30, అక్టోబర్ 2013, బుధవారం

పరలోక విశ్వాసం - ప్రాచీన భారతదేశం

            పరలోక విశ్వాసం సార్వజనీన సిద్ధాంతం.దాన్ని అన్యసిద్ధాంతం లేక భారతీయేతర  సిద్ధాంతం అని అనుకోవడం పొరపాటు.ఈ సిద్ధాంతాన్ని నమ్మడం అంటే ఓ భారతీయేతర సిద్ధాంతాన్ని నమ్మడం అని అర్ధం కాదు.సత్యం విషయంలో అది భారతదేశానికి సంబంధించినదా లేక భారతదేశానికి ఆవల నుండి వచ్చిందా అనిచూడ్డం అనేది అనవసరం.సత్యం ఎక్కడ,ఏ రూపంలో ఉన్నా అది పూర్తిగా మానవాళి ఉమ్మడి సొత్తు.
              ప్రస్తుతం జీవితానికి సంబంధించిన ఇతర దృష్టికోణాలను వదిలి మనం కేవలం పరలోక వాదాన్నే తీసుకుని ఈ విషయంలో భారతదేశ సంప్రదాయాలు,సంస్కృతి ఎలా ఉన్నాయో చూద్దాం. More read

29, అక్టోబర్ 2013, మంగళవారం

ఈ రోజుల్లో సంతోషంగా ఉండాలంటే 6 అంకెల జీవితం పొందాలంట!

అవేంటో అని ఆశర్యంగా ఉందా? మీరే చూడండి.
6 : 1,00000 [కనీసం ఒక లక్ష సంపాదన]
5 : కనీసం 5 దేశాల పర్యటన
4 : ఫోర్ వీలర్ కారు
3 : ట్రిపుల్ బెడ్ రూం హౌస్
2 : కనీసం ఇద్దరు పిల్లలు.
1 : ఓ చక్కని భార్య. నిజమేనంటారా ?

28, అక్టోబర్ 2013, సోమవారం

సరదాగ కాసేపు


యేసువారు నిజంగానే పునరుత్థానుడా? -2


యేసు పునరుత్థానం గురించి పశీలిద్దాం
ఎవడును నా ప్రాణము తీసికొనడు.నా అంతట నేనే దాని పెట్టుచున్నాను.దాని పెట్టుటకు నాకు అధికారం కలదు.దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు.నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను. -యోహాన్:10:18
          యేసు ప్రజల విమోచన క్రయధనముగా తనంతటతానే మనస్పూర్తిగా ప్రాణములనర్పించి, మూడవ రోజు పునరుత్థానం చెంది సజీవముగా లేస్తాడని పౌలు చేసిన ప్రచారానికి నిదర్శనంగా పై వాక్యం అద్దం పడుతున్నది. విచిత్రమేమిటంటే మాటలైతే కనపడుతున్నాయి కాని చేతలలో చాలా వైరుధ్యం ఉంది.

                   2వ భాగం వచ్చింది. మీ సాక్ష్యం మేగజైన్ బ్లాగులో ఇక్కడ క్లిక్ చేయండి

26, అక్టోబర్ 2013, శనివారం

యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1

గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు,నేను మీకు ప్రచురము చేయుచు చేయు యేసేక్రీస్తయి యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాతంలనెత్తి చెప్పుచు,వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అపొ//కా :17:2-3

ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి,మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమా:4:25

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. రోమా 10:9

నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. 2వ తిమోతి 2:8


        యేసు మరణించిన తరువాత పునరుత్థానమయ్యారని పౌలు ప్రచారం చేసినట్లు పై వాక్యాలలో తెలుస్తుంది.అయితే ఇది అంతిమ పునరుత్థానము గురించా? కాదు.కాని యేసు సిలువపై మరణించినట్లు అపోహకు గురయై తరువాత మూడవరోజు మృతులలో నుండి సజీవంగా లేచారని జరిగిన ప్రచారానికి సంబంధించిన పునరుత్థానము.

క్రింది వచనాలను గమనించండి.

       యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకుని వచ్చును.మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధినిఒ చేరదము.ఆర్భాటముతోనూ,ప్రధానదూత శబ్ధముతోనూ దేవును బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును.క్రీస్తునందుండి మృతులైనవారు మోదట లేతురు.ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీదకొని పోబడుదుము.కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ వుందుము.కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి. 1వ ధెస్సలోనియకకు 4:14-18
        

        యేసు పునరుత్థానమును గూర్చి ప్రచారం చేస్తూ పై వచనాలలో అంతిమ పునరుత్థానము [GENERAL RESURRECTION] గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు యేసునందు నిద్రించిన వారు అనగా యేసుపట్ల విశ్వాసముంచి మరణించినవారు అందరికంటే ముందు లేస్తారని, అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు యేసును అనుసరించి వెళ్తారు.అయితే అన్యుల గూర్చి ఇక్కడ ఏమీ చెప్పలేదు.అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు మేఘాలలో కొనిపోబడి,యేసునుందు మరణించి మోదటి ఫలముగా పునత్థానము చెందిన వారితో కలిసి యేసును ఎదుర్కొని వెంబడిస్తారు.ఆ విధంగా అప్పటికి బ్రతికి ఉన్నవారు మరణము-పునరుత్థానము అనెడి సహజ ప్రక్రియలకు లోనుకాకుండా నిరంతరం బ్రతికి ఉంటారు.ఇది పౌలు ప్రచారం.ఇది ఎంతవరకూ వాస్తవమో పరిశీలిద్దాం. 
                                                                    Read More

24, అక్టోబర్ 2013, గురువారం

మీ బ్లాగులను జత చేయండి

బ్లాగ్ వేదిక నూతనంగా తయారవుతుంది.ప్రియమైన బ్లాగర్లందరూ తమ,తమ బ్లాగులను బ్లాగ్ వేదికలో జత చేయవల్సిందిగా కోరుచున్నాము.బ్లాగు వేదికను మరింతగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాము.త్వరలో వెబ్ సైట్ గా మారుతుంది.మీ బ్లాగులను జతచేయుటకు http://blogvedika.blogspot.in/  పై క్లిక్ చేయండి

21, అక్టోబర్ 2013, సోమవారం

వెంగళప్ప బస్ ప్రయాణం

నగనగా ఒక ఊరులో ఒక వెర్రి వెంగళప్ప ఉండేవాడు.ఊరంతా తనను తింగరిబుచ్చోడు అనుకున్నా తనుమాత్రం మహా మేధావి అనుకునేవాడు.ఒకసారి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చి తొలిసారిగా బస్ ఎక్కాడు.ఇంతకు ముందు కాలి నడకనే వెళ్లివచ్చేవాడు.తొలిసారిగా బస్ ఎక్కిన కారణంగా బస్ లో టికెట్ తీసుకోవాలనే విషయం అస్సలు తెలీదు.కాలు మీద కాలు వేసుకుని కూర్చుని జర్నీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు.ఇంతలో బస్ కండక్టర్ టికెట్...టికెట్ అని అరుస్తూ బస్సులో అటుఇటూ తిరుతుంటే పాపం వెంగళప్ప చూడలేక కండక్టర్ తో "ఏమయ్యా నీకసలు బుద్దుందా? ఎవరూ కొననది ఎందుకలా అరుస్తావ్.అవేంటో వేరే బస్సెక్కి అమ్ముకోవచ్చుగా "అని గొప్పగా....అందరూ తననే చూస్తుంటే వీర లెవెల్లో చెప్పాడు.

19, అక్టోబర్ 2013, శనివారం

మీ ఆలోచనలు పంపండి

         
ప్రతివాళ్లకీ ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతూనే ఉంటాయి.
వాటిలో మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి భద్రంగా దాచుకోండి. సమాజం గురించీ,దేశం గురించీ,అందరికీ సమస్యలుగా తయారయ్యే విషయాల గురించి మీకొచ్చే ఆలోచనలను "వెన్నెల కెరటం" సాహిత్య బ్లాగులో మీ సహ బ్లాగు వీక్షకులతో పంచుకోండి.వీలైతే మీకు తోచిన పరిష్కారాలు చెప్పండి.మంచి సూచనలు చేయండి.మీ మనస్సులో మాటల్ని అక్షరాలుగా కూర్చి పంపండి. దానితోపాటు మీకిష్టమైతే మీ ఫొటో జత చేయండి.మీ ఆలోచనలు ఎందరికో కనువిప్పు కలిగించవచ్చు.కొందరికి ఓదార్పునివ్వవచ్చు.సమాజానికి మేలుకొలుపూ కావచ్చు.
                 మీ ఆలోచనలు పంపాల్సిన మెయిల్ ఐడి:
                   md.ahmedchowdary@gmail.com

       వెన్నెలకెరటం సాహిత్య బ్లాగు కొరకు క్లిక్ చేయండి.

