29, జులై 2013, సోమవారం

దటీజ్ యండమూరి-4

దటీజ్ యండమూరి -4 భాగం పూర్తిగా అర్ధం కావాలంటే మొదటి భాగం నుండీ చదవాల్సిందే...ఇవిగో ఆ భాగాలు...క్లిక్ చేయండి......  1      2       3  

4.ప్రమాణత: "ఈ ప్రపంచంలో నూటికి తొభైమంది అవతలివారు ఏం చెప్తే అది వినటానికి సిద్ధం వుంటారు"అని స్పష్టంగా నమ్మినవాడే నాయకుడు కాగలడు.వారిని నీవైపు తిప్పుకోవటమే కావల్సింది.బాబాల్నుంచి,రాజకీయనాయకుల వరకూ అలా తిప్పుకోగలిగిన సామర్ధ్యం వున్నవారే.నీలోనూ అలాంటి సామర్ధ్యం పెంపొందించుకో.
సామాన్యుడు తన కష్టాల్నుంచి బయటకు రావడంకోసం బాబానో,తననాయకుడినో నమ్ముకుంటాడు.అతడిని భ్రాంతిలో వుంచినంతకాలం నువ్వే నాయకుడివి.తాను సుఖంగా బ్రతకటానికి కావాల్సిన శక్తి తనలోనే వున్నదని,అవతలివారిలో గానీ ఇంకెక్కడోగానీ లేదని తెలుసుకున్న రోజు అతను నీలాగా నాయకుడు అవుతాడు.ఈ విషయాన్ని వారికి చెప్పినా,వివరించినా వారిలో చాలా మంది మారరు.వారికో అండ కావాలి.అది నువ్వే అవ్వాలి.దానిక్కావల్సిన తెలివితేటలు సంతరించుకో.
         "నేను పాపం చేసాను రక్షించు" అనేవాడు సామాన్యుడు."నేను పాపం చెయ్యను" అనేవాడు బుద్ధిమంతుడు."నేను చేస్తున్నది పాపమో కాదో నాకు తెలీదు"అనేవాడు తెలివైనవాడు.
         ప్రమాణం అంటే స్టాండర్డ్.చిత్రమేమిటంతే ఈ స్టాండర్డ్ అనే పదం కూడా రిలెటివే.ఏది ప్రమాణం? "మౌనా స్మూకః ప్రవచన పటుర్వాచకో"అన్నాడో సంస్కృత కవి.ఒక సేవకుడి పట్ల యజమాని ఏవిధమైన అభిప్రాయంతో ఉంటాడో ఈ పద్యంతో చెప్తాడు.మౌనంగా ఉంటే మూగవాడని,చక్కగా మాటలాడితే వదరబోతు అని,దగ్గరగా వుంటే భయభక్తులు లేనివాడని,దూరంగా ఉంటే పనిపట్ల ఆసక్తి లేనివాడని,మాటపడితే పిరికివాడని,పడక పోతే ఓర్పు లేనివాడని ప్రభువులు అంటారట.ఇది ఆకాలంలో మాట.ఈ కాలంలో అమ్మాయిలకు కూడా ఇది వర్తిస్తుంది.నువ్వొక అమ్మాయిని ముద్దడిగితే గౌరవస్తుడివి కాదు అంటుంది.ముద్దు అడక్కపోతే మగాడివే కాదు అంటుంది.పొగిడితే అబద్ధమంటుంది.పొగడకపోతే ప్రేమ లేదంటుంది.నువ్వు ఆలస్యంగా వెళ్తే ప్రేమ తగ్గిపోయిందంటుంది.తాను ఆలస్యంగా వస్తే పని వత్తిడంటుంది.నువ్వు మౌనంగా వినేటప్పుడు మాట్లాడమంటుంది.నువ్వు మాట్లాడేటప్పుడు నోర్మూసుకుని వినమంటుంది.నువ్వొక అమ్మాయితో మాట్లాడితే తనతో వదులుకోవటానికి సిద్ధంగా వుండమంటుంది.తానొక అబ్బాయితో మాట్లాడితే నువ్వు దాన్ని విశాల హృదయంతో అర్ధం చేసుకోమంటుంది.
