15, ఫిబ్రవరి 2020, శనివారం

మీరు గెలవాలంటే మీ మనసు ఇలా ఉండాలి | If you want to win your mind should be like this

విజయం సాధించాలంటే ముందుగా విజయం సాధించాలనే ఆలోచన ఆ వ్యక్తికి వుండాలి.ఏ విషయంలో విజయం సాధించాలి అనే విషయం నిర్ణయించుకున్న తరువాత ఆ దిశలో ఆలోచనలు మొదలుపెట్టాలి .రోజు రోజుకూ మీలో అభివృద్ధి వస్తుందనే ఆలోచన బాగా వుండాలి.
ఆత్మ పరిశోధనకు కూడా ఈ ఆలోచన పనికి వస్తుంది.చెడు ఆలోచన మనసు లోనికి రానియ్యకూడదు.మంచి ఆలోచన వలన మనోధైర్యం పెరుగుతుంది.ఆలోచనలో ఊహించటం జరుగుతుంది ఇది పగటి కలగానే వుండి పోకుండా రోజురోజుకూ మీలో వచ్చే ప్రగతిని విశ్లేషించుకోవాలి.ఈ విజయం సాధించడానికి ఏం చెయ్యాలి అనే విషయం చూద్దాం.మనసుకి విశ్రాంతిని ,స్పూర్తినిచ్చే ఈ క్రింది విషయాలు తలచుకోవాలి.


1.మీరు ఏ పనినైనా చెయ్యగలరు.ప్రతి మనిషి తను అనుకున్నది సాధనతో సాధిస్తాడు.
2.గతంలో ఎన్నో విజయాలు సాధించలేరు.ఇక ముందు ఎన్నో సాధించడానికి తయారుగా వున్నారు.
3.గమ్యం చేరటంలో వచ్చే సమస్యలు స్పీడు బ్రేకర్లు మాత్రమే కాని అడ్డుగోడలు కాదు.ఒక ఊరు నుంచి మరో ఊరుకు బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు అనేకసార్లు మార్గమధ్యంలో ఆగినా చేరవలసిన సమయానికి చేరవలసిన గమ్యం చేరుతుంది.
4.సమస్యలు చూసి మీపై మీరు జాలి పడటం పొరపాటు.ఆత్మవిశ్వాసం అగ్గించుకోవటం ఇకా పెద్ద పొరపాటు.
5.గతం గురించి తలచుకుని బాధపడకూడదు.బంగారంలాంటి భవిష్యత్తు గురించి ప్రణాళిక వెయ్యాలి.గతాన్ని మార్చలేం.
6.వర్తమానం భవిష్యత్ కు పునాది.గతం గురించి బాధపడటం అనవసరం.వర్తమానంలో ప్రతీక్షణం ను మీ లక్ష్యం గురించి ఖర్చు పెట్టండి.అదే మీ భవిష్యత్ కు పునాది.
7.కొన్ని విషయాలలో రాజీపడి తీరాలి.
8.కొన్ని విషయాలలో లౌక్యంతో వ్యవహరించాలి.
9.ఏ పని ముందు చెయ్యాలి అనే విషయం నిర్ణయించుకున్న తరువాత ఆ పనిని ఏకాగ్రతతో చెయ్యాలి.
10.రోజురోజుకు మీలో వచ్చే ప్రగతిని మీరు హర్షించాలి.
11.అవకాశాలు రావు.వాటిని కల్పించుకుని కైవసం చేసుకోవాలి.
12.సమయం విలువైనది.ప్రతీ క్షణం మీలక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి.ఎవరికైనా రోజుకు గంటలు మాత్రమే.

13.విజయాలు సాధించిన వారందరూ కష్టపడి సాధన చేసిన వారే.కాని విజయాలు వారికి ఎవరో తీసుకువచ్చి ఇవ్వలేదు.విజయాలు వారి గురించి అధ్యయనం చేసి వారు అ అవిజయాలను ఎలా సాధించారో తెలుసుకోవటం ఒక ముఖ్యమైన సాధన.
14.స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా స్విమ్మింగ్ రాదు.ఈత కొట్టాలంటే ఈ పూల్ లోకి దిగి విజయం కోసం పాటుపడాలి.
15.మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి.మీ మీద మీరు జాలి పడకూడదు.ఎవరి సానుభూతి గురించి ఎదురు చూడవద్దు.అది మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేస్తుంది.
16.అనుకున్న పనిని వెంటనే ప్రారంభించాలి.
17.సమస్యలను తలచుకుని బాధపడేకన్నా పరిష్కరించుకుని సంతోషపడటంలో ఎంతో తృప్తి,ఆనందం వున్నాయి.
18.వాయిదా వేస్తే విలువైన సమయం వృధా అవుతుంది.
19.ఎంత దూరం వెళ్ళాలన్నా ఒక అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది కదా! ఏది సాధించాలన్నా ప్రయత్నంతో మొదలుపెట్టాలి.
20.పొగడ్తలకు పొంగిపోవడం,విమర్శలకు కృంగిపోవటం తప్పు.

21.అలసిపొతున్నాను అని జాలిపడకండి.
22.సమస్యలు ఎక్కువగా ఉన్నవారు అంగవైకల్యం ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు.కానీ వారి అభివృద్ధిని వారు పాడు చేసుకోవటం లేదు.సమస్యతో పోటీ పడుతున్నారు.
23.సమస్యకు బానిస కాకూడదు.నిరాశ,నిస్పృహలు సమస్యలకు సమాధానం కాదు.
24.ఎదుటివారు మిమ్మల్ని చులకనగా చూసేలాగా ప్రవర్తించకూడదు.అది ఆత్మన్యూన్యతాభావంకు దారితీస్తుంది.విజయానికి ఆటంకం కలగజేస్తుంది.
25.చిన్నరంధ్రం కూడా పెద్ద నీళ్ళ ట్యాంకును ఖాళీ చెయ్యగలుగుతుంది.చిన్న రంధ్రం కూడా పెద్ద ఓడను నీట ముంచేయగలదు.కనుక చిన్న చెడు ఆలోచనను కూడా మనసులోనికి రానియ్యకూడదు.అది ఆత్మ విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేస్తుంది.విజయానికి అది కళంకం అవుతుంది.

          రోజూ మనసుకు విశ్రాంతినిచ్చే సెల్ఫ్ హిప్నాటిజం తలుచుకుంటూ మీ మనసును పూర్తిగా మంచి ఆలోచనలతో నింపితే మీ మనసు పూర్తిగా మిమ్మల్ని విజయం వైపు ప్రయాణం చేయిస్తుంది.విజయం సాధించి తీరుతాయి.

1 కామెంట్‌:

మీ అమూల్యమైన అభిప్రాయాలు,సలహాలు,సూచనలు తెలియచేయగలరు.