15, అక్టోబర్ 2013, మంగళవారం

నవ్వుల విందు : మల్లిక్ కార్టూన్స్

కడుపుబ్బ నవ్వించే కార్టూనిస్ట్ ఎవరని? ఎవరిని అడిగినా ఇంకెవరూ మల్లిక్ గారే అనే సమాధానమే వస్తుంది.తన కార్టూన్ మాయాజాలంతో అంతలా పాఠకులతో తన సంబంధాన్ని ఏర్పరుచుకుని ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడాయన! మీ అందరికోసం మచ్చుకు కొన్ని.మరిన్ని కార్టూన్ల కొరకు "వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగును చూడండి

14, అక్టోబర్ 2013, సోమవారం

మీలో ఈ గుణాలుంటే ?

జీవితం అనేక సమస్యలతో నిండిపోయినప్పుడు బ్రతకడమే ఒక సమస్యగా మారిపోతుంది.ఎవరూ కూడా ఇటువంటి పరిస్తితి రాకుండానే జాగ్రత్తపడాలి.దీనికి గమ్యనిర్దేశ్యం,ప్రణాలిక, సమయనిబద్ధత,తెగింపు, క్రమశిక్షణ అవసరం. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే జీవితమనేది నందనవనంగా తయారవుతుంది. ఒకవేళ అనుకోని రీతిలో సమస్యలు వచ్చినా ఎదురుతిరిగి పోరాడే ధైర్యం,పరిష్కరించుకునే చాకచక్యం,నేర్పరితనం అన్నీ సమకూరుతాయి.
తెలివైన జ్ఞాని భవిష్యత్ ని నందనవనంగా చేసుకోవడానికి కొన్ని త్యాగాలు చేస్తాడు.
తెలివైన మూర్ఖుడు భవిష్యత్ ని మూడడుగులకంటే ఎక్కువ ఊహించక సర్వనాశనమవుతాడు.
          నేను ఒకసారి బసులో ప్రయాణం చేస్తునప్పుడు పక్క సీట్లో ఒక వ్యక్తి [బహుశా 35సం//] కూర్చున్నాడు.బస్సు బయలుదేరిన 5నిమిషాల తరువాత ఒకరికొకరం పరిచయం పెంచుకున్నాం.తను యం.బి.బి.యస్ డాక్టర్ గా పనిచేస్తున్నాడట.తనీ పరిస్తితికొచ్చి ఎంతో ఆనందం,తృప్తి పొందుతున్నానని చెప్పాడు.తను చెప్పిన కొన్ని విషయాలు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి.ఆనందానిచ్చే పెద్ద లక్ష్యం పూర్తి కావాలంటే సంతోషానిచ్చే చిన్న,చిన్న పనులు త్యాగం చెయ్యాలి సర్ అన్నాడు.
     "నా టార్గట్ డాక్టరవ్వడం అదే నా పెద్ద గోల్!దానిని పొందడం కోసం చదువుకునే రోజుల్లో సినిమాలు మానేసాను.షికార్లు మానేసాను.ఫ్రెండ్స్ తో పనికిరాని మాటలు మానేసాను.ప్రేమించడానికి అందమైన అమ్మాయి కావాలి.మనకు నచ్చాలి.చదువుకునే రోజుల్లో ట్రై చేస్తే దక్కించుకోవడం బహు కష్టం.లవ్ లో పడితే లైఫ్ సర్వనాశనమవుతుంది.అందుకనే దానికి దూరంగా ఉన్నాను.నేను నా గోల్ సాధించిన తరువాత నా పెళ్లికొచ్చిన అమ్మాయిల ఫొటోలను చూసి ఏది సెలక్ట్ చేసుకోవాలో తెలియని అయోమయం పడ్డానంటే నమ్మండి.అదే చదువుకునే రోజుల్లో ప్రేమా,దోమా అని వుంటే నాకు జాగీ కూడా లేకుండా పోదును.నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ప్రేమలో పడి చదువు అటకెక్కించి చిన్న,చిన్న వృత్తులో బ్రతుకును ఈడుస్తూ జీవిస్తున్నారు.నేనుకూడా వారిలాగే ఎటువంటి లక్ష్యం లేకుండా జీవించి ఉంటే నాగతి కూడా అదే అయ్యుండును.కానీ నేను జాగ్రత్తపడ్డాను."జ్యూస్ త్రాగి ఆనందం [ఆరోగ్యం] పొందాలంటే, ప్రతిరోజూ టీలు,కూల్ డ్రింక్స్ తాగే అలవాటు చంపుకోవాలి" పెద్ద,పెద్ద ఆనందాలను సాధించడం కోసం చిన్న,చిన్న సంతోషాలు త్యాగం చేయడమే ప్రణాలిక.ఇది సాధించిన తరువాత పొందేదే జీవితం సర్."
        అతని మాటలు కొద్దిగా అర్ధం కాకపోయినా ఆలోచిస్తే మాత్రం జీవిత సత్యమే బోధపడుతుంది.మనం గమ్యరహితంగా జీవిచడం ప్రారంభించడం అంటే మన నాశనాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటున్నట్టు లెక్క.కాబట్టి మనిషి గమ్యం నిర్దేశించుకోవాలి.ఆనందానికి అవధులను,అవాంతరాలను దూరం చేసుకోవాలి.ముఖ్యంగా దానికి కావాల్సిన సామాగ్రి-5 రకాలు.
                              మెదటిది : గమ్యనిర్దేశ్యం
                              రెండవది : ప్రణాలిక
                           మూడవది : సమయనిబద్ధత
                              నాల్గవది : తెగింపు [పట్టుదల]
                               ఐదవది : క్రమశిక్షణ