          కాబట్టి ఏది స్టాండర్డ్? ఏ ఆనందమూ స్తాండర్డ్ కాదు.అంతకన్నా మరొకటి లేదని భావించిన మనుష్యులు కొత్తని అన్వేషించరు.అనూరాధ సుబ్బారావును ఆరు సంత్సరాలు పాటు ప్రేమించింది.మధ్యలో ఆనందరావు అనే మరో వ్యక్తి కూడా తన ప్రేమని ప్రతిపాదించాడు."భారత స్త్రీ ఒకర్ని ఒకసారే ప్రేమిస్తుంది.క్షమించు"అని ఆనందరావును తిరస్కరించింది.పెళ్ళి జరుగుతుండగా మంగళసూత్రం కట్టడానికి పీటమీదనుంచి లేచిన సుబ్బారావ్ గుండెపోటుతో అక్కడే మరణించాడు.ఆమె మండపం అంతా కలయజూసింది.శాలువా కప్పుకుని ఆనందరావు కనబడ్డాడు.అదే ముహూర్తానికి మెడలో సూత్రం కట్టమంది."స్త్రీ ఒకసారి ఒకర్నే ప్రేమిస్తుందన్నావ్ గా"అన్నాడు ఆనందరావ్."ఒక టైం లో ఒకర్నే ప్రేమిస్తుందన్నాను" అని సరిదిద్దింది.ఆనందరావ్ పెళ్ళికి సిద్దపడ్డాడు.
           "ఈ శవాన్ని కాస్త అడ్డుతీయండి"అంది పెద్దల్తో.
            ఈమె పట్ల నీ అభిప్రాయం ఏమిటి?మరీ విలువలు లేని స్త్రీగా కనబడుతుందా?సుబ్బారావ్ మరణించిన ఎన్నాళ్ల తరువాత ఈమె వివాహం చేసుకుంటే మంచిదని నీ ఉద్దేశ్యం?నెలా?సంత్సరమా?పదమూడు రోజులా? ఈ ప్రశ్నకు ఒకొక్కరు ఒకొక్కవిధంగా సమాధానం చెప్తారు."ఆమె ఎప్పుడు చేసుకుంటే మాకెందుకు?అది వారిష్టం అనరు"అనరు.ఏది ప్రమాణికత?ఇటువంటి స్టాండర్డ్స్ ని ధిక్కరించటమే నీవు చేయాల్సిన మొదటి పని.పై సంఘటనని మరోలా వూహిద్దాం.అనూరాధకి ఆ రోజుతో పాతికేళ్ళు నిండుతాయి.ఆ రోజు తరువాత పెళ్ళి చేసుకుంటే,తాతయ్య వీలునామా ప్రకారం రావల్సిన అయిదు లక్షల ఆస్తి రాదు.ఆమె తల్లికి కాన్సర్.ఆపరేషన్ కి అర్జెంటుగా అయిది లక్షలు కావాలి.ఇప్పుడు చెప్పు.నీ అభిప్రాయం మారిందా?కొత్తగా ఆలోచించడం అలవాటయిందా?నీలో ఒక కొత్త నువ్వుని గమనించావా?మార్పు అంటే అదే!
         నీలోంచి ఒక కొత్త నువ్వు బయటకొస్తూ వుండగా చుట్టుపక్కల వాళ్ళు విస్తుపోతారు.ఇరుగుపొరుగువాళ్ళు బుగ్గలు నొక్కుకుంటారు.నీ స్నేహితులు నిన్ను పాతనిన్నుగా మార్చటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు.నువ్వు ఎదగటం ఎవరికీ ఇష్టంలేదు.స్నేహం పేరుతో నిన్ను మామూలుగా వుంచటానికి నీతో వాదిస్తారు.వారితో నువ్వు ఒకే విషయం గట్టిగా నొక్కి చెప్పు.
            "నేను మారదామనుకుంటున్నాను."
నీ మార్పు అయిదు రంగాలలో సాగాలి.అవి నీకు ఆనందం ఇవాలి.
           1.నువ్వూ,నీ కుటుంబం.
           2.నీ డబ్బూ, నీ వృత్తి.
           3.నువ్వూ,నీ ఆరోగ్యం.
           4.నువ్వూ, నీ కీర్తి.
           5.నువ్వూ,నీ వ్యక్తిగత జీవితం.

