన పత్రిక. తప్పక చదవగలరు.

                                                

29, ఆగస్టు 2014, శుక్రవారం

సబీరా నాకు ఫోన్ చేసింది!

గతంలో నేను రాసిన కధ సబీరా చదివిందట!నాకు ఎప్పుడైనా నీవు పీచు మిఠాయిలు,చాకోబార్లు కొన్నావా? అని అడిగింది.(కధలో అలా స్టోరీ కల్పించాను తప్ప నిజానికి ఎప్పుడూ కొనలేదు).ఏది,ఏమైనా నేను రాసిన కధ చదివి నాతో సబీరా ఫోన్ చేసి మాటలాడటం ఆనందమేసింది.ఇప్పుడు ఆమెకు పెళ్లి అయ్యిపోయింది.మా మధ్య చక్కని ఫ్రెండ్ షిఫ్ ఉంది.ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకుంటుంది.మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను చూడకుండా వెళ్లదు.మంచి అమ్మాయి.ఆమె నా లైఫ్ లో లేకపోవడం నా దురదృష్టం.ఆమె లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండడమే నాకు కావాలి.సబీరా చాలా అందమైన, మంచి మనసున్న అమ్మాయి.ఆమె గుర్తుకొచ్చినందుకు మనస్సంతా బరువెక్కింది.

       

23, ఆగస్టు 2014, శనివారం

నేను ప్రేమలో పడ్డానా?

సహజంగానే ప్రేమలకు వ్యతిరేకినైన నేను నిన్న ఆ అమ్మాయిని ఎందుకు అలా చూస్తూ ఉండిపోయాను? నన్ను తనవైపునకు తిప్పుకునే శక్తి ఆమెకెలా వచ్చింది? నా హృదయంలో ఎక్కడో అలజడి...ఆమెను చూడకుండా ఉండలేని పరిస్తితి.ఇంతకీ నాది ఆకర్షణ ఏమో? మనసంతా అలజడి...ఏదో అనిర్వచనీయమైన ఫీలింగ్.ఇదంతా జరుగుతుంది నాకేనా? ఇంతకీ నాకేమయింది? ఎందుకు ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను.ఏమీ అర్ధం కావడం లేదు.
 ఫంక్షన్ లో ఆ అమ్మాయిని అదే ఫస్ట్ టైం చూడటం.స్కై బ్లూ కలర్ డ్రెస్ లో ఎలా ఉన్నదంటే స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలా కనిపించింది.ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసానో,లేదో ఓ చల్లని గాలి తిమ్మెర నా హృదయాన్ని తాకి వెళ్లి పోయింది.నేను ఈ లోకాన్నే మర్చిపోయాను.
 నాకు ఏమి అర్ధం కావడం లేదు.అసలు ఏమీ తినాలనిపించడం లేదు.గంట తరువాత ఆ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ తో కారెక్కి వెళ్లిపోయింది.ఇక నాకు కనిపించదా? ఆ అమ్మాయిని ఎలా వెదకడం? ఎక్కడుంటుంది?
 ఏదో కోల్పోయినట్టు మనసంతా ఒకరకమైన ఫీలింగ్!
 ఏది,ఏమైనా యుక్త వయస్సు వచ్చిన వెంటనే తోడు లేకపోతే ప్రమాదమే!
 నా జీవితానికి ఆ అమ్మాయి దొరుకుతుందా? ప్రేమంటే...వ్యతిరేకినైన నన్ను ఇలా కదిలించి వెళ్లి పోయిందేమిటి? నా మనసులో ఎందుకు అలజడి సృష్టించి వెళ్లిపోయింది?
 "చౌదరి బాబు భోజనం చేయండి" ఆ ఫంక్షన్ తాలూకు పెద్దాయన పిలుస్తున్నా...పట్టించుకోకుండా అక్కడి నుండి వచ్చేసాను.ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావడం లేదు.ఎంతమంది ముస్లిం సోదరులు సలాం చెప్పినా చెయ్యి ఊపి రావడమే గాని పరిసరాలను గుర్తించే స్తితిలో నేను లేను.ఇంతకీ నాకేమైంది? నేను ప్రేమలో పడ్డానా?

నీ జతగా నేనుండాలి.

"నీ జతగా నేనుండాలి" సినిమా చూసాను.ఎందుకో తెలీదు గాని నా మనసంతా పిండేసినట్టు అయ్యింది.చాలా,చాలా బాగుంది.ఒక మధ్య తరగతి అమ్మాయి సింగింగ్ టాలెంట్ గుర్తించిన ఓ సుపర్ స్టార్ సింగర్ (హీరో)ఆమెను ఉన్నతమైన స్తితికి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తాడు.అతను తాగుడుకు బానిసై తన ఇమేజ్ ను కోల్పోతాడు.తన స్తితి ఆమెకు అడ్దు రాకూడదని దూరం వెళ్ళి పోవాలనుకుంటాడు.ఆమె ఒప్పుకోదు.ఇవ్వన్నీ నీవల్లే వచ్చాయి.నీవే లేనిది ఇవ్వన్నీ నాకెందుకు? అని ఆమె అంటుంది.కొన్నాళ్లు కలిసి జీవించిన తరువాత తన ప్రవర్తన ఆమె భరించడం అతనికి ఇష్టం ఉండదు.తన ఇమేజ్ కోల్పోయిన బాధలో మరింత త్రాగుడుకు బానిసై పోతాడు.అతన్ని ఎలాగైనా మామూలు మనిషిని చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దూరంగా తీసుకెళ్లి పోయి జీవించాలనుకుంటుంది.అతని కోసం తన సింగింగ్ జీవితాన్ని ముగించాలనుకుంటుంది.ఈ విషయాన్ని గుర్తించిన అతను తనుంటే ఆమె మరింత స్తితికి చేరుకోలేదని,తనను వదులుకోలేదని తెలిసి అతను ఆమెకు దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడు.ప్రాణ త్యాగం చేసేసుకుంటాడు.నా రూముకు వచ్చిన తరువాత కూడా పదే,పదే అదే సినిమా గుర్తుకోస్తోంది.సచిన్ జె జోషి హీరోగా,నజియా హుస్సేన్ హీరోయిన్ గా చాలా అద్భుతంగా నటించారు.

16, ఆగస్టు 2014, శనివారం

ఇకనుండీ నా బ్లాగులో...