         పై 5 గుణాలు మీలో పుష్కలంగా ఉంటే మీరు విజయం సాధించినట్లే! ఆనందానికి దారులు వేసుకున్నట్టే! ప్రయాణం చేసి విజయమనే గమ్యాన్ని చేరుకోవడమొక్కటే తరువాయి.ఆల్ ది బెస్ట్.

12, అక్టోబర్ 2013, శనివారం

సకల రంగాల సంపూర్ణ బ్లాగవతం-1

నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు నా విషయాలు,రచనలు మాత్రమే అందించాలి అనుకున్నాను.అంటే ఆన్ లైన్ డైరీలా నా పర్సనల్ డేటా ఉంచుదామనుకున్నాను.తీరా కొన్నాళ్లు వాడిన తర్వాత అన్ని రంగులు,రంగాలు మిళితం చేసి అందరికీ చేరువ చేస్తే బాగుంటుంది అనిపించింది.అందుకే నా బ్లాగును 'సకల రంగాల సంపూర్ణ బ్లాగవతం'గా మార్చాను.దీని ద్వారా మీ అందరితో దగ్గరవ్వడం ఒకటైతే మిమ్మల్ని కూడా ఇందులో భాగస్తులను చెయ్యడం మరొకటి.దీని వలన కలిగే ప్రయోజనమేమిటో తెలియదు కానీ,పూర్తిగా ఈ బ్లాగు గురించి ప్రచారం కల్పించాలనికుంటున్నాను.ఈ బ్లాగులో సాహిత్యం,పుస్తకాలు,ఆరోగ్యం,ఆధ్యాత్మికం,ఆటలు,పాటలు వార్తలు,వాయింపులు అన్నీ ...ఒక్కటి కాదు,రెండుకాదు 64కళలు అందుబాటులోకి తీసుకొస్తాను.దానితోపాటు సోషల్ బ్లాగ్ నెట్ వర్క్,వ్యాపార లావాదేవీలు,అమ్ముకోవడాలు,కొనుక్కోవడాలు అన్నీ ఉంటాయి.లేదనేదేదీకూడా లేకుండా చేస్తాను.మీరు కూడా దీనితో లింక్ కలుపుకోండి.మీ బ్లాగులను,వ్యాపారాలను అభివృద్ధి పర్చుకోండి...అదేంటో...ఎలాగో ...త్వరలోనే చెప్తాను.ప్లీజ్ వెయిట్ అండ్ సీ!

