15, నవంబర్ 2013, శుక్రవారం

అత్యాచార నిర్మూలనకు పరిష్కారం లేదా?

భారతదేశం ఒకప్పుడు ఒక ప్రజాస్వామిక సభ్యసమాజం, ప్రపంచదేశాలన్నీ భారత్ గొప్పతనాన్ని,కీర్తిని ఎలుగెత్తిచాటేవి. ఆదర్శవంతమైనదేశంగా ఎంతో కీర్తించేవి. ఇక్కడి మహిళలను ఎంతో గౌరవోన్నతులుగా, సంప్రదాయ బద్దమైన మణులుగా కొనియాడేవారు. కానీ...నేడు...భారతదేశ మహిళలకు రక్షణే కరువైపోయింది. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు విచ్చలవిడిగా, భయంకరమైన పైశాచికత్వంతో అత్యాచారాలు చేసి హతమార్చే మానవమృగాలు పెరిగిపోయాయి. నేడు ధిల్లీ నిర్భయ...నిన్న అయేషా మీరా..మొన్న విజయవాడ శ్రీలక్ష్మి....ఇలా ఎందరో అమాయక అమ్మాయిలు మానవమృగాలకోరలకు, పైశాచిక రాక్షసులకు ఘోరంగా బలైపోయారు.దేశాన్ని పరిపాలించే అధినాయకులు సైతం కంటనీరు పెట్టుకోవడం, కళ్లు తుడుచుకోవడం తప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి భారతదేశం దిగజారిపోయిందా?ఇక ఘోరలకు అడ్డుకట్టలేదా? మన మహిళలకు మనం రక్షణ కూడా కల్పించలేమా?ప్రశాంతంగా, ధైర్యంగా జీవించే హక్కు వాళ్లిక కోల్పోయారా?ఒళ్లు గగురు పొడిచే ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తున్నాయి.మా మానాలతోనూ, ప్రాణాలతోనూ ఆటలాడుకునే నరరూప రాక్షసులను నడిరోడ్డు మీద నిలబెట్టి ఉరితీయండని ఎంతో ఆవేదనతో కళ్లనీళ్ల పర్యంతమై రెండు చేతులూ జోడించి వేడుకుంటున్న మహిళకు, ముక్కుపచ్చరాలని అమ్మాయిలకు,చిన్నారులకు పరిష్కారం లేదా?ఆధ్యాత్మిక మతపెద్దలు, రాజకీయనాయకులు,కమిటీలు చూపించే యావజ్జీవ జైలుశిక్ష పరిష్కారం కాగలదా? సం//ల తరబడి వాయిదాలు,సానుభూతులు,తప్పించడానికి ఏవిధమైన అవకాశాలు లేనప్పుడు విధించే తప్పనిసరి ఉరిశిక్ష విధించే చట్టాలు ఉపయోగపడగలవా? నేటి మహిళలకు న్యాయం చేసే..... రక్షణ కల్గించే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? మానవనిర్మిత చట్టాలలోనా? దైవశాసిత చట్టాలలోనా? కరెక్ట్ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? మీరు చెప్పగలరా?

10, నవంబర్ 2013, ఆదివారం

స్నేహమంటే ఇదే!

* పరిచయమైన వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు నీ గురించి ఎక్కువగా చెప్పవద్దు.తమ గురించి వారు చెప్పుకున్నదంతా జాగ్రత్తగా వింటే చాలు.అందరూ మిత్రులవుతారు.
* నువ్వు ఇప్పుడు ఎంచుకున్న మిత్రులను చూస్తే భావిజీవితంలో ఎలాంటి విలువలను ఆపాదించుకోబోతున్నావో చెప్పవచ్చు.
* మన మిత్రులు జ్ఞానవంతులైతే భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచనలు జరుగుతాయి.సామాన్యులైతే చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి చెబుతారు.అజ్ఞానులైతే ఇతరుల గురించి సొల్లు కబుర్లు చెప్పి విసిగిస్తారు.
* స్నేహితులను చాలా గౌరవంతో చూడాలి.కాలగతిలో నువ్వు చెప్పిన కబుర్లను మరచి పోతారేమోగాని,వారిని ఎంత గౌరవంగా చూసేవారో జీవితాంతమూ గుర్తుపెట్టుకుంటారు.
* స్నేహం కూడా మన లోగిలిలో ఉన్న పూలతోటవంటిదే.రోజూ నీళ్లు పోసి పోషణ చేస్తే పూలు గుత్తులు,గుత్తులుగా పూస్తాయి.
* స్నేహం అనే తోటలో ఎన్నో పువ్వులు వికసిస్తాయి.ప్రతి పువ్వుకూ ఓ అందం,సువాసన,విశిష్టత ఉంటుంది.స్నేహితులూ అంతే.
* స్నేహం స్నేహాన్నే కోరుతుంది.వేరే ఏ ప్రతిఫలాన్ని కోరదు.

