11, ఆగస్టు 2013, ఆదివారం

యేసు బోధనలలో దేవుడెవరు?

మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు.
అల్లాహ్ "ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.
అయితే వారు అల్లాహ్ [యెహోవా] వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా? అల్లాహ్ [యెహొవా] అమితంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూనూ .   దివ్య ఖుర్ ఆన్  5 : 72-74

1.యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు
1.అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు [అల్లాహ్] అద్వితీయ ప్రభువు.  మార్కు :12 :29
2.అందుకు యేసు - నీ దేవుడైన ప్రభువు [అల్లాహ్]నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.లూకా : 4 : 8
3. నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని [అల్లాహ్]యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను. యోహాన్ :20:17
యేసు కేవలం "అల్లాహ్ ఒక్కడే దేవుడు" అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు.

11.యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు.
1. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా  బాప్తిస్మము  పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి ....లూకా : 3:21
2. ఆయన [యేసు]   పెందలకడనే  లేచి యింకను చాలా చీకటి  యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను. మార్కు 1;35
3.ఆయన [యేసు] ప్రార్దన చేయుటకూ   కొండకు వెళ్ళి దేవుని [అల్లాహ్] ను ప్రార్ధించుటయందు రాత్రి గడిపెను.లూకా : 6:12

111.అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు.
1.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను.  మార్కు : 9:29
2.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను. యొహాను : 11:35-41

1V.కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు.
1.కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు...మార్కు : 14:35
2. ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. లూకా : 22:44
3. తిరిగి పోయి,యింతకు ముందు పలికిన మాటలనే యేసు పలుకుచు ప్రార్ధించెను. మార్కు : 14:39

V. శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు
1. నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:6
2. అందుకాయన [యేసు] - మీరు ప్రార్ధన చేయునప్పుడు తండ్రి [అల్లాహ్] నీ నామము పరిశుద్ధ పరచబడుగాక...లూకా 11: 2-4
3. మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొదుదురని వారితో చెప్పెను. మత్తయి 21:22

V1.అల్లాహ్ [ప్రభువు] కే కృతజ్ఞతా స్తుతులు యేసు చెల్లించేవారు.
1.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - తండ్రీ [అల్లాహ్] ఆకాశమునకును,భూమికిని ప్రభువా ,నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను. లూకా 10:21
2.యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ [అల్లాహ్] నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. యోహాను 11:41
3.ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను.శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. మత్తయి 15:36

V11.యేసు చేసిన కార్యములకు ప్రజజలు అల్లాహ్ [దెవుని]నే మహిమ పరిచేవారు
1. మూగవారు మాటలాడుటయును,అంగహీనులు బాగుపడుటయును,గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మత్తయి 15:31
2...వారందరూ విభ్రాంతి నొంది - మనమీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు,దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మార్కు 2:12
3.వెంటనే వాడు చూపు పొంది దేవుని [అల్లాహ్]ను మహిమపరచుచు ఆయన [యెసు]ను వెంబడించెను.ప్రజలందరూ అది చూచి దేవుని [అల్లాహ్]కు స్తోత్రము చేసిరి. లూకా 18:43

V111.తండ్రి గొప్పవాడు [అల్లాహు అక్బర్] అని యేసు స్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించేవారు.
1. దాసుడు [యేసు] తన యజమాని [అల్లాహ్] కంటే గొప్పవాడు కాడు.పంపబడినవాడు [అపోస్తులు] పంపినవాని [యేసు] కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 13:16
2. ...యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన [యేసు] - అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:27-28
3.యేసు..దేవుని [అల్లాహ్] సువార్త ప్రకటించుచూ గలిలయకు వచ్చెను. మార్కు 1:14-15
4.తండ్రి [యెహోవా] నా యేసు] కంటే గొప్పవాడు. యోహాను :14:28
5...నా తండ్రి [అల్లాహ్] అందరికంటే గొప్పవాడు. యోహాను 10:29

1X.యేసు బోధనలు విస్మరిస్తే కలిగే పర్యవసానం

1.నేను [యేసు] చెప్పు మాటల ప్రకారము మీరు చేయక  - ప్రభువా,ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా 6:46
2.మరియు యీనా [యేసు] మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భుద్ధిహీనుని పోలి యుండును. మత్తయి :7:26
3.అప్పుడు - నేను [యేసు] మిమ్మును ఎన్నడును ఎరుగను;అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొడని వారితో చెప్పుదును. మత్తయి 7:23

X.అపార్ధానికి గురియైన ఒకే ఒక్క యేసు బోధ
నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.యోహాను 10:30
తండ్రి [దేవుని] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు తండ్రి [దేవుడు] యు ఉన్నామని నమ్ముడి. యోహాను 14:11
యేసు చెప్పినది అస్తిత్వము విషయములో కాదని కేవలం ఆలోచనల విషయములోనే అని యేసు చెప్పిన మరికొన్ని వాక్యాలను బట్టి మనకు అర్ధమవుతుంది.