చివరిది ముఖ్యం.అది పై 4 వల్లా వస్తుంది.దానికోసమే ఈ సామాజిక బంధాలూ,నైతిక విలువలూ-అన్నిటినీ మనిషి నిర్మించుకునేది.నీ దృష్టిలో ఏది ప్రామాణికత [స్టాండర్డ్]నో నువ్వు నిర్ణయించుకో.దానికి నీ చుట్టుపక్కలవాళ్లు ఏ విలువని నిర్ధారిస్తారో అనవసరం.దానికేమీ విలువ లేదు.
మరో ఉదాహరణ చెప్తాను.విను.
నువ్వు కారు డ్రైవర్ వి అనుకో.నీయజమాని కుటుంబాన్ని నువ్వొక పార్టీకి తీసుకువెళ్లాలి.పార్టీ సరిగ్గా 10.00 గటలకి మొదలవుతుంది.కొండమీద హోటల్లో పార్టీ.అందరూ తీరిగ్గా తయారైవచ్చేసరికి 9.45 అయ్యింది.నిన్ను తొదరపెట్టసాగారు.నువ్వు మామూలుగా తీసుకువెళ్లితే 10.00 గానీ చేరుకోలేవు.వేగంగా వెళ్తే 10.00 గంటలకు వెళ్తావు.నిన్ను వేగంగా పోనివ్వమని అందరూ బలవంతపెట్టారు.ఊరు దాటాక ఒక ముసలమ్మను గుద్దావు.మరీ అంత వేగమా?అని మళ్లీ వాళ్లే నిన్ను తిట్టారు.ఓ వంద ఇచ్చిపోదామన్నారు.ఆమెకు పెద్ద దెబ్బలు తగలలేదు గానీ "దాహం" అంటోంది.రోడ్డు మీద ఎవరూ లేరు.నీవె వెళ్లి నీరు తీసుకొచ్చి ఇచ్చి తిరిగి బయల్దేరావు.మొత్తం కుంటుంబం అంతా నిన్ను తిట్టింది.పిల్లలు నీ పరోపకారబుద్ధిని ఎగతాళి చేసారు.అంతామౌనంగా భరించావు.అక్కడొక అడ్డదారి ఉంది అలా పోనిమ్మన్నారు.అది One-way Traffic. వారి సలహా వినపడనట్టు నటించి నువ్వు మామూలుగా పోనిచ్చావు.మళ్లీ తిట్టారు.వెళ్లేసరికి 11.00 అయింది.అక్కడికి వెళ్లేసరికి సరిగ్గా అయిదు నిమిషాల క్రితమే కొండచరియ విరిగి,హోటల్ ధ్వంసమై అందరూ మరణించారు అని తెలిసింది.తాము ఎంత కొద్దిలో ప్రమాదాన్ని తప్పించుకున్నామో ఆ తరువాత కధలు,కధలుగా అందరికీ చెప్పుకున్నారు.అందులో ఎక్కడా నీ ప్రసక్తి లేదు.ప్రపంచం ఈ విధంగానే వుటుంది.నీ"చెడు"ని గుర్తించినంత తొందరగా నీ "మంచి"ని గుర్తించదు.అలా గుర్తించాలనుకోవటం కూడా వృధా.కన్విక్షన్ తో బ్రతకటం మంచిదే.లేదా,ధైర్యంగా కన్వీనియెన్స్ తో బ్రతుకు.ఆత్మవంచన చేసుకోకు.ఈ ప్రపంచంలో 95% Convenience తో బ్రతుకుతూ,కన్విక్షన్ తో బ్రతుకుతున్నామనుకుంటారు.4% Conviction తో బ్రతుకుతారు.1% మాత్రమే కేవలం కన్వీనియన్స్ తో బ్రతుకుతున్నామని ధైర్యంగా వప్పుకోగల్గుతారు.
                                                                   Next Page-5