నా కలం పేరుమీద (నామనోడైరీ:బ్లాగ్ టైటిల్)బ్లాగు మొదలిపెట్టినప్పుడు నుండీ దానికోసం రాయడం కంటే బ్లాగును డిజైన్ చేయడంలోనే ఎక్కువ సమయం కేటాయించేస్తున్నాను.ఈ రోజున పెట్టిన టెంప్లేట్ రేపు నచ్చడం లేదు.ఇలా ఎన్నో మార్చి,మార్చి చూసి చివరికి చిరాకేసిందంటే నమ్మండి.
 ఇక ఈరోజుతో ఆపనికి స్వస్తి చెప్పేసాను.(కొన్నాళ్లు సుమా!మంచి డిజైన్ నా కళ్ల బడితే అంతే నాది కూడా అటువంటి టెంప్లేట్ సెట్ చేసేయాలి.లేకపోతే నిద్రపట్టదు.)
 అయినా!నామతిగానీ..బ్లాగ్ ఎంత అందంగా ఉంటే ఉపయోగమేముందీ అందులో సరుకు బాగుండాలి గాని!అంతే గదండీ !
 ఫాతిమా మేరాజ్ గారి బ్లాగు చూడండి ఏమాత్రం అలంకరణ ఉండదు.గానీ బ్లాగులో కవిత ఫోస్ట్ అయితే చాలు హాట్ కేకుల్లా తినేస్తారు.సారీ..చదివేస్తారు.టాలెంట్ ఉండాలంతే!ఏమంటారు?
 పద్మప్రియ గారి బ్లాగు "ప్రేరణ"కూడా కొంతవరకు అలంకరణ వున్నా మంచి,మంచి కవితలలో దదరిల్లే బ్లాగే.ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగవతం ఈ జన్మకు పూర్తికాదు.గూగుల్ వాడి మెమరి కూడా సరిపోదు.ఇంకా తెలుసుకోవాలని గట్టి  పట్టుదలగా ఉంటే...అదే బ్లాగుల గురించి "బ్లాగ్ వేదిక"ను ఓ లుక్కేయండి.
 ఇంతకీ ఓ శుభవార్త చెప్పటం మరిచాను."వెన్నెలకెరటం"అని ఈ మధ్య కొత్త బ్లాగ్ ఒకటి అవతరించింది.సాహిత్యంపై ఎక్కువుగా పని చేస్తుంది.
 ఏది,ఏమైనా నా బ్లాగులో మంచి,మంచి పోస్ట్సు చేయాల్సిందే!ఇక నుండీ ఆపని మొదలు పెడతాను.

10, ఆగస్టు 2014, ఆదివారం

మనిషికి ఆనందం డబ్బులోనే ఉందా?

మనిషికి కావల్సిన ఆనందాలు,సంతోషాలు కేవలం పూర్తి డబ్బులోనే లేవు.వీటిని పొందటానికి మాత్రం డబ్బు కూడా ఒకటి.ఈ మాట మీకు అర్ధం కాకపోవచ్చు.వింతగా అనిపించవచ్చు.కాని నిజం.
      మనిషి సంతోషంగా జీవించడానికి కావల్సిన వాటిలో డబ్బు  ప్రధానమైనది తప్ప..డబ్బే అన్నీ కాదు.డబ్బు ఏ కష్టo లేకుండా బ్రతకడానికి కావాలిగాని, కేవలం డబ్బు కోసమే బ్రతకడం ప్రారంభిస్తే అన్నీ కష్టాలే!అశాంతిమయాలే!!
      అతి అన్ని విషయాలలో ప్రమాదమే!అలాగే డబ్బు విషయంలో కూడా!
      అయితే మనిషి ఆ డబ్బు సంపాదన విషయంలో ముందుండాల్సిందే!
      హ్యాపీగా బ్రతకడానికి అతని దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఏవిధమైన గుర్తింపు లేదు.సమాజంలో గౌరవం లేదు.
 ఆర్ధికబలం ఉన్నవాడికే సమాజం అండగా నిలుస్తుంది.తప్ప మంచి చెడులను బట్టి అస్సలు కాదు.
      ఎన్ని కుంభకోణాలు చేసిన నాయకుడైనా..ప్రజల మధ్య ఊరేగడం ప్రారంభిస్తే చేతులెత్తి నమష్కరిస్తుంది సమాజం.మనుష్యులను ఆ విధంగా తయారుచేస్తుంది డబ్బు.కాని వాళ్ల వ్యక్తిగత జీవితాలలో మాత్రం అలజడులు,అశాంతులు తప్ప మనశ్శాంతి మాత్రం ఉండదు.
     సరిపడే డబ్బే సంతృప్తి...అంతకు మించితే అనర్ధమే!
     నేనొకసారి కడపలో ఓ ఆధ్యత్మిక సభలోకి అతిధిగా వెళ్లినప్పుడు నా సందేశం ముగిసిన తరువాత ఓ ముస్లిం పండితుడు చక్కని కధ చెప్పాడు.
     ఆ ఊరి జమిందారు రాత్రి నిద్రపట్టక అతని ఇంటిపైన పచార్లు చేస్తున్నాడట.అయితే ఆ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద ఓ భిక్షగాడు దోమలు ఎంత కుడుతున్నా పట్టించుకోకుండా ఆదమర్చి నిద్రపోతున్నాడు.ఈ దృశ్యం జమిందారిగారి కంటబడింది.మనస్సులోనే అనుకున్నాడు"ఎంత విచిత్రం..నాకు గదిలో పడుకోవడానికి పరుపు,దుప్పట్లు,గదినిండా చల్లటి ఎ.సి ఉన్నా నాకు నిద్రలేదు.ఈ భిక్షగాడు చూస్తే అంత చలిలో అన్ని దోమకాట్లు మధ్య నిద్రపోతున్నాడు.
    జమిందారికి "నా బ్రతుక్కంటే నీ బ్రతుకే బాగుంది అనుకుని ఆ భిక్షగాడిని మనస్సులోనే అభినందించాడు.
 మర్నాడు ఉదయమే భిక్షగాడిని కల్సి ఓ వందరూపాయలు ఇచ్చి వచ్చాడు.
    ఆరోజు రాత్రి యధావిధిగా జమిందారుగారు తన డాబాపై తిరుగుతూ చెట్టు క్రింది భిక్షగాడు నిద్రపోకుండా దోమలను తోలుతూ కూర్చోవడం చూసాడు.జమిందారుగారు ఆశ్చర్యపోతూ డాబాపైనుండి క్రిందికి వచ్చి భిక్షగాడిని అడిగాడట ఎందుకు నిద్రపోలేదని?
    దానికి భిక్షగాడు "అయ్యా! ఉదయం మీరిచ్చిన 100రూపాయలలో 90రూపాయలు ఖర్చయింది.ఇంకా నాదగ్గర 10రూపాయలున్నాయి.వాటిని ఎవడు కొట్టేస్తాడోనని నిద్రపట్టడం లేదు బాబయ్యా అన్నాడట!
    ఏది ఏమైనా డబ్బు ప్రోగు వేతే మనిషి లక్ష్యం అయితే అతనికి మనసిక శాంతి కరువే!!

2, ఆగస్టు 2014, శనివారం

నీ సంతోషం నీలోనే వుంది.

సంతోషం ఒక వృత్తం లాటిది.నీ హృదయంలోంఛి చిన్న మొక్క లాగా అంకురించిన కోరికని తీర్చుకోవడం కోసం, నీ చేతులు చేస్తున్న పనిని చూస్తున్నప్పుడు నీ కళ్లు... ఆనందంతో వర్షిస్తాయి.హృదయమూ, చేతులూ, కళ్లు ఆ మూడింటి మధ్యా పూర్తయ్యే వృత్తమే సంతోషమంటే.