6, నవంబర్ 2013, బుధవారం

అత్యాచారాలు ఆగాలంటే...?

విజయవాడ నుంచి వెళ్తున్న ట్రైన్ బోగీలో 27సం//ల ఓ వివాహిత దారుణంగా అత్యాచారానికి గురైంది.ఇలాంటి వార్తలు ప్రతిరోజూ T.V లలో న్యూస్ పేపర్లలో కానవస్తూనే వున్నాయి.దీనినిబట్టి అర్ధమయ్యేదేమిటంటే ఇంతకీ మానవమృగాల సంఖ్య తగ్గడం లేదు.పెరుగుతూనే పోతుంది. నిర్భయ చట్టం ఎందుకు పనికిరాకుండా పోతుంది.ఆ చట్టం పట్ల ఈ వెధవలకి ఏమంత భయంగాని,భీతిగాని ఏవీలేవు.
        ఎందుకిలా జరుగుతుంది?
        మన స్త్రీలకు రక్షణ కలిపించలేని చట్టాలున్నాయా?
        ఈ రోజు స్త్రీ ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తే చంపుతున్నారు.ట్రైన్లలో ప్రయాణిస్తే చంపుతున్నారు.ఆఖరికి ఇంటిలో ఒంటరిగా ఉంటే రక్షణ కూడా లేదు. రేప్ చేయడం,తగలబెట్టడం,అతికిరాతకంగా,పైశాచికంగా హింసించి చంపడం.ఇదేం దారుణం.మనం ఏం చేయాలి? మనదేశం ఇక్కడనుండీ మానభంగాల మహా భారత్తేనా?
        ఇప్పుడున్న నిర్భయ చట్టాలేవీ పనిచేయవు!ఒక్కటే పరిష్కారం!
        ఎవరైతే స్త్రీల పట్ల అత్యాచారాలకు పాల్పడ్డారో వారిని నడిరోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపాల్సిందే! ఇదొక్కటే పరిష్కారం.
        మానవ నిర్మిత చట్టాలేవీ పనికిరావు.
        దైవచట్టాలు అమలులోకి రావాల్సిందే!
        మహాప్రవక్త[స] వారు ఈ విషయంలో దిశానిర్దేశ్యం ఎప్పుడో చేసేశారు.మహిళ పట్ల అత్యాచారానికి పాల్పడినవాళ్లను ప్రజలందరి మధ్య నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేయమన్నారు.నిందుతుల విషయంలో వెంటనే శిక్షను అమలు చేయాలన్నారు.వాయిదాలు నిషిద్ధమని చెప్పారు!
        ఆ నేరం పట్ల ప్రజలలో వేడి,వేడి ఉంటుంది.ఆ సమయంలో శిక్షించడం వల్ల ఒక భయం పుడుతుంది.ఆ భయం నేరాలకు దూరంగా వుంచుతుంది.అలా కాకుండా ఆ వాయిదా, ఈ వాయిదాలని సం//ల తరబడి కాలయాపన చేయడం వలన నేరస్తులకు తప్పించుకోవడానికి అనేక మార్గాలు దొరుకుతాయి. ఢిల్లీ బస్సులో అతి కిరాతకంగా చంపిన నిర్భయ విషయంలో నేరస్తుల తరుపున కూడా వాదించడానికి లాయర్లు ఉన్న దేశం మనది.నేను కూడా ఓ స్త్రీ గర్భాన పుట్టానే అనే ఇంగిత జ్ఞానం లేని కొంతమంది లాయర్లు ఉన్నారు.ఈ పనికిమాలిన వ్యవహారం లేకుండా వెంటనే శిక్షించడం ఉత్తమం,ప్రయోజనం.
      ఇక స్త్ర్రీల విషయానికొస్తే...
      ఇంత జరుగుతున్నా ఏమంత భయం కూడా వీరికి లేదు.ప్రియులతో ఒంటరిగా గడపటాలు,పార్కులకూ,పబ్బులకూ,అర్ధరాత్రుల వరకూ సినిమా షికార్లు ఏమాత్రం మానలేదు. ఈ అత్యాచారాలన్నీ ఎక్కువశాతం వీరిపట్ల మాత్రమే జరుగుతున్నాయి.
      ఒంటిమీద అందచందాలు, ఒంపుసొంపులు బహిర్గతమయ్యేలా బత్తలేసుకు తిరగడం, పెదాలనిండా లిప్ స్టిక్ రాసుకోడాలు, నడకలలో వయ్యారాలు, అందులో మళ్లీ అందరూ తనను చూస్తున్నారా...లేదా? అనే ఓ పనికిమాలిన స్టైల్!
      పెళ్లైన తర్వాత ఆ అందాలన్నీ చేసుకున్న మొగిడికి చూపించుకోవాలి.బయటి మృగాళ్లకు కాదు.
      స్త్రీలలో అనేకమంది హద్దులు దాటిపోతున్నారు.ఈ దిక్కుమాలిన సినిమాల ప్రభావం పెరిగిపోయింది. ఒంటిమీద ఎంత చిన్న గుడ్డముక్క ధరిస్తే అంత రెమ్యూనరేషన్ దక్కుతుంది వాళ్లకు. డబ్బులకోసం వారలా నటిస్తున్నారు.బయటికొస్తే వారికి బోల్డు బందోబస్తు,పబ్లిసిటీ!
      సినిమా వాళ్లలా తయారయితే మనకెవడిస్తాడు బందోబస్తు.నిజానికి సినిమా జీవితానికి, రియల్ జీవితానికి ఏమాత్రం సంబంధం లేదు.కాబట్టి మహిళలు పద్దతి మార్చుకోవాలి. చక్కగా,నిండుగా బట్టలేసుకుని భారతదేశ స్త్రీలా తయారవ్వండి.ఫారిన్ కల్చర్ స్త్రీలా కాకుండా!

