28, డిసెంబర్ 2013, శనివారం

యేసువారు నిజంగానే పునరుత్థానుడా?

పునరుత్థానదినం నాడు- మృతులను తీర్పు గూర్చి సమాధిలలో నుండి లేపటానికి యేసు వస్తారని యోహాన్ సువార్తలోని పై వాక్యాలు తెలుపుతున్నాయి.ప్రళయం నాడు ప్రపంచం అంతా అంతమైపోతుంది.ఆ నాడు ప్రతిజీవి మరణించి,అంతా నాశనమైపోతుంది.ఆ తరువాత అంతిమ పునరుత్థానము [GENERAL RESURRECTION] సంభవిస్తుందనేది యధార్ధం.అలాంటప్పుడు కొందరు క్రైస్తవులు మేఘాలలో యేసును ఎదుర్కొనబోయి నిరంతరం ఆయనతో సజీవంగా ఉండిపోవడానికి,ప్రళయం నాడు మరణించకుండా ఉండడం ఎలా సాధ్యం? ఈ విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాకుండా దీనిని ప్రచారం చేయమంటాడు పౌలు. [ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించికోండి] ఇంకా పై వచనాల [యోహాన్ 5:28-29]లో 'తాను మృతులను లేపుటకు వచ్చునప్పుడు కొందరు క్రైస్తవులు సజీవంగా ఉంటారు.వారిని మేఘములలో నాతోపాటు కొనిపోతాను.వారు నిత్యం నాతో ఉంటారూ అని యేసు చెప్పకపోవడం మరో విశేషం. More

6, డిసెంబర్ 2013, శుక్రవారం

పరలోక విశ్వాసం - ప్రాచీన భారతదేశం

పరలోక విశ్వాసం సార్వజనీన సిద్ధాంతం.దాన్ని అన్యసిద్ధాంతం లేక భారతీయేతర  సిద్ధాంతం అని అనుకోవడం పొరపాటు.ఈ సిద్ధాంతాన్ని నమ్మడం అంటే ఓ భారతీయేతర సిద్ధాంతాన్ని నమ్మడం అని అర్ధం కాదు.సత్యం విషయంలో అది భారతదేశానికి సంబంధించినదా లేక భారతదేశానికి ఆవల నుండి వచ్చిందా అనిచూడ్డం అనేది అనవసరం.సత్యం ఎక్కడ,ఏ రూపంలో ఉన్నా అది పూర్తిగా మానవాళి ఉమ్మడి సొత్తు.
              ప్రస్తుతం జీవితానికి సంబంధించిన ఇతర దృష్టికోణాలను వదిలి మనం కేవలం పరలోక వాదాన్నే తీసుకుని ఈ విషయంలో భారతదేశ సంప్రదాయాలు,సంస్కృతి ఎలా ఉన్నాయో చూద్దాం.
              అనేక రుగ్మతలకు, కాలానుగుణమైన మార్పులకు చేర్పులకు గురైనా,పరలోక భావనకు సంబంధించిన ఈ ప్రభావాలు భారతీయ సంస్కృతిపై, ఆలోచనలపై ఎలా పడ్డాయి అనేది సమీక్షించి చూపించాల్సి ఉంది.పునర్జన్మ సిద్ధాంతపు ఉనికి కూడా పరలోక విశ్వాసాన్ని రూపుమాపడంలో కృతకృత్యం కాలేకపోయింది.ఇది నిజంగా పరలోక విశ్వాసం, మానవ ప్రకృతికి అనుకూలమైనది అనడానికి ఓ నిదర్శనం.ఇంకా,ప్రాచీన భారతదేశంలో ఈ పరలోక భావన ఎంత లోతుగా వ్రేళ్లూనుకుని ఉండేదో, దాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలకు ఎలా సాధ్యం కాకపోయిందో చెప్పేందుకు కూడా ఓ ఉదాహరణే.
              భారతీయ సంప్రదాయాలకు సంబంధించి అధ్యయనం ,ఆర్యుల నాగరికత,సభ్యతల వరకు వచ్చి ఆగి పోతుంది. అంతకు పూర్వపు విషయాలను పరిశీలించడo జరుగదు. ఈ విశయమ్లొఅ కొన్ని అపార్ధాలు ,మరికొన్ని గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆర్యులకు పూర్వం ఇక్కడ మనుగడ సాగించిన  జాతుల గురించిన పరిశోధనలు నామమాత్రంగానే ఉండిపొయాయి.
             ఆర్యులకు పూర్వముండిన జాతుల భాషలు ,వారి చరిత్ర, నాగరికతలను గురించి తెలుసుకునేందుకు మన దగ్గర ఉన్న వనరులు అతి తక్కువ [నామమాత్రమే] అయినా,ఆర్యులకు పూర్వం భారతదేశంలో ద్రవిడ నాగరికత అనే గొప్ప నాగరికత విలసిల్లిందని చెప్పుకోవడం జరుగుతుoది. దాని ప్రభావం ఆ తరువాత వచ్చిన జాతులపై కూడా పడిoది. ఆశ్చర్యo ఏమిటంటే ,ఈ ద్రవిడ నాగరికతల సంబంధం,ఈజిప్ట్,బాబిలోనియా నాగరికతలతో ముడిపడి ఉండడం, ఇదె విధముగా కోల్ భాషల అధ్యయనం ద్వారా అనేక క్రొత్త యదార్దాలు వెలుగులోకి వచ్చాయి. కోల్ జాతిని ఇప్పటిదాకా ఓ అనాగరిక జాతిగా కొట్టి పారేయడం జరిగిoది.కాని ఆ తరువాతి పరిశొధనలు మన ఈ వైఖరి సరైంది కాదు అని తేల్చి చెప్పాయి. కోల్ భాష ఆస్ట్రేలియా,ఆసియా ఖండాలలో వ్యాపించి ఉన్న వివిధ భాషలతో సంబందం గలిగి ఉందని రుజువవుతుoది . మన పట్టణాలకు సంబందిoచిన అనేక పేర్లు కోల్ భాషలోనే ఉన్నాయి. ఇదే కాకుండా మనం  ఉపయోగించే అనేక వస్తువుల పేర్లు కూడా కోల్ భాషల నుండే గ్రహింబడ్డాయి ఇదే విధంగా ఆ తరువాత వచ్చిన జాతుల ,ఈ సిద్ధాంతాలు,నమ్మకాలు మా స్వంతం అనుకున్నవి కూడా కోల్ జాతికి సంబందించిన సిద్ధాంతాలు,నమ్మకాలే. అయితే ఈ విషయంలో జరిగిన పరిశోధనలు అతిస్వల్పం ప్రొపెసర్ సిల్వాన్ లెవి ,ఆయన శిష్యులు చేసిన భాషాపరమైన పరిశోధనల వల్ల  కొన్ని రహస్యాలు మాత్రం వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో మరిన్ని పరిశొధనలు జరిగితే,ఇక్కడి జాతుల సన్మార్గం లేక అపమార్గానికి సంబంధించిన ఎన్నో విషయాలను కనుగొనవచ్చు.
                                                                 1      2      Next