     తాను చేస్తున్న పనిలో సుఖాన్ని గుర్తించినవాడు, పని చేస్తున్నానన్న విషయం మర్చిపోతాడు.అందుకే అతడు అలసిపోడు.చేస్తున్న పనిలో సంతోషం లేని వాడు తొందరగా వృద్ధుడవుతాడు.ఒక వ్యక్తి నిద్రలోనూ, పనిలోనూ,కలలోనూ ఒకే విధమైన సంతోషంగా ఉండాలి.

     బద్ధకం ఆకర్షణీయమైనదే.కాని పని తృప్తికరమైనది.విశ్రాంతిలో వృధాగా వుండే అనవసరమైన ఆనందం ఒకసారి నీకు అలవాటయితే, చేసే పనిని సగంలో ఆపు చెయ్యడం నీ వ్యసనమవుతుంది. నీ "కర్మ"నీవు చేసే పనులపై ఆధారపడివుంటుంది.నీ నుదుటి వ్రాత మీద కాదు"అన్నాడు అరిస్టోటిల్.సంతోషం కూడా అంతే.అది నీలో వుంది.నీవు త్రాగే మధువులో కాదు.అదే విధంగా సంసారంలో సంతోషం అనేది నీకు మంచి భాగస్వామి దొరకటం వలన రాదు.నీవు మంచి భాగస్వామి అవటం వలన వస్తుంది.

     గెలుపుకీ,విజయానికీ తేడా తెలుసుకో. "గెలుపు"నీలోంచి వచ్చేది."విజయం" ఇతరులు దాన్ని గుర్తించగా వచ్చేది.పని చేయలేనివాడు తనెలా చెయ్యాలనుకున్నాడో నీకు సలహా ఇస్తాడే తప్ప తాను చెయ్యడు.చెయ్యలేడు.చేసేటట్టయితే నీకెందుకు చెప్తాడు?

 •      ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు.
 •      ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రణాళిక వెయ్యి.
 •      ఇతరులు తటపటాయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో.
 •      ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను.
 •      ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు పని చెయ్యి.  
      పై విషయాలు నా అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాధ్ గారి "తప్పు చేద్దాం రండి" పుస్తంకంలోనివి.ఆ పుస్తకం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

28, జులై 2014, సోమవారం

ఈ రోజుల్లో ఇంతమంచి సినిమా ఇదేనేమో!

ఒకరోజు నా ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దృశ్యం సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు.పెద్దగా సినిమాలు చూడని నేను ఆరోజు ఆ సినిమా చూసాను.సినిమా చాలా బాగుంది.సైలెంట్ గా,ధ్రిల్లింగ్ గా సస్పెన్స్ కధనంతో ఆసాంతం మనిషిని కట్టి పడేసింది.
 
    బహుశా ఈరోజుల్లో ఇంతటి మంచి సినిమా రావడం ఇదే  మొదటిసారనుకుంటా!
 
    సినిమాలో అశ్లీలం లేదు.బట్టలూడదీసి తిరగడం అసలే లేదు.ఎంతో హుందాగా,గౌరవపధంగా నడిచింది.

    నేటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ఉంది.

    ఇక కట్ చేసి కథలోకొస్తే...

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ప్రాజెక్ట్ పనిమీద బయటికి క్యాంప్ కి వెళ్లుంది.ఒకరోజు బాత్ రూం లో స్నానం చేస్తుంటే...ఆ అమ్మాయికి తెలియకుండా ఓ రాక్షసుడు సెల్ కెమెరాతో వీడియో తీసి తర్వాత క్యాంపు నుండి తిరిగి వచ్చిన అమ్మాయి ఊరెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

    వాడొక ఐ.జి కొడుకు...తల నిండా పొగరు.

    ఒకరోజు నైట్ తనతో గడపక పోతే ఆ వీడియో Youtube లో Upload చేస్తానని బెదిరిస్తాడు.

    అమ్మాయి బెదిరిపోతుంది.విపరీతంగా భయపడిపోతుంది.
 
    ఆరోజు రాత్రి అతను రమ్మన్న చోటుకి వెళ్తుంది.వీడు కూడా అదే చోటుకి వెళ్లినప్పుడు అక్కడ ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా వుంటుంది.

    వీడికి కోపం రగిలిపోతుంది.

    తల్లికూతుర్లిద్దరూ ఎంతో ప్రాధేయపడతారు.ఆ వీడియో ఇచ్చేయమని బ్రతిమిలాడుకుంటారు.

    అయినా ఆ రాక్షసుడు వినడు.వాడికి మనస్సుంటేనే గదా!

    తన కూతురి జీవితాన్ని...పాడు చేయవద్దని...కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న తల్లి ఒంటిపై చేతులేసి..."నీ కూతుర్ని వదిలి పెడతాను.నీవు నాతో ఈ నైట్ గడుపు"అంటాడు.అంతే..వాడి తలపై బలమైన దెబ్బ...ఆ అమ్మాయి కట్టె తీసుకుని వాడి తలపై కొడుతుంది.ఆ ఒక్క దెబ్బ బలంగా తగిలి అక్కడికక్కడే కూలబడి చనిపోతాడు.ఆ తరువాత వాడి బాడీని తల్లీకూతుర్లిద్దరూ...గోతిలో పూడ్చేస్తారు.

    ఆ కుటుంబాన్ని ఎలా ఆ కేస్ నుండి రక్షించాలా అని ఆ అమ్మాయి తండ్రి చేసే ప్రయత్నాలే సినిమా అంతా!

    ఇందులో గమనించాల్సిన ఓ  పేక్షకుడి ఫీలింగ్ ఏమిటంటే...

    ఆ కుటుంబం ఆ కేస్ నుండి తప్పించుకోవడానికి ఆడే నాటకం ఏ పేక్షకుడికి తప్పు అనిపించదు.ఎందుకంటే ఆ దుర్మార్గుడి వారి పట్ల ప్రవర్తించిన తీరు ...వీళ్లు కేసునుండి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు,నాటకాలను సమర్ధిస్తాయి.ఉద్దేశ్యపూర్వకంగా చేయని ఆ హత్యనుండి తప్పించుకోవడానికి ఈ కుటుంబం చేసేదంతా రైటే అనిపిస్తుంది.

    నా దృష్టిలో అయితే...కరెక్ట్ కూడా..

    ఆ అమ్మాయి తనకు జరిగిన విషయం గురించి తల్లికి చెప్పడం గొప్ప విషయం!ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.ఈ సినిమాలో అమ్మాయి అలా చెయ్యలేదు.తల్లికి చెప్పి గొప్ప పని చేసింది.

   మరొక విషయమేమిటంటే ఆ అమ్మాయి తండ్రికి ఆ కేస్ ను ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు త్రాగించేంత తెలివితేటలు..అతను ఎక్కువుగా అతని కేబుల్ ఆఫీసులో సినిమాలు చూడటం వలనే వచ్చాయి.సినిమాలు మనిషికి ఇన్ని తెలివితేటలు కల్గిస్తాయా?అదీ మంచిగా అనేది నాకైతే పెద్ద సందేహమే!