28, జులై 2013, ఆదివారం

దటీజ్ యండమూరి-3

దటీజ్ యండమూరి -3 భాగం పూర్తిగా అర్ధం కావాలంటే మొదటి భాగం నుండీ చదవాల్సిందే...ఇవిగో ఆ భాగాలు...క్లిక్ చేయండి.... 1    

3.శక్తాశక్తత : గమ్యం వేరు.కల వేరు.కల చాలా బావుంటుంది.గమ్యం కఠినంగా వుంటుంది.అదే విధంగా ఆశతో ఎదురుచూడడం వేరు.ఓర్పుతో వేచి వుండడం వేరు.ఏమీ కష్టపడకుండా పరీక్షలు వ్రాసి,ఏదో అద్భుతం జరిగి ఫస్ట్ క్లాస్ వస్తుందేమో అని ఎదురుచూడడం ఆశ.పొలానికి నీళ్లు పెట్టి,విత్తనాలు వేసి,పంట కోసం వేసి వుండడటం ఓర్పు.రెండిటికి తేడా అర్ధమయ్యిందా?రెండో దానిలో కర్తవ్య నిర్వహణ వున్నది.అది పూర్తి చేసి ఫలితం కోసం వేసి వుండాలి.వేసి వుండటానికి, ఎదురుచూడటానికి తేడా తెలుసుకున్నవాడు జీవితంలో  పైకి వస్తాడు.
ఒక భూతమూ,ఒక దెయ్యమూ నీశక్తిని తగ్గిస్తాయి.వాటికి దూరంగా వుండు.దయ్యం పేరు "చిరాకు",భూతం పేరు "కోపం".వాటిని అలా దూరంగా వుంచటానికి ఓ టెక్నిక్ వుంది.నువ్వొక వాహనం నడుపుతున్నావు.నాలుగు రోడ్ల దగ్గర ఎర్రలైటు వెలిగింది.నీ వెనుకవాడు తన వాహనాన్ని ఆపకుండా పరుగెత్తించాడు.మరొకడు లైట్ కేసి చూస్తూ విసుగ్గా వున్నాడు.మరొకడు,వాహనాల సందుల మధ్య నుంచి మెలికలు తిప్పుతూ ముందుకు రావటానికి ప్రయత్నిస్తున్నాడు.
                   నువ్వు ఆగు.తాపీగా నీకిష్టమైన విషయం ఆలోచించు.పచ్చలైటు ఎలాగూ పెలుగుతుందని నీకు తెలుసు.అది వెలిగేసరికి నీ ముదున్న వాహనాలన్నీ చాలా దూరం వెళ్ళిపోయివుంటాయి.రోడ్డు ఖాళీగా వుంటుంది.తాపీగా ప్రశాంతంగా బయల్దేరు.నీ వెనుక నుంచి తన వాహనాలన్నీ వేగంగా ముందుకి దూకించిన వాడు ఆ తరువాతి జంక్షన్ లో అందరికన్నా చివరిగా దిక్కులు చూస్తూ నీకు కనబడతాడు.ఇదొక పద్ధతి.!మరోలా ఆలోచిద్దాం.ఒకడు తనే హీరో అనుకుంటూ,ఒకమ్మాయిని ఢీకొట్టబోతూ నటించి పక్కకి తిప్పి,ట్రాఫిక్ రూల్స్ అన్నీ అధిగమించి,అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ అందర్నీ దూసుకుంటూ,నిన్ను రాసుకుంటూ వెళ్ళిపోయాడనుకో!వాడిని చూసి విసుక్కోకు.విసుక్కుంటే నీ బి.పి.యే పెరుగుతుంది.వాడు తనింటికి ఓ పది నిముషాలు ముందు చేరతాడు.అంతేకదా.వాడప్పుడే ఇంటికి రాడని వాడి భార్య పక్కింటాయంతో మాట్లాడుతూ వుంటుంది.తొందరగా ఇంటికి చేరటం వల్ల వచ్చే నష్టాల గురించి ఆ విధంగా ఆలోచిస్తూ,నవ్వుకుంటూ డ్రైవ్ చెయ్యి.దట్టమైన ట్రాFఇక్ లో చిరాకు తగ్గించుకోవటానికి ఇదే మంచి మార్గం.వాడికి ఆక్సిడెంట్ అయ్యి,వెన్నెముక్కకి దెబ్బ తగిలి "పిల్లలు పుట్టరని"డాక్టర్ చెప్పినప్పుడు,పక్కింటాయన "నేనున్నాను కదా.మీరు దిగులు చెందకండి"అని వోదార్చినట్టూ,ఆ పక్కింటానవి నువే అయినట్టూ వూహించుకో.
                  కోపంతో నిన్నెవరయినా తిడుతున్నపుడు కూడా ఇదే టెక్నిక్ ఉపయోగించు.కోపంలో ఉన్నపుడు శరీరంలో విడుదలయ్యే అడ్రినలిన్,మనిషి కిడ్నీలనిపాడు చేస్తుంది.నిన్ను తిట్తేవాడి కడుపుని సూటిగా చూడు.అతడిని నగ్నంగా ఊహించుకో.అతడి లోపల విడుదలవుతున్న అడ్రినలిన్నీ,అది కిడ్నీలవైపు వెళుతున్న విధానాలన్నీ గమనిస్తూ మనసులో "పోతావురా!కిడ్నీలు పాడయి తొందర్లోనే పోతావు"అనుకుంటూ వుండు.నీకు నవ్వొస్తూ వుంటుంది.వాడు నిన్ను తిడుతూనే వుంటాడు.