ఉదా : కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం
1.నేను [యేసు] నా తండ్రి [దేవుని] యందును మీరు [శిష్యులు] నా [యేసు] యందును, నేను [యేసు] మీ [శిష్యులు] యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగరు. యోహాను 14:20
2. ...పరిశుద్ధుడవైన తండ్రీ, మనము [యేసు మరియు దేవుడు] ఏకమైయున్నలాగున,వారును [శిష్యులందరు] ఏకమై యుడునట్లు నీవు నాకనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యోహాను 17:11
3.వారి [శిష్యులు] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు నీవు [దేవుడు]ను ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి... యోహాను 17:23

పై వాక్యముల ప్రకారము శిష్యులు + యేసు + దేవుడు ఒకరి యందు ఒకరు అస్తిత్వములో ఏకమై యుంటే దేవుడు + యేసుతో పాటు శిష్యులందరూ దైవత్వంలో భాగస్వాములైపోతారు.కాబట్టి ఆలోచనలలోనే ఏకం కాగలరు. గాని అస్తిత్వములో ఏకం కాలేరన్నది నిర్వివాదాంశం.

X1. యోహొవా [అల్లాహ్] ను వదలి ఇతరులను ఆరాధించడం వ్యభిచారం మరియు శాపగ్రస్తము.ఎందుకంటే ???
1. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు.సైన్యములకధిపతి యగు యెహొవా [అల్లాహ్] అని ఆయనకు పేరు. యెషయా 54:5
2.యెహొవా [అల్లాహ్] ఈలాగు సెలవిచ్చుచున్నాడు.నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా [అల్లాహ్] మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 17:5
3. ...'నీవు నీ దేవుని [యెహొవా]ను విసర్జించి వ్యభిచరించితివి. హోషేయ 9:1
4. ప్రభువా [అల్లాహ్] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తన 86:5
5......అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకి తిరిగి రమ్మని యెహొవా  సెలవిచ్చుచున్నాడు. యిర్మియా 3:1

ప్రియ చదువరీ !

 యేసు బోధనల వెలుగులో దేవుడు [తండ్రి/ప్రభువు/యెహొవా/అల్లాహ్] ఒక్కడే అని రూడీ అయిన తర్వాత ఆలస్యమెందుకు? నేడే ! ఇప్పుడే !! విరిగి నలిగిన హృదయంతో దేవును తట్టు తిరుగుము.ఆజ్ఞాతిక్రమం [ముఖ్యముగా ప్రధానమైన ఆజ్ఞ మీరడం] వల్ల వచ్చిన గొప్ప పాపము నుండి క్షమించమని దేవునికి మొరపెట్టుము.అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు.

X11.చివరిగా యేసు చేసే హెచ్చరిక!!
1.ప్రభువా, ప్రభువా అని నన్ను [యేసును] పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. మత్తయి 7:21
2....అల్లాహ్ [యెహొవా]కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని [నిత్యజీవాన్ని] నిషిద్ధం చేశాడు.వారి నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ ఆన్  :5:72.

                         యేసు సువార్త ద్వారా తెలిసిన విషయం

సర్వ సృష్తికర్తయైన అల్లాహ్ [యెహొవా] ఒక్కడే ఆరాధనకు అర్హుడైన దేవుడు అన్న ప్రధానమైన యేసు యొక్క ఈ బోధను తృణీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని స్పష్టమగుచున్నది.     DOWNLOAD