   ఏది ఏమైనా!సినిమా చాలా బాగుంది.ఆ అమ్మాయి తల్లిదండ్రులుగా మీనా,వెంకటేశు నటించారు.గొప్ప విషయమేమిటంటే...మీనాగారు అచ్చు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా, ఓ చక్కని భార్యగా..హుందాగా నటించిన తీరు చూస్తే...అబ్బో నాకు కూడా ఓ మంచి సంప్రదాయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది.బ్యాచ్ లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనిపించింది.

27, జులై 2014, ఆదివారం

ఆంధ్ర,తెలంగాణ వాళ్లు ఎప్పటికీ అన్నదమ్ములే!

ఆంధ్ర,తెలంగాణ వాళ్లు ఎప్పటికీ తెలుగుజాతి ముద్దుబిడ్డలే!తోడబుట్టిన అన్నదమ్ములే!వారి మధ్య వున్న బంధాన్ని ఎప్పటికీ విడదీయలేరు.కాని...కొన్ని రాజకీయ శక్తులు వీళ్ల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టింది.
   తెలంగాణ వేరైంది!మంచిదే.నేనైతే ప్రత్యేక తెలంగాణ నినాదానికి ఎప్పటికీ వ్యతిరేకిని కాను.ఎందుకంటే మేము వేరైపోయి మా తెలంగాణను ఇంకా సస్యశ్యామలం చేసుకుంటాం.అభివృద్ధి పధంలోకి నడిపించుకుంటాం!అంటున్నారు కాబట్టి విడిపోవడం మంచిది.
  ప్రాంతీయ అభివృద్ధే దేశ అభివృద్ధికి మూలం అని నమ్మేవాళ్లలో నేనూ ఒకడ్ని.
  విడిపోయాం...కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా పరిష్కారాలు చూసుకుని ఆంధ్ర,తెలంగాణాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాల్సిన బాధ్యత,అవసరం,ఆవశ్యకత ఈ రాజకీయవేత్తలపై ఉంది.
      కానీ...
 • ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టేలా..వ్యాఖ్యానించడాలు,రెచ్చగొట్టే ధొరణిలో మాట్లాడటాలు ఎంతవరకు న్యాయం?
 • కేవలo ప్రాంతాలను విడదీయడమే కాకుండా, మనుషులను కూడా వేరుపర్చాలనా?
 • ఆంధ్రా,తెలంగాణలను మరొక ఇండియా,పాకిస్తాన్ ల మాదిరిగా మార్చేయలనా?
 • తెలంగాణలో కొన్ని అల్లరిమూకలు అక్కడున్న ఆంధ్రావాళ్లను టార్గెట్ చేయడం,వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం పద్ధతేనా?
 • అక్కడే పుట్టి,అక్కడే పెరిగి చదువుకుంటున్న అమాయక విధ్యార్ధులను ఏవేవో చట్టాలు చేసి బయటికి తోలడానికి సన్నాహాలు చేయడం,ఏవిధమైన సహాయాలు చేయకుండా నిరోధించాలనుకోవడం ఎంతవరకు సబబు?

  పరిస్థితి గమనిస్తుంటే...ఇన్నీ చేస్తున్న మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రిగారైన కె.సి.యార్ గారిని కూడా ఏదో రోజున నీవు కూడా పూర్తి తెలంగాణ వాడివి కాదంటూ బయటికి తోలేస్తారేమో అనిపిస్తుంది.

26, జులై 2014, శనివారం

పూర్తిగా చెడిపోతున్న కాలేజీ అమ్మాయిలు!

ఈ రోజు అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంది.Boy Friend లేని అమ్మాయిలు లేరు.అలాగే Girl Friend లేని అబ్బాయిలు లేరు. (బహుశా కొంతమంది జెన్యూన్ అబ్బాయిలు,అమ్మాయిలు ఉండొచ్చు!నా అభిప్రాయం వారికి వర్తించదు)
        కట్ చేస్తే...
        నేను ఒక ప్రాంతానికి వర్కు నిమిత్తం వెళ్లి,అక్కడ రూం అద్దెకు తీసుకుని ఉన్నాను.నేను 8నెలలు ఉండాల్సి వచ్చిందిలెండి.నా పక్క ఫోర్షన్ లో మరో నాలుగు గదులున్నాయి.వాటిలో కాలేజీ స్టూడెంట్స్ ఉంటున్నారు.
        నేను వాళ్లను దగ్గర నుండి గమనించింది ఏమిటంటే....
        ఖాళీ దొరికితే చాలు..గంటల తరబడి ఫోన్లు!వెటకారాలు,నవ్వులాటలు..ఒక్కటేమిటి...అన్నీ..వీళ్లు నిజంగా చదువుకునే వారేనా అనిపిస్తుంది.వాళ్లందరూ చదువుకంటే ఎక్కువ సమయాన్ని ఫోన్ల సంభాషణకు, చాటింగులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
        రాత్రుళ్లు...మరీ దారుణం..
        అమ్మాయిల రూముల్లోకి స్వయంగా అబ్బాయిలు వచ్చి రాత్రంతా గడిపేసి వెళ్లిపోతున్నారు.కొంతమంది అమ్మాయిలైతే మరీ దారుణం వారే రాత్రి సమయాల్లో తమ,తమ Boy Friend రూములకు వెళ్లిపోతున్నారు.
        పెళ్లి కాకుండా ఇంత బరి తెగింపా?
        నాకు ఇదంతా ఏదోలా అనిపించింది.ఒళ్లు గగుర్పొడుస్తుంది.
        ఇలాంటి వారిని ఏమి చెయ్యాలి?
        ఎంతో కష్టపడి...చెమటోడ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం వారికి తమ,తలకి మించిన భారాన్ని మోస్తూ చదివించుకుంటున్న మధ్యతరగతి తల్లిదండ్రుల పిల్లలే అక్కడ ఎక్కువమంది ఉన్నారు.
        ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో..?
        ఇది ఒక ప్రాతంలోనే కాదు.అన్ని ప్రాంతాలలో ఇలాగే తగలబడింది.
        అబ్బాయిలైతే దులుపుకుపోతారు.మరి అమ్మాయిల పరిస్థితి? రేపు పెళ్లి చేసుకున్న వాడిని దారుణంగా మోసం చేయడమే కదా!రేపు గతం తాలుకు విషయాలు తప్పక తెల్సిపోతాయి.అప్పుడు వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో..ఊహించడమే కష్టంగా వుంది.
        లక్షణంగా చదువుకోవల్సిన అమ్మాయిలు..తమ చేజేతులా ఆవిరైపోతుంటే ఆవేదనగా వుంది.
        పాపం! తల్లిదండ్రులకు ఇవేవీ తెలియడం లేదు.తమ పిల్లలు మంచిగానే ఉన్నారనే భ్రమలో ఉంటున్నారు.ఈ పిల్లలు అలా నమ్మిస్తున్నారు వారిని.
        ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేదేమిటంటే...
        మీ పిల్లలపై నిఘా పెట్టండి.ఇది వారి భవిష్యత్ మంచికోసమే.బయటి వాళ్లు నిఘా పెడితే తప్పుగాని..మీరు గమనించడంలో తప్పు అస్సలు లేదు.
        ఒకవేళ వారి ప్రవర్తన బాగులేకపోతే వెంటనే పెళ్లిళ్లు చేసేయండి!అమ్మాయిల విషయంలో అయితే మరీ తొందరపడటం మంచిదని నా అభిప్రాయం.దీనికి మీరేమంటారు?