                 నీ చిరాకూ,కోపమూ నీ ప్లాన్ లనీ,ఆలోచన్లనీ పాడుచేస్తాయి.మూడ్ సరిగ్గా లేనప్పుడు ఆలోచన సజావుగా వుండదు.ఆలోచన బావోలేకపోతే జీవితం బాగోదు.జీవితమంటే పెళ్లి చేసుకోవడం,ఉద్యోగం సంపాదించడం,ఇల్లు కట్టుకోవడం -ఇలాటి చిన్న,చిన్న గమ్యాల సముదాయం.ప్రతి గమ్యానికి ఒక ప్లాన్ కావాలి.అదే వ్యూహం.వ్యూహం వేరు,గమ్యం వేరు.గమ్యంచేరటానికి కావల్సింది.వ్యూహం.నీ గమ్యం నిర్ధారించుకునేటప్పుడు నీ శక్తిని కూడా దృష్టిలో వుంచుకో.భారతదేశంలో పుట్టి రష్యా ప్రెసిడెంట్ అవ్వాలనుకోకు.చాలామంది చేసే తప్పు ఒకటున్నది.ఆస్ట్రోనాట్ అంటారు.బయోకెమిస్ట్ అంటారు.తమకి నిజంగా కావాల్సింది కాకుండా,చెవులకు బాగా ధ్వనించేదాన్ని గమ్యంగా ఎన్నుకుంటారు.అంటేకాదు.నీ శక్తినంతా హరించే దాన్ని గమ్యంగా పెట్టుకోకు.ఉదాహరణకి,లక్షరూపాయల్తో వ్యాపారం ప్రారంభిస్తే నెలకి రెండు వేలు వస్తాయనుకో! లక్ష రూపాయల మీద వడ్డీ నెలకు నాలుగు కట్టాలనుకో! నీకష్టమంతా వడ్డీకే సరుపోతుంది.
                 చాలామంది మార్కెట్లో తమ పేరు నిలుపుకోవటం కోసం ఎడాపెడా అప్పులు చేస్తూ వుంటారు.ఒక పాయింటు దగ్గర అగ్నిపర్వతం బ్రద్దలయినట్తు అది పేలిపోతుంది.మార్కెత్లో పేరు సమూలంగా నాశనమైపోతుంది.ఒకసారి నీ పేరు పాడయిందా,మళ్ళీ దాన్ని కూడగట్టుకోవటం చాలా కష్టం.తాబేఅలు-కుందేలు కధలోలా,నీ శక్తి తెలుసుకోకుండా,కుందేలుతో ఎప్పుడూ పరుగు పందెం కట్టకు.నువ్వు తాబేలువై,కుందేల్తో పందెం కట్టవలసి వస్తే,మధ్యలో ఒక కాలువ అడ్డు వుండేలా చూసుకో.గెలుపు నీదే!మంచి చదరంగం ఆటగాడు అవతలి వ్యక్తి చివరి ఎత్తు వరకూ వూహించగలిగి వుంటాడు.సామాన్యుడు తరువాతి ఎత్తు గురించే తాపత్రయపడతాడు.అదే తేడా.ఇదంతా నిన్ను నిరాశపర్చటానికి చెప్తున్నదని అనుకోకు.నీ గమ్యo ఎప్పుడూ ఉన్నతంగా వుండాలి.రెండు పడగ్గదుల ఇంటిని వూహించుకోకు.విశాలమైన భవంతిని కలగను.దానిక్కావల్సిన శక్తిని సమకూర్చుకో!
                 కరెక్టుగా ఆలోచించు.నీ శక్తిని తక్కువ అంఛనా వెయ్యకు.
                 ప్రతి మనిషిలోనూ అలసట పాయింట్స్ [Fatigue Zones] అని వుంటాయి.అక్కడకొచ్చేసరికి,ఇక తనకి శక్తి లేదనుకుంటాడు.అది తప్పు.ఆ గీతని కాస్త కష్టపడి దాటగలిగితే,మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేయగల శక్తి వస్తుంది.ఉదాహరణకి వందసార్లు స్కిప్పింగ్ చేసాక ఇక శక్తిలేదనుకుంటావు.కానీ కష్టపడితే మరో పది చేయగలవు.దాంతో నీ మీద నీకు నమ్మకం పెరిగి,మరో యాభైసార్లు స్కిప్పింగ్ కొనసాగించగలవు.అలసట జోన్ దాటడం అంటే అదే.ఒకామె ఆరోజు నుంచీ డైటింగ్ ప్రారంభిద్దామనుకున్నది అనుకుందాం.భోజనం సమయమయ్యేసరికి ఆకలికి తట్టుకోలేకపోయింది.తన నిర్ణయాన్ని వదిలేద్దామన్న బలీయమయిన కోరిక కలుగుతుంది.కానీ...ఒక్క గంట..కేవలం ఒక్క గంట ఆగగలిగితే..!చాలు!! ఆకలి చచ్చిపోతుంది.ఆతరువాత పదిరోజుల ఉపవాసం ఉండగలుగుతుంది.ఎలా?తన బలహీనతని జయించానన్న ఆనందంతో వచ్చిన శక్తి వల్ల!!
నీ ఏవో నువ్వు తెలుసుకో.చాలా మంది అందులోనే ఆగిపోతారు.నువ్వు మాత్రం సర్వశక్తులూ క్రోడీకరించుకుని ఆ వృతంలోంచి కాస్త ముందుకురా.ఇక విజయం నీదే.విజయం అంటే ఆయాచితంగా అదృష్టం రావాలని కోరుకోవటం.అదే అత్యాశ!అత్యాశకి పోకు.శక్తాశక్తత అంటే అదే.ముప్ఫై సంవత్సరాలు కలిసి బ్రతికారట ఒక దంపతులు.అతడి వయసు అరవై.ఆమెకి వయసు యాభై.ఒక దేవత ప్రత్యక్షమై ఇద్దర్నీ చెరో కోరికా కోరుకొమ్మన్నదట.
"నాకు నా భర్తతో కలిసి ప్రపంచమంతా ఆనందంగా తిరగటానికి కావలసినంత ధనమివ్వు" అన్నదట భార్య.
"తధాస్తు" అన్నదట దేవత.
"నాతో కలిసి ప్రపంచం అంతా తిరగటానికి నాకంటే ముప్ఫై సంవత్సరాలు తక్కువ వయసున్న అమ్మాయిని ప్రసాదించు" అని భర్త కోరుకున్నాడట.
"తధాస్తు" అన్నదట దేవత
అతడు మరుక్షణం ఎనభై ఏళ్ళ వృద్దుడై పోయాడట.
                                                           Next Page
________________________________________________________
మరిన్ని పుస్తకాల కోసం నా డైరీ లోని శీర్షిక : "నేను చదివే పుస్తకాలు" క్లిక్ చేయండి.