                 ఆధ్యాత్మిక ఆర్టికల్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

4, నవంబర్ 2013, సోమవారం

వీళ్లకిదేం పోయేకాలం?

ఆర్మీ సైన్యాలు ఒకపక్క దేశాన్ని కాపాడుతూ ఉంటే ...మరోప్రక్క దేశంలో ఆడవాళ్లు అతిదారుణం,కిరాతంగా బలవుతూ ఉన్నారు.ఒకసారి సైన్యాన్ని మూటముళ్లు సర్ధించి దేశంలో ఒకసారి అత్యాచార కేసులన్నీ సర్వే చేయించి ఎక్కడికక్కడ ఆ మానవమృగాలను వెదికి,వెదికి...పిట్టలను కాల్చినట్టు కాల్చిపారేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందిగదా! అనుకునేవాడిని. ఈరోజు క్రింది వార్త చూసి ఆఖరికి ఆర్మీలో కూడా ఇటువంటి మానవమృగాలున్నాయని తెలిసి మనసు ఎంతో వేదనకు గురైంది.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువతిపై అత్యాచారయత్నం చేసిన కేసులో ముగ్గురు జవాన్లను పోలీసులు అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సికింద్రాబాదులోని ఓ యువతిపై ముగ్గురు ఆర్మీ జవాన్లు అత్యాచారానికి యత్నించినట్లు తుకారాంగేట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అక్కడి తన స్నేహితుడిని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి వారు ఈ కిరాతకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.
         
                     ఆ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

2, నవంబర్ 2013, శనివారం

ఎప్పుడూ సంతోషంగా ఉండడం ఎలా?

మనచుట్టూ కష్టాల పుట్టగొడుగులు ఎన్ని మొలచినా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి.కష్టం,సుఖం,లాభం,నష్టం ఏదైనా ప్రతిరోజూ కొత్తగా భావించి ఆ రోజును ఆస్వాదించాలి.గొప్పవిజయాలు సాధించలేకపోయినా విజయాలు సాధిస్తే చాలని భావించండి.ఆనందించడం, గెలుపొందడం ముఖ్యం.అవి పెద్దవే కానఖ్ఖరలేదు.ఎవరూ పుట్టుకతో సంతోషాన్ని వెంటతెచ్చుకోరు.సంతోషంగా వుండడం అలవాటు చేసుకోవాలి.
     సంతోషంగా ఉన్నవాని చుట్టూ ప్రత్యేక పరిస్థితులు వుండవు.సంతోషంగా ఉన్నవారు ప్రత్యేక లక్షణాలు కలిగివుంటారు.ఒక్కసారి ఈ లక్షణాలు గ్రహిస్తే మీరు మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని కొలిచే సాధనంగా కాక, వాతావరణాన్ని సృష్టించే వారుగా మారగలుగుతారు.

                                ఆధ్యాత్మిక ఆర్టికల్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.