24, జులై 2014, గురువారం

మనం ఈ తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లను ఆదరిస్తున్నామా?

తెలుగు బ్లాగులను ప్రతిరోజూ ఏదో ఒక టపాతో అప్ డేట్ చెయ్యకపోతే వాటికి అడ్రస్ లేకుండా పోతుంది.వాటిని తెలుగు ప్రజలకు చేరవేసే అగ్రిగేటర్లు కొన్ని మాత్రమే ఉన్నాయి.వాటిలో మొదటి స్థానంలో కూడలి ఉంటే తరువాతి స్థానంలో మాలిక, ఆపై బ్లాగిల్లు,జల్లెడ ఉన్నాయి.ఇవే కాకుండా మరికొన్ని బ్లాగ్ ప్రపంచం,బ్లాగ్ వేదిక,పూదండ వంటివి కూడా ఉన్నాయి.వీటన్నింట్లో మాలిక మాత్రం అమిత వేగం కలది.పోస్ట్ చెయ్యడం తరువాయి వెంటనే మాలికలో ప్రచురించబడుతుంది.కూడలి,బ్లాగిల్లు మాత్రం కొద్ది సమయాన్ని తీసుకుంటాయి.ఇవి చేసే సేవ చాలా గొప్పదనే చెప్పాలి.ఎటువంటి ఆదాయం లేకుండా తెలుగు బ్లాగుల లోకానికి ఎనలేని సేవ చేస్తున్నాయి.కాని దారుణమేమిటంటే ఈ అగ్రిగేటర్లను ఉపయోగింకుంటూ వాటి లోగోలను తమ బ్లాగుల్లో ముద్రించుకోని బ్లాగర్లు నూటికి 95% మంది ఉన్నారు.వారు చేసే ఉచిత సేవ అందుకుంటూ వారికి మద్దతు ఇవ్వకపోవడం చాలా దారుణం కదూ?

16, జులై 2014, బుధవారం

ఒక ముస్లిం [విశ్వాసి]ఈ రెండు విధులనూ నిర్వర్తించకపోతే కఠినశిక్షే!


విశ్వాసి అయిన ప్రతి వ్యక్తీ రెండు విధులను నిర్వర్తించవలసి ఉందని అల్లాహ్ నిర్దేశించి ఉన్నాడు.వాటిలో మొదటి విధి 'దైవధర్మ అనుసరణ".దీనినే షరియత్ పరిభాషలో 'ఇత్తెబాయె ఇస్లాం"అని అంటారు.రెండవ విధి 'దైవధర్మ ప్రచారం దీనిని 'ఇషాయతె ఇస్లాం"అని అంటారు.ఈ రెండు విధులనూ సమాంతరంగా నిర్వర్తించవలసి ఉంది.మొదటి విధిని నిర్వర్తించి, రెండవ విధిని నిర్వర్తించక పోతే ఏ విధమైన ప్రయోజనమూ లేదు అన్న దానికి ఆధారంగా ఈ క్రింది ఖురాన్ వాక్యాలను గమనించగలరు.

    ఇంకా వారికి ఈ విషయం గుర్తు చేయి.వారిలోని ఒక వర్గం వారు మరొక వర్గంవారితో ఇలా అన్నారు: 'మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ నాశనం చెయ్యనున్న వారికి లేక కఠినంగా శిక్షించునున్న వారికి?..ఖురాన్ 7:164

  పై వాక్యాలను కాస్త నిశితంగా గమనిస్తే వాటిలో మూడు వర్గాలు కనిపిస్తాయి. అవి:
 
1.హితబోధ చేస్తున్న వర్గం.
2.హితబోధ చేస్తున్న వారిని వారిస్తున్న వర్గం.
3.హితబోధ చేయబడే వర్గం.

  మొదటి వర్గం ధర్మానుసరణ [ఇత్తెబాయె ఇస్లాం] మరియు ధర్మప్రచురణ [ఇషాయతె ఇస్లాం] అన్న రెండు విధులను కూడా చేస్తున్న వర్గం.

  రెండవ వర్గం అయితే అటు ధర్మప్రచురణ [ఇషాయతె ఇస్లాం] చేయక కేవలం ధర్మ అనుసరణ [ఇత్తెబాయె ఇస్లాం] అన్న ఒక్క విధిని మాత్రమే చేస్తున్న వర్గం.

  మూడవ వర్గం అయితే అటు ధర్మ అనుసరణ మరియు ఇటు ధర్మ ప్రచురణ అనే రెండు విధులనూ చేయని వర్గం అనగా తిరస్కార వర్గం.

  అయితే ఒకరోజు దైవశిక్ష అవతరించింది.ఆ శిక్ష నుండి ఎవరు రక్షించబడ్డారు? మరియు ఎవరు దానికి బలి అయ్యారు? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.

                                                                              More read

13, జులై 2014, ఆదివారం

వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?

 నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,ఆవులు ఇతర జంతువులు బలి అర్పిస్తూ ఉండేవారు.యజ్ఞాలలో అర్పించబడిన జంతువులను వారు భుజిస్తూ ఉండేవారు.

స్వామి భాస్కరానందగారి మాటల్లో....

    స్మృత్యనుసారంగా ఆనాటి వారికి కొన్ని జంతువుల మాంసం నిషేధం కాదు.మాంసాహారమంతగా నిషిద్ధం కాకపోయినా మనువు శాకాహారమే జీవహింస దృష్ట్యా శ్రేష్టమన్నాడు.మాంసాహారం తీసుకోవడం పాపమేమీ కాదు.కానీ తినకపోవడం ఎంతో మంచిది.ఏ ఆహారమైనా,మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి.వేదకాలం నాటి ఆర్యులు గోమాంసం భక్షకులా?కాదా? అన్న మీమాంస ఒకటి ఉన్నదివారు తినారన్నది సత్యమే.కానీ పాలిచ్చే ఆవులనెన్నడూ వారు చంపలేదు.ఆవును ఆఘ్న్యా అనేవారు.అంటే చంపకూడదని దీని అర్ధం.ఎడ్లు, లేతదూడలు,గొడ్డుబోతు ఆవులను మాత్రమే తినేవారు.ఆవుమాంసం తినకూడదన్న సంప్రదాయం చాలా ఇటీవల కాలంలో వచ్చింది.దీనికి కారణం జైనమతమని కొoదరంటారు.
                                                - స్వామి భాస్కరానంద [హిందూమత సారాంశం 58,59]

                                                                                  Read more10, జులై 2014, గురువారం

'త్రిత్వ"వాదం మరియు ;యేసు దైవత్వ"వాదం యేసు అనంతరమే క్రైస్తవంలో ప్రవేశపెట్టబడ్డాయా?