27, జులై 2013, శనివారం

దటీజ్ యండమూరి-2

2.వాస్తవికత : నీవు అంచెలంచెలుగా సాగి,నీ గమ్యాన్ని చేరుకోవాలి.అంచె అంటే మజిలీ.నీ ప్రతి మజిలీ స్పష్టంగా వుండాలి.ఒక మజిలీ చేరుకున్నకరెందో మజిలీ గురించి ఆలోచించాలి.మొదటి మజిలీలో ఉంటూ మూడో దాని గురించి ఆలోచించకూడదు.ఎనిమిదో క్లాస్ చదువుతూ ఎం సెట్ గురించి కలలు కనడం తప్పు.
       ఒక గమ్యం పక్కనే జాగ్రత్తకోసం మరొక గమ్యం పెట్టుకో.కానీ ఒకేసారి రెడు పరస్పర రెండు విరుద్ధమైన గమ్యాలు పెట్టుకోకు.ఇది కాకపోతే అది"అనుకున్న రెండు గమ్యాలు విరుద్ధంగా వుండకూడదు.ఒక బాణం రెండు గమ్యాల్ని ఒకేసారి ఛేదించలేదు.బాణం వదలాలంటే మాత్రం రెండు (చూపు- చెయ్యి) కావాలి.ఊహలూ,ఆశలూ ఎప్పూడూ గొప్పగా వుంటాయి.నీలో ఉన్న శక్తిని దానికి చేసి సరిచూసుకోవాలి.దీనికి ఉదాహరణగా చెరుకు,బతాయి,కాకరకాయనీ తీసుకో.మొదటి రెండూ తీపే.కానీ చెరుకురసం తీసే మిషన్ లో బత్తాయి పండు పెడ్తే తీయటి రసం కూడా చేదుగా మారుతుంది."ఏ రసం తీయటానికి ఏ మిషను వాడాలి" అన్నది కరెక్ట్ గా తెలుసుకోవడమే గెలుపు.నీ దగ్గర వున్నది కాకరకాయ అయితే రసం తీసే ఉద్దేశ్యమే మానుకో.కూర వండు.తమ గురించి తాము ఎక్కువుగా ఊహించుకోవడం,తన బలహీనతల్ని తమ సహజ స్వభావంగా తమకి తామే నచ్చ చెప్పుకోవడం మూర్ఖుల గుణం.ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారో,నిన్ను నీవు అలా చూసుకోగలగాలి.నీ బలహీనతల్ని స్పష్టంగా చూడగగాలి.

             నీకన్నా ముందే తమ గమ్యం చేరుకున్న వారి నుంచి నేర్చుకో.పైకి సులభంగా కనబడుతుంది గానీ వారు ఎంతో కష్టపడివుండవచ్చు.అది నీకు తెలీదు.వారిని చూసి ఈర్ష్యపడకు.అది వారి అదృష్టమనీ,నీకు అది లేదనీ నీ మనసును ఎప్పుడైతే సమాధానం పర్చుకోవడం ప్రారంభించావో,నీ పతనం మొదలైందన్నమాటే! మరొక్క విషయం.నీ వాస్తవికత ఏమిటో నీవు తెలుసుకో.ఇతరుల్ని అనుచరించకు.పగలు నిద్రపోతున్న గుడ్లగూబను ఒక కొంగ "ఇంత సంతోషంగా,ఏ పనీ చేయకుండా పగలంతా ఎలా నిద్రపోతావు?" అని అడింగిందట."నా ఆహారం చాలా సులభంగా రాత్రిళ్ళు దొరుకుతుంది కాబట్టి" అందట గుడ్లగూబ.కొంగ కూడా అలాగే పగటిపూట నిద్రపోతూంటే దాన్ని కొండచిలువ తినేసిందట.కొన్నిసార్లు నీకున్న శక్తికన్నా ఎక్కువ శక్తివంతుడిగా అవతలివారికి కనపడటానికి ప్రయత్నించావో,నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నట్టే.తెలివి అన్నది లాలాజలం లాంటిది.అది లేకపోతే బ్రతకలేము.కానీ లోలోపలే దాన్ని వాడుకోకుండా బయటవారికి చూపించడం ప్రారంభిస్తే అది ఉమ్మి అవుతుంది.నీ తెలివిని ప్రదర్శించే కొద్దీ నీకు శత్రువులు ఎక్కువ అవుతారు.వాస్తవికతని ఎదుటివాల్లు ఒక్కొక్కసారి భరించలేరు.ఈ  క్రింది సంభాషణ చదువు.
"నోటి పరీక్షలో నాకు లెక్కల్లో సున్నా మార్కులు వేసింది మాటీచర్" అన్నాడు ఒక కుర్రాడు.
"అదేమిటీ.నువ్వు తెలివైనవాడివేగా,ఎలా జరిగింది?"స్నేహితుడు అడిగాడు.
"2x3 ఎంత అని టీచర్ అడిగింది.ఆరు అన్నాను"
"కరెక్టేగా.తరువాత?"
"తరువాత 3x2 ఎంత అని అడిగింది"
"నీయమ్మ రెండిటికీ తేడా ఏమిటి?"
"సరిగ్గా నేనూ అదే అన్నాను"              