మీరు రచయి[త్రు]తలు కవులు,కవయిత్రులు అయితే మంచి రచనలు పంపండి

coming soon

సీరియల్స్

కథలు       కవితలు        సీరియల్స్        వ్యాసాలు         అవీ,ఇవీ,అన్నీ
__________________________________________________

కవితలు

కథలు       కవితలు        సీరియల్స్        వ్యాసాలు         అవీ,ఇవీ,అన్నీ
__________________________________________________

5, అక్టోబర్ 2013, శనివారం

Internet erning

డాలర్లు సంపాదించాలంటే విదేశాలకే వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. మీ సృజనాత్మకత, నైపుణ్యం, కొంచెం సమయం పెట్టుబడిగా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

సెల్ఫ్ పబ్లిషింగ్ బుక్స్

మీకు కథలు, నవలలు రాసే అలవాటుందా? ఇప్పటికే మీరు రాసిన కథలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయా? మీ సృజనాత్మకలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. వాటిని అమెజాన్ ద్వారా ఉచితంగా పబ్లిష్ చేయవచ్చు. కిండిల్ (ఎలక్ట్రానిక్) డైరెక్ట్ పబ్లిషింగ్ పేరుతో అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటి అమ్మకాలపై మీకు రాయల్టీ అందుతుంది. ఇందులో రెండు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు అమ్మాలనుకుంటే 35 శాతం రాయల్టీ, కేవలం ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో అమ్మాలనుకుంటే 70 శాతం రాయల్టీని అమేజాన్ మీకు చెల్లిస్తుంది. భారతీయ రచయిత లకు వారి పుస్తకాల ధరలు నిర్ణయించే అధికారం ఉంది. అలాగే, రాయల్టీ మొత్తాన్ని దేశీ కరెన్సీలో అందుకుంటారు.

అప్లికేషన్ల అమ్మకం

వర్థమాన మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల అమ్మకాల ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వీటి కోసం కొత్త కొత్త అప్లికేషన్లు రూపొందించడం లాభదాయక వ్యాపారంగా రూపుదిద్దుకుంటోంది. అప్లికేషన్ రూపొందించడం గురించి ఆన్‌లైన్ పాఠాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్‌ను రూపొందించిన తర్వాత దాన్ని సంబంధిత అప్లికేషన్ స్టోర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్‌కు ఒక ధర నిర్ణయించాలి. అప్లికేషన్ అమ్మకాలపై వచ్చిన ఆదాయం నుంచి ఫీజులు మినహాయించి మిగిలిన డబ్బును నెలవారీగా అందిస్తారు.

ఫోటోల అమ్మకం

ఆన్‌లైన్‌లో ఫొటోలు విక్రయించడానికి shutterstock. com, shutterpoint.com, istockphoto.comలాంటి వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా సైట్ల విధానాలను బట్టి ప్రతి ఫోటో అమ్మకంపై 15 శాతం నుంచి 85 శాతం వర కు రాయల్టీ పొందవచ్చు. నాణ్యమైన ఫొటోలు, వైవిధ్య ఫొటోలు కలిగిన ఉంటే అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే, మీరు అప్‌లోడ్ చేయాలనుకున్న ఫొటోగ్రాఫ్ ఆయా సైట్ల యాజమాన్యం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఫొటోల ఎంపికలో సైట్లు కఠిన నిబంధ నలు అమలు చేస్తాయి.

పాత వస్తువుల అమ్మకం

ఇంట్లో వృధాగా పడి ఉన్న పాత వస్తువులను ఆన్‌లైన్ ద్వా రా విక్రయించి డబ్బు సంపాదించవచ్చుolx.in, quickr.com & craigslist.co.in లాంటి వెబ్‌సైట్లు వీటి కోసం ఉచితంగా ఒక ప్లాట్‌ఫాంను అందుబాటులో ఉంచాయి. ఇందులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అమ్మకానికి పెట్టిన వస్తువుల వివరాలు, ధర, ఫొటోలు, ఏ ప్రదేశంలో ఉంది అనే సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు నేరుగా మిమ్మల్నే సంప్రదించి కొనుగోలు చేస్తారు.

