2, మార్చి 2019, శనివారం

సుఖనిద్రతో సుఖమయ జీవితం!

రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున4 గంటల మధ్య గల సమయంలోనే శరీరంలోని హార్మోన్లు సమ్మిళితం కావడానికి ఉత్తమమైంది.ఆ సమయంలో తప్పక నిద్రించాలి.అప్పుడు శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది.మనస్సు ఎటువంటి కోర్కెలు లేకుండా విశ్రాంతి పొందుతుంది.
             ఆత్మ తిరిగి కాలపరిమితిలేని సహజస్థితికి చేరుకుంటుంది.అందువల్ల నిద్ర ఎంతో ముఖ్యమైంది.మద్యపానం,మాదకద్రవ్యాల జోలికి వెళ్ళకుండా మంచి ఆలోచనలతో కంటినిండా నిద్రించాలి.నిద్రించే ముందు గాఢశ్వాస తీసుకోవడం లేదా విశ్రాంతి పొందే ధ్యానం,సంగీత వాయిద్యం నునుడి వెలువడే శ్రావ్యమైన సంగీతం వినడం చెయ్యాలి.మనస్సును ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంచుకుని హాయిగా నిద్రకు ఉపక్రమించండి.               కొన్ని సమయాలలో మనస్సు మబ్బులు కమ్ముతుంది.జీవితం నిస్సారంగా అనిపించి,నిస్పృహ,నిరాశ మనస్సును ఆవరిస్తాయి.మళ్ళీ మనస్సు ఉత్తేజం పొంది,ఆనంద వీచికలు వీస్తే అడుగులు ముందుకుపడతాయి.పడిలేచే కడలిపై అలల వలె మనసు పరుగుపెడుతుంది.ఎల్లవేళలా సంతోషంగా ఉంటూ హాయిగా జీవనం సాగించడానికి కొన్ని సూత్రాలను అనుసరించినట్లయితే ఆనందం మన సొంతమవుతుంది.జీవితం ఆశావహంగా మారుతుంది.నిత్యం జీవననౌక ఆనందంగా సాగిపోవడానికి కొన్ని సూత్రాలు తెలుసుకుందాం.
             ఆకాశంలో తళుక్కుమని ఒక మెరుపు మెరిసినట్టే మనస్సు పొరల్లో ప్రేరణ కలుగుతుంది.అది పూల పరిమళాలవలె మనమదినిండా ఆక్రామించి ఉత్తేజపరుస్తుంది.రతి క్రీడలో కలిగే రసానుభూతివలె వుంటుంది.ఆ అనుభూతి చూటు చేసుకోగానే మనస్సులో ఉన్న ప్రతికూలతలన్నీ దూదిపింజలా ఎగిరిపోతాయి.మనసంతా హాయి నిండుతుంది.

             మనస్సులో తొణికిసలాడే ఉల్లాసం ఏకాస్త అలా వుండిపోయినా అది వరమవుతుంది.ఐతే ఆ స్తితి కోసం కాస్త శ్రమించాలి.నిశ్శబ్దాన్ని ఇష్టపడేందుకు మనస్సును సిద్ధం చేసుకోవాలి.దాని నుండి ఉత్తేజం పొందాలి.
             పని ఒత్తిడి తగ్గించుకోండి:
             విరామ మెరుగని మనస్సు ఉత్తేజం పొందడం కష్టమవుతుంది.అందువల్ల ఎంతపనైనా,ఎల్లవేళలా చేయగనన్న అహానికి కాస్త కళ్ళెం వేయండి.కాసేపు మస్తిష్కానికి విశ్రాంతి ఇవ్వండి.ఇబ్బంది పెట్టే ఆలోచనలను పారద్రోలండి.సున్నితమైన,సానుకూల ఆలోచనలకు పదును పెట్టండి.అప్పుడు మళ్ళీ మనస్సు కుదుటబడి ఊహించని పరిస్తితులకు అనుగుణంగా పనిచేయగలుగుతుంది.జాగృతమైన మనస్సు సూక్ష్మమైన అన్శాలను గ్రహిస్తుంది.అప్పుడు సహజంగా ముందుకు సాగిపోవచ్చు.

2 వ్యాఖ్యలు:

  1. ప్రత్యుత్తరాలు
    1. బ్లాగ్ సందర్శించినందుకు Anonymous గారికి కృతజ్ఞతలతో....వారికి సంబంధించిన జాగ్రత్తలు వారికుంటాయి.వారు అవి తెలుసుకోవాలి కదా సర్!

      తొలగించు

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.