____________________________________________________________
ముందు పేజి - 1                                                       తరువాయి పేజి-3

Udayabhanu Emotional Songs

ఉదయభాను పాట గురించి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రాక్షులను కడిగిపారేసింది.తను ఇంత గొప్పగా పాడుతుందని ఎవరూ ఊహించలేదు.మీరు ఒకసారి ఈ వీడియోను ఓ లుక్కేయండి.


దటీజ్ యండమూరి-1

నేను యండమూరి పుస్తకాలు ఎప్పుడూ చదవలేదు.నా స్నేహితుడు నాలోని జిజ్ఞాస గుర్తించి ఒకరోజు "తప్పు చేద్దాం రండి" పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు.ఏం తప్పులు నేర్పుతాడా అని చదివితే మన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలా అని క్లాస్ పీకాడు. ఒక పేజీ చూద్దామని మొదలు పెట్టిన నేను అన్ని పేజీలూ ఆసాంతం చదివేసాను.యండమూరిగారు వ్యక్తిత్వవికాసాన్ని ఒక కధ రూపంలో తీసుకువెల్లడం అబ్బురమనిపించింది.నన్ను బాగా కదిలించిన కొన్ని వాక్యాలు ఆ పుస్తకం నుండి ఇస్తున్నాను.మీరే చూడండి.అన్నట్టు చెప్పటం మరిచాను మీరు కూడా ఆ పుస్తకాన్ని అదే "తప్పు చేద్దాం రండి" చదవడం మరిచిపోకండి.
                                                గమ్యం
మూర్ఖుడు తన భవిష్యత్తుని ముందు మూడడుగుల కంటే ఎక్కువచూడలేడు.మూడడుగులు నేర్చుకుంటే చాలనుకుంటాడు.పిల్లల పెళ్ళి చేసి రిటైరవ్వటం కోసం కాదు నువ్వు బ్రతుకుతున్నది.బ్రతుకు చివరి క్షణం వరకూ బ్రతకటం ఎలాగో నేర్చుకుంటూ వుండటమే జీవితం.గెలుపంటే,ఇతరులకన్నా నువ్వు గొప్పవాడివికావడం అవటం కాదు.నిన్నటి నువ్వు కన్నా ఈ రోజు నువ్వు బావుండటం.తన గమ్యం నిర్మించుకునేటప్పుడు అయిదు విషయాల్ని గుర్తు పెట్టుకోవాలి.
1.స్పష్టత , 2.వాస్తవికత,  3.శక్తాశక్తత, 4.ప్రమాణత, 5.నిర్దిష్టత.
1.స్పష్టత :నువ్వు ఎక్కడికి చేరుకోవాలనుకున్నావో,దేన్ని సాధించాలనుకున్నావో దాని పట్ల స్పష్టంగా వుండు.'నేను ఏదో ఒక ఆటగాడిని అవ్వాలీఅనుకోవద్దు.'నేను పుట్ బాల్ ఆటగాడిని అవ్వాలీ అనుకో!ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఫుట్ బాల్ లో Left - Forward ఆటగాడిని అవ్వాలి ' అనుకో !!ఎంత వివరంగా అనుకుంటే అంత మంచిది.శలవుల్లో నీ స్నేహితుడిని కులుసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నావనుకో .ఎక్కడికి వెళ్తున్నావని ఎవరైనా అడిగితే ఢిల్లీ అని చెప్తావు.కాని ఢిల్లీలో ఏవీధికి,ఏ ఇంటికి వెళ్ళాలో నీకు స్పష్టంగా తెలుసు.నీ గమ్యం కూడా అంత స్పష్టంగా వుండాలి.