యేసు దేవుడని లేక 'తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటేన"ని ఏ ప్రచారమైతే నేడు క్రైస్తవంలో జోరుగా సాగుతుందో అది,యేసు సువార్తకు ఏమాత్రం సంబంధం లేని అన్య విశ్వాసాలని చెప్పటానికి బలమైన ఆధారం వీటిని నిరూపించే ఎటువంటి రుజువులూ పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో ఇసుమంతైనా లేకపోవడమే!!మొత్తానికి యేసు దైవత్వాన్ని ఏదో విధంగా నిరూపించాలనుకున్న ప్రయత్నంలో భాగంగా అన్యుల నుండి తెచ్చుకున్నదే ఈ త్రిత్వదైవత్వపు వాదం.

     క్రైస్తవంలో యేసు దైవత్వ సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరు?దేవుడా?అన్యుడా?

  ఇక యేసు దైవత్వపు సిద్ధాంతం సైతం యేసు అనంతరం 325వ సంవత్సరంలో విగ్రహారాధకుడైన బాప్తిస్మం పొందని అన్య రోమన్ చక్రవర్తి   'కైసర్ ఫ్లావిస్ కాన్ స్టన్ టైన్" ఆధ్వర్యంలో జరిగిన నైసియా సభలో నాడు క్రీస్తు బోధించిన 'పరిశుద్ధ ఏక దైవ ఆరాధనా విశ్వాసంలో ఈ అపరిశుద్ధ అనేక దైవారాధన విశ్వాసం"యుక్తిగా చొప్పించబడిందని క్రైస్తవ చరిత్రకారులు ఏకరువుపెడుతున్నారు.

  'బాప్తిస్మం తీసుకొనని ఈ చక్రవర్తే నైసియా సభకు అధ్యక్షత వహించి దేవుడు [యెహోవా]మరియు యేసు ఒకేసారం కలిగి ఉన్నారనే విశ్వాసాన్ని ప్రతిపాదించటంలో ప్రధాన పాత్ర వహించాడు.   -ది ఎన్ సైక్లోపిడియా బ్రిటానికా

     క్రైస్తవంలో త్రిత్వ సిద్ధాంతం ప్రవేశ పెట్టింది ఎవరు?
                                                                                 Read more

9, జులై 2014, బుధవారం

బ్లాగ్ వేదిక మరో విజయం.

ఇప్పటివరకూ బ్లాగ్ వేదికలో 300 తెలుగు బ్లాగులు అనుసంధానించబడ్డాయి.ప్రముఖ అగ్రిగేటర్లకు ఇంచుమించు తక్కువ కాకుండా బ్లాగ్ వేదిక రూపాంతరం చెందింది.ఎన్నో శీర్షికలు రూపొందించింది.ఇంకా మరెన్నో ఫీచర్స్ రానున్నాయి కూడా.త్వరలో బ్లాగ్ యాడ్స్ ద్వారా తెలుగు బ్లాగర్లకు కొద్దో,గొప్పో ఆదాయాన్ని సమకూర్చే విధానం కూడా ప్రవేశపెట్టనుంది.ఇవే కాకుండా ఇంగ్లీష్ బ్లాగుల పోర్టల్ కూడా అందించనుంది.దానితో పాటు ప్రతి సబ్జెక్ట్ మీద బ్లాగులను వేరు పరచి బ్లాగు వీక్షకులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేయనుంది.
       
        బ్లాగు క్రియేట్ చేయాలన్నా,టెంప్లేట్ మార్చాలన్న,ఏవిధమైన సమాచారమైనా బ్లాగ్ వేదికలో దొరికే ఏర్పాటు చేయనుంది.

        బ్లాగ్ వేదిక ప్రవేశ పెట్టిన శీర్షికలలో 'బ్లాగర్ల పరిచయాలు 'ప్రత్యేకమైనది.ఎందుకంటే ప్రతి బ్లాగరును తెలుగు ప్రజలకు తెలియచేయటం ప్రధాన ల్క్ష్యంగా కొనసాగుతుంది.దీని నిమిత్తం Facebook, twitter లాంటి సోషల్ సైట్ల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది.
        ఇలా..ఎన్నో...మరెన్నో శీర్షికలు,ఫీచర్లు త్వరలో రానున్నాయి.
        మీరు కూడా ఓ మంచి బ్లాగరైతే ఈ క్షణమే మీ బ్లాగును బ్లాగ్ వేదికతో అనుసంధానించండి.
                                           
                                              మీ
                                         బ్లాగ్ వేదిక టీం

                                 http://blogvedika.blogspot.in/
                                              

7, జులై 2014, సోమవారం

దివ్య ఖుర్'ఆన్ తెలుగులో

దివ్యగ్రంధం ఖుర్ ఆన్ తెలుగులో ప్రారంభించబడింది.ప్రతిరోజూ కొద్ది,కొద్దిగా మీకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుంది.ఖుర్ ఆన్ యొక్క గొప్పతనం అది అధ్యయనం చేసే వారికే తెలుస్తుంది.దాని గొప్పతనం వర్ణించలేనిది.ఈరోజు అత్యధిక ముస్లిం సమాజం ఉన్నతమైన స్థితిలో లేదు అంటే దానికి ప్రధానకారణం ఖుర్ ఆన్ యొక్క ఆదేశాలను పెడ చెవిన పెట్టడమే.

                            ఖుర్ ఆన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

4, జులై 2014, శుక్రవారం

యేసువారు నిజంగానే పునరుత్థానుడా?

యేసువారు పాపులకోసం చనిపోయి మూడవదినమున లేచి పునరుత్థానము చెందడం వాస్తవమేనా? మీరు కూడా చదవండి.పరిశీలించండి.      Read More

28, జూన్ 2014, శనివారం

ఓ చిన్న శుభవార్త

ప్రియమైన బ్లాగ్ రీడర్లకు ఓ చిన్న శుభవార్త.ఇకనుండీ వెన్నెలకెరటం బ్లాగ్ పత్రికను నడిపించాలని సంకల్పించాము.దీనికొరకు మీ సహాయసహకార్యాలు మాకు కావాలి.దయచేసి ఈ పత్రికను ముందుకు నడిపించడానికి కావల్సిన ప్రోత్సాహాన్ని అందించవల్సిందిగా కోరుచున్నాము.

                       మీ సహాయసహకార్యాలు కోరుకుంటూ....
                             
                                    మీ
                             వెన్నెలకెరటం ఎడిటర్

                     http://vennelakeratam.blogspot.in/  

23, జూన్ 2014, సోమవారం

2.యేసు దేవుడా?