8, ఆగస్టు 2013, గురువారం

వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

పరలోకాన్ని వ్యతిరేకించే కొందరి నమ్మకాల్లో ఓ నమ్మకం "పునర్జన్మ" సిద్ధాంతం.ఈ విశ్వాసం లేక సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని,తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొక్కప్పుడు ఏదో ఒక జంతువుగానో,కీటకంగానో లేక చెట్టుచేమల రూపంలోనో జన్మించి మరల,మరల ఈ లోకంలోకే వస్తాడు అన్నది.ఈ సిద్ధాంతం ఓ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.గ్రీకు,రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు.ఈజిఫ్ట్ ప్రాచీన చరిత్రలోను ఈ విశ్వాసం కానవస్తుంది.వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోను ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది.మన భారతదేశంలోని హిందువుల్లోను,జైనుల్లోను,బౌద్ధుల్లోను దీనికి మంచి ప్రాచుర్యం లభించింది.
    ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటిని,ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు.
     పునర్జన్మ సిద్ధాంతం పరలోక సిద్ధాంతానికి వ్యతిరేకమే కాకుండా దీనివల్ల మతానికి,మత భావాలకు కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది.ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే నాగరికులు,విద్యావంతులు అనబడే వారి దృష్టిలో దీనికి ఎలాంటి విలువే ఉండదు.మతం ఓ శక్తిగా మారి అది పైకొచ్చే మార్గాలన్నీ మూసివేయబడతాయి.ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు సైతం దీన్ని తమ ఆచరణలో పెట్టకుండా దూరంగానే ఉంచుతున్నారు.దాన్ని తమ నిజజీవితంలో ఆచరించడం లేదు,ఆచరించనూలేరు.
       పునర్జన్మ విశ్వాసంలో సాధారణ ప్రజలకు ఎంతో కొంత ఆసక్తి,ఆకర్షణ ఉండడానికి కారణం,కేవలం ఈ విశ్వాసం ద్వారా మనిషి సంబంధం తన జన్మభూమి నుండి తెగిపోకుండా ఉండడమే;అతడు మరణించినతరువాత కూడా ఏదో ఒక రూపంలో ఈ ప్రపంచంతో సంబధం కలిగి ఉంటాడన్న భావమే.ఈ ధరిత్రి ఎడల అతనికున్న అనురాగం,మమకారం,ప్రేమ అతణ్ణి జరుగబోయేదాని గురించి ఆలోచించే అవ్కాశమే ఇవ్వవు.అసలు జీవితం పరిమితమైన ఈ ప్రపంచం కంటే అనేక రెట్లు అధికమని తెలిస్తే ఎంత బాగుంటుంది!
          పునర్జన్మ సిద్ధాంతం గురించి సహేతుకమైన,ఆచరణయోగ్యమైన దృష్టికోణాలతో సంగ్రంగా పరిశీలించే అవకాశం ఇక్కడ లేకపోయినా ఓ మౌలిక విషయం వైపు మాత్రం దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తాను.జంతు,వృక్షశాస్త్ర అధ్యయనం వల్ల మనకు తెలిసేదేమిటంటే,వృక్ష సంతతి మాట అటుంచి కేవలం జంతుజాలాలు ,మనిషి నడుమ ఉన్న వ్యత్యాసమే భర్తీ చేయ వీలులేనటువంటిదని,వృక్ష సంతతి మరియు జంతు సంతతిలో స్పృహ అనేదే లేదు అని తెలుస్తుంది.తన గురించి తాను అర్ధం చేసుకునే స్పృహ కేవలం మనిషిలోనే ఉంది.ఏ జంతువులోనో,ఏ చెట్టులోనో మనిషి ఆత్మ,తాను జంతువు రూపంలోనో,చెట్టుచేమల రూపంలోనో ఉన్నానని,తాను చేసిన దుష్కృత్యాలకు ఫలితం ఇలా ఈ రూపంలో లభిస్తుందని ఎలా తెలుసుకోగలరు?
         మనిషి ఆత్మ,స్పృహరహితమైన జంతువు లేక వృక్షం ఆత్మగా మార్చబడి శిక్షించబడుతోంది అని ఏ ప్రబుద్దుడైనా అంటే,మనిషి ఆత్మ,జంతువు ఆత్మకు ఉన్న తేడా ప్రకారం,ఓ మనిషి ఆత్మ,జంతువు ఆత్మగా మార్చబడితే మోదట దానికి ఉన్న వ్యక్తిత్వంగాని,శక్తిగాని దానికి ఉండదు అని అతడు గ్రహించాలి.ఇలా జరిగినప్పుడు మరో ఆత్మ ఉనికిలోనికి వస్తుంది.ఆ వ్యక్తిత్వంగాని,ఆ ఆత్మగాని ఉండకపోతే శ్క్షించబడేదెవరు? చెట్లు,జంతువులు వగైరాలు పూర్వజన్మ దుష్కృతం వల్ల శిక్షల రూపంలో ఉనికిలోనికి వచ్చాయి అని మనం ఒప్పుకున్నా ఆ శిక్ష మానవాత్మలకు కాదు,శిక్షకు అర్హులు కానటువంటి ఇతర అమాయక ఆత్మలకు లభిస్తోంది.ఈ చెట్టుచేమలు,జంతుజాలం మనిషికి గొప్ప వరాలు.అవి పాపాల ఫలితంగానే ఉనికిలోనికి వచ్చాయి అని అనడం,వాటిపై అభాండాలు వేసి అత్యాచారం చేసినట్లే.పాప ఫలితంగా మనకు ఈ వరాలు లభిస్తాయి అని అనుకుంటే ఈ పాపం మానవత్వానికి మానవజాతికి ఎంతో అవ్సరం అని అనక తప్పదు.సరికదా మానవ మనుగడ,ప్రపంచ అందచందాలు ఈ పాపాల ఫలితంగానే సాగుతున్నాయని కూడా చెప్పవచ్చు.ఈ నేపధ్యంలో,మన హృదయాల్లో దైవం కోసం రవ్వంత కృతజ్ఞతాభావం కూడా పొడసూపదు.మనం ఈ ప్రపంచాన్ని,ఇక్కడి వరాలను వనరులను,వనరుల్ని మరో దృష్టితో చూడాల్సి వస్తుంది.పేదసాదల్ని,కష్టాల్లో కడగండ్లలో జీవితం నెట్టుకువచ్చేవారిని,పాపాత్ములని,వీళ్లు పాపాత్ములు కాకపోతే వీరికి ఈ స్ధితి దాపురించేదే కాదు అని అనుకోవలసివచ్చేది మనం.