ఆన్‌లైన్ షాప్ ప్రారంభం

మీరు సొంతంగా రూపొందించిన వస్తువులు లేదా హోల్‌సేల్ డీలర్ల నుంచి ఒకేరకమైన కొన్ని వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఆన్‌లైన్ ద్వారా విక్రయించవచ్చు.ebay.in, indiebazaar.com లాంటి వెబ్‌సైట్ల ద్వారా వాటిని విక్రయించవచ్చు. ఈ రెండు సైట్లలో సైన్అప్ ప్రాసెస్ ఉంటుం ది. అది పూర్తయ్యాక ఆన్‌లైన్ షాప్ నిర్వహించడానికి ఫోటోలు, వాటి వివరాలు సైట్‌లో ఎలా జతపరచాలనే విషయాన్ని వివరిస్తారు.

ఆన్‌లైన్ వర్కింగ్

ఇంటర్నెట్‌లో చాలా బోగస్ కంపెనీలు ఉంటాయి. చేసిన పనికి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడమే గాని చెల్లించిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ విభాగంలోodesk.com, elance.comలు అత్యంత నమ్మకమైనవి. ఈ వెబ్‌సైట్లో వర్క్ చేయాలంటే, ముందు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. తర్వాత మీరు పనిచేయదలచుకున్న విభాగంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఎంచుకున్న సబ్జెక్ట్‌లో మీ నైపుణ్యం చూపించాల్సి ఉంటుంది. ఇందులో మీరు నెగ్గితే, సం బంధిత వెబ్‌సైట్లో మీరు లిస్ట్ అవుతారు. మీ సబ్జెక్ట్ అవసరం ఉన్న కస్టమర్లు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. గంటల లెక్కన వేతనం చెల్లిస్తారు. ఎక్కువ వేతనం కావాలంటే ఎక్కువ సేపు కష్టపడాల్సి ఉంటుంది. మీ పనితీరు పట్ల క్లయింంట్లు సంతృప్తి వ్యక్తం చేయడం అతి ముఖ్యం.

ఇ-ట్యూషన్లు

ఏదైనా సబ్జెక్ట్‌లో మీకు ప్రావీణ్యత ఉంటే ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్లు చెప్పవచ్చు. ఈ వెసులుబాటును www.2tion.net,  www.tutorvista.com ఛిౌఝలు కల్పిస్తున్నా యి. ఈ సైట్లలో మీరు ఒక ట్యూటర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఇందులో మీ చెప్పే సబ్జెక్ట్, ఏ కోర్సులు/క్లాసుల వారికి చెప్పాలనుకుంటున్నారు, టీచర్‌గా మీ అనుభవం, అందుబాటులో ఉండే సమయాలు, ఆశిస్తున్న వేతన ం తదితర వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్‌ను సైట్ నిర్వాహకులు «ద్రువీకరించి, వారి పోర్టల్‌లో ప్రవేశపెడతారు. ఆసక్తిగల విద్యార్థులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇందులో మీరు రాణిస్తే ఏకకాలంలో మరింత మంది విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం ద్వారా అధిక వేతనం సంపాదించవచ్చు.

ప్రకటనలతో..

మీ బ్లాగ్, వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్‌లో గూగుల్ యాడ్‌సెన్స్ ప్రకటనల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇందులోకి ప్రవేశించాలంటే www.google.com/adsenseలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇదే అకౌంట్‌ను మీ వెబ్‌సైట్, బ్లాగ్, యూట్యూబ్ చానల్‌కి వాడుకోవచ్చు. మీరు నిర్వహిస్తున్న అకౌంట్‌ను విజిట్ చేసే వారి సంఖ్యపై ఆధారపడి సంపాదన ఉంటుంది. విజిటర్లు ఎక్కువయ్యే కొద్దీ సంపాదన పెరుగుతుంది. మీరు రాసే ప్రతి విషయం కొత్తగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండాలి. అలాగే, యూట్యూబ్‌లో ఉంచే వీడియోలు వాస్తవమైనవి, ఆసక్తి కలిగించేవిగా ఉండాలి. మీ చానల్‌ను ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మంది సందర్శించే అవకాశం ఉంటుంది. ఇందులో ఎదుగుదలకు ఎక్కువ సమ యం పడుతుంది. అయితే, ప్రకటనల ద్వారా మీ సంపాదన 100 డాలర్లను దాటినప్పుడే గూగుల్ ఒక్కసారిగా మొత్తం డబ్బు చెల్లిస్తుంది.