తనను ఒకడు పంపితేనేగాని ఈ లోకానికి రాలేని యేసు దేవుడు ఎలా కాగలరు?

    యేసు నిజంగా దేవుడే అయివుంటే ప్రజలకు ప్రత్యక్షమవటం,అవ్వకపోవడం అన్నది ఆయన స్వీయ అభీష్టం ప్రకారమే జరగాలి.ఎందుకంటే దేవుడనేవాడు 'సర్వస్వతంత్రుడై' ఉంటాడు.'పరతంత్రుడై' ఉండేవాడు దేవుడు ఏమాత్రం కాలేడు.ఈ విషయంలో యేసును 'ఓ యేసూ!మీరు స్వయంగా ఈ లోకానికి వచ్చారా?లేక మిమ్మల్ని ఎవరైనా పంపించారా?'అని ప్రశ్నిస్తే యేసు స్వతహాగా ఇచ్చే సమాధానం ఏమిటో ప్రత్యక్షంగా చూడండి.

...నేను దేవుని[యెహోవా] యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను,నా అంతట నేనే వచ్చి యుండలేదు,ఆయన నన్ను పంపెను. -యోహాన్:8:42

   తన అభీష్టంతో ఈ లోకానికి రాలేదని యేసు స్వయంగా చెబుతున్న పై వాక్యాలనిటి ద్వారా అర్ధమవుతుంది.మరెలా వచ్చారు?సర్వశక్తిగల దేవుడైన యెహోవా పంపగా వచ్చారు.ఒకవేళ యేసు యెహోవా వంటి దేవుడే అయి వుంటే స్వతహాగా రావాలి.ఒకరు పంపితే వచ్చేవాడు దేవుడు ఎలా కాగలడు?

కనీసం తన సొంత బోధ చేయలేని యేసు దేవుడు ఎలా కాగలడు?

    అందుకు యేసు-నేను చేయుబోధ నాదికాదు;నన్ను పంపిన తండ్రిదే. -యోహాన్: 7:16
    నన్ను పంపినవాడు సత్యవంతుడు,నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.  -యోహాన్ 8:26
    ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు.నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ణ యిచ్చియున్నాడు. -యోహాన్ 12:49
 
    పైవాక్యాలన్నిటి ప్రకారం యెహోవా దేవుడు ఆదేశించిన దానిని తప్ప యేసు సొంతంగా మాటలాడే కనీస అర్హతను సైతం కలిగిలేరని స్వయంగా ఆయన చేస్తున్న బోధనల ద్వారానే తెలుస్తుంది.అటువంటప్పుడు యేసు దేవుడు ఎలా కాగలరు?
                                                             దీనికి ముందు పేజీ చదవండి         ఇంకా వుంది

                                                                   More Blog information

మీ బ్లాగు Speed Up అవ్వాలనుకుంటున్నారా?ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
http://techclubinworld.blogspot.in/

20, జూన్ 2014, శుక్రవారం

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

7, జూన్ 2014, శనివారం

యేసు దేవుడా?

కనీసం స్వీయ జీవశక్తి లేని యేసు దేవుడు ఎలా కాగలరు?
       జీవముగల తండ్రి[యెహోవా]నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే...    -యోహాన్ 6:57
       మీ జీవము ఎవరిది?అని ప్రశ్నిస్తే 'నా జీవము నా తండ్రి ప్రసాదితం' అని యేసు సమాధానం ఇస్తున్నారు.అంటే నా స్వీయ జీవశక్తితో నేను జీవించటం లేదు అనేకదా!యేసు-'నా తండ్రి మూలముగా జీవిస్తున్నాను ' అని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆయన ఈ క్రింది యధార్ధాన్ని తెలుసుకున్నారు.ఏమిటి ఆ యధార్ధం?
       యెహోవాయే నిజమైన దేవుడు,ఆయనే జీవముగల దేవుడు,సదాకాలము ఆయనే రాజు.    -యిర్మియా 10:10
       కనుక ఈనాటి అధికశాతం క్రైస్తవ పండితులు చేసే యేసు దేవుడు అనే వాక్య విరుద్ధ అబద్ధ ప్రచారాన్ని నమ్మక, యేసు పరిచయం చేస్తున్న స్వీయ జీవశక్తిని కలిగియున్న యెహోవానే నిజమైన దేవునిగా నమ్ముకోండి.కనీసం జీవశక్తి లేకుండా,మరొకనిపై ఆధారపడి ఉన్న యేసు ఎలా దేవుడు కాగలరు?
                                                                                  Next Page

1, జూన్ 2014, ఆదివారం

"మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-3

హిందువులారా దీనిని తప్పక చదవండి,చదివించండి!

క్రైస్తవమతం ముసుగులో పాశ్చాత్య విష సంస్కృతి ప్రచారం!? 


బైబిల్ ప్రకారం- నిత్యజీవం పొందటానికి క్రైస్తవమతం స్వీకరించవలసిన అవసరం లేదు!