నీ అంతరాత్మకి ఏది మంచో,చెడో తెలుసుకునే విచక్షణా జ్ఞానం లేదు.నువే దాన్ని నిర్ణయించాలి.లేకపొతే అది నిరంతరం సందిగ్ధంలో కొట్టుమిట్టులాడుతుంది.అంతేకాదు ముందే చెప్పినట్లు ఇల్లు కట్టుకోవటం నీ కల అయితే,కేవలం ఇంటి గురించి కలలుగనకు.అది ఎన్ని గదులో,అవి ఎంత విశాలంగా వుండాలో కలగను.అదేవిధంగా నీక్కావలసిన పురుషుడిపట్లగానీ,స్త్రీ పట్లగానీ అత్యంత స్పష్టమైన ఆలోచన్లు రూపొందించుకో.నిర్ధిష్టత అంటే అదే.నాకు మంచి అమ్మాయి కావాలి అంటారు కొందరు.అంటే ఏమిటి?దాని అర్ధం అవతలి వారికి ఎలా తెలుస్తుంది?నీ వుద్దేశ్యంలో మంచి అంటే ప్రొద్దున్నే నీ కాళ్ళకి నమస్కారం చేసి,రాత్రి నువ్వు తెచ్చుకున్న అమ్మాయికీ నీకూ వంట చేసిపెట్టేదా? నన్ను అర్ధం చేసుకునే మంచివాడు కావాలి" అంటారు కొందరు.అంటే ఏమిటి? ఇతరుల వల్ల నీకు కలిగిన సంతానాన్ని కూడా తన కన్న బిడ్డల్లా చూసుకునే వాడా?ఏది మంచి?ఏది అర్ధం చేసుకోవటం?ముందు నీకేం కావాలో కరెక్టుగా అర్ధం చేసుకో అయోమయంగా వుండకు.
        మరొక్క విషయం గమ్యాన్ని విస్తృతం చెయ్యి.తుపాకితో దుప్పిని కొట్టడానికి అడవిలో మాటు వేసావనుకో.పొదచాటునుంచి నీటిని తాఘడానికి ఒక దుప్పి సెలయేటిలోకి దిగుతుంది.ఆగు!వెంటనే గురిపెట్టి పేల్చకు.మొత్తం మంద అంతా దిగనీ.అప్పుడు నీగమ్యాన్ని ఎంపిక చేసుకో.నీకు దుప్పి దొరక్క పొవడమంటూ వుండదు.సాధారణంగా 99% వేటగాళ్ళు జంతువు కనపడగానే ఉద్వేగపడతారు.1% మాత్రమే మొత్తం పరిస్థితిని స్పష్టంగా చూడగల్గుతారు.ఎప్పుడూ ఆ ఒక శాతంలో వుడటానికి నువ్వు ప్రయత్నించు.ఈ ఒక శాతం వారు మిగతా వారిలా పరిస్థితికి వెంటనే ప్రతిస్పందన చూపరు.తమక్కావలసిన విధంగా పరిస్తితి దిశ నిర్దేశిస్తారు.పరిస్తితికి గాఢంగా,ఉద్వేగంగా,బలంగా ప్రతిస్పందించటం మూర్ఖులు చేసే పని.నీ శత్రువుని నీ బరిలోకి (లేదా నీక్కావలసిన బరిలోకి) వచ్చేలా చెయ్యాలంటే,ముందు నీ ఎమోషన్స్ ని నువ్వు కంట్రోల్ లో వుంచుకోవాలి.
నీ గమ్యంలో స్పష్టత ముఖ్యం
నీ అభిరుచులకి అనుగుణంగా గమ్యం ఏర్పరచుకోకు.నీ గమ్యానికి అనుగుణంగా అభిరుచులు ఏర్పరచుకో.నీకు సినిమాలంటే అభిరుచి వుండవచ్చు.అందువల్ల సినిమా పాటల రచయిత అవటం నీగమ్యం అయి వుండవచ్చు.అప్పుదు నువ్వు తప్పనిసరిగా గణాలూ,సంధులూ,సమాసాలూ తెలుసుకోవలసి వుంటుంది.రాగాల పట్ల,శృతుల పట్ల కొంతయినా అభిరుచి ఏర్పర్చుకోవలసి వుంటుంది.గమ్యానికి అనుగుణంగా అభిరుచులు ఏర్పర్చుకోవటమంతే అదే.చాలామంది అలా చెయ్యరు.తమకు శక్తి వున్నదో లేదో తెలియకుండా,కేవలం తమ ఇష్టాన్ని బట్టి గమ్యాన్ని ఏర్పర్చుకుని ఫెయిల్ అవుతూ వుంటారు.ఉన్నత గమ్యం వుండటంలో తప్పులేదు.కానీ,ఒక రాయి విసిరిచూద్దామన్న మనస్తత్వం వుండకూడదు.గమ్యంలో స్పష్టత అంటే అదే.

                                                                                                                                              Next Page-2