         పునర్జన్మ సిద్ధాంతం వేద బోధనలకు కూడా వ్యతిరేకమే.వేదాల్ని అధ్యయనం చేస్తే,ఆర్యులు పరలోకాన్ని నమ్మేవారని తెలుస్తోంది.వారి విశ్వాసం ప్రకారం మరణానంతరం మనిషికి మరో జీవితం లభిస్తుందని,అది మనిషి కర్మలకు అనుగుణంగా మేలైనదైనా,కీడైనదైనా అయివుండవచ్చు.
         "మంత్రం" మరియు బ్రాహ్మణాల్లోను "పితృలోక" విశ్వాసం ఉంది.ఆ విశ్వాసంలో పునర్జన్మకు తావేలేదు.ఆ తరువాతి "సూత్ర"కాలంలో,పితృలోక విశ్వాసానికి తోడు పునర్జన్మ సిద్ధాంతం కూడా చోటుచేసుకుంది.ఆ తరువాత పురాణ కాలం నాటికి పితృలోక విశ్వాసంతో పాటు పునర్జన్మ విశ్వాసం చెరిసమంగా మనకు కానవస్తాయి.వేదాలు పునర్జన్మను నమ్మవు.ఇది యదార్ధం.ఎవరైతే వేదాల నుండి పునర్జన్మ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారో,వారు న్యాయంగా వ్యవహరించరు.కొందరైతే ఖుర్ ఆన్ నుండి కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని సాధించే ప్రయత్నం చేశారు.కాని వారి ఈ ప్రయత్నాలకు సత్యంతో ఎలాంటి సంబంధం లేదు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన గ్రంధం "ఇండియన్ ఫిలాసఫీ"సంపుటం-1లోని 113-116 పేజీల్లో,వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లభించదు అని రాశారు.ఇలాగే అనేక మంది హిందూ విద్వాన్సుల భావం కూడా అదే.ప్రాచ్యమతాల ప్రఖ్యాత అధ్యయనకర్త "మూక్స్ ముల్లర్" వేదాలను అధ్యయనం చేసిన తరువాత,"వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం అనేదే లేదు అందు పరలోకవాదమే లభిన్స్తుంది" అని రాశాడు.
              వేదాల్లో ఇలా ఉంది:
     "వారు పరలోకాన్ని మరచి,బుద్ధీజ్ఞానాలను వదిలేసి మాచే నిర్ణయించబడ్డ హద్దులను దాటే ప్రయత్నం చేస్తున్నారు." [ఋగ్వేదం-1:3-4]
      "గుర్రానికి ప్రతిదినం గడ్డి ఎలా కేటాయించబడుతుందో ఓ అగ్నీ!ధనాన్ని [కూడగట్టి]భద్రపరిచే వారి నుండి అంతిమ దినం నాడు నేను లెఖ్ఖ గైకొంటాను" [యజుర్వేదం-50:11-75]
      సత్యార్ధ విద్యాలంకార్ ఇలా రాశారు:
      "వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు.ఈ విషయం గురించి నేను జూదం కూడా ఆడగలను [బెట్టుకాస్తాను]" పునర్జన్మ:పేజి.104
      డా.పరాడా చౌహాన్ ఇలా రాశారు:
      "వేదాల్లో పునర్జన్మ గురించి ఉంది.అయితే అందులో ఈ జన్మ తరువాత కేవలం ఒకే ఒక జన్మ గురించి రాసుంది.వేలాది జన్మ గురించి కాదు." [పునర్జన్మ మరియు వేదాలు:పేజి.93]
      వేదాల్లో ఇలా ఉంది:
      "అగ్ని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సూర్యుణ్ణి పొందే ప్రయత్నం చేయండి.మాతరిశ్వుడు,భృగుడు అనేవాళ్లు మా ద్వారానే రెండు జన్మలను తెలుసుకొని నమ్మారు." [ఋగ్వేదం:1-11-1]
       మరణానంతర జీవితం గురించి ఖుర్ ఆన్ ఇచ్చిన ప్రస్ఫుటమైన విశ్వాసం ప్రకారం,పై వేదమంత్రాలు సత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.తత్సంబంధమైన ఊహాగానాలకు బదులు దైవవాణి ద్వారానే ఈ విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చు.దివ్యఖురాన్ తన అనేక ప్రత్యేకతలకు తోడు "అల్ ముహైమిన్" కూడా అంటే గతించిన సర్వసత్య బోధనలను తనలో నిక్షిప్తం చేసుకున్న గ్రంధం అని అర్ధం.ఎవరైతే ఖురాన్ ను అధ్యయనం చేస్తారో వారు సకల ఆకాశ గ్రంధాలను [దైవగ్రంధాలను],సర్వప్రవక్తల మౌలిక బోధనలను అధ్యయనం చేసినట్లే.మౌలికంగా,ఖురాన్ మరే క్రొత్త సిద్ధాంతంతోగాని,మరే ఇతర క్రొత్త సందేశంతోగాని అవతరించలేదు.ఈ గ్రంధం ఎప్పుడైతే పరలోకాన్ని ధృవపరుస్తోందో, మరణానంతర జీవితానికి సంబంధించిన మూలసిద్ధాంతం కూడా సకల సత్యధర్మాలకు అదే అయి ఉండింది అని అర్ధం చేసుకోవచ్చు.సత్యధర్మం ఎల్లప్పుడు పరలోక విశ్వాసాన్నే బోధించింది అని అనడానికి,గత గ్రంధాల్లో తత్సంబంధమైన ఆధారాలు,బోధనలు లభిస్తాయి.ఇతర నమ్మకాలు,సిద్ధాంతాలన్నీ కేవలం మనుషుల మనోమస్తిష్కాల నుండి వెలువడ్డవే.
                                                     ఇంకా వుంది.....