     నేటి క్రైస్తవ పండితుల ప్రచారహోరును బట్టి- ఇహలోక జీవితంలో "శాంతి"-పరలోక జీవితంలో "ముక్తి"వంటి ఉభయ లోక ప్రయోజనాలు లభించాలంటే-"క్రైస్తవమతం స్వీకరించక తప్పదు"అనే ఒక అపోహకు చాలా మంది గురవుతున్నారు.ఇది "క్రైస్తవ పండితుల కాల్పనిక భావన" తప్ప బైబిల్ గ్రంధ యధార్ధం"మాత్రం కాదనే విషయాన్ని క్రింది వాక్యాలు తెలుపుతున్న వైనాన్ని గమనించగలరు.
      ఆయన [యెహోవా దేవుడు] ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమునిచ్చును.-రోమా 2:6
     పై వాక్యంలో- ప్రతివానికి"అనగా లోకంలో ఉన్న మతస్తునికైన సరే వానివాని "మతము" చొప్పున అనికాక "వానివాని క్రియల చొప్పన అన్న దానిని బట్టి-క్రైస్తవమతానికి ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టమవుతుంది.నిత్యజీవమును పొందటానికి క్రైస్తవ మత స్వీకారం ఏకైక మార్గమా?లేక మరొక మార్గం ఏదైనా ఉందా?అన్న ప్రశ్నకు క్రింది వాక్యం ఇచ్చే సమాధానం ఏమిటో గమనించగలరు.
     సత్ క్రియలను ఓపికగా చేయుచు,మహిమ,ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. - రోమా 2:7
     వాక్యాల ప్రకారం -నిత్యజీవమూను పొందటానికి క్రైస్తవ మత స్వీకారంతో ఎలాంటి సంబంధం లేకుండా,ఎవరైతే సత్ క్రియలను ఓపికగా చేస్తారో ఇంకా తన మహిమను,ఘనతను మరియు అక్షయతను అన్వేషిస్తారో అలాంటి వారికి నిత్యజీవమును ప్రసాదిస్తానని దేవుడైన యెహోవా స్వయంగా ప్రకటిస్తున్న వైనం పై వాక్యాలలో కనిపిస్తుంది."నిత్యజీవమును పొందటానికి మార్గం బైబిల్ చెబుతున్న పై విషయాలే గాని నేటి క్రైస్తవ పండితులు చెబుతున్న క్రైస్తవ మత స్వీకారం కాదని తెలుస్తుంది.
       అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును....-రోమా 2:9
      బైబిల్ గ్రంధం ప్రకారమైతే- *భేదములు పుట్టించి *సత్యమునకు లోబడక *దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమున వచ్చును"అని ప్రకటిస్తుంది.అయితే నేటి అధికశాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే -క్రైస్తవులుగా మారనివారిపై దేవుని ఉగ్రతయు రౌద్రమున వచ్చును"అని ప్ప్రకటించబడుతుంది.దీనిని బట్టి -వారి ప్రచారం బైబిల్ గ్రంధానికి  విరుద్ధమైన అసత్య ప్రచారమని తేటపడుతుంది.
      దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు,మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడ,శ్రమయు వేదనయు కలుగును. సత్ క్రియ చేయు ప్రతివానికి,మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ మహిమ ఘనతను సమాధానమును కలుగును. రోమా 2:9-10
  దుష్కార్యము చేయు ప్రతి యుని ఆత్మకు [అతడు మతవర్గం వాడైనా సరే వానికి]శ్రమయు వేదనయు కలుగును"అని పైన పేర్కొన్న బైబిల్ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది.కాని నేటి అధిక శాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే క్రైస్తవులుగా మారనివారిపై శ్రమయు వేదనయు కలుగును"అని బైబిల్ కు పూర్తి విరుద్ధంగా ప్రకటించబడుతుంది.
   అలాగే "సత్ క్రియ చేయు ప్రతివానికి [అతడు మతవర్గం వాడైనా సరే వానికి]మహిమను,ఘనతను సమాధానమును కలుగును" అని పైన పేర్కొన్న అదే బైబిల్ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది.కాని నేటి అధిక శాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే క్రైస్తవులుగా మారినవారిపై "మహిమను ఘనతను సమాధానమును కలుగును"అని బైబిలుకు పూర్తి విరుద్ధంగా ప్రకటించబడుతుంది.
      విధంగా "నిత్యజీవము" లేక "నిత్యమరణము"లను నర్ణయించేది "సత్ క్రియ" లేక "దుష్ క్రియ "అని బైబిల్ గ్రంధం చెబుతుంటే - నామకార్ధ క్రైస్తవ పండితులైతే "క్రైస్తవ మతం తీసుకోవటం" లేక "క్రైస్తవ మతం తిరస్కరించటం"అని అంటున్నారు.ఇది ఎంత దారుణమైన  వాక్య అతిక్రమణో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించగలరు.బైబిల్ గ్రంధంలో దేవుడు మతపరమైన విభజనను ఎందుకు చేయలేదు?అన్న ప్రశ్నకు క్రింది వాక్యం ఇచ్చే సమాధానం ఏమిటో చూడగలరు.
            దేవునికి పక్షపాతములేదు...... - రోమా 2:11
     అంటే నామకార్ధ క్రైస్తవ పండితులలో పక్షపాతం ఉన్నట్లే కదా!అందుకే వారు క్రైస్తవేతరులతోనే కాక స్వయంగా తమ క్రైస్తవుల మధ్య సైతం పక్షపాతాన్ని పాటిస్తూ "డినామినేషన్ల భేదము"లను పుట్టిస్తూ వీరే ఎలక్ట్రానిక్ మీడియాలో పరస్పరం దూషించుకుంటూ తమ అసలు నైజాన్ని చాటుకుంటున్నారు.
       పై అంశం వివరణను బట్టి ,బైబిల్ ప్రకారం -నిత్యజీవం పొందటానికి క్రైస్తమతం స్వీకరించవలసిన అవసరం ఏమీ లేదని సుస్పష్టమవుతుంది.

    మతమార్పిడిని నిరసిస్తున్న యేసు!
  అయ్యో,వేషధారులైన శాస్త్రులారా,పరిసయ్యులారా,ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు;అతడు కలసినప్పుడు అతనిని మీ కంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. -మత్తయి 23:15
  దుష్ క్రియలు పోయి-సత్ క్రియలు రాకపోయినప్పుడు మతం మారటం వలన ఒరిగేదేమీ ఉండదు.బైబిలుకు వ్యతిరేక బొధలు చేసే క్రైస్తవ పండితులు తమతో పాటు తమ అనుయాయులనూ నరకానికి తీసుకుపోవటం తప్ప మరేమీ చేయగలరు? విషయాన్నే పైవాక్యంలో యేసు ఎంతో ఆవేదనతో తెలుపుతున్నారు.దీనిని బట్టి యేసు కూడా క్రియాత్మకమైన మార్పును కోరుకున్నారేగాని,మతమార్పిడిని,పేరు,సంస్కృతుల మార్పునుగాని ఎన్నడూ కోరుకోలేదని బోధపడుతుంది.
    అందుకే క్రైస్తవులు కాకపోతేనే మేలని బైబిల్ గ్రంధం ప్రకటిస్తుంది!
   ఇప్పటివరకు సాగిన వాక్యపరిశీలన ద్వారా-అన్యులకు తప్ప యేసును నమ్ముకున్న క్రైస్తవులకు పాపక్షమాపణ లేదని తేలిపోయింది.అలాగే "యేసు పాపుల రక్షకుడు"కాదని కూడా తేలిపోయింది.క్రైస్తవమత స్వీకారం ద్వారా మాత్రమే కాక,దుష్ క్రియను విడిచి సత్ క్రియను ఆచరించి మతవర్గం వానికైనా "నిత్యజీవం"లభిస్తుందని తెలిసింది.కనుక క్రింది వాక్యం చెబుతున్నదేమిటో చూడగలరు.
   వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని,తమకు అప్పగింపబడిన పరిశుద్దమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుటకంటే [క్రస్తవ] మార్గం అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. -పేతురు 2:21
   ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు చిన్నపాటి పాపానికి పాల్పడకూడదు.అది ఎంత గొప్ప భక్తునికైనా సాధ్యం కాని విషయం.మనిషి అన్నాక ఎంతోకంత పాపానికి పాల్పడుతూనే ఉంటాడు.అటువంటప్పుడు క్రైస్తవ్యం గురించి తెలుసుకుంటే మేలుకంటే కీడే ఎక్కువ!అందుకే-క్రైస్తవమార్గము తెలియకపోవుటయే ప్రజలకు మేలు"అని పైవాక్యం కోరుతుంది.దీనిని బట్టి "యేసు పాపుల రక్షకుడు-క్రైస్తవ్యం రక్షణమార్గం"అని జరుగుతున్న ప్రచారం బైబిల్ గ్రంధానికి వ్యతిరేకమైన అసత్యప్రచారమని తెలుస్తుంది.

                                                          దీనికి ముందు పేజీలు :   1     2   
                                    
                                                                                           ఇంకా ఉంది...త్వరలో...

Comments here