7, ఆగస్టు 2013, బుధవారం

ఆ కల్కి అవతారపురుషుడు ఎవరు?

మన వేదాలలోనూ,పురాణాలలోను భవిష్యవాణిగా వస్తాడని చెప్పబడిన ఆ కల్కి అవతారపురుషుడు ఎవరు? ఆయన గురించి మన హిందుశాస్త్రాలు ఏమని ఘోషిస్తున్నాయి? ఆయన లక్షణాలు,గుణగుణాలు ఏమని వర్ణించబడ్డాయి? ఇంతకీ ఆయన వీరభోగవసంతరాయులా? లేక జీసస్సా ? ముహమ్మద్ [స] మా?వేరేఎవరైనా ఉన్నారా? ఆ కల్కి వచ్చేసి వెళ్లిపోయారా? ఇంకా రావల్సివుందా?
హిందుశాస్త్రాలపై జరిగిన అద్భుతపరిశోధన.
అతి త్వరలో ...మీకోసం......

4, ఆగస్టు 2013, ఆదివారం

ఆకుల రూపంలో వున్న వింత జీవులు

సృష్టికర్త అయిన దేవుడు ఎన్నో సృష్టిరాశులను తయారు చేసాడు.ఆ అందాల సృష్టిని చూడాలంటే ఈ జీవితం ఏమాత్రం సరిపోదు.అటువంటి అందమైన దైవం సృష్టిలో ఈ క్రింది అద్భుత జీవులను చూడండి.
2, ఆగస్టు 2013, శుక్రవారం

శక్తి యొక్క 48 సూత్రాలు.

కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు.ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.
ప్రతి సూత్రాన్ని 1.వివేకం, 2.శక్తిని పొందే కీలకం, 3.చిత్రం [ఉదాహరణ] అనే మూడు విధాలుగా ఒకొక్క సూత్రాన్ని వర్ణించిన తీరు అద్భుతంగా వుంది.
శక్తి యొక్క 48 సూత్రాలు
1.బాస్ ని మించినట్టు ప్రవర్తంచవద్దు
2.మిత్రులని అతిగా నమ్మవద్దు,శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి
3.మీ ఉద్దేశాలని దాచిపెట్టండి
4.అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి
5.పేరు ప్రతిష్ఠలు మీదే ఎంతో ఆధారపడి ఉంది-ప్రాణ సమానంగా కాపాడుకోండి
6.ఏది ఏమైనా సరే అందరి దృష్టిని ఆకట్టుకోండి
7.మీ పని ఇంకొకరి చేత చేయించండి,కాని పేరు ఎప్పుడూ మీకే దక్కేట్టు చూసుకోండి
8.ఇతరులని మీ దగ్గరకి రప్పించుకోండి-అవసరమైతే ఎరని ఉపయోగించండి
9.వాదనతో కాదు,మీ చేతలతోనే గెలవండి
10.అంటువ్యాధి : దురదృష్టవంతులకి దూరంగా ఉండండి.
11.ఇతరులు మీమీద ఆధారపడేలా ఎలా చేయాలో నేర్చుకోండి
12.నిజాయితీని,ఉదారతను జాగ్రత్తగా ఎంచుకోండి
13.సహాయం కోరేటప్పుడు,అవతలివారి దయనీ,కృతజ్ఞతనీ ఆశించవద్దు.
14.స్నేహితుడిలా నటించండి,గూఢచారిలా పని కానివ్వండి.
15.మీ శత్రువుని పూర్తిగా అణచివెయ్యండి
16.గౌరవాన్ని సంపాదించేందుకు అంటీముట్టనట్టుగా ఉండండి
17.అవతలివారిని ఉత్కంఠకు గురిచేయండి.ముందుగా ఊహించటానికి వీలులేని వాతావరణాన్ని సృష్టించండి.
18.ఆత్మరక్షణకోసం కోటలు కట్టుకోకండి-ఏకాంతవాసం ప్రమాదకరమైంది.
19.మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి-పొరపాటున తప్పుచేయని వ్యక్తికి కోపం తెప్పించకండి.
20.ఎవరికీ నిబద్ధుడై ఉండొద్దు.
21.మూర్ఖుడిగా కనిపించటంకోసం,మూర్ఖుడిలా ప్రవర్తించండి-మీ ముందున్నవ్యక్తికన్నా అమాయకుడిలా నటించండి.
22.లొంగిపోవడం అనే యుక్తిని ఉపయోగించండి:బలహీనతను శక్తిగా మార్చుకోండి.
23.మీ శక్తులన్నీ ఒకచోట కేంద్రీకరించండి.
24.పరిపూర్ణుడైన ఆస్థానికుడి పాత్ర నిర్వహించండి.
25.మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి.
26.మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
27.మిమ్మల్ని ఆరాధించే అనుచరుల బృదాన్ని తయారుచేసుకునేందుకు వాళ్ల నమ్మకాన్ని సంపాదించండి.
28.ధైర్యంగా పనిలో ప్రవేశించండి.
29.చివరిదాకా పూర్తి ప్రణాళికని వేసుకోండి.
30.మీ విజయాలు సులభంగా సాధించినవన్నట్టు కనిపించనీయకండి.
31.ఇతరుల నిర్ణయాలని నియంత్రించండి. మీరు పంచే పేకముక్కలలో ఇతరులు ఆడేటట్టు చూడండి.
32.అందరూ కనే పగటికలలని సమర్ధించండి.
33.ప్రతి వ్యక్తిలోనూ ఉండే బలహీనమైన అన్శాన్ని గుర్తించండి.
34.మీ పద్ధతిలో మీరు రారాజులా ఉండండి. రాజులాగౌరవం పొందాలనుకుంటే,రాజులా పని చెయ్యండి.
35.సరైన సమయం ఎంచుకునే కళలో నిష్ణాతులు కండి.
36.మీరు పొందలేని వాటిని తిరస్కరించండి. వాటిని అలక్ష్యం చెయ్యడమే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రతీకారం.
37.ఆకట్టుకునే అద్భుత దృశ్యాలని సృష్టించండి.
38.మీకిష్టం వచ్చినట్టు ఆలోచించండి,కానీ అందరిలా ప్రవర్తించండి
39.చేపల్ని పట్టేందుకు నీళ్లని కదపండి
40.ఉచితంగా లభించేవాటిని తిరస్కరించండి
41.గొప్ప వ్యక్తిని అనుకరించటం మానండి.
42.గొర్రెల కాపరి మీద దాడి చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి.
43.ఇతరుల హృదయాలనీ,మనసులనీ జయించండి.
44.అద్దం చూపించి సమ్మోహితులనీ,కోపోద్రక్తులనీ చెయ్యండి
45.మార్పు అవసరమని ఉపదేశించండి,కాని ఒక్కసారిగా మరీ ఎక్కువ సంస్కరించకండి.
46.మరీ నిర్దుష్టంగా ఉన్నట్టు కనబడకండి.
47.లక్ష్యాన్ని దాటి వెళ్లకండి,గెలిచిన తరవాత ఎక్కడ ఆగాలో తెలుసుకోండి.
48.నిరాకారులుగా తయారవకండి.
___________________________________________________
అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి.ఈ పుస్తకం నేటి ప్రంపంచంలో ప్రగతి సాధించటానికి,ముందుకు దూసుకుపోవటానికి అవసరమయ్యే వంచన,నటన,పోరాట పటిమను మీకు నేర్పుతుంది.-ఇండిపెండెంట్ ఆన్ సన్ డే
Manjul Publishing House
  www.manjulindia.com 


___________________________________________________
మరిన్ని పుస్తకాలకోసం నా డైరీలోని పేజీ:"నేను చదివే పుస్తకాలు"క్లిక్ చేయండి.
కథలు       కవితలు        సీరియల్స్        వ్యాసాలు         అవీ,ఇవీ,అన్నీ
__________________________________________________

నన్ను కరుణించవా చెలీ?

తెల్లవారే పువ్వు మీద తొలిమంచు నా కోసమే ముత్యమై మెరుస్తుంది

వికసించిన పువ్వు నాకెప్పుడూ వినోదాన్ని,ఆనందాన్ని పంచుతుంది

ప్రచండ వేడిమి గల సూర్యుడు సైతం నన్ను చూసాకే పశ్చిమ కనుల్లోకి వెళ్లిపోతాడు

చందమామ సైతం నాకోసం వెన్నెలను విరబూస్తూనే వుంటుంది

నదుల గలగలలు,సముద్రాల ఘోషతరంగాలు నాకెప్పుడూ సంతోషాన్నే మిగిల్చాయి.

కానీ...కానీ...ప్రకృతి నంతటినీ సింగారించుకున్న నీవు మాత్రం
నన్ను ఏనాడూ ఓదార్చలేదు.

నా ఆవేదనను అర్ధం చేసుకుని ఆహ్లాదాన్నే ఇవ్వలేదు.

నా ఆలోచనలకు ప్రతిరూపం ఏనాడూ ప్రసాదించలేదు.

నేను మాత్రమే బాధపడడం లేదు చెలీ.....

నీవు సింగారించుకున్న ప్రకృతి సైతం మూగగా రోదిస్తూనే వుంది.

1, ఆగస్టు 2013, గురువారం

దటీజ్ యండమూరి -5

దటీజ్ యండమూరి -5 భాగం పూర్తిగా అర్ధం కావాలంటే మొదటి భాగం నుండీ చదవాల్సిందే...ఇవిగో ఆ భాగాలు...క్లిక్ చేయండి...   1       2        3       4    
5.నిర్దిష్టత : The Purpose of Life is a"Life of Purpose" నీ ముందు,నీ వెనుక విషయాల్ని వదిలిపెట్టు.నీ"లో"వున్నది ముఖ్యం.నిన్నటి తప్పుని సరిదిద్దుకో.ఈ రోజు పని పూర్తిచేయి.కొత్తరేపు నీ జీవితంలోకి అద్భుతంగా రాబోతూవున్నది.నీవు పెట్టుకున్న ఒక గోల్ ని మరొకగోల్ అడ్డుకునేదిగా వుండకూడదు.మనసు లగ్నం చేసి చదవటం నీ గమ్యం అయినప్పుడు ప్రేమలో పడకూడదు.నీ శత్రువుని నాశనం చేయటం నీ వుద్దేశ్యం అయినప్పుడు,అహింస నీ గమ్యం కాకూడదు.నీ గమ్యం నీకే స్పష్టంగా తెలియకపోతే ఎలా? ఈ ప్రపంచంలో ఒకరికి మంచి మరొకరికి మంచి కాదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకర్నొకరు పూర్తిగా అర్ధం చేసుకోలేరు.ఆ మాటకొస్తే క్షణక్షణానికి నీ ఆలోచనా విధానం మారుతూనే ఉంటుంది కదా?చాలా సార్లు నీకే నీవు అర్ధం కావు.ఇక నిన్ను అర్ధం చేసుకోవడం అవతలివారికి ఎలా అర్ధం అవుతుంది.అయినా నిన్ను అర్ధం చేసుకోవడం వేరు.నీకు అనుగుణంగా ప్రవర్తించడం వేరు.ఇది చాలా ముఖ్యమైనది.నీ క్రింది పనిచేస్తున్న వారుగానీ,నీ దగ్గిరవారు గానీ నిన్ను జాగ్రత్తగా అర్ధం చేసుకుని మనస్పూర్తిగా పనిచేయడం లేదు.నీకున్న "పవర్" వల్ల అలా చేస్తున్నారు.ప్రధానమంత్రి క్రింద పని చేసేవారందరూ అతడి విధానాలని అర్ధం చేసుకునే దేశసేవ చేస్తున్నారా?లేదే.తమ మనుగడ కోసం చేస్తున్నారు.నీకు "పవర్"లేకపోతే నీ భర్త కూడా నిన్ను హిన్సిస్తాడు.అలాంటి పవర్ సంపాదించటమే నీ గమ్యం.ఆ గమ్యం చేరుకోవటం కోసం:
* ఒకటి తరువాత ఒకటిగా నీ గోల్స్ వ్రాసుకో.నీ అంతిమ గమ్యానికి ఈ గోల్స్ అన్నీ కలిసి దారి తీయాలి.
* మొత్తం పూర్తయ్యాక ఒక బొమ్మ నీకు కనబడాలి.దానికి ఒక Road map వెయ్యి.
* దాన్ని నీ మనసు గోడమీద ముద్రించుకో.దాన్ని చూసేకొద్దీ నీ మనసు ఉద్వేగంతో ఉవ్విళ్ళూరాలి.ఎందుకొచ్చిందిరా  భగవంతుడా అని నీ మనసు నిరాశపడకూడదు.అలా పడుతోందంటే ,నీ కోరిక బావుంది గానీ,దాని దారి గతుకుల్లో వుందన్నమాట.డాక్టర్ అవ్వాలనుకోవటం వేరు.ఎం సెట్ ఆనందంగా చదవటం వేరు.
* రోజూ కొంచెం సేపు నీ గమ్యం గురించి ఆలోచించు.రోజు,రోజుకీ నీ గమ్యానికి దగ్గిరవుతున్నావో లేదో చూసుకో.అవకపోతే నీ వ్యూహం [స్ట్రాటెజీ] మార్చు.
           గోల్ కీ ప్రేమకీ దగ్గిర సంబంధం వుంది.గోల్ ని ప్రేమించు.అది నువ్వు ప్రేమించిన స్త్రీలాంటిది.అందంగా వుంటుంది.ఒక స్త్రీ అందంగా వుంది కాబట్టి ప్రేమించొద్దు.నువ్వు ప్రేమించావు కాబట్టి అది అందంగా వుండాలి.గోల్ కూడా అలాంటిదే.కష్టమైన దాన్ని ఒకసారి ప్రేమిస్తే అదే ఇష్టమైనది అవుతుంది.ఫుట్ బాల్ ఆటలో ఆటగాడు ఎదుటి గోల్ వైపు దూసుకుపోతూంటే,అది దగ్గిరవుతున్న కొద్దీ అతడు ఒక చిత్రమయిన స్ధితికి లోనవుతాడు.గోల్ తప్ప ఇంకేమీ కనపడదు.ఎదురుగా అడ్డొచ్చే ఆటగాళ్లని చీల్చి చెండాడుతాడు.సర్వశక్తులూ సమీకరించుకుంటూడు.విజయం సాధిస్తాడు.
అదే యుద్ధమంటే.
జీవితం ఒక యుద్ధం.
నీ దేశంకోసం ప్రాణాలు అర్పించటం కాదు దేశభక్తి అంటే!
అవతలి శత్రువు తన దేశకోసం చచ్చేలా చెయ్యటం!!
Art of War లో సుంజూ [Suntzu]ఏమన్నాడో గుర్తు తెచ్చుకో.అయిదు సూత్రాలవి.
1.యుద్ధభూమి గురించి నీకు పూర్తి అవగాహన వుండాలి.
2.ఆక్కడికి ప్రయాణించే నిరపాయమయిన మార్గం తెలిసుండాలి.
3.శత్రువు బలహీనత క్షుణంగా అవగతమై వుండాలి.
4.నీ పట్ల,నీ సైనికుల పట్ల నీవు స్పష్టమైన నియంత్రణ కలిగియుండాలి.
5.యుద్ధంలో చంపటం పాపం కాదు.చావటం కన్నా అది మంచిది.చేతకాని వీరస్వర్గం క్షమార్హం కాదు అని నువ్వు నమ్మాలి.
యుద్ధంలో గెలుపు ముఖ్యం.నా మంచితనం వలనే ఈ ఓటమి.మంచితనం నా స్వభావం అనుకోవడం వలన ఓటమి యొక్క స్వరూపం మారదు కదా.నువ్వు ఎలా గెలిచావన్న రూలు ప్రాణాలుపోతున్న సమయంలో పాటించకు.కత్తి ఎత్తి,వాడుపైకి చూసే లోపులో క్రింద నరుకు.నీ కుడిచేతిలో శక్తి వుంటే,ఎడమచేయివాటంగా నటించు.నీ శత్రువు కోపంలో వుంటే మరింత విసిగించు.అయోమయంలో వుంటే మరింత వేధించు.కలిసుంటే విడగొట్టు.ఆశపరుడైతే ఏర చూపించు.పౌరుషవంతుడైతే ఎగతాళి చెయ్యి.శాంతమూర్తి అయితే చికాకు పెట్టు.నీ ప్రత్యర్ధికన్నా ముందు నువ్వే యుద్ధభూమికి చేరుకో.ఆలస్యంగా వచ్చినవాడు అలసిపోయి వుంటాడు.వాడిని కదుల్చు.నువ్వు కదలకు.నీ ఆలోచనలు వాడికి తెలియనివ్వకు.నువ్వు ఎక్కడ అటాక్ చేస్తావో తెలియని పక్షంలో అతడు చాలా ప్రదేశాలని సమ్రక్షించుకోవల్సి వుంటుంది.ప్రదేశాలు పెరగే కొద్దీ అతడి రక్షణ బలగం తక్కువ అవుతుంది.రొమ్ము కాచుకుంటే వీపు.వీపు కాచుకుంటే మెడ.చైనీస్ యుద్ధవీరుడు సున్ జూ చెప్పిన సూత్రాలు ఇవి.
జీవిత యుద్ధంలో గెలుపు క్కూడా ఇవే మార్గదర్శకాలు.ముందే చెప్పినట్టు యుద్ధంలో గెలుపు ముఖ్యం.నువ్వు ఎలా గెలిచావన్నది ముఖ్యం కాదు.కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన పది రోజుల తరువాత కృష్ణుడూ,ధర్మరాజుతో సహా అందరూ ధర్మ సూత్రాలు మర్చిపోయారు.జీవిత కురుక్షేత్రంలో అదేనీకు ఆదర్శం తప్ప,భగవంతుడి దర్శకత్వంలో సామాన్యుడు నిర్దేశించుకున్న మంచి,మంచి నైతిక సూత్రాలు కాదు.మంచి అంటే తను ఎలా వుండాలనుకుంటున్న్నాడో అది.చెడు అంటే తను ఎలా వుంటున్నాడో అది.
ఆ రెండింటికీ తేడా లేకపోతే,అతడు భోగి.ఆపై యోగి.
________________________________________________________
ఇటువంటి అమూల్యమైన వాక్యాలతో,ఉర్రూతలూగించే సస్పెన్స్ కధా రూపంతో కొనసాగే అద్భుత రచన "తప్పు చేద్దాం రండి". ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే తెలియజేయడం జరిగింది.జీవితానికి అన్వహించుకునే ఎన్నో,మరెన్నో విషయాలు దాగి యున్నాయి.ప్రయోజనం పొందాలంటే ఈ పుస్తకం పూర్తిగా చదవాల్సిందే.పుస్తకం పొందదల్సినవారు సంప్రదించవల్సిన చిరునామా:

Writter's Address
YANDAMOORI VEERENDRANATH
HYDERABAD
PH:9246502662
yandamoori@hotmail.com
www.yandamoori.com

Publishers's Address
NAVASAHITHI BOOK HOUSE
VIJAYAWADA
PH:0866-2435885
navasahithiravi@gmail.com